breaking news
Weather
-
వాతావరణంలో పెను మార్పులు
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఎల్‌నినో ప్రభావమో..వాతావరణం మార్పులో.. రుతుపవనాలు రాకో.. వాయుగుండం ప్రభావమో తెలియదు గాని ఇటీవల కాలంలో వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విభిన్న పరిస్థితులు కానవస్తున్నాయి. వర్షాకాలం వచ్చినా ఉదయం, మధ్యాహ్నాం ఉష్ణోగ్రతలు కొనసాగుతూనే ఉన్నాయి. వేసవిని తలపించే విధంగా ఎండలు కాస్తున్నాయి. మధ్యాహా్నం సమయంలో గాల్పులు వీస్తున్నాయి. వాతావరణం వేడిగా ఉండి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పగటి పూట ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. కార్యాలయాలు వద్ద జనసంచారం తగ్గుతుంది. జ్యూస్ షాపులు వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. ఇది ఇలా ఉంటే సాయంత్రం అయ్యే సరికి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వస్తున్నాయి. ఆకాశం మేఘావృతం కావడం కొన్ని సందర్భాలలో ఈదురు గాలులు వీచి మేఘాలు వర్షం పడకుండానే దూరంగా వెళ్లిపోవడం, కొన్ని సందర్భాలలో తేలికపాటి చిరు జల్లులు పడుతూ విచిత్రమైన, విభిన్నమైన పరిస్థితులు కానవస్తున్నాయి. మేఘాలు వస్తే వర్షాలు భారీగా పడుతాయన్న ప్రజల ఆశలు ఆవిరి అవుతున్నాయి. ఉక్కపోత తప్పడం లేదు. ఇటువంటి వాతావరణ పరిస్థితులు కొత్తగా చూస్తున్నట్లు ఉందని పలువురు అంటున్నారు. రాత్రి సమయాల్లో వేడి కారణంగా ఉక్కపోత, దోమల బెడదతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. వర్షాలు పడాలని, ఇటువంటి పరిస్థితులు గతంలో చూడలేదని, ఎంత కాలం ఇలా కొనసాగుతుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఆరు రోజుల తర్వాత.. అమర్నాథ్ యాత్ర షురూ!
శ్రీనగర్: భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత ఆరు రోజులుగా నిలిచిపోయిన అమర్నాథ్ వార్షిక యాత్ర శనివారం తిరిగి ప్రారంభమైంది. జమ్ము నుంచి కశ్మీర్ లోయలోని బాల్తాల్ బేస్ క్యాంపునకు 6,000 మందికి పైగా యాత్రికులతో కూడిన కొత్త బృందం బయలుదేరిందని అధికారులు తెలిపారు.అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. 1,470 మంది మహిళలు, 25 మంది పిల్లలు, 54 మంది సాధువులతో సహా మొత్తం 6,269 మంది యాత్రికులతో కూడిన 18వ బృందం 223 వాహనాల కాన్వాయ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈరోజు తెల్లవారుజామున సుమారు 2:40 గంటలకు బాల్తాల్ బేస్ క్యాంపునకు బయలుదేరింది. అయితే పహల్గామ్ మార్గంలో ఎలాంటి వాహనాల కాన్వాయ్‌ను పంపలేదని అధికారులు వెల్లడించారు.లోయవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా జూలై 19న పహల్గామ్, బాల్తాల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. జూలై 2న భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి తొలి విడత యాత్రికులను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. 57 రోజుల పాటు కొనసాగే ఈ పవిత్ర అమర్నాథ్ యాత్రలో ఇప్పటివరకు 3.7 లక్షలకు పైగా భక్తులు పవిత్ర గుహను దర్శించుకున్నారు. ఈ యాత్ర ఆగస్టు 28న ముగియనుంది. #WATCH | Udhampur, J&K | Shri Amarnath Yatra resumes after remaining suspended for six days. The annual pilgrimage was temporarily halted on July 19, 2026, following heavy rainfall and deteriorating weather conditions.A fresh batch of pilgrims departed from the Bhagwati Nagar… pic.twitter.com/eTcCBNccDz— ANI (@ANI) July 25, 2026యాత్రికుల సౌకర్యార్థం రెండు మార్గాలను అందుబాటులో ఉంచారు. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ వద్ద నున్వాన్ నుంచి ప్రారంభమయ్యే సాంప్రదాయ మార్కం సుమారు 48 కిలోమీటర్లు ఉంటుంది. ఇక గందర్బాల్ జిల్లాలోని బాల్తాల్ మీదుగా వెళ్లే రెండో మార్గం కొంచెం చిన్నదిగా, 14 కిలోమీటర్ల పొడవుతో నిటారుగా ఉంటుంది.మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మాతా వైష్ణో దేవి యాత్ర కూడా జూలై 19 నుంచి జమ్ముకశ్మీర్‌లో తాత్కాలికంగా నిలిచిపోయింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వైష్ణో దేవి యాత్ర పునఃప్రారంభానికి సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక ప్రకటనలను గమనించాలని అధికారులు సూచించారు. -
ఎల్‌నినోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్: ఎల్‌నినోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రస్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా జి.చిన్నారెడ్డిని నియమించింది. కమిటీ కన్వీనర్‌గా వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఉంటారు. ఎల్‌నినో ప్రభావంపై కమిటీ అంచనా వేయనుంది. కరవు నివారణ చర్యలపై కమిటీ సిఫార్సులు చేయనుంది.మరోవైపు, శనివారం విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించిన వేళ ఎల్‌నినో సవాళ్లపై ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాభావంతో పెరిగే విద్యుత్ డిమాండ్‌కు సిద్ధంగా ఉండాలని చెప్పారు. నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు. తాగునీరు, సాగు నీటికి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ పంపిణీలో ఏఐ వినియోగాన్ని విస్తరించాలని ఆదేశించారు. డీటీఆర్ మ్యాపింగ్‌ను గడువులోగా పూర్తి చేయాలని చెప్పారు. -
చైనాలో ఊహించని విపత్తు.. తప్పించుకున్న 900 పాములు
బీజింగ్: చైనాపై ప్రకృతి పగబట్టింది. తీవ్రమైన వరదలు, భారీ వర్షాలతో డ్రాగన్ దేశం అతలాకుతలమవుతోంది. దేశంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, గ్వాంగ్జీ (Guangxi) ప్రాంతంలో ఒక వింతైన, భయంకరమైన పరిస్థితి తలెత్తింది. వరద నీటి ఉధృతికి స్థానిక పెంపకం కేంద్రాల నుంచి వందలాది పాములు తప్పించుకుని ఊళ్లపై పడటంతో అధికారులు, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాల ప్రకారం.. గ్వాంగ్జీ ప్రాంతంలో వరదలు ముంచెత్తడంతో దాదాపు 900కు పైగా పాములు పెంచే కేంద్రాల నుంచి బయటకు వచ్చాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైన నాగుపాములు వంటి విషసర్పాలు కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. లోతైన వరద నీటిలో పాములు ఈదుకుంటూ వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.గ్వాంగ్జీ పరిధిలోని హెంగ్‌జౌ నగరంలో వరద నీరు,రోడ్లు బ్లాక్ అవ్వడం వల్ల ఒక విషాదం చోటుచేసుకుంది. వరదల్లో కొట్టుకువచ్చిన పాము కాటుకు గురైన ఒక మహిళ, సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేక ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో, పాము కాటు బాధితులకు తక్షణ చికిత్స అందించేందుకు ప్రభుత్వం తాత్కాలిక వైద్య క్లినిక్‌లను ఏర్పాటు చేసింది.అలాగే తప్పించుకున్న పాములను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. చైనాలోనే సాంప్రదాయ వైద్యం, తోలు ఉత్పత్తులు మాంసం కోసం వాడే వాణిజ్య పాముల పెంపకానికి గ్వాంగ్జీ అతిపెద్ద కేంద్రం. ఇక్కడ సుమారు 3 కోట్లకు పైగా సర్పాలను పెంచుతుంటారు. హెంగ్‌జౌ పరిసరాల్లోని పలు గ్రామాలు నీట మునగడంతో ఈ పాములన్నీ వరద నీటిలోకి చేరాయని ప్రాంతీయ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. విపత్తులు, విషసర్పాల ప్రమాదం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అత్యవసర సహాయక చర్యలను పూర్తిస్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. 📌 Hengzhou, #China 🇨🇳 July 6 /2026After days of heavy rain 🌧️ and flooding across China, around 900 snakes 🐍 escaped from a breeding farm in Hengzhou. Reports say the reptiles included venomous cobras, with villagers attempting to catch them in the floodwaters. pic.twitter.com/cTcgAZ4nZd— CAUGHTIN4KHQ (@CaughtIn4KHQ) July 9, 2026 -
భారీ వర్షాలతో దెబ్బకు కుంగిన రోడ్డు..
-
ఎల్‌నినో దెబ్బ.. ఎండిపోనున్న ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు
భూమ్మీద ఉన్న అతిపెద్ద సరస్సుకు ఘోర విపత్తు రాబోతోంది. 3 లక్షల 75 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి, సముద్రాన్ని పోలి ఉన్న ఆ సరస్సు మరో పాతికేళ్లలో ఎండిపోవడమే కాకుండా.. అక్కడ ఓ భయంకర ఎడారి ఉద్భవించనుంది.ఇప్పుడు ప్రపంచమంతా రష్యా-ఉక్రెయిన్.. పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాలపై ఆందోళన చెందుతుంటే.. అంతకు మించిన విపత్తు తనపని తాను చేసుకుపోతోందనే విషయం మీకు తెలుసా?అవును, మధ్య ఆసియాలో అతి పెద్ద సరస్సుగా పేరున్న క్యాస్పియన్ సీ వేగంగా అంతరించిపోతోంది. మీరు విన్నది నిజమే..!ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్‌తో విలవిలలాడుతున్న ఈ మహా సరస్సుకు.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికేస్తున్న భయంకరమైన ‘సూపర్ ఎల్‌నినో’ విపత్తు తోడైంది! పసిఫిక్ మహాసముద్రంలో పుట్టే ఈ ఎల్‌నినో ప్రభావం వల్ల, క్యాస్పియన్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఇక్కడి నీరంతా ఊహించని వేగంతో ఆవిరైపోతోంది.మరోవైపు ఎల్‌నినో వల్ల వర్షాలు ముఖం చాటేయడంతో.. ఈ సరస్సుకు జీవనాడి అయిన నదుల నుంచి వచ్చే నీటి ప్రవాహం కూడా ఘోరంగా పడిపోతోంది. రష్యా, కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, అజర్బైజాన్, ఇరాన్.. ఇలా ఐదు దేశాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ఈ మహా సరస్సు, 2050 కల్లా గుర్తుపట్టలేనంతగా మారిపోబోతోంది. అసలు క్యాస్పియన్ సముద్రానికి ఏమైంది? దీని వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఏంటి? ఈ రోజు చర్చించుకుందాం.సముద్రమంత పెద్ద సరస్సు..!క్యాస్పియన్ సముద్రం ఎంత పెద్దదో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే.. దీన్ని గనుక అమెరికా మ్యాప్ పైన పెడితే, దక్షిణాన లాస్ ఏంజిల్స్ నుండి ఉత్తరాన ఓరెగాన్, ఐడహో రాష్ట్రాల వరకు విస్తరిస్తుంది. సముద్రాలతో ఎలాంటి సహజ అనుసంధానం లేకపోవడం వల్ల సాంకేతికంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు. కానీ, 2020లో జర్మనీలోని బ్రెమెన్ యూనివర్సిటీ, నెదర్లాండ్స్ లోని ఉట్రెచ్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 'నేచర్' జర్నల్‌లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం.. ఈ శతాబ్దం ముగిసేసరికి క్యాస్పియన్ సముద్రం నీటి మట్టం 9 మీటర్ల నుండి ఏకంగా 18 మీటర్ల మేర పడిపోనుంది! ఒకవేళ 9 మీటర్ల నీటి మట్టం తగ్గితే.. ఈ సముద్ర ఉపరితల వైశాల్యంలో 23 శాతం శాశ్వతంగా ఎండిపోతుంది. అదే గరిష్టంగా 18 మీటర్లు తగ్గితే.. ఏకంగా 34 శాతం భాగం భూమిగా.. ఇంకా పరిస్థితులు దారుణంగా ఉంటే.. ఎడాదిరి మాదిరిగా మారిపోతుంది. అంటే, దాదాపు 'పోర్చుగల్' దేశమంత పరిమాణంలో ఉన్న నీటి భాగం ఎండిపోయి ఎడారిగా మారుతుందన్నమాట! అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే.. 2050 నాటికే, అంటే కేవలం మరో పాతికేళ్లలోనే ఈ సరస్సు ఉత్తర భాగం పూర్తిగా అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది.ఉత్తరభాగం కనుమరుగు..!అసలు ఈ ఉత్తర భాగమే ఎందుకు ముందు ఎండిపోతోంది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని నేను వివరిస్తాను. క్యాస్పియన్ సముద్రం మూడు బేసిన్లుగా ఉంది. దక్షిణ బేసిన్ అత్యంత లోతైనది. ఇక్కడ దాదాపు ఒక కిలోమీటరు మేర లోతు ఉంటుంది. మధ్య బేసిన్ కూడా 788 మీటర్ల మేర లోతు ఉంటుంది. కానీ కజకిస్తాన్, రష్యా సరిహద్దుల్లో ఉండే ఉత్తర బేసిన్ సగటు లోతు 5 మీటర్లు మాత్రమే! క్యాస్పియన్ సముద్రంలో మూడో వంతు వైశాల్యం దీనిదే అయినప్పటికీ, కేవలం 1 శాతం నీరు మాత్రమే ఇక్కడ ఉంటుంది. గత శతాబ్దంలో 'ఆరల్ సముద్రం' ఎలాగైతే సోవియట్ పాలకుల నిర్వాకం వల్ల పూర్తిగా ఎండిపోయిందో.. ఇప్పుడు క్యాస్పియన్ సముద్రానికి కూడా అదే గతి పడుతోంది.ఎందుకు ఈ పరిస్థితి?అసలు క్యాస్పియన్ సముద్రం ఎందుకు ఎండిపోతోంది? అనే ప్రశ్నకు రెండు అంశాలను కారణాలుగా చెప్పవచ్చు. మొదటిది, ఈ సరస్సుకు నీరందించే 130 నదులలో అత్యంత ప్రధానమైనది 'ఓల్గా నది'. క్యాస్పియన్ సముద్రానికి వచ్చే నీటిలో 80 శాతం ఈ ఒక్క నది నుంచే చేరుతుంది. అయితే, 2026లో 'అమెరికన్ జియోఫిజికల్ యూనియన్' ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఓల్గా నది ద్వారా వచ్చే నీటి ప్రవాహం గత కొన్నేళ్లుగా 12 శాతం తగ్గిపోయింది. క్లైమేట్ ఛేంజ్ వల్ల వర్షపాతం తగ్గడమే దీనికి కారణం. ఇక క్యాస్పియన్ సీ ఎండిపోవడానికి రెండో కారణం.. గ్లోబల్ వార్మింగ్! 1979 నుంచి 2015 మధ్య కాలంలో ఇక్కడి సగటు ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ మేర పెరిగింది. దీనివల్ల నీరు ఆవిరైపోయే రేటు విపరీతంగా పెరిగింది. క్యాస్పియన్ సముద్రం కోల్పోయిన నీటిలో 40 శాతం కేవలం ఈ ఎండల వల్ల ఆవిరైపోయినదే!జీవవైవిధ్యానికి ముప్పు..?ఈ విపత్తు వల్ల జరిగే నష్టం ఊహాతీతం. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అంతరించిపోతున్న 'క్యాస్పియన్ సీల్స్' అనే జీవులు చలికాలంలో ఈ ఉత్తర భాగంలో గడ్డకట్టే మంచుపైనే పిల్లల్ని కంటాయి. ఇప్పుడు ఆ మంచు కరిగిపోతే, ఆ జీవజాతి పూర్తిగా అంతరించిపోతుంది. ఇక ఆర్థికంగా చూస్తే.. ప్రపంచంలోని 3 శాతం ఆయిల్ నిల్వలు, 4 శాతం గ్యాస్ నిల్వలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ముఖ్యంగా కజకిస్తాన్‌కు చెందిన, అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ అయిన 'కాశగన్ ఆయిల్ ఫీల్డ్' ఈ ఉత్తర బేసిన్ లోనే ఉంది. సముద్రం ఎండిపోతే, అక్కడ ఉన్న బిలియన్ల డాలర్ల షిప్పింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ల్యాండ్లాక్డ్ అయిపోయి, కజకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అంతేకాదు, రష్యాలోని ఆస్ట్రాఖాన్, అజర్బైజాన్ రాజధాని బాకూ లాంటి ప్రముఖ ఓడరేవులు కొత్త తీరప్రాంతానికి కిలోమీటర్ల దూరంలోకి జరిగిపోతాయి. చైనా నుంచి ఐరోపా వెళ్లే అత్యంత కీలకమైన 'మిడిల్ కారిడార్' ట్రేడ్ రూట్ కూడా ఈ సరస్సు ఎండిపోవడం వల్ల ప్రశ్నార్థకంగా మారబోతోంది.భూగర్భం విషపూరితమే..ఇవన్నీ ఒకెత్తయితే, ఎండిపోయిన ఈ సరస్సు గర్భం విషపూరితమైన ఎడారిగా మారుతుంది. ఎందుకంటే దశాబ్దాలుగా ఇక్కడ జరిగిన ఆయిల్ వెలికితీత, కెమికల్ వ్యర్థాల వల్ల ఈ నీరు పూర్తిగా కలుషితమైంది. రేపు ఎండల వల్ల ఈ భూమి ఎండిపోయాక, వీచే గాలులు ఆ కెమికల్ ధూళిని చుట్టుపక్కల నగరాలపైకి మోసుకొస్తాయి. దీనివల్ల ఈ తీరప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు 'క్లైమేట్ రెఫ్యూజీస్' అంటే.. వాతావరణ శరణార్థులుగా తమ ఇళ్లను వదిలి వలస వెళ్ళిపోవాల్సిన దుస్థితి వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోనూ, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల్లోనూ ఇరాన్ తన డ్రోన్లను రష్యాకు సరఫరా చేయడానికి ఈ క్యాస్పియన్ సముద్రాన్నే వాడుకుంటోంది. రాజకీయాలకు వ్యూహాత్మక కేంద్రంగా ఉన్న ఈ మహా సరస్సు.. ప్రకృతి ప్రకోపానికి బలైపోతుండటం నిజంగా మానవాళికి ఒక హెచ్చరిక. మరి గ్లోబల్ ఎమిషన్స్ తగ్గించి ప్రపంచ దేశాలు ఈ మహావినాశనాన్ని ఆపగలవా? లేదా అనేది కాలమే నిర్ణయించాలి.:: హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు -
రుతుపవనాలు ఉధృతం.. పలు నగరాలు అతలాకుతలం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఉధృత రూపం దాల్చాయి. ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా ముంబైలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగగా.. కేరళ, ఒడిశా రాష్ట్రాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.ముంబైలో శనివారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురవడంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వే కార్యకలాపాలను గంటపాటు నిలిపివేశారు. దీనివల్ల విమానాల రాకపోకల్లో సగటున 30 నుంచి 75 నిమిషాల ఆలస్యం చోటుచేసుకుంది. నగరంలో 24 గంటల్లో గరిష్టంగా 200 నుంచి 300 మి.మీ వర్షపాతం నమోదైంది.మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఒడిశాలోని అన్ని జిల్లాలను యంత్రాంగం అప్రమత్తం చేసింది. కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కన్నూర్, కాసరగోడ్ సహా పలు ఉత్తర జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు ప్రకటించారు. వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. జాతీయ రాజధాని ఢిల్లీ, జార్ఖండ్‌లలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.ఇది కూడా చదవండి: ‘కలల నగరం’ కథలే వేరు.. -
ముంబైలో వర్ష బీభత్సం..‘రెడ్ అలర్ట్’ జారీ!
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం నగరంతో పాటు పరిసర ప్రాంతాలలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. వర్షంతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, సముద్రంలో భారీ అలలు ఎగిసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలుల కారణంగా జనజీవనం స్తంభించింది. ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యమైనప్పటికీ, ఈ వారం ప్రారంభం నుండి ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం 8 గంటల వరకు గడచిన 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం.. ఐలాండ్ సిటీలో సగటున 99 మి.మీ, తూర్పు శివారు ప్రాంతాలలో 98 మి.మీ, పశ్చిమ శివారు ప్రాంతాలలో 94 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. -
Big Breaking : మరో 24 గంటల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు
-
వర్షాల రాకపై వ్యాపారం !
స్టాక్ మార్కెట్ అంటే షేర్లు.. బంగారం.. కమోడిటీలు.. కరెన్సీలు మాత్రమే అనుకునే రోజులు మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం, కార్బన్ క్రెడిట్లు, నీటి వినియోగం, విద్యుత్ ధరలు వంటి అంశాలపై కూడా ఫైనాన్షియల్ ఉత్పత్తులు వస్తున్నాయి. అదే దారిలో భారత్‌లో కూడా ‘‘వెదర్ డెరివేటివ్స్’’ అనే కొత్త కాన్సెప్ట్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది. ముంబై వర్షపాతం ఆధారంగా ‘రెయిన్ ముంబై’ అనే వెదర్ డెరివేటివ్‌ను నేషనల్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్ (ఎన్సీడెక్స్) ప్రారంభించింది. వాతావరణ శాఖ (ఐఎండీ) డేటా ఆధారంగా, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పర్యవేక్షణలో ఈ కాంట్రాక్టులు ట్రేడ్ అవుతాయి. రైతులకు మాత్రమే సంబంధించినవిగా పరిగణించే రుతుపవనాలు ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్లలో కూడా ‘ట్రేడింగ్ థీమ్’గా అందుబాటులోకి వస్తున్నాయి. ఇన్వెస్టర్ల ఆసక్తిని బట్టి ముందు ముందు దేశవ్యాప్తంగా వెదర్ డెరివేటివ్స్ని ప్రారంభించేందుకు కమోడిటీ ఎక్సే్చంజ్ కసరత్తు చేస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ఏమిటీ రెయిన్ ముంబై?రెయిన్ ముంబై ఫ్యూచర్ కాంట్రాక్టు వర్షపాతం ఎక్కువా? తక్కువా? అన్న డేటాపై ఆధారపడి ట్రేడయ్యే ఒక ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ . రైతులు, పవర్ కంపెనీలు, నిర్మాణ సంస్థలు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఇలా వర్షాల ప్రభావానికి లోనయ్యే అన్ని రంగాలకు ఇది రిస్క్ మేనేజ్మెంట్ సాధనంగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో మార్కెట్‌ను అర్థం చేసుకునే ఇన్వెస్టర్లకు కొత్త అవకాశాలను అందిస్తుందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఇప్పటివరకు వాతావరణ సంబంధిత ప్రమాదాలు జరిగినపుడు బాధితులకు బీమా మాత్రమే ప్రస్తుతం నష్టపరిహారంగా అందుబాటులో ఉంది. ఇప్పుడు మార్కెట్ ఆధారిత ‘వెదర్ ట్రేడింగ్’ వారికి కొత్త రక్షణ కవచంగా నిలుస్తుందనేది మార్కెట్ వర్గాలు అంచనా.ప్రపంచానికి పాతవే..ప్రపంచ మార్కెట్లలో ఇలాంటి డెరివేటివ్స్ కొత్త విషయమేం కాదు. అమెరికా, యూరప్‌లలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు, గ్యాస్ ధరలు, విద్యుత్ వినియోగం వంటి అంశాలపై ట్రేడింగ్ ఉత్పత్తులు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. కార్బన్ క్రెడిట్ మార్కెట్లు అయితే బిలియన్ డాలర్ల వ్యాపారంగా మారాయి. ఈకోవలోనే వాతావరణ మార్పులు పెరుగుతున్న సమయంలో ‘‘క్లైమేట్ ఫైనాన్స్’’ వేగంగా విస్తరిస్తోంది.ఇది పెట్టుబడులకు మాత్రమే కాకుండా, ధరల మార్పులు , వ్యాపార రిస్క్‌ల నుంచి రక్షణ పొందేందుకు కూడా ఉపయోగపడుతుంది. భారత్‌లో ఇప్పటివరకు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ వరకే పరిమితమయ్యారు. కానీ భవిష్యత్తులో యువ ఇన్వెస్టర్లు లక్ష్యంగా డేటా ఆధారిత కొత్త తరహా ఫైనాన్షియల్ ఉత్పత్తులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువ ఇన్వెస్టర్లు, మార్కెట్‌పై అవగాహన ఉన్నవారు ఇలాంటి విభిన్న ట్రేడింగ్ ఉత్పత్తులపై ఆసక్తి చూ పుతున్నారని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘ఆల్టర్నేటివ్ డెరివేటివ్స్’⇒ వాతావరణం ⇒ కార్బన్ క్రెడిట్లు ⇒ విద్యుత్ వినియోగం ⇒ నీటి హక్కులు ⇒ ఈఎస్జీ/ సస్టెయినబిలిటీ ఇండెక్స్‌లు (పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత, మరియు పారదర్శక పాలనా ప్రమాణాల ఆధారంగా కంపెనీల పనితీరును అంచనా వేసే సూచీలు.) ⇒ పునరుత్పాదక ఇంధన వనరుల పత్రాలురిస్క్ ఎక్కువేడెరివేటివ్స్ అంటే అధిక రిస్క్ సాధనాలు. అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టకూడదు. మార్కెట్ ఎలా పనిచేస్తుంది? ఒడిదుడుకులు ఎలా ఉంటాయి? వంటి అంశాలు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ప్రవేశించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రిస్క్ అంచనాలతో సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు ఈ మార్కెట్లో ప్రవేశించాలని హెచ్చరిస్తున్నారు. -
జులైలో వానలు! విశాఖ IMD గుడ్ న్యూస్
-
ఫ్రాన్స్‌లో వడగాలుల బీభత్సం.. వెయ్యి మంది మృతి
పారిస్: ఫ్రాన్స్‌లో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అధిక వేడులతో వడ గాలుల కారణంగా దాదాపు 1,000 మందికి పైగా మృతిచెందినట్లు ఆ దేశం ప్రకటించింది. అదే విధంగా జర్మనీ, స్పెయిన్, బ్రిటన్‌తో సహా 16 దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఆ ఏడాది నమోదైనట్లు పేర్కొంది.ఐరోపా ప్రస్తుతం రికార్డు స్థాయిలో వేడిగాలుల బారిన పడుతోంది. ఈ తీవ్రమైన వేడి కారణంగా ఫ్రాన్స్‌లో దాదాపు 1,000 మంది అదనంగా మరణించారని తెలుస్తోంది. జూన్ 24 నుండి జూన్ 27 మధ్య మూడు రోజులలోనే ఫ్రాన్స్ వ్యాప్తంగా ఈ మరణాలు సంభవించాయని నివేదికలు పేర్కొన్నాయి. రాజధాని పారిస్, పరిసర ప్రాంతాలలో మరణాలు కేసులు ఉన్నాయని మృతులలో అధికంగా వృద్ధులే ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అదే సమయంలో, జర్మనీ, స్పెయిన్, బ్రిటన్, డెన్మార్క్, ఇటలీ స్విట్జర్లాండ్‌తో సహా 16 దేశాలలో ఉష్ణోగ్రతలు దశాబ్దాల నాటి రికార్డులను బద్దలు కొట్టాయి.అయితే యూరప్‌లో 35 డిగ్రీల సెల్సియస్‌కు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అక్కడి రోడ్లు కరిగిపోతున్నాయని అనేక ప్రాంతాలల కార్చిచ్చులు చెలరేగుతున్నాయనిల అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ సగటు కంటే యూరప్‌లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. భారీగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో బ్రిటన్ చరిత్రలోనే తొలిసారిగా, వరుసగా మూడు రోజుల పాటు రెడ్ వార్నింగ్ హెచ్చరికలు జారీ చేశారు. బ్రిటన్‌లో జూన్ నెలకు సంబంధించి ఈ వారం వరుసగా మూడు రోజుల పాటు బద్దలైందని అధికారులు పేర్కొన్నారు. బ్రిటన్ వ్యాప్తంగా వెయ్యికి పైగా పాఠశాలలను మూసివేయవలసి వచ్చిందని తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా ఇనుప రైలు పట్టాలు వ్యాకోచించి, వంగిపోతున్నాయని తెలిపారు. దీనివల్ల రైళ్లపై కఠినమైన వేగ పరిమితులను గంటకు గరిష్ఠంగా 60 మైళ్లకు తగ్గించాల్సి వస్తోందని పేర్కొన్నారు. -
విశాఖలో భీకర వర్షం.. APలో రెండు రోజులు వానలే వానలు
-
భవిష్య దృష్టి
శుభా వెంకటేష్ అయ్యంగార్ పెద్దగా మాట్లాడడం ఎవరూ పెద్దగా చూడలేదు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకొని పోవడం చిన్నప్పటి నుంచి ఆమె అలవాటు. భౌతికశాస్త్రంలో ఎన్నో బంగారు పతకాలు సాధించిన అయ్యంగార్ స్ఫూర్తిదాయకమైన సైంటిస్ట్ స్థాయికి ఎదిగారు. ‘దృష్టి’ పేరుతో ఎయిర్పోర్ట్ వెదర్, రన్‌వే విజిబిలిటీ సిస్టమ్‌ను అభివృద్ధి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న శుభా అయ్యంగార్ గురించి...నాలుగు దశాబ్దాలకు పైగా నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ (ఎన్.ఎ.ఎల్.)లో పనిచేసిన శుభా అయ్యంగార్ ఎయిర్పోర్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగానికి నాయకత్వం వహించారు. పద్మ పురస్కారాల నేపథ్యంలో... ప్రతికూల వాతావరణ పరిస్థితులలో సురక్షితమైన విమాన కార్యకలాపాలకు తోడ్పడే వ్యవస్థ రూపకల్పనకు సంబంధించి శుభా అయ్యంగార్ కృషిని భారత ప్రభుత్వం ప్రశంసించింది.బంగారు బాటలో...బెంగళూరు యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసిన అయ్యంగార్ రెండింటిలోనూ మొదటి ర్యాంక్ సాధించారు. భౌతిక శాస్త్రంలో ఎన్నో బంగారు పతకాలు సాధించారు. ఎంఎస్సీ ఫిజిక్స్‌లో మొదటి ర్యాంక్ సాధించిన శుభా అయ్యంగార్ భారత ప్రభుత్వ మెరిట్ స్కాలర్షిప్ను అందుకున్నారు. రాత పరీక్ష, ఇంటర్యూ్య ప్రక్రియతో పనిలేకుండా కేవలం విద్యాప్రతిభ ఆధారంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ఆమెకు జూనియర్ సైంటిఫిక్ ఫెలోషిప్ ప్రదానం చేసింది.ప్రపంచం ‘దృష్టి’లో ఆమె ప్రతిభ‘దృష్టి’ పేరుతో ఎయిర్పోర్ట్ వెదర్, రన్‌వే విజిబిలిటీ సిస్టమ్‌ను అభివృద్ధి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు శుభా అయ్యంగార్. ఈ సాంకేతికత... పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు రియల్ టైమ్ రన్‌వే విజువల్ రేంజ్ (ఆర్వీఆర్)ను అందిస్తుంది. దృశ్యాలు అస్పష్టంగా ఉన్నప్పుడు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతోంది. దీనిని ఇప్పుడు భారతదేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలలో, భారత వైమానిక దళంలో ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికత దేశానికి గణనీయంగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడంలో సహాయపడింది. భారతీయ విమానాశ్రయాలలో సాధారణంగా ఎదురయ్యే సవాళ్లలో దట్టమైన పొగమంచు ఒకటి. భారీ వర్షపాతం, ధూళి తుఫాను పరిస్థితులలో కూడా ఈ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ‘దృష్టి’ వ్యవస్థను రూపాందించారు. ‘దృష్టి’కి ముందు మన విమానశ్రయాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ట్రాన్సోమీటర్లపై ఆధారపడేవి. ‘దృష్టి’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.నాసా గుర్తింపుశుభా అయ్యంగార్ శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్న రోజుల్లో ఇంటర్నెట్ సదుపాయం, అత్యాధునిక ప్రయోగశాలలు లేవు. ‘ఇంటర్నెట్, ఇతరత్రా సదుపాయాలు లేకుండానే 1986లో మూడు పరిశోధన పత్రాలను ప్రచురించాను. అది మా పేర్లతో నాసాలో ఒక రిపోర్ట్‌గా రికార్డ్ అయింది’ అంటారు శుభ.శుభా అయ్యంగార్ చేసిన కృషి భారతదేశ రక్షణ సామర్థ్యాలకు దోహదపడింది. భారతదేశం గర్వించదగిన ‘అగ్ని’ క్షిపణికి సంబంధించి క్లిష్టమైన సాంకేతిక సమస్యను పరిష్కరించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. స్వదేశీ సాంకేతిక అభివృద్ధి, స్వావలంబనను పెంపొందించడంలో చేసిన కృషికి గుర్తింపుగా మొట్ట మొదటి జాతీయ ‘మేక్ ఇన్ ఇండియా’ అవార్డ్ అందుకున్నారు శుభా అయ్యంగార్. ఫ్యామిలీ పవర్‘మహిళలు ఉన్నత విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత స్థానంలోకి వెళ్లగలరు’ అని బలంగా నమ్మేవారు శుభా అయ్యంగార్ నాన్నగారు. కూతురిని చదువు విషయంలో బాగా ప్రోత్సహించేవారు. శాస్త్రీయ విషయాలపై అవగాహన కలిగించేవారు. కూతురు ఉన్నతస్థాయిని చూడకుండానే, శుభ ఎం.ఎస్సీ. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. ‘నాన్న ద్వారానే సైన్స్ పట్ల ఆసక్తి కలిగింది’ అని చెబుతుంటారు శుభ. తొమ్మిది మంది తోబుట్టువులలో అందరికంటే చిన్నదైన శుభ తన కుటుంబాన్నే వెన్నెముకగా భావిస్తారు. పదవీవిరమణ తరువాత కూడా అవసరమైనప్పుడు వివిధ సంస్థలు ఆమె సలహాలు తీసుకుంటున్నాయి. వ్యక్తిగత గుర్తింపు కంటే పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు శుభా అయ్యంగార్. -
ముంబై నగరాన్ని వణికిస్తున్న కుండపోత వర్షం..
-
ముంబై: మరో 48 గంటల్లో రుతుపవనాలు!
ముంబై: ముంబై నగరవాసుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. గత కొంతకాలంగా మందగించిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకున్నాయి. రాబోయే 48 గంటల్లో రుతుపవనాలు ముంబై సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం నగరంలో కురిసిన వర్షాలు ముందస్తు రుతుపవన జల్లులేనని స్పష్టం చేసిన అధికారులు, రానున్న రెండు రోజుల్లో అధికారికంగా రుతుపవనాల రాకను ప్రకటించే అవకాశం ఉందని తెలపడంతో తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి పెద్ద ఊరట లభించినట్లయింది.పుంజుకున్న రుతుపవనాలుఅరేబియా సముద్రం, బెంగాళాఖాతంలో బలహీనమైన వాతావరణ వ్యవస్థలు, ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యమైంది. సాధారణంగా జూన్ 11 నాటికే ముంబైని తాకాల్సిన రుతుపవనాలు, గత వారం రోజులుగా మరింత మందగించాయి. అయితే, తాజా పరిణామాల ప్రకారం పశ్చిమ తీరం వెంబడి రుతుపవన వ్యవస్థ మళ్లీ బలాన్ని పుంజుకుంటోంది. ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్లలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని, రాబోయే రెండు రోజుల్లో ఈ పురోగతి మరింత వేగవంతం కానుందని వాతావరణ శాఖ పేర్కొంది.వేగాన్ని నియంత్రిస్తున్న అల్పపీడనంరుతుపవనాలు మళ్లీ కదిలినప్పటికీ, వాటి ప్రయాణం సాధారణం కంటే నెమ్మదిగానే సాగుతోందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఈ సమయంలో వర్షాలను తీవ్రం చేసే బెంగాళాఖాతంలోని అల్పపీడన వ్యవస్థ ఇంకా ఏర్పడకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. జూన్ చివరి నాటికి మాత్రమే ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆలస్యం కారణంగా ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు రుతుపవనాల రాక మరింత ఆలస్యమై, జూలై మొదటి వారంలో అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.దేశవ్యాప్తంగా 43 శాతం వర్షపాత లోటుప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షపాత లోటు ఆందోళనకరంగానే ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణంగా కురవాల్సిన 106 మిమీ వర్షపాతానికి గానూ కేవలం 60.6 మిమీ మాత్రమే నమోదైంది. అంటే దేశవ్యాప్తంగా 43 శాతం వర్షపాత లోటు నెలకొంది. ఇందులో మధ్య భారతదేశం అత్యధికంగా 67 శాతం లోటుతో అతలాకుతలమవుతుండగా, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 40 శాతం, దక్షిణ భారతదేశంలో 28 శాతం, వాయువ్య భారతదేశంలో 15 శాతం మేర వర్షపాత లోటు నమోదైంది. రాబోయే 48 గంటల్లో ముంబైలోకి రుతుపవనాల ప్రవేశం దేశవ్యాప్త వర్షాలపై సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. -
ఎల్ నినోను బ్లేమ్ చేయొద్దు.. అసలు కారణాలు వేరే!
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కదలికలు అనూహ్యంగా నిలిచిపోవడంతో రైతులు, వాతావరణ నిపుణుల్లో ఆందోళన పెరుగుతోంది. వర్షాలు ముందుకు సాగాల్సిన సమయంలో అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఈ సమయానికే దేశమంతటా రుతుపవనాల విస్తరణ వేగంగా జరగాలి. కానీ ఈసారి ఆ సహజ గమనంలో అంతరాయం ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితికి ఎల్ నినోనే ప్రధాన కారణమని అంతా భావిస్తున్నారు. అయితే లోతైన అధ్యయనాలు కొనసాగుతున్న కొద్దీ, శాస్త్రవేత్తలు ఈ మార్పు వెనుక ఒకే కారణం కాకుండా.. ఇంకా చాలా ఉన్నాయని చెబుతున్నారు..పసిఫిక్ సముద్రంలో చోటుచేసుకుంటున్న వాతావరణ అస్థిరతలు, భారత మహాసముద్రంలో తేమ ప్రవాహాల్లో మార్పులు, అలాగే ఖండాల మధ్య గాలుల సమతుల్యతలో వచ్చిన వ్యత్యాసాలు కలిసి ఈ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా రుతుపవనాలు ముందుకు సాగడానికి అవసరమైన తక్కువ పీడన వ్యవస్థలు ఈసారి సమయానికి ఏర్పడకపోవడం ప్రధాన కారణాల్లో ఒకటిగా గుర్తిస్తున్నారు. బంగాళాఖాతంలో బలమైన తక్కువ పీడన కేంద్రాలు లేకపోవడం వల్ల వర్ష మేఘాలు లోపలికి చొచ్చుకుపోవడం తగ్గిపోయింది.ఇక ఉత్తర భారతంపై తరచూ ప్రభావం చూపే పశ్చిమ దిశ వాతావరణ వ్యవస్థలు ఈసారి అసాధారణంగా క్రియాశీలంగా మారాయి. ఇవి పొడి గాలులను దక్షిణ దిశకు తీసుకువచ్చి, తేమను తగ్గించడంతో మేఘాల ఏర్పాటుకు అనుకూలం కాని పరిస్థితిని సృష్టించాయి. ఫలితంగా రుతుపవనాలు ముందుకు సాగాల్సిన దారి మధ్యలోనే బలహీనపడినట్టు కనిపిస్తోంది. సాధారణంగా ఒక వ్యవస్థ బలహీనపడితే మరొక వ్యవస్థ దాన్ని పూరిస్తుంది. కానీ ఈసారి అన్ని సహజ చక్రాలు ఒకేసారి అనుకూలంగా లేకపోవడం వల్ల సమతుల్యత దెబ్బతింది.అలాగే భూమధ్యరేఖ ప్రాంతంలో వర్షాలను ప్రభావితం చేసే సహజ చక్రం కూడా ఈ సమయంలో అనుకూలంగా లేకపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. దీని వల్ల వర్ష మేఘాల సమూహాలు బలపడకుండా విడిపోయి, నిర్దిష్ట ప్రాంతాల్లో కేంద్రీకృతం కావడం తగ్గింది. దీంతో విస్తృత స్థాయిలో వర్షాలు కురవాల్సిన అవకాశం తగ్గిపోయింది.కాబట్టి ఎల్ నినో ప్రభావం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ.. అది ఒక్కటే ఈ స్థాయి విఘటనకు కారణం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది కేవలం మొత్తం వాతావరణ సమీకరణంలో ఒక భాగం మాత్రమేనని, కానీ అసలు సమస్య అనేక వ్యవస్థల సమకాలీన అసమతుల్యతతో ముడిపడి ఉందని చెబుతున్నారు. అంటే రుతుపవనాల కదలికను ఎల్ నినో అనే ఒకే కారణంతో వివరించడం ఇప్పుడు సాధ్యం కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ చివరి వారంలో పరిస్థితులు కొంత మారే అవకాశం ఉంది. సముద్ర ఉపరితల గాలులు తిరిగి బలపడడం, భూమధ్యరేఖ నుంచి వచ్చే తేమ ప్రవాహం పెరగడం, పై స్థాయిలో గాలుల దిశ అనుకూలంగా మారడం వంటి అంశాలు కలిసి రుతుపవనాలకు మళ్లీ ఊపునివ్వవచ్చని భావిస్తున్నారు. అయితే ఇది ఎంత వేగంగా జరుగుతుందన్నదే కీలకంగా మారింది.మొత్తానికి ఈసారి రుతుపవనాల నిలకడ వెనుక ఒకే కారణం కాకుండా అనేక వాతావరణ వ్యవస్థల సంక్లిష్ట పరస్పర ప్రభావం ఉందని స్పష్టమవుతోంది. సహజ వాతావరణ చక్రాల్లో చిన్న మార్పు కూడా దేశవ్యాప్తంగా వర్షాలపై ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ఈ పరిస్థితి మరోసారి గుర్తు చేస్తోంది. రైతుల ఆశలు వర్షాలపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఈ వాతావరణ సమతుల్యత ఎంత త్వరగా తిరిగి వస్తుందన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం. -
హైదరాబాద్ : నగరంలో పలుచోట్ల భారీ వర్షం (ఫొటోలు)
-
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
-
రేపు వర్షం వస్తుంది !
వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వంతో పాటు అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్నదాతలకు వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఆధారిత ‘తెలంగాణ వాతావరణ సమాచారం’ కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. వాతావరణ శాఖ సహకారంతో తొలిదశలో రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ జాబితాలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి.నేరుగా వాట్సాప్‌కు...వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని నేరుగా రైతుల సెల్‌ఫోన్ వాట్సాప్‌కు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఆధారిత సలహాలను చేరవేస్తారు. ఏఐ, డిజిటల్ సాంకేతిక డేటాల అనుసంధానంతో శాటిలైట్ ఆధారిత వాతావరణ అంచనాలతో రూపొందించిన సమాచారం అందుతుంది. ఈ కార్యక్రమం అమలుకు డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్(డీఐఎల్), ఇండియా ఎవిడెన్స్ యాక్షన్ సంస్థలతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.విత్తనాలు, ఎరువులపై కూడా..వర్షాలు, ఉష్ణోగ్రతలు, వడగాలులే కాక రాబోయే వాతావరణ మార్పుల ముందస్తు అంచనాలను రైతులకు అందించనున్నారు. ఇవికాక వాతావరణం, వర్షాపాతం ఆధారంగా ఏ సమయంలో ఏ విత్తనాలు వేయాలి, ఎరువులు వాడాలి, పంటలను ఎలా రక్షించుకోవాలనే అంశంపై నిపుణుల సలహాలు కూడా ఇందులో ఉంటాయి. తాజా వాతావరణ పరిస్థితులతో పాటు సలహాల కోసం స్థానిక వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించవచ్చు. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఐఎండీ సూచనలను తెలుసుకోవడానికి Met centre Hyderabad& IMD ఈ ను సందర్శించే అవకాశం కల్పించారు. రాబోయే ఎల్‌నినో వంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు తట్టుకుని పంట నష్టాలను తగ్గించుకునేలా రైతులకు ఈ ఏఐ ఆధారిత వ్యవస్థ కచ్చితమైన సమాచారాన్ని అందించనుంది.ఖమ్మంలో జిల్లాలో 3.58 లక్షల మందికి..రైతు భరోసా పోర్టల్ ఆధారంగా 17 జిల్లాలకు చెందిన 15 లక్షల మందికి తొలిదశలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా ఖమ్మం జిల్లాలో రైతు భరోసా సాయం అందుతున్న 3,58,753 మంది రైతుల సెల్‌ఫోన్ నంబర్లను అనుసంధానం చేశారు. ఆయా రైతులకు ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులపై ఏఐ ఆధారిత వాతావరణ వివరాలు అందుతున్నాయి. అయితే, ఇందులో నమోదుకాని రైతులు వ్యవసాయ శాఖ, వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించే అవకాశాన్ని కల్పించారు.రైతులకు ప్రయోజనంఏఐ ఆధారిత ముందస్తు వాతావరణ సమాచారం, పంటల నిర్వహణపై సలహాలు రైతులకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం అందరి చేతుల్లో సెల్‌ఫోన్ ఉంటున్నందున వాట్సాప్‌కు వాతావరణం, పంటల సాగుపై సలహాలు అందుతాయి. ఈ సమాచారం ఆధారంగా రైతులు సాగులో ముందుకు సాగే అవకాశం ఉంటుంది.– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
తెలంగాణను తాకిన రుతుపవనాలు ఏపీకి ఎప్పుడంటే...?
-
కేరళ, కర్ణాటకలో అలర్ట్ ఐఎండీ భారీ వర్ష హెచ్చరిక
-
Weather Updates: వచ్చేసిన రుతుపవనాలు.. ఇక వానలే.. వానలు
-
ఎండలు రివర్స్ గేర్, భారీ ఈదురు గాలులతో ఏపీకి వానలు
-
రాష్ట్రంలో భిన్న వాతావరణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ వానలతో భిన్నవాతావరణం నెలకొందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తూర్పు విదర్భ నుంచి దక్షిణ కేరళ వరకు, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఆకస్మికంగా ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడొద్దని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలన్నారు. గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ, వీలైనంత దూరంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఎండ తీవ్రత ఉంటుందని వివరించారు. -
కోస్తాలో ఎండ.. సీమలో వర్షం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది విభిన్న వాతావరణం ఏర్పడుతోంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వానలు విరుచుకుపడుతున్నాయి. ఆదివారం కోస్తా ప్రాంతంలో ఎండలు దంచికొట్టగా.. సీమ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పల్నాడు జిల్లా అచ్చంపేటలో 44.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మద్దిపాలెంలో 9.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బంగాళాఖాతం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక్కడ సెగ మరోవైపు పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నంద్యాల, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. -
రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు
-
Weather Update: వర్షాలు ఇప్పట్లో లేవు
-
మండుతున్న ఎండలు.. ప్రధాని మోదీ కీలక సూచనలు
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిని దాటేస్తుండటంతో, వడగాల్పుల తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితికి దారితీసే ఈ ఎండల నుండి రక్షించుకునేందుకు అప్రమత్తతతో ఉండాలని ఆయన సూచించారు.ఎండల వేళ పాటించాల్సిన నియమాలుతీవ్రమైన ఎండల కారణంగా డీహైడ్రేషన్, వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రధాని కోరారు. దాహం వేయకపోయినా క్రమం తప్పకుండా నీరు తాగాలని, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు వాటర్‌బాటిల్ వెంట ఉంచుకోవాలని సూచించారు. తల తిరగడం, వాంతులు, తీవ్ర అలసట వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నీడ ఉన్న చోటికి చేరాలని, వైద్య సహాయం పొందాలని సూచించారు. Different parts of India are witnessing soaring temperatures and the challenges that come with it. This heat is harsh on all of us and I urge you all to take as many precautions as possible. Please stay hydrated, keep water with you when stepping out. Offer a glass of water to…— Narendra Modi (@narendramodi) May 27, 2026మానవత్వంతో స్పందించండిప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తోటి వారికి సాయం చేయాలని ప్రధాని కోరారు. దాహంతో ఉన్న వారికి మంచి నీరు అందించడం, నీరసంగా ఉన్నవారిని చల్లని ప్రదేశానికి తరలించి ఓఆర్ఎస్ వంటివి అందించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. వృద్ధ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని, మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లకుండా వారిని అప్రమత్తం చేయాలని సూచించారు.మూగజీవాలపై మానవత్వంఎండల తీవ్రత కేవలం మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా ఇబ్బందికరమని ప్రధాని గుర్తు చేశారు. మన ఇళ్ల బాల్కనీలు, టెర్రస్‌లు, దుకాణాల ముందు ఒక చిన్న పాత్రలో నీటిని ఉంచడం ద్వారా దాహంతో ఉన్న పక్షులు, జంతువుల ప్రాణాలను కాపాడవచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఈ కష్టకాలంలో మనలో ఉన్న కరుణే మూగజీవాలకు జీవనాధారమని, అందరూ ఈ మానవీయ బాధ్యతను నెరవేర్చాలని కోరారు. -
ఏ జిల్లా హీట్ రిస్క్ ఎంత?
న్యూఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్వి రాన్మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) మనదేశంలో (1982–2022 మధ్య) 40 ఏళ్ల వాతావరణ గణాంకాలను విశ్లేషించి ఏ జిల్లా హీట్ రిస్క్ ఇండెక్స్ ఎంతో లెక్కగట్టింది. ఈ అధ్యయనం ప్రకారం..మన దేశంలోని అప్పటికి ఉన్న 734 జిల్లాలకుగాను 266 జిల్లాలు అత్యధిక వేడి ముప్పును, 151 జిల్లాలు అధిక వేడి ముప్పును ఎదుర్కొన్నాయి. ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురు ఈ జిల్లాల్లోనే ఇబ్బందికర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అధిక వేడి ముప్పును ఎదుర్కొంటున్న తొలి పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు: ఢిల్లీ, ఆంధ్రపదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. ఏపీతో పోల్చితే తెలంగాణ నయం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత సీజన్లో ఎండల తీవ్రత ఏఏ జిల్లాల్లో ఎంత ఎక్కువగా ఉందో మనం చూస్తున్నాం. అయితే గత కొన్ని దశాబ్దాల వాతావరణ గణాంకాల ప్రకారం ఏఏ జిల్లాల హీట్ రిస్క్ స్కోర్ ఎంత చూస్తే... ⇒ తెలంగాణలోని 33 జిల్లాల్లో 9 జిల్లాలు (జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల) అత్యధిక’హీట్ రిస్క్ లో ఉన్నాయి. మరో 14 జిల్లాలు అధిక రిస్క్ లో, మిగతా 10 జిల్లాలు మోస్తరు వేడి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ⇒ ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి 5 జిల్లాలు (ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం) అత్యధిక హీట్ రిస్క్ లో ఉంటే, మిగతా ఉమ్మడి 8 జిల్లాలు అధిక హీట్ రిస్క్ లో ఉన్నాయి. – (సాక్షి, స్పెషల్ డెస్క్ ) -
మృత్యు మేఘాలు వచ్చేసాయ్.. జాగ్రత!
-
బయటకి రావద్దు..కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్
-
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం
-
మేఘ సందేశం... మే 26 న కేరళకు నైరుతి రుతుపవనాలు
-
తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు ముందుగానే రుతుపవనాలు
-
హై అలెర్ట్.. మరో 48 గంటల్లో దూసుకొస్తున్న రాకాసి మేఘాలు
-
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల బీట్ బజార్ వద్ద గంటపాటు కురిసిన భారీ వర్షంతో మక్కలు పూర్తిగా తడిసిముద్దయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. 20 రోజుల క్రితం తీసుకొచ్చిన మొక్కలు ఇప్పటికీ కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై రైతులు మండిపడ్డారు. జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ఆందోళనతో భారీగా స్తంభించింది ట్రాఫిక్. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు, జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది.నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. బాల్కొండ, మోర్తాడ్, ఏర్గట్ల, వేల్పూరు, ఆర్మూర్,ధర్పల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోరుట్ల నియోజకవర్గంతో పాటు కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. మెట్ పల్లి మార్కెట్ యార్డులో భారీ వర్షంతో మొక్కజొన్న, ధాన్యం తడిచింది. పలు గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం, మొక్కజొన్నలోకి నీరు చేరింది. పలు ప్రాంతాల్లో మామిడి నేలరాలింది.కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి శివారులో భారీ ఈదురు గాలులతో వెంకటేశ్వర రైసు మిల్ యంత్ర భాగాలు కూలడంతో భారీ నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాలలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. భైంసా మండలం మాటేగాం గ్రామం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న కొనుగోలులో జాప్యంతో అకాల వర్షం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని నిరసన తెలిపారు.కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని కంచుమహల్, కొండాపూర్, ముంబాజీపేట్, భవానీపేట్, జల్దిపల్లి, రాంపూర్ భారీ వర్షం కురిసింది. గ్రామాలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో.. ఆరబోసిన ధాన్యం నీటిలో తడిసి ముద్దయింది.ఏపీకి వర్ష సూచనఆంధ్రప్రదేశ్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విదర్భ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర కోస్తా, రాయలసీమలో తేలికపాటి వానలు పడుతున్నాయి. దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రత పెరుగుతోంది. వచ్చే వారం బంగాలాఖతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అంచనా వేసింది. -
తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: తెలంగాణలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం (మే 2) ఈ సీజన్లోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో గరిష్ఠంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, నిర్మల్, సిద్దిపేట జిల్లాలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల ప్రభావంతో మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయట తిరగలేకపోతున్నారు. ఉదయం వేళల నుంచే ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉంటున్నాయి. వేడి గాలులు మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. -
ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు మే లోనే వర్షాలు..?
-
వేడెక్కుతున్న వేసవి విడుదులు
దేశంలోని చాలా ప్రాంతాల్లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఫలితంగా, జనం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలోని వేసవి విడుదులకు ప్రయాణం కడుతున్నారు. సిమ్లా, కులు, మనాలి, నైనితాల్, ముసోరి, ధర్మశాల వంటి టూరిస్టు కేంద్రాలతోపాటు, పర్వత ప్రాంతాలలోని పుణ్య క్షేత్రాలకు కూడా తరలివెళుతున్నారు.ఏటా ‘చార్ ధామ్’ (బదరీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి) యాత్ర కూడా వేసవిలోనే మొదలవుతుంది. ఇటీవలి దశాబ్దాలలో ఆ ప్రాంతాలు పర్యావరణ ఉపద్రవాలను చవి చూశాయి. వాతావరణం క్షణానికో రకంగా మార్పులకు లోనవుతోంది. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. నేలలు కుంగిపోతున్నాయి. దాంతో అడ్డూఆపూ లేని టూరిజంతో పర్వత ప్రాంతాలపై పడుతున్న ప్రభావం గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి.సున్నితమైన ప్రాంతాలువివిధ పుణ్య క్షేత్రాలు హిమాలయాల లోపలి ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ ప్రాంతాలు సన్నని లోయలు, హిమానీనదాలు ఏర్పరిచిన పల్లపు ప్రాంతాలతో కూడుకుని ఉన్నాయి. భూగర్భంలోని పలకలు కదులుతూంటాయి. వర్షం పడినా, భూకంపనాలు చోటుచేసుకున్నా ఆ ఒత్తిడికి వాలు ప్రాంతాల్లోని రాళ్ళు కిందకు జారిపడిపోతూంటాయి. ఎతై ్తన కొండ ప్రాంత గడ్డిభూములు, పర్వతాగ్రాలలోని సరస్సులు, పెళుసైన వృక్షజాల ప్రాంతాలు ఆ రకమైన ఒడుదుడుకులను తట్టుకుని తేలిగ్గా కోలుకోగల శక్తి కలిగినవి కావు.అందుకనే, అనాది నుంచి అక్కడ మానవ ఆవాస ప్రాంతాలు తక్కువ. వాతావరణం అనుకూలంగా ఉండే సీజనులో వచ్చే యాత్రికుల వల్ల కూడా అక్కడి జీవావరణ వ్యవస్థ చెదిరిపోతోంది. పెద్ద సంఖ్యలో వచ్చే కార్లు, బస్సులు కాలుష్యానికి కారణమవుతున్నాయి. వ్యర్థ పదార్థాలను సక్రమమైన రీతిలో జారవిడిచే సదుపాయాలు లేవు. పెరుగుతున్న మానవ కార్యకలాపాల (టూరిజం, నిర్మాణ కలాపాలు, భారీ ప్రాజెక్టులు వంటి వాటి) వల్ల హిమాలయాల జీవావరణ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతోంది. కోర్టులు, పర్యావరణ పరిరక్షణ సంస్థల ఒత్తిడి వల్ల ఆ వాస్తవాన్ని విధాన నిర్ణేతలు గుర్తించకపోలేదు. కానీ, క్షేత్ర స్థాయిలో నివారణ చర్యలు అంతంతే.చార్ ధామ్‌కు వెళ్ళే దినసరి సందర్శకుల సంఖ్యపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం గత ఐదేళ్ళుగా ఒక పరిమితిని విధిస్తున్నా, వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటోంది. ఒక రోజులో బదరీనాథ్‌కు 1,000, కేదార్ నాథ్‌కు 800, గంగోత్రికి 600, యమునోత్రికి 400లకు మించి యాత్రికులను అనుమతించకూడదని 2021లో నిర్ణయించారు. ఆ యా ప్రాంతాలు తట్టుకోగల శక్తిని బట్టికాక, కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయానికి వచ్చారు. ఈ ఏడాది కూడా, సందర్శకుల సంఖ్యపై పరిమితి విధించబోమని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను మాత్రం తప్పనిసరి చేశారు. ఎంతమందిని అనుమతించొచ్చు?కేదార్, బదరీ, గంగోత్రి, యమునోత్రి తట్టుకోగలిగిన సామర్థ్యానికి సంబంధించి ‘వీర్ చంద్ర సింగ్ గడ్వాలీ ఉత్తరాఖండ్ యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ’, ‘జి.బి. పంత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్’ సైంటిస్టులు 2025లో ఒక అధ్యయన పత్రాన్ని ప్రచురించారు. ఎత్తు, వాలు, వృక్షజాల వ్యాప్తి అనే మూడు కీలక భౌగోళిక సూచికలను ఆధారం చేసుకుని వారు ఆ పత్రాన్ని రూపొందించారు. ఆ నాలుగు మందిరాల వద్ద, వాటి చుట్టుపక్కలనున్న హిమంతో కప్పుకున్న హిమానీనద ప్రాంతాలను విశ్లేషించినపుడు ఆ హిమనదాలు 2002–2020 మధ్యకాలంలో గణనీయంగా కుంచించుకుపోయినట్లు వెల్లడైంది. వాటిలో ఎక్కువగా (ఏడాదికి 22.36 మీటర్ల చొప్పున) గంగోత్రి, యమునోత్రి (ఏటా 20 మీటర్లు), బదరీనాథ్ (ఏటా17.32 మీటర్లు), కేదార్నాథ్ (14.14 మీటర్లు) కుంచించుకుపోతున్నట్లు తేలింది. ఆ నాలుగు ప్రాంతాల్లో (1990–2020 మధ్య కాలానికి సంబంధించి) వాతావరణ డేటాను కూడా విశ్లేషించారు. ఆ ప్రదేశాలన్నింటిలోను, మూడు (వర్షాకాలానికి ముందు, వర్షాకాలంలో, వర్షాకాలం తర్వాత) సీజన్లలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ధోరణి కనిపించింది. నాలుగు ప్రదేశాలు సంరక్షణ ప్రాంతాల లోపల లేదా వాటి చుట్టుపక్కల పరిసరాలలో ఉన్నాయి. బదరీనాథ్ మందిరం ‘నందాదేవి నేషనల్ పార్క్’ పరిధిలోకి; ‘కేదార్నాథ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’ పరిధిలోకి కేదార్నాథ్; ‘గంగోత్రి నేషనల్ పార్క్’ పరిధిలోకి గంగోత్రి; ‘గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్ అండ్ శాంక్చురీ’ పరిధిలోకి యమునోత్రి వస్తాయి. ఆ విశ్లేషణను ఆధారం చేసుకుని చార్ ధామ్ దినసరి సందర్శకుల సంఖ్యపై గణనీయమైన పరిమితి విధించాలని పరిశోధకులు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఒక రోజులో బదరీనాథ్‌కు (11,833 నుంచి 15,778), కేదార్‌నాథ్‌కు (9,833 నుంచి 13,111), గంగోత్రికి (6,133 నుంచి 8,178), యమునోత్రి (4,620 నుంచి 6,160) సందర్శకులను పరిమితం చేయాలని వారు కోరారు. వాహనాల క్రమబద్ధీకరణ, వ్యర్థ పదార్థాల పునర్వినియోగానికి సంబంధించి కూడా కొన్ని సూచనలు చేశారు. కొండ ప్రాంతాల్లోని ఇతర నగరాలు, పట్టణాలకున్న భరణ శక్తిని గణించేందుకూ ఈ గ్రూపు అభివృద్ధిపరచిన పద్ధతిని వర్తింపజేసుకోవచ్చు. సిమ్లా కూడా దాని శక్తికి మించి సందర్శకులను భరిస్తున్నట్లు కొన్ని మదింపులలో తేలింది. ఏం చేయాలి?భరణ సామర్థ్యాన్ని శాస్త్రీయమైన రీతిలో మదింపు చేస్తే, సముచితమైన చర్యలు తీసుకునే వీలుంటుందని సుప్రీంకోర్టు 2024 జూన్‌లో, మొత్తం 13 హిమాలయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. నగరాలతో సహా వేసవి విడుదులు, పర్యావరణపరంగా సున్నితమైన మండలాల భరణ సామర్థ్యాన్ని మదింపు చేసేందుకు 2020లోనే మార్గదర్శక సూత్రాలు జారీ చేసినట్టు పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఆ తర్వాత కోర్టుకు తెలియజేసింది. నిపుణుల కమిటీలను నియమించడం లేదా వాయు పరిశీలన పరికరాలను నెలకొల్పడం వంటి పైపై చర్యలకు పరిమితమవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు అరకొర విధానాలనే అనుసరిస్తున్నాయి. పర్వత ప్రాంత రాష్ట్రాలు తమ సమస్యను పరిష్కరించుకునేందుకు సమగ్రమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించుకోవాల్సి ఉంది. లేదంటే నిష్క్రియాపరత్వానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కేదార్ నాథ్ వరదల నుంచి జోషీమఠ్ కుంగిపోవడం వరకు ప్రకృతి ఉపద్రవాల పరంపరను ఇప్పటికే చవిచూశాం. తీవ్ర వాతావరణ పరిస్థితులు, మేఘ విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం వంటివాటికి పుడమి వేడిమితో ప్రపంచం మొత్తంమీద వాతావరణంలో వస్తున్న మార్పు, ఆ యా ప్రాంతాల్లోని భౌగోళిక స్థితిగతులు కారణం కావచ్చు. కానీ, టూరిజం, పరిమితికి మించి జనం మీదపడడం, ప్రణాళికాబద్ధత లేని పట్టణీకరణ, అడవులను నరికేయడం, భారీ ప్రాజెక్టులు చేపట్టడం వంటి మానవ ప్రేరేపిత చర్యలు ఉపద్రవాలకు మరింత ఊతం ఇస్తున్న సంగతిని మరువకూడదు. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
కాలే పెనంలా మారబోతున్న తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరిక
-
సడన్ ట్విస్ట్.. ఇరాన్లో యుద్ధం సీను మారింది?
టెహ్రాన్ : పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్లో వాతావరణం మారింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో మంచుకురుస్తోంది. దశాబ్ధానికిపైగా కరువుతో అల్లాడుతున్న ఇరాన్లో క్రమంగా వాతావరణం మారుతోంది. ఖాళీగా ఉన్న జలాశయాలు, ఎండిపోయిన సరస్సుల్లో మళ్లీ జీవం కనిపిస్తోంది. అయితే వాతావరణం ఒక్కసారిగా మారడంపై ఓ ఆసక్తికర వాదన తెరపైకి వచ్చిందిసోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ఇరాన్లో మార్పుల వెనుక అసలు సీక్రెట్ అదేనా. ఇరాన్లో కరువు పరిస్థితులు శతృదేశాల కుట్రే పూరితంగా సృష్టించినవేనాఅమెరికా ఇరాన్ యుద్ధం మొదలై యాబై రోజులు దాటిపోయింది. ఈ యుద్ధంలో ఇరాన్‌పై అమెరికా భారీ దాడులే చేసింది. క్షిపణులు, వైమానిక దాడులతో బీభత్సమే సృష్టించింది. దీని కోసం పెద్ద సంఖ్యలో ఆయుధ శక్తిని ఉపయోగించింది. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న ఇరాన్‌ను ఈ యుద్ధం మరింత కష్టాల్లోకి నెట్టింది. అయినా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమెరికా,ఇజ్రాయెల్‌కు ఇరాన్ అదే స్థాయిలో బదులిస్తోంది.ఇలాంటి సమయంలో ఇరాన్ వాతావరణం మారిపోవడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. నిత్యం కరువుతో అల్లాడే ఇరాన్లో ఇప్పుడు భారీ స్థాయిలో వర్షాలు, మంచు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణంలో ఏర్పడిన ఆకస్మిక మార్పుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇక్కడే ఓ ఆసక్తికరమైన వాదన తెరపైకి వచ్చింది. దేశ వాతావరణాన్ని తారుమారు చేయడానికి వాడటానికి వినియోగించే రాడార్లను, ఇజ్రాయెల్ వాతావరణ యంత్రాలను ఇరాన్ ధ్వంసం చేయడం వల్లే ఈ వాతావరణ మార్పు సంభవించిందన్న వాదనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజానికి దశాబ్ధానిపైగా ఇరాన్ కరువుతో అల్లాడుతోంది. ఖాళీగా ఉన్న జలాశయాలు, ఎండిపోయిన సరస్సులే అక్కడి నీటి సంక్షోభం గురించి చెప్పడానికి ఉదహారణలుగా నిలుస్తున్నాయి.ఈ క్రమంలో యాభైరోజుల యుద్ధం తర్వాత అక్కడి వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు, మంచు, ఉష్ణోగ్రతలు తగ్గడంతో అక్కడ పచ్చదనం చిగురులు తొడుగుతోంది. ఆనకట్టలు వాటి పూర్తి సామర్ధ్యానికి వస్తున్న తరుణంలో ఇరాన్ మీడియా కుట్ర సిద్ధాంతాలతో హోరెత్తుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ వాతావరణ ఇంజినీరింగ్ యంత్రాలను ఇరాన్ ధ్వంసం చేయడమే వాతావరణంలో ఆకస్మిక మార్పులకు కారణమన్నది వారి వాదన.ఈ యుద్ధంలో ఇరాన్ అమెరికాకు చెందిన అధునాతన రాడార్ వ్యవస్థలపై, ఇజ్రాయెల్ వాతావరణ యంత్రాలపైన దాడి చేసిన మాట నిజమే. అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగించే క్షిపణి వ్యవస్థలు కేవలం ముందస్తు అలెర్ట్ కోసమే కాకుండా మధ్యధరా సముద్రంలోని తేమను ఇరాన్ పొరుగు ప్రత్యర్ధుల వైపు మేఘాలను మళ్లించడానికి వీటిని ఉపయోగించారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.నిజానికి వర్షపు నీరు దొంగతనం అనే చర్చ ఇరాన్లో ఎప్పటి నుంచో ఉంది. 2018 నుంచి ఈ వాదన పదే పదే తెరపైకి వస్తోంది. ఇజ్రాయెల్,అమెరికా, యూఏఈ జియో ఇంజినీరింగ్‌ను ఉపయోగించి వాతావరణ సరళిని తారు మారు చేస్తున్నాయనేది ఇరాన్ వాదన. ఇప్పుడు సోషల్ మీడియాలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
వాతావరణ శాఖ హెచ్చరిక .. తెలుగురాష్ట్రాలపై సూర్యుడి ఉగ్రరూపం
-
దేశంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. అలర్ట్ జారీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఉదయం పది గంటలకే భానుడు భగభగలాడుతుండటంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. రానున్న రెండు వారాల్లో ఎండల తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చనుందని, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వేడి గాలులుల వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరికలు జారీ చేసింది.ఏప్రిల్ 17 నాటికి దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 41 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుందని ఐఎండి అంచనా వేసింది. ఏప్రిల్ 12 నుంచి 18 వరకు వాయువ్య భారతదేశంలో 4 నుంచి 6 డిగ్రీలు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి మధ్య ప్రాంతాల్లో 3 నుంచి 5 డిగ్రీలు, గుజరాత్, మహారాష్ట్రల్లో 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగనున్నాయి. ముఖ్యంగా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో వడగాల్పుల ముప్పు తీవ్రంగా పొంచి ఉంది. 🚨 Next 2 weeks are going to be very hot for Indian Subcontinent 🌡️South India also at 42-45°C 📈📈Mumbai at 35-37°C 📈 pic.twitter.com/oAOHBXMLE3— Mumbai Rains (@rushikesh_agre_) April 12, 2026రాబోయే వారం రోజుల పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాల్లో విపరీతమైన ఉక్కపోత వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే అస్సాం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు ఎండల విషయంలో అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ఇది కూడా చదవండి: యోగి, సువేందుల వైరల్ వీడియో.. ‘ఎంత భక్తో’ -
కొద్దిసేపట్లో వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి విజయవాడ: రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలతో పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి , ఏలూరు,ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు నిలబడరాదని ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని సూచించింది. అదేవిధంగా వర్షం సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం వీలైనంత తగ్గించాలని తెలిపింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్త ఎండీ ప్రకటన విడుదల చేశారు. -
పేద మహిళలకు క్లైమేట్ బీమా
అసంఘటిత రంగాల్లో ఉపాధి పొందే పేద మహిళలు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా అభద్రతకు గురవుతున్నారు. తీవ్ర వడగాడ్పులు, భారీ వర్షాలు, తీవ్ర చలిగాలులు వీచే రోజుల్లో పనులకు వెళ్లలేకపోతే ఆదాయం ఉండదు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పొట్ట తిప్పలకు పనులకు వెళ్లక తప్పని పరిస్థితుల్లో అనారోగ్యాల పాలవుతున్నారు. వీరికి ఆదాయ, ఆరోగ్య భద్రతను కల్పించడానికి కొన్ని రాష్ట్రాల్లో ‘పారామెట్రిక్ క్లైమేట్ ఇన్సూరెన్స్’ను అమలు చేస్తున్నారు. – (సాక్షి స్పెషల్ డెస్క్)పారామెట్రిక్ క్లైమేట్ ఇన్సూరెన్స్ అంటే..ఈ పని బీమా పాలసీ తీసుకున్న వారికి మాత్రం.. వేడి, చలి, వాన ఒక పరిమితికి మించితే చాలు వీరు పనికి వెళ్లకుండా ఇంటి పట్టునే భద్రంగా ఉంటూ బీమా పరిహారం పొందొచ్చు. వాతావరణం మామూలుగా ఉంటేనే పేద మహిళలకు రోజువారీ పనులు సజావుగా దొరుకుతాయి. వాతావారణంలో ఏ మాత్రం తేడా వచ్చినా వారికి పని ఉండదు. పట్ట ణ / గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులు, తోపుడు బండ్లు/ నెత్తిమీద బుట్టలు పెట్టుకొని సరుకులు అమ్ముకునే వారు, చిరు వ్యాపార సంస్థల్లో పనిచేసే వారు, చిన్నాచితకా కూలి పనులు, వ్యవసాయ మహిళా కార్మికులకు రెక్కాడితే గాని డొక్కాడదు. ప్రమాదకర వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ పని మానితే ఆదాయం పోతుందన్న బెంగతో పనులు కొనసాగిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇటువంటి వారికి ఆదాయ భరోసా ఇవ్వటానికి ప్రారంభమైనదే పారామెట్రిక్ క్లైమేట్ ఇన్సూరెన్స్.అనేక రాష్ట్రాల్లో అమలుపారామెట్రిక్ క్లైమేట్ ఇన్సూ్యరెన్స్ను తొలుత అమలు చేసిన రాష్ట్రం నాగాలాండ్. కేరళలో పాల సహకార మార్కెటింగ్ సమాఖ్య 1,500 ఎంఎంకి మించి అధిక వర్షపాతం వల్ల పనిదినాలు కోల్పోయే వారికి బీమా అమలు చేస్తోంది. గుజరాత్లో ఈ బీమా పథకాన్ని నేషనల్ ఇన్సూ్యరెన్స్ వైమో సేవ కోఆపరేటివ్ లిమిటెడ్ అనే సహకార బీమా సంస్థ అమలు చేస్తోంది. ఆహ్మదాబాద్, పరిసర జిల్లాల్లో 2023 ఏప్రిల్‌లో వైమో సేవ సంస్థ ఈ బీమాను తొలుత అమలు ప్రారంభించింది. 2024 నాటికి గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్ లలోని 22 జిల్లాలో 50 వేల మంది 18–70 ఏళ్ల మధ్య వయసు మహిళలకు ఈ బీమా కల్పించారు. » వడగాడ్పుల బీమా ప్రీమియంగా ప్రతి మహిళ రూ.350 ప్రీమియం చెల్లించాలి. 43.2 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రత ఎన్ని రోజులు పెరిగితే అన్ని రోజులకు ఒకరికి రోజుకు రూ.400 చొప్పున (అత్యధికంగా రూ. 3 వేలు) పరిహారంగా చెల్లిస్తున్నారు. » 45.28 అంగుళాలకు మించి వర్షపాతం వల్ల పనులు కోల్పోయినా పరిహారం ఇచ్చే బీమాను కూడా అమలు చేస్తున్నారు. ప్రీమియం రూ.425. అత్యధికంగా రూ. 7 వేల వరకు పరిహారం చెల్లిస్తున్నారు. » ఉష్ణోగ్రత, వర్షపాతం పెరుగుతున్న కొద్దీ పరిహారం తదనుగుణంగా పెరుగుతుంది.పారామెట్రిక్ బీమా అవసరం ఏమిటి?» 2023లో కనీవిని ఎరుగనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిన విషయం గుర్తుంది కదా. దాదాపు వంద రోజుల పాటు ఒక మోస్తరు వడగాడ్పులు వీచాయి. ఆరుబయట పనులు, శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పనులు చేయటం ప్రమాదకరంగా మారింది. 2024, 2025లలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. » ఆ ఏడాది అతి ఉష్ణం వల్ల మన దేశం 18,100 కోట్ల పని గంటలు కోల్పోయింది. తద్వారా రూ. 13 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని లాన్సెట్ అంచనా వేసింది. » మహిళలు ఎక్కువ క్లైమేట్ రిస్క్‌కు గురవుతుంటారు. గర్భస్రావాలు లేదా నెలలు నిండకుండానే ప్రసవించటం వంటి ఉపద్రవాలను ఎదుర్కొంటూ ఉంటారు. » మన దేశంలో ఆదాయం కోసం పనిచేసే మహిళల్లో 92% మంది చిన్నా చితకా రోజువారీ పనులు చేసుకొని పొట్టపోసుకునేవారే. » ప్రతికూల వాతావరణం వల్ల మహిళల సారథ్యంలోని కుటుంబాలు ఎక్కువగా ఆదాయాన్ని కోల్పోతున్నాయని ప్రపంచవ్యాప్త అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక పరిమితికి మించి 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే మహిళ సారథ్యంలోని కుటుంబానికి 34% ఆదాయం తగ్గిపోతోందని ఐరాస ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ–2024) అంచనా. » ఎండాకాలంలో 97% మంది అసంఘటిత రంగ మహిళా కార్మికుల ఆదాయం తగ్గిపోతోంది. వేడి వల్ల పని సామర్థ్యం తగ్గిపోవటంతో 20–25% రోజువారీ ఆదాయం తగ్గిపోతోందని సర్వే నివేదికలు చెబుతున్నాయి. -
ముందుగానే మండుతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం నడివేసవిని తలపిస్తోంది. సీజన్ ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగతలు నమోదు కావాల్సి ఉండగా... చాలాచోట్ల సాధారణం కంటే సుమారు 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు పొడి వాతావరణం, ఆకాశం నిర్మలంగా ఉండటం, మేఘాలు లేకపోవడం, గాలిలో తేమశాతం తగ్గడంతో వేడిమి అధికంగా ఉంది. ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉండాలి. కానీ 40 డిగ్రీలకు పైబడి నమోదవుతుండటం మున్ముందు పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఏప్రిల్‌లో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతుండటం కలవరపెడుతోంది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 40.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. నల్లగొండ మినహా అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.9 డిగ్రీలు అధికంగా నమోదు కాగా... ఆదిలాబాద్‌లో 2.8, భద్రాచలంలో 2.7, హనుమకొండలో 2.1 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజుల పాటు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థితిలోనే నమోదవుతున్నాయి. దీంతో సాయంత్రానికి వాతావరణం చల్లబడటంతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తోంది. శనివారం ఒడిశా పరిసర ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. ఇది తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా కర్ణాటక తీరం వరకు సముద్రమట్టం నుంచి సగటున 0.9 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోంది. వచ్చేవారం చివర్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. -
తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం
-
సురక్షితంగా ల్యాండ్ అయిన బిల్‌గేట్స్ విమానం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని ఎయిర్ పోర్టులో భారీగా పొగమంచు కమ్ముకుంది. దీంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదే తరుణంలో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న విమానం వాతావరణం అనుకూలించక పోవడంతో కాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. తరువాత క్లియరెన్స్ రావడంతో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. నేడు(సోమవారం) బిల్‌గేట్స్ అమరావతిలో పర్యటించనున్నారు. -
57 ‘ఇండిగో’లు రద్దు
ముంబై: దేశవ్యాప్తంగా వివిధ విమానా శ్రయాల్లో అననుకూల వాతావరణం కారణంగా శనివారం 57 విమానాలను రద్దు చేసినట్లు దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తెలిపింది. అదేవిధంగా, ఆదివారం నడిపే మరో 13 విమానాలను సైతం రద్దు చేసింది. వీటిలో రెండు నిర్వహణ పరమైన కారణాలు, మిగతావి ప్రతికూల వాతావరణం నెలకొనవచ్చనే అంచనాతో రద్దు చేశామని వెల్లడించింది. ఈ నెలారంభంలో నిర్వహణ పరమైన కారణాలు చూపుతూ వేలాదిగా విమానాలను ఇండిగో రద్దు చేయడంతో తీవ్ర సంక్షోభం తలెత్తడం తెల్సిందే. అదేవిధంగా, గత వారం, పది రోజులుగా ఈ సంస్థ వాతావరణం సరిగా లేదనే కారణంతో పదుల సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేస్తోంది. శనివారం రద్దయిన వాటిలో చండీగఢ్, అహ్మదాబాద్, హైదరాబాద్, అమృత్సర్, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, పుణె మొదలైన చోట్ల నుంచి రాకపోకలు సాగించాల్సినవి ఉన్నాయి. -
తైవాన్‌లో భారీ భూకంపం
తైపీ: భారీ భూకంపం తైవాన్ తూర్పు తీరప్రాంతాన్ని వణికించింది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.0గా నమోదైంది. భూకంపం సముద్ర ప్రాంతంలో, సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు అధికారులు తెలిపారు.భూకంపం సంభవించిన వెంటనే రాజధాని తైపే సహా అనేక ప్రాంతాల్లో భవనాలు కంపించాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం గురించి స్పష్టమైన సమాచారం అందలేదు. స్థానిక అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ, అత్యవసర సేవలను అప్రమత్తం చేశారు.తైవాన్ భూకంప కేంద్రం ప్రకారం, తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సునామీ ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. తైవాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్నందున తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. 1999లో జరిగిన భారీ భూకంపం 2,400 మందికి పైగా ప్రాణాలు తీసిన విషయం గుర్తు చేస్తూ నిపుణులు ఈసారి పెద్ద నష్టం జరగకపోవడం ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. తైవాన్‌లో సంభవించిన ఈ భూకంపం ప్రజల్లో ఆందోళన కలిగించినప్పటికీ, సునామీ ప్రమాదం లేకపోవడం కొంత ఊరటనిచ్చింది. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు భద్రతా సూచనలు జారీ చేస్తున్నారు. -
చలి చంపేస్తోంది.. గజగజ వణుకుతున్న రాష్ట్రాలివే..
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశాన్ని గడ్డకట్టించే చలి చుట్టుముట్టింది. హిమాలయాల నుంచి వీస్తున్న అతి శీతల గాలులతో ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ వరకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం, రానున్న 48 గంటల్లో ఈ చలి తీవ్రత మరింత పెరగనుంది. ముఖ్యంగా కశ్మీర్ లోయలో కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోగా, హిమాచల్, ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం మైదాన ప్రాంతాలను వణికిస్తోంది. పంజాబ్, హర్యానాలో తేమతో కూడిన చల్లని గాలుల వల్ల విజిబిలిటీ ‘సున్నా’కి పడిపోవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయంతో వణకుతున్నారు.దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాన్ని అటు చలి, ఇటు కాలుష్యం రెండు వైపుల నుండి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గురువారం ఉదయం నుంచే నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో విమాన, రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందే విమానయాన సంస్థల స్థితిగతులను తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు, గాలి నాణ్యత (ఏక్యూఐ) క్షీణించడంతో నేటి (గురువారం)నుంచి కఠినమైన వాయు కాలుష్య నిరోధక నిబంధనలు అమలులోకి వచ్చాయి. బీఎస్-4 వాహనాలపై ఆంక్షలు విధిస్తూనే, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వం అమలు చేస్తోంది.ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది. వారణాసి, కాన్పూర్, లక్నో తదితర నగరాల్లో విజిబిలిటీ 50 మీటర్ల కంటే తక్కువగా ఉండటంతో ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, చంబల్ డివిజన్లలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోయి ప్రజలను విపరీతంగా వణికిస్తున్నాయి. డిసెంబర్ 18 నుండి వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ యాక్టివేట్ కానుండటంతో అమృత్సర్, పఠాన్‌కోట్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి చినుకులు పడే అవకాశం ఉంది. ఇది చలి తీవ్రతను మరింత పెంచి, సామాన్య ప్రజల కష్టాలను రెట్టింపు చేయనుంది.పర్వత ప్రాంతాలైన కులు, లాహౌల్-స్పితి, చమోలిలో భారీగా మంచు కురిసే అవకాశం ఉన్నందున పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ టూరిజం హెచ్చరించింది. ఎత్తైన రహదారుల గుండా ప్రయాణాలు ప్రమాదకరమని సూచించింది. అటు కాశ్మీర్లో 'చిల్లై-కలాన్' (కఠినమైన శీతాకాలం) ప్రారంభం కాకముందే శ్రీనగర్‌లో ఉష్ణోగ్రతలు -2.0 డిగ్రీలకు పడిపోయాయి.ఇది కూడా చదవండి: ‘కిస్’ విద్యార్థి మృతి కేసు.. పప్పు కోసం ప్రాణం తీశారా? -
గజగజ వణుకుతున్న హైదరాబాద్ (ఫొటోలు)
-
అలర్ట్.. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి
సాక్షి, విశాఖ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక, తెలంగాణలో పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదైంది.అల్లూరి జిల్లాలోని అరకులోయలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గురువారం ఉదయం ఆరు గంటలకు 8 డిగ్రీలు, లంబసింగిలో 10, చింతపల్లిలో 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. పలు ప్రాంతాల్లో పొగ మంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోవైపు.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శీతల గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. వీటి ప్రభావంతో కొమురం భీం- ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్‌లో 6.8 డిగ్రీలు, సిర్పూర్లో 7.1 డిగ్రీలు, తిర్యానీలో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, హైదరాబాద్ శేరిలింగంపల్లి హెచ్‌సీయూ ప్రాంతంలో 11.8 డిగ్రీలు, ఇబ్రహీంపట్నంలో 11.5, రాజేంద్రనగర్‌లో 12.9, మారేడుపల్లిలో 13.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉదయం పొగమంచు, చలిగాలులు, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.COLD WAVE INTENSIFIED ACROSS TG ⛄️SINGLE DIGIT TEMPERATURES(ASIFABAD)— Lingapur : 6.8°C— Sirpur (U) : 7.1°C— Ginnedari : 8.2°C— Kerameri : 9.3°C— Tiryani : 9.5°C(ADILABAD)— Neradigonda : 9.5°C— Sonala : 9.8°C— Bazarhathnoor : 9.9°C— Pochara : 9.9°C(SIRCILLA)—… pic.twitter.com/1U4ZMHAkLE— Weatherman Karthikk (@telangana_rains) November 13, 2025ఈ నెలలో సగటు ఉష్ణోగ్రతలు 13 నుంచి 17 డిగ్రీల మధ్య కొనసాగే అవకాశం ఉందన్నారు. రాబోయే వారం రోజులు ఇదే తరహా చలి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం- ఆసిఫాబాద్, నల్గొండ, భద్రాచలం, రామగుండం, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, పటాన్చెరు, నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ శివారు హయత్‌నగర్ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 26 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నా.. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం అత్యల్పానికి పడిపోతాయన్నారు. చాలా ప్రాంతాల్లో 16 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.STRONG COLDWAVE GRIPS TELANGANA Sirpur in KB Asifabad recorded 7.1°C this morning, followed by Tiryani 8.2°C 🥶Meanwhile in Hyderabad City, HCU Serlingampally recorded 11.8°C, Rajendranagar 12.9°C, Maredpally 13.6°CMeanwhile outskirts of Hyderabad City like Ibrahimpatnam…— Telangana Weatherman (@balaji25_t) November 13, 2025 -
వణికిస్తున్న చలి.. జాగ్రత్తగా ఉండాల్సిందే (ఫొటోలు)
-
తెలంగాణలో వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రతలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. గురువారం రాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. శుక్రవారానికి మరింతగా పడిపోయాయి. రాత్రిపూట, తెల్లవారుజామున చలిగాలుల (Cold Waves) తీవ్రత ఎక్కువైంది. మరోవైపు.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. మంచు కారణంగా తెల్లవారుజామున వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆదిలాబాద్ జిల్లా బేలలో శుక్రవారం అతి తక్కువగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో 14.7 డిగ్రీలు, సంగారెడ్డిలోని జహీరాబాద్‌లో 14.8, శంకర్‌పల్లిలో 14.9, మొయినాబాద్‌లో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక, కొమురంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. అలాగే, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.COLD WEATHER INTENSIFIES 🥶Today's lowest temperatures in °CTelangana toppersBela Adilabad 14.7Shahbad Rangareddy 14.7Zahirabad Sangareddy 14.8Shankarpally 14.9Moinabad 15Bheempoor Adilabad 15Jinnaram Sangareddy 15.1Hyderabad toppersRajendranagar 15.3UoH 15.3…— Telangana Weatherman (@balaji25_t) November 8, 2025 -
Delhi: నేడు కృత్రిమ వర్షం.. కురిపిస్తారిలా.. ప్రయోజనమిదే..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెను సమస్యగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కృత్రిమంగా వర్షాలను కురిపించేందుకు సిద్ధమయ్యింది. శీతాకాలంలో క్షీణిస్తున్న గాలి నాణ్యతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీపావళి అనంతరం పొగ, దుమ్ము, పొగమంచు కలగలిసి ఢిల్లీని గ్యాస్ చాంబర్ మాదిరిగా మార్చాయి. దీనికి క్లౌడ్ సీడింగ్ (కృత్రిమ వర్షాలు) పరిష్కారం చూపనుంది.వాతావరణం అనుకూలిస్తే..వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఢిల్లీ ప్రభుత్వం నేడు (మంగళవారం)తొలి క్లౌడ్ సీడింగ్ ట్రయల్‌ను నిర్వహించనుందని సంబంధిత అధికారి తెలిపారు. ఈ పరీక్షను నిర్వహించే ముందు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా మీడియా సంస్థ పీటిఐకి తెలిపారు. ఈ ప్రయోగానికి ఉపకరించే విమానం కాన్పూర్ నుండి ఢిల్లీకి చేరుకుంటుందని, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే క్లౌడ్ సీడింగ్ ట్రయల్ నిర్వహిస్తామన్నారు. క్లౌడ్ సీడింగ్ ప్రయోగానికి సన్నాహాలు ఇప్పుటికే పూర్తయ్యాయి.రూ.3.21 కోట్ల వ్యయంప్రభుత్వం ఇటీవల బురారి మీదుగా ఒక టెస్ట్ ఫ్లైట్ నిర్వహించిందని, టెస్ట్ రన్ సమయంలో కృత్రిమ వర్షపాతాన్ని ప్రేరేపించేందుకు ఉపయోగించే చిన్న పరిమాణంలో సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ సమ్మేళనాలను విమానం నుండి విడుదల చేశామని సంబంధిత అధికారులు తెలిపారు. వాయువ్య ఢిల్లీలో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించడానికి ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 25న ఐఐటీ, కాన్పూర్‌తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)కుదుర్చుకుంది. దీనికి ముందు ఢిల్లీ క్యాబినెట్ మే 7న రూ.3.21 కోట్ల వ్యయంతో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించాలనే ప్రతిపాదనను ఆమోదించింది.క్లౌడ్ సీడింగ్ అంటే..క్లౌడ్ సీడింగ్(కృత్రిమ వర్షం) అంటే మేఘాలలో రసాయనాలను విడుదల చేసి, వర్షం కురిసేలా చేసే విధానం . ఇందుకోసం సాధారణంగా సిల్వర్ అయోడైడ్ లేదా సోడియం క్లోరైడ్ లాంటి రసాయనాలు వాడుతారు. మేఘాలు తగినంతగా ఉన్న సమయంలో ఈ రసాయనాలను వాటిలోకి చిమ్మి, నీటి బిందువులు ఏర్పడేలా చేస్తారు. దాంతో మేఘాలు వర్షం కురిపిస్తాయి. ఈ ఆపరేషన్ కోసం సెస్నా అనే చిన్న విమానాన్ని ఎంచుకున్నారు. ఇది శాస్త్రీయ ప్రయోగాలకు, తక్కువ ఎత్తులో ఎగరడానికి, కచ్చితమైన నియంత్రణ సామర్థ్యాలను కలిగివుంటుంది. ఈ విమానాన్ని ప్రత్యేకంగా క్లౌడ్ సీడింగ్‌కు ఉపయోగపడే విధంగా మార్పులు చేశారు.ఉపయోగాలివే..కృత్రిమ వర్షం కారణంగా గాలిలే తేలియాడే కాలుష్య కణాలు కిందికి చేరతాయి. ఫలితంగా గాలి శుభ్రపడి, ఆక్సిజన్ స్థాయి మెరుగుపడుతుంది. ఇది తాత్కాలిక పరిష్కారంగా కనిపించినప్పటికీ, కాలుష్యం అధికంగా ఉన్న సమయంలో ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ ప్రయోగానికి వాతావరణం అనుకూలించడం అత్యవసరం. సెస్నా విమానంతో చేసే ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో ఇతర నగరాల్లో కూడా ఇదే తరహాలో కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇది కూడా చదవండి: మరో నగరం పేరు మార్పు.. ముస్తఫాబాద్ ఇకపై.. -
8 Districts: ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు
-
అంతరిక్షంలో ప్రళయం భూమికి ముప్పు తప్పదా?
-
Visakha Weather: అర్థరాత్రి భీకర గాలులతో..!
-
TS: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
-
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వాతావరణ హెచ్చరికలు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్ నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టెక్నాలజీని వినియోగిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల వారీగా వాతావరణ హెచ్చరికలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఒక జిల్లాలోని మండల పరిధిలో ఉన్న ఓ గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లో వర్షాలు, పిడుగులు పడే పరిస్థితులు ఉంటే ముందే సదరు కేంద్రం సిబ్బందిని అలర్ట్ చేయడం ద్వారా రైతులు తీసుకొచ్చిన వడ్లు తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారన్నారు. వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ప్రణాళికను మంగళవారం పౌరసరఫరాల భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ రైతులకు ఏమాత్రం నష్టం జరగకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలని క్షేత్రస్థాయి వరకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ధాన్యం తడవకుండా డ్రయ్యర్లు..ప్యాడీ క్లీనర్లు దేశంలోనే తొలిసారిగా ధాన్యం ఆరబెట్టే యంత్రాలతోపాటు ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను వినియోగంలోకి తీసుకొస్తున్నట్టు చౌహాన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులు, వడ్లు తడిసిన ప్రాంతాలకు తొలుత ఈ యంత్రాలను పంపించి రైతులకు తోడ్పాటు అందిస్తామన్నారు. వీటికి ప్రస్తుతం ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదని, భవిష్యత్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటే, డీజిల్‌కు అయ్యే ఖర్చును భరించేలా ప్రణాళిక రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే సన్నబియ్యాన్ని గుర్తించేందుకు డిజిటల్ మిషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సీజన్లో 18.75 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం అని అంచనా వేయగా, ఇప్పటి వరకు 11.63 కోట్ల బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. సన్న, దొడ్డు ధాన్యం సంచులను కుట్టేందుకు వినియోగించే దారం రంగులు వేర్వేరుగా ఉంటాయని తెలిపారు. వరికోతకు వినియోగించే హార్వెస్టర్లకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఏఈవోలకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. పూర్తిగా కోతకు రాని పంటలను ముందుగా కోయడం వల్ల వరి గింజ నాణ్యత దెబ్బతింటుందని, బ్లోయర్‌ను యాక్టివ్ మోడ్‌లో పెట్టకుండా డీజిల్ ఆదా చేసే పరిస్థితిని నిరోధించాలని వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టం చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా రాష్ట్ర సరిహద్దుల్లో 17 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, అక్కడ సీసీ టీవీలు కూడా ఉంటాయన్నారు. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అంచనా రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో 65.96 లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యిందని, ఉత్పత్తి అంచనా 159.15 లక్షల మెట్రిక్ టన్నులుగా చౌహాన్ పేర్కొన్నారు. ఇందులో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేసినట్టు తెలిపారు. అక్టోబర్ ఒకటో తేదీ కల్లా కొనుగోళ్లకు సిద్ధంగా ఉంటామని, అయితే అక్టోబర్‌లో 6.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం (9%) మాత్రమే సేకరిస్తామన్నారు. అత్యధికంగా నవంబర్‌లో 32.95 లక్షల మెట్రిక్ టన్నులు (44%), డిసెంబర్లో 27.03 లక్షల మెట్రిక్ టన్నులు (36%) సేకరించనున్నట్టు తెలిపారు. రైతుల సౌకర్యార్థం రాష్ట్రంలో 8,332 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. జిల్లాల వారీగా అత్యధికంగా నిజామాబాద్ నుంచి 6.80 లక్షల మెట్రిక్ టన్నులు, జగిత్యాల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నులు, నల్లగొండ నుంచి 4.76 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించనున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ హనుమంతు కొండిబా, అదనపు డైరెక్టర్ బి.రోహిత్‌సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ పై వరుణ ప్రతాపం
-
మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు
-
చావుకబురు ‘చల్లగా’.. అక్టోబర్ నుంచే ఎముకలు కొరికే చలి..
ఈ సంవత్సరం చివర్లో లా నినా పరిస్థితులు తిరిగి రావచ్చని, ఇది ప్రపంచ వాతావరణ నమూనాలను నిర్ధేశ్యించనుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. మన శీతాకాలాన్ని సాధారణం కంటే చాలా చల్లగా మార్చే అవకాశం ఉందని వీరు హెచ్చరిస్తున్నారు. రానున్న అక్టోబర్ డిసెంబర్ 2025 మధ్య లా నినా అభివృద్ధి చెందడానికి 71 శాతం అవకాశం ఉందని సెప్టెంబర్ 11న నేషనల్ వెదర్ సర్వీస్‌కు చెందిన క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది. ఇది అలాగే కొనసాగి డిసెంబర్ 2025 నుంచి తగ్గడం మొదలవుతుందని ఫిబ్రవరి 2026 మధ్యకు వచ్చేసరికి 54%కి తగ్గుతుందని వెల్లడించింది. కానీ లా నినా వాచ్ అప్పటికీ ప్రభావం చూపుతూనే ఉంటుందంది.ఎల్ నినో–సదరన్ ఆసిలేషన్ (ఇఎన్‌ఎస్‌ఓ) శీతలీకరణ దశ అయిన లా నినా, భూమధ్యరేఖ పసిఫిక్‌లో సముద్ర ఉష్ణోగ్రతలను మారుస్తుంది తద్వారా ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై చాలా గాఢమైన ప్రభావాలను చూపుతుంది. ఈ ప్రభావం భారతదేశంపైన ఎలా ఉంటుంది అనే విషయానికొస్తే, ఇది తరచుగా సాధారణం కంటే చల్లగా ఉండే శీతాకాలాలను మనం ఎదుర్కోవలసి రావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.భారత పౌరాణిక విభాగం (ఐఎమ్‌డి) తన ఇటీవలి తన ఇఎన్‌ఎస్‌ఓ బులెటిన్‌లో భూమధ్యరేఖ పసిఫిక్‌పై ప్రస్తుతం తటస్థ పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది అంటే ఎల్ నినో లేదా లా నినా పరిస్థితి లేదు). ఐఎమ్‌డి కి చెందిన మాన్సూన్ మిషన్ క్లైమేట్ ఫోర్కాస్ట్ సిస్టమ్ (ఎమ్ఎమ్సిఎఫ్ఎస్) ఇతర అంచనాలు, ఈ తటస్థ పరిస్థితులు రుతుపవనాల సీజన్ మొత్తం కొనసాగుతాయని తేల్చాయి. అయితే రుతుపవనాల తర్వాత నెలల్లో లా నినా ఆవిర్భవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా అంచనా వేశాయి.ఈ నమూనాలు ఈ సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ (50% కంటే ఎక్కువ) మధ్య లా నినా అభివద్ధి చెందే అవకాశాలను చూపిస్తున్నాయని ఐఎమ్‌డి శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. వాతావరణ మార్పులు భూ ఉపరితలం వేడెక్కడం ప్రభావం కొంతవరకు దీనిని భర్తీ చేయగలదు, లా నినా ఉన్న శీతాకాలాలు అది లేని సంవత్సరాలతో పోలిస్తే మరింత చల్లగా ఉంటాయని స్పష్టం చేశారు.ప్రైవేట్ ఫోర్కాస్టర్ స్కైమెట్ వెదర్ అధ్యక్షుడు జిపి శర్మ మాట్లాడుతూ స్వల్పకాలిక లా నినా ఎపిసోడ్‌ను తోసిపుచ్చలేమని అన్నారు. ‘పసిఫిక్ మహా సముద్రం ఇప్పటికే సాధారణం కంటే చల్లగా ఉంది, అయినప్పటికీ లా నినా పరిమితుల వద్దకు ఇంకా రాలేదు. అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు –0.5నిఇ కంటే తక్కువగా పడిపోయి అదే విధంగా కనీసం మూడు త్రైమాసికాల పాటు కొనసాగితే, దానిని లా నినాగా ప్రకటిస్తారు.2024 చివరిలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నవంబర్ నుంచి జనవరి వరకూ లా నినా పరిస్థితులు కాస్త కనిపించి, మళ్ళీ తటస్థంగా మారిందన్నారు. కొనసాగుతున్న పసిఫిక్ శీతలీకరణ ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని శర్మ అన్నారు. ‘లా నినా ప్రారంభమైతే ఏర్పడే పొడి శీతాకాలాల కోసం అమెరికా ఇప్పటికే అప్రమత్తంగా ఉంది. భారత దేశానికి, చల్లటి పసిఫిక్ జలాలు సాధారణంగా కఠినమైన శీతాకాలాలుగా మారతాయి.ముఖ్యంగా ఉత్తర హిమాలయ ప్రాంతాలలో హిమపాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది‘ అని ఆయన అంచనా వేస్తున్నారు. మొహాలి (పంజాబ్)లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఇఆర్) బ్రెజిల్‌లోని నేషనల్ ఇన్సి్టట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ చేసిన 2024 అధ్యయనం ప్రకారం, ఉత్తర భారతదేశంపై తీవ్రమైన చలి తరంగాలను ప్రేరేపించడంలో లా నినా పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలింది. ‘లా నినా సమయంలో దేశంలోకి చల్లని గాలి ప్రవేశిస్తుంది. ‘ఎల్ నినో, తటస్థ సంవత్సరాలతో పోలిస్తే లా నినా సంవత్సరాల్లో శీతల తరంగ సంఘటనల ఫ్రీక్వెన్సీ వ్యవధి కూడా ఎక్కువగా ఉన్నాయి‘ అని అధ్యయనం తేల్చింది. -
ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా చమోలి, రుద్రప్రయాగ్ జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. వాతావరణశాఖ నుంచి సమాచారం అందుకోగానే ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’లో తెలియజేస్తూ, బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించామని తెలిపారు.భారీ వర్షాల నేపధ్యంలో స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించేలా విపత్తు కార్యదర్శి, జిల్లా మేజిస్ట్రేట్లకు అవసరమైన సూచనలు జారీ చేసినట్లు సీఎం ధామి తెలిపారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని బుస్కేదార్ తహసీల్ పరిధిలోని బరేత్ దుంగర్ టోక్ ప్రాంతంలో, చమోలీ జిల్లాలోని దేవల్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కొన్ని కుటుంబాలు ప్రమాదంలో చిక్కుకున్నాయని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయన్నారు. जनपद रुद्रप्रयाग के तहसील बसुकेदार क्षेत्र के अंतर्गत बड़ेथ डुंगर तोक और जनपद चमोली के देवाल क्षेत्र में बादल फटने के कारण मलबा आने से कुछ परिवारों के फंसे होने का दुःखद समाचार प्राप्त हुआ है। स्थानीय प्रशासन द्वारा राहत और बचाव कार्य युद्धस्तर पर जारी है, इस संबंध में निरंतर…— Pushkar Singh Dhami (@pushkardhami) August 29, 2025మరోవైపు దేవాల్లో ఆకస్మిక వరదల్లో ఇద్దరు గల్లంతయ్యారని, పలు జంతువులు జల సమాధి అయ్యాయని చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారీ తెలిపారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు మూసుకుపోయాయని, ఫలితంగా సహాయ చర్యలకు ఆలస్యమవుతున్నదన్నారు. బుధవారం సీఎం ధామి ఉత్తరకాశిలోని ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. రాష్ట్రంలో విపత్తు ప్రభావిత ప్రజలకు సహాయ ప్యాకేజీని ప్రకటించారు. ఇంతలో, భారత వాతావరణ శాఖ ఉత్తరాఖండ్‌లోని చమోలి, పిథోరగఢ్, బాగేశ్వర్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్లలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఒక నిర్దిష్ట ప్రదేశంలో చాలా తక్కువ సమయంలో అకస్మాత్తుగా భారీ స్థాయిలో వర్షం కురవడాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. Uttarakhand cloud burst: Rescue operation underway to find those missing after a cloudburst near Paligad-Silai Band in Tehsil Barkot of Uttarkashi district at around 2:12 am last night. #Uttarakhand #cloudburst #weather #Monsoon # #Uttarkashi pic.twitter.com/ur76OEVcbo— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) June 29, 2025 -
తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
-
AP and Telangana: నేడు..రేపు భారీ వర్షాలు
-
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
జలదిగ్బంధంలో ఢిల్లీ.. ప్రమాద స్థాయికి ‘యమున’
న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంతోపాటు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో నేటి (గురువారం) ఉదయం నుండి ఎడతెరిపిలేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. STORY | Yamuna nears warning mark in DelhiREAD: https://t.co/Khi8oNlw1WVIDEO | pic.twitter.com/jBQVZ17moE— Press Trust of India (@PTI_News) August 14, 2025భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన తాజాగా రెడ్ అలర్ట్ జారీచేసింది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. రోడ్లు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.VIDEO | Gurugram: Heavy rainfall on Thursday led to significant waterlogging and traffic congestion at IFFCO Chowk.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/zeQR1oE7ON— Press Trust of India (@PTI_News) August 14, 2025ఆగస్టు 17 వరకు ఈ ప్రాంతంలో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. మరింత అంచనా వేసింది. ఢిల్లీలోని యమునా నది నీటి మట్టం పాత రైల్వే వంతెన వద్ద 204.43 మీటర్లకు చేరుకుంది.VIDEO | Delhi: Heavy rain floods Mathura Road, causing severe waterlogging as vehicles struggle through the traffic.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/w4FYsbgkga— Press Trust of India (@PTI_News) August 14, 2025అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వర్షం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 23.6 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. ఇది సాధారణం కంటే 3.2 డిగ్రీలు తక్కువ. సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రత దాదాపు 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని ఐఎండీ తెలిపింది.వర్షం కారణంగా రింగ్ రోడ్, దక్షిణ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు ఢిల్లీని కలిపే అనేక ప్రధాన మార్గాలతో సహా అనేక ప్రాంతాలలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.#WATCH | Commuters wade through a partially waterlogged street near BD Marg area in Delhi, as the city receives continuous rain pic.twitter.com/CRdWc8w45N— ANI (@ANI) August 14, 2025సుబ్రోతో పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు, ద్వారకా సెక్టార్-20, గురుగ్రామ్‌లోని బసాయి రోడ్డు, ఘజియాబాద్, నోయిడాలోని కొన్ని ప్రాంతాలలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తూర్పు ఢిల్లీలోని పాండవ్ నగర్ అండర్‌పాస్‌లో నీరు నిలిచిపోయింది. ప్రజలు దాని గుండా వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. -
Telangana: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 13న అల్పపీడనం ఏర్పడే ఛాన్స్
-
Heavy Rainfall: ఢిల్లీకి రెడ్ అలర్ట్
-
జలప్రళయం
ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, ఎంతగా ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నా బేఖాతరు చేస్తున్న మనిషిపై ప్రకృతి మరోసారి తన విశ్వరూపాన్ని చూపింది. దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్‌లోని ధరాలీ గ్రామంపై మంగళవారం ఉవ్వెత్తున విరుచుకుపడిన వరద అక్కడి ఇళ్లూ, హోటళ్లూ, రెస్టారెంట్లూ, దుకాణాలూ వగైరాలను ఊడ్చిపెట్టేయగా దాదాపు వందమంది ఆచూకీ తెలియటం లేదని వార్తలొస్తున్నాయి. హార్సిల్ ప్రాంతంలో ఉన్న సైనిక శిబిరం కొట్టుకుపోగా అందులోని పదిమంది జవాన్ల ఆచూకీ తెలియటం లేదు. కుంభవృష్టితో ఖీర్గంగా నది పోటెత్తి ఇంత విలయానికి దారితీసింది. ఆకస్మిక వరదకు అరగంట ముందే ధరాలీ మార్కెట్ ప్రాంతానికి విరిగిపడ్డ కొండచరియలు, బురద కొట్టుకొచ్చాయనీ, అంతలోనే భారీయెత్తున వరదనీరు విరుచుకుపడిందనీ స్థానికుల కథనం. ఆత్మరక్షణ కోసం సమీపంలోని కొండపైకి ఎక్కినవారికి ఖీర్‌గంగ పెనుగర్జన వినబడిందంటే ఉద్ధృతి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే ఈ జలప్రళయం విరుచుకుపడింది. ప్రకృతి విలయం సంభవించినప్పుడల్లా ఎన్నో విషాద ఘట్టాలు ఆవిష్కృతమవుతాయి. ఇకపై అత్యంత జాగ్రత్తగా మెలగాలన్న సంకల్పమూ వినబడుతుంది. నెలలు కాదు... రోజులు గడిచేసరికే అదంతా మరుగునపడుతుంది. పర్యావరణాన్ని బేఖాతరు చేస్తూ నిర్మాణాలు మొదలవుతాయి. నదుల్ని దేవతలుగా కొలిచే సంప్రదాయం మనది. అయినా వాటికి అవరోధం కలిగించే నిర్మాణాలైనా, వాటిని కాలుష్యంలో ముంచే కర్మాగారాలనైనా అనుమతించరాదన్న గ్రహింపు పాలకులకు లేదు. గంగానదిని మాఫియాల బారి నుంచి కాపాడాలంటూ 2011లో ఉపవాసదీక్షకు పూనుకున్న స్వామి నిగమానంద ప్రాణత్యాగం చేసినా పాలకుల వైఖరిలో మార్పు లేదు. ఉత్తరాఖండ్‌కు విపత్తులు కొత్తగాదు. దశాబ్దాలుగా ఇంచుమించు ఏటా రివాజుగా వరదలొస్తాయి. గ్రామాలకు గ్రామాలు వరదనీటిలో చిక్కుకుంటాయి. కొన్నిసార్లు పెద్దగా సమస్యలేమీ లేకుండా ముగుస్తుంది. 2013లో సంభవించిన విలయం ఏకంగా 6,000 మందిని బలి తీసుకుంది. అంతకు ముందూ తర్వాతా కూడా పదుల నుంచి వందలమంది వరకూ మృత్యువాత పడిన సందర్భాలున్నాయి. అభివృద్ధి ముసుగులో ప్రకృతినీ, పచ్చటి ప్రాంతాలనూ ధ్వంసం చేయటం... వేర్వేరు ప్రాజెక్టులకు ఎడాపెడా అనుమతులీయటం మన దేశంలో పాలకులకు అలవాటైన జాడ్యం. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో వరదలొచ్చిన ప్రాంతం భాగీరథి పర్యావరణ జోన్ పరిధిలో ఉంది. దాన్ని అత్యంత జాగ్రత్తగా పరిరక్షించాల్సిన ప్రాంతంగా గుర్తించారు. 4,157 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఆ జోన్‌ను 2012లో నోటిఫైడ్ ప్రాంతంగా పరిగణించారు. అక్కడ జరిగే విచక్షణారహిత అభివృద్ధిని నియంత్రించటానికి ఉద్దేశించిన ఈ చర్య ఆచరణలో ఎందుకూ కొరగాకుండా పోయింది. నదులూ, ఉపనదుల సమీపంలో నిర్మాణాలు ఉండరాదన్న ఇంగితజ్ఞానం ఎవరికీ లేదు. ప్రతిష్ఠాత్మకమైన చార్ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టు సైతం ఆ ప్రాంతంలోనే ఉంది. పర్యావరణ ఉద్యమకారులు న్యాయ స్థానాల్లోనూ, వెలుపలా పోరాడినా... చివరకు ప్రభుత్వానిదే పైచేయి అయింది. ఏడాదిక్రితం 34వ జాతీయరహదారిపై హినా–టెక్లాల మధ్య నిర్మించతలపెట్టిన బైపాస్ రోడ్డు గురించి కూడా ఆందోళనలు జరిగాయి. ఆ ప్రాంతం ధరాలీకి దక్షిణంగా ఉంది.ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అమరికలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ధ్రువ ప్రాంతాల్లో, హిమపర్వతశ్రేణిలో మాత్రమే కుంభవృష్టి, ఆకస్మిక వరదలు ఉండేవి. అలాంటి రాతినేలలకు వరద నీటిని పట్టివుంచే గుణం తక్కువ. నిమిషాల వ్యవధిలో వరదలు పోటెత్తుతాయి. కొండచరియలు విరిగిపడి ముప్పును మరిన్నిరెట్లు పెంచుతాయి. పర్యావరణంలో వచ్చిన మార్పుల పర్యవసానంగా ప్రకృతి వైపరీత్యాలకు ఏ ప్రాంతమూ అతీతం కాని స్థితి వచ్చేసింది. వాతావరణాన్ని కొలవటానికి ఉపయోగించే నమూనాలు, ఉపకరణాలు ఒక్కోసారి విఫలం కావటానికి మారిన స్థితిగతులే కారణం. వేడిగాలులు ఎక్కువ తేమను పట్టి ఉంచుతాయి. ఒక డిగ్రీ ఉష్ణోగ్రత హెచ్చితే తేమ ఏడు శాతం పెరుగుతుందనీ, దీనికి అధికశక్తి ఉంటుందనీ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. వాతావరణంలో తేమ పెరిగినకొద్దీ వేడిగాలుల వల్ల ఆకస్మిక కుంభవృష్టికి అనువైన పరిస్థితులేర్పడతాయి. అందుకే ఉత్తరాఖండ్ వంటిచోట్ల మాత్రమే కాదు... అన్నిచోట్లా పర్యావరణాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటూ దానికి విఘాతం కలగనీయని రీతిలో ఆచరణ ఉండాలి. కానీ పట్టించుకునేదెవరు? అందుకే ప్రభుత్వాల అభివృద్ధి నమూనాలు మారాలి. పర్యావరణానికి విఘాతం కలిగించే అవకాశమున్నదని భావించే ఎలాంటి ప్రాజెక్టునైనా నిస్సంకోచంగా తిరస్కరించాలి. ఇప్పుడొచ్చిన ఉత్పాతం ఆఖరిది కావాలి. -
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం
-
AP Rains: చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ
-
Nallakunta: ప్రతి సంవత్సరం వర్షం వస్తే ఇదే పరిస్థితి అంటూ కాలనీవాసుల ఆవేదన
-
నేడు భారీ నుంచి అతిభారీ వర్షం.. మంత్రి పొన్నం విజ్ఞప్తి
హైదరాబాద్‌కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ (శనివారం) భారీ నుంచి అతి భారీ వర్షం తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం ఏకధాటిగా నాలుగు గంటలపాటు కురిసిన వానతో నగరంలో పలుప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.ఇప్పటికే జలదిగ్బంధంలో ఉన్న ప్యాట్నీ సింధీ కాలనీలో బోట్ల సాయంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కంటోన్మెంట్ సిబ్బంది మోటార్ల సహాయంతో నీళ్లను తొలగిస్తున్నారు. నాలా రిటైనింగ్ వాల్ కట్టకపోవడంతోనే ఇళ్లలోకి వర్షపు నీరు చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ వర్షాలపై హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. వర్షాలపై సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు. లోతట్టు ప్రాంతాలపై ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురండి. ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్ , పోలీస్ కమిషనర్, వాటర్ వర్క్ ఇతర అధికారులను అప్రమత్తం చేస్తూ వారితో మాట్లాడడం జరిగింది.. హైదరాబాద్ నగరానికి సంబంధించి నీళ్లు ఎక్కడ నిల్వ లేకుండా సిబ్బంది వెంట వెంటనే తొలగిస్తున్నారు. మొత్తం 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ పై అధికారులు సమన్వయం చేసుకుంటూ అక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం. జీహెచ్ఎంసీ ,రెవెన్యూ , పోలీస్ అధికారులు ప్రజల ఇబ్బందులు వస్తె పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలి ఏదైనా విపత్తు వస్తె అధికారులకు వెంటనే తెలియజేయాలి’’ అని పొన్నం నగరవాసులను కోరారు.మరోవైపు.. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. -
Weather: ఏపీకి భారీ వర్ష సూచన
-
Hyderabad: దంచికొట్టిన వర్షం
-
Big Alert: కోస్తా జిల్లాల్లో ఐదు రోజుల పాటు పడనున్న వర్షాలు
-
ఢిల్లీలో భారీ వర్షం.. రోడ్లపై నిలిచిపోయిన నీరు
-
బంగాళాఖాతంలో అల్పపీడనం: కోస్తాలో విస్తారంగా వర్షాలు
విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తరకోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం పడే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని, గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లాలోని నాగంపల్లెలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ రూరల్‌లో 3.7, ఎనీ్టఆర్ జిల్లా మునకుళ్లలో 3.6, అల్లూరి జిల్లా కూనవరంలో 3.5, విశాఖ జిల్లా ఎండాడ, సీతమ్మధారలో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ ప్రకటించింది. -
వానలకు అనుకూలంగా వాతావరణం
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు క్రమంగా ఊపందుకునే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి చల్లదనం సంతరించుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం రుతుపవనాల కదలికలు ఆశాజనకంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి రుతుపవనాలు వచ్చినప్పటికీ గత పది రోజులుగా మందగించడంతో వానల జాడ లేకుండా పోయింది. అక్కడక్కడా అడపాదడపా తేలికపాటి వర్షాలు నమోదైనప్పటికీ..వాతావరణంలో నెలకొన్న మార్పులతో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత తీవ్ర ఉక్కిరిబిక్కిరికి గురిచేశాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. రుతుపవనాల కదలికలు చురుగ్గా మారుతుండటంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు tకురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మాటూర్‌లో 4.93 సెం.మీ. వర్షం బుధవారం రాష్ట్రంలో సగటున 7.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ సీజన్లో 11 రోజుల్లో 3.37 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. బుధవారం సాయంత్రానికి 2.35 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా నల్లగొండ జిల్లా మాటూర్‌లో 4.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లిలో 4.35, నల్లగొండ జిల్లా ముదిగొండలో 3.38, పడమటిపల్లెలో 3.10, తిమ్మాపూర్‌లో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 5 డిగ్రీ సెల్సీయస్ తక్కువగా నమోదయ్యాయి. ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత అదిలాబాద్‌లో 33.8 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
ఏపీలో మండే ఎండలు.. వేడిగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి (ఫొటోలు)
-
Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు
-
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
మహారాణిపేట (విశాఖ)/సాక్షి నెట్వర్క్: ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ద్రోణి వల్ల రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఉపరితల ఆవర్తనం వల్ల ఇప్పటికే నైరుతి రుతుపవనాల కదలిక జోరుగా ఉంది.రానున్న మూడు రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిప్రాంతాల్లో గంటకు 40 –50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. ఉమ్మడి కృష్ణాజిల్లాను 2 రోజులుగా వర్షాలు వీడటం లేదుమచిలీపట్నంతోపాటు కృష్ణాజిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం వర్షం కురిసింది. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తాజాగా రాత్రి 8 గంటల సమయంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో జోరు వాన కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. » గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు గుంటూరు నగరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గుంటూరులో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మే నెల 21 వరకు జిల్లా సాధారణ వర్షపాతం 42.8 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు 106.2 మి.మీ వర్షపాతం నమోదైంది. » ప్రకాశం జిల్లాలో బుధవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. గిద్దలూరు, మార్కాపురం, వైపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో ఉరుము లు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. అత్యధికంగా దోర్నాల మండలంలో 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. తీగలేరు పొంగిపొర్లడంతో మార్కాపురం–దోర్నాల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. » శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో బుధవారం జోరు వాన కురిసింది. నెల్లూరులోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. -
ముందుగానే నైరుతి రుతుపవనాలు
-
ఉమ్మడి విశాఖ జిల్లాలో విస్తారంగా వర్షాలు
-
Rain Alert: వారం రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు
-
Earthquake: చైనాలో భూకంపం
బీజింగ్: చైనాలో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది.భారత కాలమానం ప్రకారం ఉదయం 6:29 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. భూమి లోతులో 10 కిలోమీటర్ల లోపల భూకంపం నమోదైనట్లు ఎన్సీఎస్ అధికారులు తెలిపారు. ఈ మేరకు భూకంప వివరాలను ఎన్సీఎస్ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈనెల మే 12న తెల్లవారుజామున 2:41 గంటలకు టిబెట్, చైనా పలు ప్రాంతాల్లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంపం భూమిలో 9 కిలోమీటర్ల లోతులో నమోదైంది.EQ of M: 4.5, On: 16/05/2025 06:29:51 IST, Lat: 25.05 N, Long: 99.72 E, Depth: 10 Km, Location: China. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/08mQNfOwyd— National Center for Seismology (@NCS_Earthquake) May 16, 2025 -
Rain Alert: అరేబియా సముద్రంలో బలపడుతున్న గాలులు
-
ఏపీకి భారీ వర్ష సూచన. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
విశాఖ : రాబోవు కొన్ని గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దాంతో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.గంటలకు 60 నుంచి 80 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీయవచ్చని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు స్పష్టం చేసింది. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్‌రాగల రెండు మూడు గంటల వ్యవధిలో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరంగా బయటకు రాకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ, రోణంకి కూర్మనాథ్,పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్మరోవైపు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాలతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు పడే సూచనలున్నాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. -
ఏపీకి వారం రోజుల పాటు వర్ష సూచన
-
ఏపీలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం
-
AP: రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు
-
ప్రపంచ వాతావరణ సంస్థ ఎలా ఏర్పాటైందంటే..! ఇప్పటికీ 75 ఏళ్లా..?
మనిషి జాతకాన్ని పంచాంగాలు చెబుతాయి. పంచాంగాలు చెప్పే జాతకాలను సైతం మార్చగల పంచభూతాల ‘మూడ్’.. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందో ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (ప్రవాస) చెబుతుంది! పంచాంగమైనా కాస్తా అటూఇటూ అవొచ్చు. లేదా, అసలెటూ కాకపోవచ్చు. పంచభూతాలు ఎలా ఉండబోతున్నాయో ‘ప్రవాస’ చెబితే మాత్రం... దాదాపుగా చెప్పిందే జరుగుతుంది. ‘మబ్బు పట్టి.. గాలి కొట్టి..’ఆకాశం మేఘావృతమై ఉంటుంది అంటే ‘ప్రవాస’ చెబితే ఆకాశం మేఘావృతమయ్యే ఉంటుంది! భూమి భగభగమంటుంది అంటే భగభగమన్నట్లే ఉంటుంది. చిరుజల్లులు, కుంభవృష్టి, ఈదురుగాలులు, సముద్రపు ఆటు పోట్లు, సముద్రం లోపలి సుడిగుండాలు, సముద్ర గర్భంలో బద్ధలయ్యే అగ్ని పర్వతాలు, వరదలు, విపత్తులు, ప్రకృతి విలయాలు అన్నిటినీ ‘ప్రవాస’ సరిగ్గా అంచనా వేస్తుంది. ‘‘ఎండలు విపరీతంగా ఉండబోతున్నాయి ఇంట్లోంచి బయటికి రావద్దు..’’ అని జాగ్రత్త చెబుతుంది. చలి తీవ్రత, చలి గాలులు పెరిగే ప్రమాదం ఉందని అప్రమత్తం చేస్తుంది. ‘‘వాయుగుండం పడబోతోంది సముద్రంలోకి వెళ్లొద్దు’’ అని మత్స్యకారులను హెచ్చరిస్తుంది. ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ప్రభుత్వాలకు ముందే సమాచారం అందిస్తుంది. ఇలా అనుక్షణం ప్రకృతి ధోరణులను గమనిస్తూ, ప్రపంచ దేశాల వాతావరణ శాఖలకు ఎప్పటికప్పుడు ఆ సమాచారం పంపుతూ, మానవాళి మనుగడలో అంత్యంత ప్రాముఖ్యం కలిగి ఉన్న ‘ప్రవాస’కు నేటికి 75 ఏళ్లంటే చరిత్రలో ఒక విశేషమే కదా. ‘ప్రవాస’ స్వయం ప్రతిపత్తి కలిగిన అంతర్జాతీయ సంస్థ. ఐక్యరాజ్య సమితి 1950 మార్చి 23న ఈ సంస్థను ఏర్పాటు చేసింది. అప్పట్నుంచీ ఏటా ఈ రోజును ‘వరల్డ్ మీటియరలాజికల్ డే’ (ప్రపంచ వాతావరణ దినోత్సవం)గా జరుపుకుంటున్నాం. సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.‘మేఘాలు లేని ఆకాశం.. పూలగడ్డి లేని మైదానం’మనిషి పంచభూతాలను ‘డిస్టర్బ్’ చేయకుండా ఉంటే ‘ప్రవాస’కు గానీ, ఇండియన్ మీటియరలాజికల్ వంటి ఇతర దేశాల వాతావరణ శాఖలకు గానీ ఇంతగా ‘వాతావరణ జోస్యం’ చెప్పే అవసరం లేకపోయేది. కవులు కూడా ప్రకృతిపై కాస్త కనికరం చూపండి అని మనిషికి ఏనాటి నుండో చెబుతూనే వస్తున్నారు. ‘‘మేఘాలు లేని ఆకాశం.. పూలగడ్డి లేని మైదానం.. ’’ అంటాడు కవి. మేఘాలు లేకుండా ఆకాశం ఎందుకు ‘ఎండిపోతుంది’? మనిషి వల్లే. ఎండల్ని మండిచేస్తున్నాం కదా! ‘‘ప్రకృతిని ప్రేమించండి. ప్రకృతికి దగ్గరగా ఉండండి’’ అంటాడు కవి. ఎందుకు మనం అసలు ప్రకృతి వైపే చూడము? ప్లాస్టిక్ సౌఖ్యాల్లో మునిగిపోయాం కదా.. అందుకు! ‘‘చెట్లను చూడండి. పక్షులను చూడండి. నక్షత్రాలను చూడండి’’ అంటాడు కవి. చూస్తూనే ఉన్నాం. కానీ కూలిపోతున్న చెట్లను, అంతరించిపోతున్న పక్షులను, ధూళి కొట్టుకుని పోయిన నక్షత్రాలను!! ఎప్పటికి మనం మారుతాం? వాతావరణం పూర్తిగా మారిపోయి, మనిషి ఉనికే లేకుండా పోయాక, ఈ భూగోళపు పునఃప్రారంభంలోనా?‘ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరూ..’’ అని రాశారు కొసరాజు రాఘవయ్యగారు. నిజమే. ఊహించలేం. కానీ మనమింకా మహర్జాతకులంగానే మిగిలి ఉన్నాం అంటే వాతావరణ సంస్థలు, శాఖల వల్లనే. ఏం జరగబోతోందో అవి చక్కగా అంచనా వేసి మనల్ని ఆపదల నుండి తప్పిస్తున్నాయి. మన వల్ల వాతావరణానికి ఆపద రాకుండా మనమూ బాధ్యతగా ఉండాలి. ‘ప్రవాస’ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సెలెస్ట్ సౌలో ఇటీవలే జనవరి 15న ‘భారత వాతావరణ శాఖ’ (ఐ.ఎం.డి) 150 వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఇండియా వచ్చి వెళ్లారు! ఆ సందర్భంగా వాతావరణ మార్పులపై భారత్ సహసోపేతమైన చర్యలు తీసుకుంటోందని కూడా ఆమె ప్రశంసించారు. భారతదేశంలో 1875లో ఐ.ఎం.డి. ప్రారంభం అయింది. అంతకన్నా ముందు, ప్రపంచంలోనే తొలి ఐ.ఎం.డి. 1854లో బ్రిటన్‌లో ఏర్పాటైంది. అంటే ఇప్పటికి సుమారు 170 ఏళ్ల క్రితం. భారత్‌లో ఐ.ఎం.డి.ని నెలకొల్పింది కూడా బ్రిటిష్ వారే. 1864 కలకత్తా సైక్లోన్‌లో 80 వేల మంది ప్రాణాలు కోల్పోవటంతో, భవిష్యత్తులో మళ్లీ అంతగా ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అప్పటి దేశ రాజధాని కలకత్తా ప్రధాన కార్యాలయంగా ఐ.ఎం.డి.ని నెలకొల్పారు. తర్వాత సిమ్లాకు, అక్కడి నుంచి పుణె, చివరికి 1944లో ఢిల్లీ ఐ.ఎం.డి.కి ప్రధాన కార్యాలయం అయింది. బ్రిటన్‌లోను, ఇండియాలోనూ ఐ.ఎం.డి.లు ఏర్పాటు చేయకముందు వరకు మేఘాల పోకడలు, జంతువుల ప్రవర్తనలు, రుతు చక్రాల ఆధారంగా రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతున్నదో అంచనా వేసేవారు. అలాగే ఉష్ణోగ్రత, పీడనం, తేమ, గాలి వేగాలను కొలిచే సాధనాలు కొన్ని ఉండేవి. వాతావరణ హెచ్చరిక కేంద్రాల స్థాపన తర్వాత తొలిరోజుల్లో వర్షపాత సమాచారాన్ని పోస్ట్ కార్డ్లపైన, టెలిగ్రాఫిక్ సిస్టమ్‌ల ద్వారా అందించేవారు. తర్వాత రాడార్లు, ఇప్పుడు జీపిఎస్.. వాతావరణ సూచనల సమాచారాన్ని చేరవేయటంలో ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. (చదవండి: ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’కి ప్రధాని మెదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..) -
ఈ తరుణంలో చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ
-
తెలుగు రాష్ట్రాల్లో మార్చిలోనే దంచికొడుతున్న ఎండలు (ఫొటోలు)
-
43.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. మండిపోతున్న ఎండలు
భువనేశ్వర్: దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండ వేడిమి ఠారెత్తిస్తోంది. ఒడిశా(Odisha)లోని పలు నగరాల్లో ఇప్పటికే వేడిగాలులు వీస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అందించిన సమాచారం ప్రకారం ఒడిశాలోని బౌధ్ సోమవారం వరుసగా మూడవ రోజు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు(Highest temperatures) నమోదైన ప్రదేశంగా నిలిచింది.సోమవారం ఈ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఒడిశాలోని బార్గడ్లో 42 ఢిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు మూడవ స్థానంలో నిలిచింది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 41.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత చాలా రోజుల తర్వాత 30 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యింది.మంగళవారం నుండి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుందని, మార్చి 25- 31 మధ్య రాజధానిలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. ఢిల్లీలో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీలుగా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 2.1 డిగ్రీలు తక్కువ. ఢిల్లీతో పాటు ఇతర మైదాన ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తగ్గడానికి జమ్ముకశ్మీర్‌లో కురుస్తున్న హిమపాతం కారణంగా నిలిచింది. ఒడిశా విషయానికొస్తే బౌధ్‌లో శనివారం 42.5 డిగ్రీల సెల్సియస్, ఆదివారం 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒడిశాలోని ఆరు జిల్లాలకు మంగళవారం వాతావరణ శాఖ వేడిగాలుల హెచ్చరిక జారీ చేసింది.ఇది కూడా చదవండి: జో బైడెన్ సంతానానికి సీక్రెట్ సర్వీస్ రక్షణ తొలగింపు -
ఎండలు పెరుగుతున్నాయి... జర జాగ్రత్త
నిన్నామొన్నటి వరకు గజ గజ వణింకించిన చలించింది. ఇపుడిక ఎండలు దంచికొడుతున్నాయి. జనవరి మాసం అలా వెళ్లిందో లేదో ఫిబ్రవరి మాసం ఆరంభంనుంచి క్రమంగా వాతావరణ వేడెక్కడం మందలైంది. ఇపుడిక ఎండలు మండిస్తున్నాయి. ఎండ ప్రభావం, ఉక్కపోత మొదలైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా శివరాత్రితో శివ..శివా అంటూ చలి వెళ్లిపోతుందని పెద్దలు చెబుతారు. కానీ శివరాత్రి కంటే ముందే ఎండల ప్రభావం కనిపిస్తోంది. దీంతో రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వేసవిలో ఎండల బాధలు, తిప్పలు తప్పవు. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో బయటకు రాకూడదు. ఎండ వేడికి ఎక్కువగా గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా పిల్లలు, వయసైన వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని అధికారులు తెలిపారు. ముదురుతున్న ఎండలు- జాగ్రత్తలుఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి.అలాగే గాలి పీల్చుకునే తేలికపాటి బట్టలు ధరించడం ఉత్తమం.బయటికి వెళ్లేవారు గొడుగులు, స్కార్ఫ్‌లు ధరించాలి.మరీ ఎండ ఎక్కువగా సమయంలో బయటికి రాకుండా ఉండాలి. కొబ్బరి నీళ్లు, నీళ్ల కంటెంట్ ఎక్కువగా ఉండే తాజా పళ్లు తీసుకోవాలి.కానీ ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తగ్గడం లేదు.ఉక్కపోతతో పాటు చెమట ఇబ్బంది పెడుతోంది. తరచూ చెమట పట్టడం వల్ల శరీరంలోని నీటి పరిమాణం, ఉప్పు శాతం తగ్గిపోతాయి. ఏసీ రూంలో ఉన్నాం కదా, చెమట లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి. వేడి వాతావరణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, రానున్న కాలంలో మరింత ముదిరే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం, ఎప్పటికపుడు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని ఆరోగ్యరంగ నిపుణులు అంటున్నారు. -
కచ్చితత్వం దిశగా...
పక్షుల, పాముల, జంతువుల ప్రవర్తనను చూసీ...ఆకాశం తీరుతెన్నులు గమనించీ, గాలివాటు, దాని వేగం గ్రహించీ వాతావరణాన్ని అంచనా కట్టే గతకాలపు రోజుల నుంచి ఇవాళ ఏం జరుగుతుందో, వచ్చే నాలుగైదు రోజుల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతున్నదో, రాగల సంవత్సరమంతా ఎలాంటి స్థితిగతులుంటాయో స్పష్టంగా వివరించే సమాచారం అందరికీ అందుబాటులో కొచ్చింది. గత నూట యాభయ్యేళ్లుగా అవిచ్ఛిన్నంగా ఈ పనిలోనే నిమగ్నమై కోట్లాది పౌరులకు చేదోడువాదోడుగా నిలిచిన భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) తన వార్షికోత్సవాన్ని మంగళ వారం ప్రధాని మోదీ సమక్షంలో ఘనంగా నిర్వహించుకుంది. ఒక దేశ విజ్ఞాన శాస్త్ర అవగాహన ఆ దేశంలోని వైజ్ఞానిక సంస్థల ప్రగతిలో ప్రతిఫలిస్తుందని ఈ సందర్భంగా మోదీ చెప్పిన మాట అక్షరసత్యం. ఈ నూటయాభయ్యేళ్లలో ఐఎండీ సాధించిన ప్రగతి ఇందుకు సాక్ష్యం. ‘వాన రాకడ... ప్రాణం పోకడ’ ఎవరికీ తెలియదనే నానుడి నుంచి మనం చాలా దూరం వచ్చాం. ఇక పోవటం ఖాయమనుకున్న ప్రాణాన్ని నిలబెట్టడానికీ, పునర్జన్మ ఇవ్వడానికీ అధునాతన వైద్య సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకొచ్చాయి. అలాగే వాన ఎక్కడ కురుస్తుందో, దాని తీవ్రత ఏపాటో అంచనా వేయగలుగుతున్నాం. తుపాను ఏర్పడే అవకాశాలు, దాని గమ్యం, గమనం, అది మోసుకు రాగల విపత్తు గురించీ హెచ్చరించటంతో పాటు కరవుకాటకాల ప్రమాదాన్ని తెలియజెప్పటం ఆ రంగంలో సాధించిన ప్రగతికి తార్కాణం. మూడు రోజుల వరకూ వాతావరణం ఎలా ఉండబోతు న్నదో చెప్పే స్వల్పకాలిక అంచనాలు, పదిరోజుల వరకూ వాతావరణ పోకడల్ని వివరించగల మధ్య శ్రేణి అంచనాలు, నెల పాటు ఏ వారమెలా వుంటుందో తెలియజేయగల సామర్థ్యం ఇప్పుడు మన సొంతం. ఇంకా స్థానిక వాతావరణాలను అంచనా వేయగలిగే దిశగా ఐంఎండీ ముందుకెళ్తోంది.పేరులో తప్ప జనాభా రీత్యా, సంపద రీత్యా, లేదా విస్తీర్ణం రీత్యా ఏ రకంగానూ ‘గ్రేట్’ అనే పదానికి అర్హత లేని బ్రిటన్ నుంచి వచ్చిన వలస పాలకులు ఈ దేశంలోని వాతావరణ తీరుతెన్నులు చూసి అయోమయంలో పడ్డారు. వీటిని సక్రమంగా అంచనా వేసే సాధనాలు లేకపోతే సరిగా పాలించటం అసాధ్యమన్న నిర్ణయానికొచ్చిన ఫలితంగానే 1875లో సర్ చార్లెస్ చాంబర్లేన్ నేతృత్వంలో ఐఎండీని నెలకొల్పారు. అంతవరకూ రైతులు సంప్రదాయంగా అనుసరిస్తూ వచ్చిన విధానాలన్నీ క్రమేపీ కనుమరుగై వాతావరణ అధ్యయనం కొత్త పుంతలు తొక్కటం ప్రారంభించింది. కేవలం బ్రిటన్ వాతావరణాన్ని పోలి వుంటుందన్న ఏకైక కారణంతో తమ వెసులుబాటు కోసం సిమ్లాలోని పర్వత ప్రాంతంలో మొదలెట్టిన ఐఎండీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని గ్రహించాక 1928లో పుణేకు తరలిరావటం, ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఢిల్లీకి వెళ్లటం తప్పనిసరైంది. ఐఎండీ డైరెక్టర్ జనరల్‌గా వచ్చిన గిల్బర్ట్ వాకర్ 1904–1924 మధ్య రెండు దశాబ్దాల సమయంలో భారత వాతావరణంలో చోటుచేసుకున్న అసాధారణతలపై అధ్యయనం చేయటంతో అనేక అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంత పసిఫిక్ మహా సముద్ర జలాలపై ఉండే వాయుపీడనంలో వచ్చే హెచ్చుతగ్గులే ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ స్థితిగతులను ప్రభావితం చేస్తున్నాయని ఆ అధ్యయనం తేల్చాక వాతావరణాన్ని అర్థంచేసుకునే తీరే మారిపోయింది. పసిఫిక్ జలాలపై ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతలో మైనస్ 17 డిగ్రీల సెల్సియస్ మేరకు హెచ్చితే లాæనినో... ఆ ఉష్ణోగ్రత మైనస్ 17 డిగ్రీల కన్నా తగ్గితే లానినా ఏర్పడు తుందని తేలింది అప్పుడే. ఇదంతా అర్థమయ్యాక రాగల కాలంలో వాతావరణమెలా వుండనున్నదో అంచనా వేయటం సులభమైంది. వాతావరణంలో విడిచిపెట్టే బెలూన్లు గాలిలో తేమనూ, ఉష్ణోగ్రతనూ ఇట్టే చెప్పగలుగుతుండగా ఉపగ్రహాలు నేల పరిస్థితుల గురించి సమాచారం ఇస్తున్నాయి.స్వాతంత్య్రానంతరం వాతావరణాన్ని కొలవటానికి రాడార్ల వంటి ఉపకరణాలు అందుబాటు లోకొచ్చాయి. 1971లో తొలి తుపాను హెచ్చరిక కేంద్రం ఏర్పాటైతే, 1990ల్లో ఇస్రో ఉపగ్రహాలు పంపే డేటాతో వాతావరణ అంచనాల కచ్చితత్వం పెరిగింది. సెకనుకు కొన్ని లక్షల గణనలను చేయగలిగిన అధునాతన సూపర్ కంప్యూటర్ వినియోగం మొదలయ్యాక రుతుపవనాలు, తుపానుల గురించి మాత్రమే కాదు... వడగాల్పులు, వరదల వంటి వైపరీత్యాల గురించి కూడా చెప్పగలుగుతున్నారు. మన దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో 60 శాతం కేవలం వర్షాధారం కావటం, జనాభాలో మూడింట రెండొంతుల మందికి జీవనాధారం వ్యవసాయమే కావటం వల్ల ఐఎండీ చెప్పే అంచనాలు ఎంతో అవసరం. అందుకే వర్షాలు సరిగ్గా ఎక్కడ పడతాయో, ఏ ప్రాంతంలో వడగాడ్పులు వీచవచ్చో, ఎక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నదో కూడా పదేళ్లుగా చెప్పగలుగుతోంది. కృత్రిమ మేధ దీన్ని మరింత పదునెక్కించింది.ఐఎండీ అంచనాల వల్ల ప్రభుత్వాలు అప్రమత్తమై లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించటం, వేలాది ప్రాణాలను కాపాడుకోవటం సాధ్యమవుతోంది. ఇది మున్ముందు ఇంకా విస్తరించి కనీసం అయిదురోజుల ముందు 90 శాతం కచ్చితత్వంతో చెప్పగలిగే విధానాలను అభివృద్ధి చేసుకోవాలనీ, ఆఖరికి భూకంపాల రాకడను సైతం పసిగట్టగలగాలనీ ఐఎండీ 2047 విజన్ డాక్యుమెంటు విడుదల సందర్భంగా మోదీ చేసిన సూచన శిరోధార్యం. ఈ అంచనాలు మన దేశానికి మాత్రమే కాదు...ఆసియా ప్రాంత దేశాలకు సైతం ఎంతో మేలుచేస్తాయి. పంటల దిగుబడిపై, ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులపై మరింత మెరుగైన అంచనాలకు తోడ్పడతాయి. -
కేరళ, తమిళనాడు తీరాలకు కల్లక్కడల్ ముప్పు
-
వణుకుతున్న ఉత్తరాది.. ఢిల్లీలో తగ్గిన విజిబిలిటీ
-
కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు
-
చలి కాలంలో వర్షం.. అనుకూలమా? ప్రతికూలమా?
దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. శీతాకాలంలో వర్షాలు కురవడం విచిత్రంగా అనిపిస్తుంది. ఇటువంటి వాతావరణంలో పొగమంచు పెరిగేందుకు అవకాశం ఉంటుందని, చలి తీవ్రత కూడా పెరుగుతుందని కొందరు అంటుంటారు. సాధారణంగా వేసవికాలంలో వర్షం కురిస్తే వాతావరణం చల్లగా మారి, మనకు హాయినిస్తుంది. అలాగే వాతావరణంలో తేమ శాతాన్ని పెంచుతుంది. మరి శీతాకాలంలో వర్షం పడినప్పుడు ఏమి జరుగుతుంది?మనదేశంలో శీతాకాలంలో వర్షాలు పడటం అనేది అతి అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఈ వర్షాలుకు రుతుపవనాలకు ఏమాత్రం సంబంధం లేదు. భారత్‌తో చలికాలంలో వాయువ్య దిశ నుండి వచ్చే గాలులు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. వీటిని వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ అంటారు. ఈ గాలులు పశ్చిమాన మధ్యధరా సముద్రం నుండి వస్తాయి. ఈ గాలుల కారణంగా వాతావరణంలో అల్ప పీడనం ఏర్పడుతుంది. ఫలితంగా వర్షాలు కురుస్తాయి.ఉష్ణోగ్రతలపై ప్రభావంభారతదేశంలో హిమాలయ ప్రాంతాలలో కురుస్తున్న మంచు కారణంగా ఏర్పడే చలి మైదాన ప్రాంతాల వరకూ వ్యాపిస్తుంది. శీతాకాలంలో వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, ఈ సమయంలో కురిసే వర్షం వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. ఈ వర్షం కారణంగా ఉత్తర, మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. గాలిలో తేమ పెరుగుతుంది. ఈ రెండింటి కలయిక కారణంగా చలి మరింతగా పెరుగుతుంది. మంచు కురుస్తున్న ప్రాంతాల్లో ఒకవేళ వర్షం పడితే, అక్కడ చలి తగ్గుతుంది. చాలా చల్లగా ఉండే ప్రాంతాల్లో, కురిసే వర్షపు నీరు ఉష్ణోగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుగుతుంది. అయితే అత్యంత అరుదుగా ఇది జరుగుతుంది. శీతాకాలంలో కురిసే తేలికపాటి వర్షం ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోకుండా కాపాడుతుంది.గాలిలో తేమశాతం పెరిగి..ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో వర్షం కారణంగా, గాలిలో తేమశాతం చాలావరకూ పెరుగుతుంది. పొగమంచు కూడా పెరుగుతుంది. మరోవైపు ఇప్పటికే పొగమంచు ఉన్న ప్రాంతాల్లో, వర్షాలు కురిస్తే పొగమంచు తగ్గుతుంది. చలికాలంలో కురిసే వర్షాల వల్ల ఒక ప్రయోజనం ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్ వంటి ప్రాంతాలలో కాలుష్యాన్ని తగ్గించడంలో, గాలి నాణ్యతను మెరుగుపరచడంలో వర్షాలు ఎంతో ఉపయోగపడతాయి. శీతాకాలంలో కురిసే వర్షాలు గాలిలోని కాలుష్య కారకాలను కడిగివేస్తాయి. ఇది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. పొగ, కాలుష్యం అధికంగా ఉండే నగరాల్లో వర్షం వల్ల కాలుష్యం తగ్గుతుంది. ఉత్తర భారతదేశంలో కురిసే శీతాకాలపు వానలు చలి గాలులను పెంచవు. వర్షం పడితే అది ఖచ్చితంగా చలిని కొంతవరకు ప్రభావితం చేస్తుంది. కానీ చలిగాలులను నియంత్రింపజేయదు. చలికాలంలో కురిసే వర్షం చల్లదనాన్ని తగ్గించడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఇటువంటి వర్షం గాలిలో తేమను, చల్లదనాన్ని పెంచుతుంది. అదే సమయంలో కలుషితమైన గాలిని తగ్గిస్తుంది. ఇది కూడా చదవండి: Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు -
ఇంకా ఆందోళనకరంగానే పరిస్థితి!
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం తిరిగి ఆందోళనకర స్థాయికి చేరింది. కలుషిత గాలి కారణంగా జనం కళ్ల మంటలతో పాటు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 450కి పైగా నమోదైంది. బవానాలో అత్యధిక ఏక్యూఐ స్థాయి 475 వద్ద నమోదైంది. ఇది చాలా తీవ్రమైన విభాగంలోకి వస్తుంది.నిర్మాణ పనుల నిలిపివేతడిసెంబర్ 16 నుంచి ఢిల్లీలో గ్రాప్ -4 నిబంధనలు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ ఢిల్లీ గాలి నాణ్యతలో ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 400 దాటింది. సొమవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలోని 25 కాలుష్య పర్యవేక్షణ కేంద్రాలలో గాలి నాణ్యత సూచిక 400 కంటే అధికంగా నమోదైంది. గ్రాప్-4 నిబంధనల అమలుతో ఢిల్లీలో నిర్మాణ పనులను పూర్తిగా నిషేధించారు. పాఠశాలలను కూడా హైబ్రిడ్ విధానంలో నడుపుతున్నారు.ఏడు ప్రాంతాల్లో 450 దాటిన ఏక్యూఐ ఢిల్లీలోని బవానాలో 475, రోహిణిలో 468, వజీర్‌పూర్‌లో 464, అశోక్ విహార్‌లో 460, సోనియా విహార్‌లో 456, జహంగీర్‌పురిలో453గా ఏక్యూఐ స్థాయి నమోదయ్యింది. ఇది ఢిల్లీవాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ఈరోజు(సోమవారం) ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీలో కాలుష్యంతో పాటు చలి కూడా అధికంగానే ఉంది. సోమవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది కూడా చదవండి: Year Ender 2024: కుటుంబం మెచ్చిన 10 అందమైన ప్రదేశాలు -
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
-
RK బీచ్ వద్ద అలల ఉగ్రరూపం
-
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
-
వీటిపై ‘శీత’ కన్నేయండి
ఈ కాలంలో కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవడం వంటికి ఎంతో మంచిది. అదేవిధంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది. ఏ కాలంలో తీసుకో వలసిన పండ్లు, కూరగాయలు ప్రకృతి చేసిన ఏర్పాటు వల్ల విరివిగా దొరుకుతూనే ఉంటాయి. అయితే తీసుకోకూడని ఆహారం మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అయితే వాటికి దూరంగా ఉండటం ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారమేంటో చూద్దాం.ఈ కాలంలో తీసుకోకూడని ఆహార పదార్థాలలో ముందు వరసలో ఉండేది...నూనెలో వేయించిన చిరుతిళ్లు...వీటికి ఉదాహరణ సమోసాలు, పకోడీలు, బజ్జీలు. చలి చలిగా ఉన్న వాతావరణంలో వేడి వేడి బజ్జీలు, పకోడీలు, సమోసాలు లాగించడానికి బాగుంటుంది కానీ అరుగుదలకే చాలా కష్టం అవుతుంది. అజీర్తి, యాసిడిటీ, కడుపు ఉబ్బరం వస్తాయి. ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి చిరుతిళ్లకు దూరంగా ఉండటమే మేలు.డెయిరీ ఫుడ్...మీగడ, జున్ను, పాల ఉత్పత్తులు శరీరానికి బలవర్థకమే కానీ అది ఈ సీజన్లో అంతమంచిది కాదు. పాల ఉత్పత్తులు ఒంటికి వెచ్చదనాన్నివ్వడమొక్కటే కాదు, శ్లేష్మకరం కూడా. చల్లని వాతావరణంలో సైన సైటిస్ వచ్చేలా చేస్తుంది. శ్వాసకోశ వ్యాధులున్నవారికి సమస్యలు కలిగిస్తుంది. అందువల్ల ఈ సీజన్లో డెయిరీ ఉత్పత్తులు తీసుకోవడం అంత మంచిది కాదు. రెడ్ మీట్...చలికాలంలో రెడ్ మీట్ తీసుకోరాదు. రెడ్‌మీట్‌కు మంచి ఉదాహరణ మటన్, బీఫ్, పోర్క్. ఇవి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై దు్రçష్పభావం పడుతుంది. అధికమొత్తంలో కొవ్వు ఉండటం మూలాన అరుగుదల లోపిస్తుంది. కడుపు ఉబ్బరం వస్తుంది. ఒకోసారి అది గుండెకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. బండ్లమీద అమ్మే పదార్థాలు...బండ్లమీద అపరిశుభ్ర వాతావరణంలో అమ్మే పానీపూరి, చాట్ వంటి వాటిని ఎప్పుడు తీసుకున్నా మంచిది కాదు కానీ ఈ సీజన్లో తీసుకోవడం బొత్తిగా మంచిది కాదు. స్ట్రీట్‌ఫుడ్ తినడం రోగనిరోధక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపి, బలహీనపరుస్తుంది. ఫలితంగా శరీరం రకరకాల వ్యాధుల బారిన పడుతుంది. అందువల్ల స్ట్రీట్ ఫుడ్‌కి దూరంగా ఉండటం మంచిది. శీతల పానీయాలు...చల్లటి వాతావరణంలో చల్లటి పానీయాలు, ఐస్‌క్రీములూ తీసుకోవడం వల్ల వాటిని అరిగించడానికి, జీర్ణం చేసుకోవడానికి శరీరానికి చాలా కష్టం అవుతుంది. దానివల్ల జీర్ణవ్యవస్థకు తీవ్ర హాని కలుగుతుంది. గొంతులో గరగర, నొప్పి, జలుబు, ముక్కు కారడం వంటి సమస్యలు తీవ్రం అవుతాయి. సిట్రస్ జాతి పండ్లు...విటమిన్ సీ అధికంగా ఉండే కమలా, బత్తాయి, నిమ్మ వంటి పండ్లు తీసుకోవడం వల్ల వాటిని అరిగించే క్రమంలో కడుపులో తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. అసిడిటీ, గొంతు మంట వంటి ఇబ్బందులు కలుగుతాయి.ఆవకాయ వంటి ఊరగాయలు...వింటర్లో ఊరగాయలు తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే నిల్వ ఉండటం కోసం ఊరగాయలలో ఉప్పు, నూనె, కారం వంటివి కొంచెం ఎక్కువమొత్తంలో వాడతారు. వాటిని అరిగించడం జీర్ణవ్యవస్థకు కాస్తంత భారమైన పనే. ఊరగాయలలో కూడా మామిడికాయలతో పెట్టిన ఆవకాయ, మాగాయ వంటివి తినడమంటే జీర్ణవ్యవస్థకు మరింత పని పెట్టినట్టే కాబట్టి వాటికి కాస్తంత దూరంగా ఉండటం మంచిది. మసాలా పదార్థాలు...మసాలాలు దట్టించి చేసిన పదార్థాలంటే భారతీయులకు అందులోనూ తెలుగు వాళ్లకు చాలా ఇష్టం. అయితే ఈ సీజన్లో మసాలాలను దేహం అరిగించుకోలేదు కాబట్టి వాటిని కూడా దూరం పెట్టడమే మేలు. -
Red Alert : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
-
ఏపీకి హై అలర్ట్..
-
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
-
క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాలి
సాక్షి, హైదరాబాద్: మారిన వాతావరణ పరిస్థితులు, రైతుల ఆకాంక్షల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సరికొత్త సవాళ్లకు పాత కాలపు ఆలోచనలతో కూడిన పరిష్కారాలు సరిపడవని, క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు పిలుపునిచ్చారు. సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) మినీ ఆడిటోరియంలో మిల్లెట్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు.చిరుధాన్యాలపై అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘క్లైమెట్ ఛేంజ్, మిల్లెట్స్, ఎకోసిస్టమ్ సర్వీసెస్’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టికి రామాంజనేయులు సమన్వయకర్తగా వ్యవహరించారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు 30 ఏళ్ల నాడు పాలకులు ఏర్పాటు చేసిన మద్దతు వ్యవస్థలు ఇప్పటి సవాళ్లను ఎదుర్కోవటానికి పనికిరావని, కొత్త తరహా మద్దతు వ్యవస్థలను అమల్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని డా. రామాంజనేయులు సూచించారు. రైతుబంధు వంటి పథకాలను కొత్త సవాళ్ల వెలుగులో సమీక్షించుకోవాలన్నారు. రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలిపర్యావరణ సేవలకు చెల్లింపులు అవసరం అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అధ్యాపకురాలు డాక్టర్ మంజుల మేనన్ మాట్లాడుతూ.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి మిశ్రమ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలన్నారు. వారు ప్రభుత్వం నుంచి ఎరువులకు సంబంధించి ఎటువంటి సబ్సిడీలు పొందటం లేదు. ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతి వల్ల పర్యావరణానికి, సమాజానికి ఎన్నో విధాలుగా ప్రయోజనం ఒనగూడుతున్నది. ఈ పర్యావరణ సేవలకు గుర్తింపుగా ఈ రైతులకు ప్రత్యేక చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉందని మంజుల సూచించారు.ఇది కొత్త భావన కాదని, ఇప్పటికే అనేక దేశాల్లో అమల్లో ఉన్నదేనన్నారు. డీడీఎస్ మాదిరి రసాయన రహిత జీవవైవిధ్య సాగు వల్ల భూసారాన్ని పెంపొందించటం, సాగు నీరు ఆదా అవుతుంది, పోషక విలువలతో కూడిన ఆహారం ప్రజలకు అందుతుంది కాబట్టి ఈ రైతులకు ప్రత్యేక మద్దతు వ్యవస్థను నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల్లో 6% అదనపు నిధులతోనే ఈ మద్దతు వ్యవస్థను అందుబాలోకి తేవచ్చని తమ అధ్యయనంలో వెల్లడైందని మంజుల అన్నారు. రైతులు ఎందుకు నష్టపోవాలి?సీనియర్ పాత్రికేయుడు డాక్టర్ కెవి కూర్మనాధ్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల రైతులకు ఎదురవుతున్న సరికొత్త సమస్యలను పాలకులు గుర్తించకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. కుండపోత వర్షాలు, అకాల వర్షాల వల్ల పత్తి, ధాన్యంలో అధిక మోతాదులో తేమ ఉంటే అందుకు రైతులు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో నిబంధనలు సడలించి రైతులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తెరగటం లేదన్నారు.చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలిరైతు స్వరాజ్య వేదిక నేత కన్నెగంటి రవి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటైన తర్వాత మద్దతు ధర, సేకరణ సదుపాయాల్లేక రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు మరింత దిగజారిందన్నారు. అధిక బ్యాంకు రుణాలు పొందటం కోసం చిరుధాన్యాలు సాగు చేసే రైతులు కూడా తాము పత్తి, వరి వంటి పంటలు సాగు చేస్తున్నామని అధికారులతో చెబుతున్నారని, అందుకే చిరుధాన్యాల వాస్తవ సాగు విస్తీర్ణం కూడా గణాంకాల్లో ప్రతిఫలించటం లేదన్నారు. అత్యంత కాలుష్యానికి కారణమయ్యే ఇథనాల్ పరిశ్రమలు మరో 30 రాష్ట్రంలో రానున్నాయని, వీటికి ముడిసరుకు అందించటం కోసమే ప్రభుత్వం వరి సాగును ప్రత్యేక బోనస్ ప్రకటించి మరీ ప్రోత్సహిస్తున్నదన్నారు. మూడు చిరుధాన్య పంటలకు మద్దతు ధర ప్రకటించినా, జొన్నలను మాత్రమే కోర్టు ఆదేశించినప్పుడే ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేదుకు ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని రవి కోరారు. -
అయోధ్యలో.. తొలి మంచు కురిసింది..
అయోధ్య: రాముడు కొలువైన అయోధ్యలో ఈరోజు(ఆదివారం) శీతాకాలపు తొలి పొగమంచు కనిపించింది. వేడి నుంచి ఉపశమనం లభించడంతో పాటు అయోధ్యవాసులను చలి తాకింది. భక్తులు తొల పొగమంచును ఎంజాయ్ చేస్తున్నారు.అయోధ్యలో తొలి పొగమంచు ప్రభావం రోడ్లపై వెళుతున్న వాహనాలపై పడింది. వాహనాలు నెమ్మదిగా నడుస్తున్నాయి. సరయూ తీరం, రామ్ కీ పైడీ, రాంపథ్.. ఇలా అన్ని చోట్లా పొగమంచు కనిపిస్తోంది. అయోధ్య చేరుకున్న భక్తులు చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది చలికాలం ఆగమనానికి ప్రతీక అని స్థానికులు అంటున్నారు.చలి ప్రవేశంతో అయోధ్యకు వచ్చే భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలుగుతోంది. అయోధ్యలో తొలిసారిగా పొగమంచు కమ్ముకోవడం శుభపరిణామమని భక్తులు భావిస్తున్నారు. కౌశాంబి నుండి అయోధ్యకు వచ్చిన భక్తురాలు రాణి మాట్లాడుతూ అయోధ్యలో పొగమంచు మాత్రమే ఉందని, చలి అంతగా లేదన్నారు. గోరఖ్‌పూర్ నుంచి అయోధ్యకు వచ్చిన నవీన్ అనే భక్తుడు మాట్లాడుతూ అయోధ్యలో కురుస్తున్న పొగమంచు చక్కని అనుభూతిని ఇస్తున్నదన్నారు.ఇది కూడా చదవండి: కార్తీకం స్పెషల్.. దేశంలోని ప్రముఖ శివాలయాలు -
బీహార్‌లోకి ప్రవేశించిన చలి
పట్నా: బీహార్‌లోకి చలి అప్పుడే ప్రవేశించింది. మరో రెండు మూడు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని, ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పులు కనిపించబోవని వాతావరణ శాఖ తెలిపింది. అధిక తేమ కారణంగా రాష్ట్రాంలోని పలు జిల్లాల్లో ఉదయం వేళ పొగమంచు కమ్ముకుంటోంది.రాజధాని పట్నాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దీపావళికి ముందే గాలి నాణ్యత క్షీణించింది. పట్నా వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తుఫాను గాలులు కొనసాగుతున్నాయి. ఫలితంగా బీహార్‌లోని ఈశాన్య ప్రాంతం మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. గాలి దిశ పశ్చిమం వైపు కొనసాగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 20 నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. ఇది కూడా చదవండి: పుష్కర కాలానికి పూచే నీలకురంజి పుష్పం..! -
ఏపీకి అల్పపీడనం ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక
-
హిమాచల్‌లో రెండు డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లాహౌల్ స్పితి జిల్లా కుకుమ్సేరిలో కనిష్ట ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్. గరిష్ట- కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య ఏర్పడిన వ్యత్యాసం పలువురికి అనారోగ్యాలను తెచ్చిపెడుతోంది. పగటిపూట ఎండవేడిమి, సాయంత్రం వీచే చల్లని గాలి వ్యాధులకు కారణంగా నిలుస్తోంది.సిమ్లా వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 17 వరకు వాతావరణం నిర్మలంగా ఉండనుంది. అంటే వర్షం, ఉరుములు, మెరుపులు, వడగళ్ల వాన మొదలైనవి ఉండవు. మరోవైపు కిన్నౌర్ జిల్లా కల్పాలో తేలికపాటి వర్షం నమోదైంది. ధర్మశాలలోని ధౌలాధర్ పర్వతాలపై కూడా తేలికపాటి హిమపాతం కనిపించింది.దీనిని ఈ సీజన్లో మొదటి హిమపాతంగా చెబుతున్నారు. ఎత్తయిన ప్రాంతాల్లో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లాలోని కుకుమ్సేరిలో అత్యల్ప ఉష్ణోగ్రత 2.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉనాలో అత్యధికంగా 35.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సిమ్లాలో 23.8 డిగ్రీలు, కల్పాలో 21.8 డిగ్రీలు, ధర్మశాలలో 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది కూడా చదవండి: ఎయిరిండియా విమానంలో బాంబు? -
తమిళనాడుకు భారీ వర్ష సూచన.. మిగిలిన రాష్ట్రాల్లో..
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.తమిళనాడుతో అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా చెన్నైతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 5-6 రోజులలో దక్షిణ కర్ణాటక, కేరళలోనూ భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్టోబరు 14 నుంచి 16వ తేదీ మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.గడచిన 24 గంటల్లో రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. తూర్పు రాజస్థాన్‌లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షపాతం నమోదైంది. సంచోర్ (జలోర్)లో గరిష్టంగా 25 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఢిల్లీలో మేఘావృతమై గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: దేవర గట్టు కర్రల సమరంలో పారిన నెత్తురు.. 100మందికి పైగా భక్తులకి గాయాలు -
ఆదమరిస్తే మరపు ఖాయం
అల్జైమర్స్ ముప్పు మహిళల్లోనే ఎందుకు ఎక్కువ? క్రమక్రమంగా చాలా విషయాల మరపునకు దారితీసే ‘న్యూరో–డీజనరేటివ్’ వ్యాధి అల్జైమర్స్... మహిళ జ్ఞాపకశక్తి, ఆలోచన, ప్రవర్తనతీరు... ఇలా ఎన్నో అంశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తాము ఉన్న ఇంటి అడ్రస్‌తో సహా క్రమంగా అన్నీ మరచిపోయేలా చేసే ‘అల్జైమర్స్’ ముప్పు మహిళల్లోనే ఎక్కువ.కొన్ని పరిశీలనల ప్రకారం మొత్తం రోగుల్లో మూడింట రెండు వంతులు మహిళలే! ఎందుకిలా జరుగుతోందనే అంశంపై అధ్యయనాలు జరిగినప్పుడు చాలా అంశాలే ఇందుకు కారణమవుతున్నాయని తేలింది. ఉదాహరణకు జన్యుపరమైన, పర్యావరణ, జీవశాస్త్ర సంబంధితమైన పలు అంశాలు ఇందుకు కారణమవుతున్నట్లు గుర్తించారు. అన్నింటికంటే ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత వారిలో వచ్చే హార్మోనల్ మార్పులు ప్రధాన కారణంగా చెబుతున్నారు. కీలకమైన శుభవార్త ఏమిటంటే... దీనివల్ల కలిగే దుష్ప్రభావాల నివారణ చాలావరకు సాధ్యమని నిపుణులు చెబుతున్నారు.మెనోపాజ్ తర్వాత మెదడులో వచ్చే మార్పులు... బ్రెయిన్ ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి పలు ఇమేజింగ్ పరీక్షల తర్వాత తేలిన అంశం ఏమిటంటే... మెనోపాజ్ తర్వాత మహిళల మెదడు పనితీరు, జీవక్రియల్లో మార్పు వస్తుంది. మెదడు పనితీరు తగ్గడంతో పాటు న్యూరాన్ల మధ్య కనెక్షన్లూ తగ్గుతాయి. ఈ న్యూరాన్ కనెక్షన్ల వల్లనే ఆలోచనలూ, విషయాలు జ్ఞప్తికి రావడం, నేర్చుకునే / అభ్యాసన శక్తీ... ఇవన్నీ కలుగుతాయి. మెనోపాజ్ తర్వాత మెదడు జీవక్రియలు (మెటబాలిజమ్) తగ్గడంతో జ్ఞాపకశక్తి తగ్గుతుండటం, ఏదీ ఠక్కున గుర్తుకు రాకపోవడం వంటి అనర్థాలు కనిపిస్తుంటాయి. ఇలా జరగడాన్ని ‘బ్రెయిన్ ఫాగ్’ గా పేర్కొంటారు. మెనోపాజ్ తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అంతేకాదు వీటిని ‘అల్జైమర్స్’ తాలూకు ముందస్తు చిహ్నాలుగా కూడా భావించవచ్చు.మరి మహిళ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమెలా? ఇప్పటవరకూ అల్జైమర్స్‌ను నివారించడానికి నిర్దిష్టమైన చర్యలు లేకపోయినా, జీవనశైలిలో కొన్న మార్పుల ద్వారా (మరీ ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత) ఈ ముప్పును చాలావరకు నివారించవచ్చు. మెనోపాజ్ రాబోయే ముందర హార్మోన్ రీ–ప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ)లో భాగంగా ఈస్ట్రోజెన్ ఇవ్వడం వల్ల అల్జైమర్స్ ముప్పును చాలావరకు తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మెదడుకు మేత కల్పించేలా బాగా చదవడం, రకరకాల పజిల్స్ ఛేదించడం, కొత్త విద్యలు నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాల సాధన, తరచూ పలువురితో కలవడం, మాట్లాడుతుండటం (సోషల్ ఇంటరాక్షన్స్) వంటివి అల్జైమర్స్ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి. ఊ నిత్యం తగినంత శారీరక శ్రమతో, దేహంలో కదలికలతో ఉండేవారిలో అల్జైమర్స్ ముప్పు గణనీయంగా తగ్గుతుంది. అందుకే వేగంగా నడక (బ్రిస్క్ వాకింగ్), ఈత, యోగా వంటి వ్యాయామాలు అల్జైమర్స్ రిస్క్‌ను తగ్గించడమే కాకుండా ఇతరత్రా మొత్తం ఆరోగ్యానికి బాగా దోహదపడతాయి. ఊ ఆహారంలో తగినంతగా ఆకుకూరలు, కూరగాయలు, చేపలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, తాజాపండ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల అవి మెదడు ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. ఊ నిద్రను దూరం చేసే కెఫిన్‌ను పరిమితంగా తీసుకుంటూ మంచి నిద్ర అలవాట్లతో కంటినిండా నిద్రపోవడం అల్జైమర్స్ ముప్పును చాలావరకు తగ్గిస్తుంది. ఊ గుండె ఆరోగ్యం బాగుంటే మెదడు ఆరోగ్యమూ బాగుంటుంది. కీలకమైన ఈ రెండు అవయవాల ఆరోగ్యాలు ఒక దానితో మరొకటి ముడిపడి ఉంటాయి. అందుకే గుండె సంబంధిత (కార్డియో వాస్క్యులార్) సమస్యలైన హైబీపీ, డయాబెటిస్ , అధిక కొలెస్ట్రాల్ వంటి జబ్బులను అదుపులో పెట్టుకోవడం ద్వారా అల్జైమర్స్ ముప్పును చాలావరకు నివారించవచ్చు. మహిళల్లోనే ఎందుకు ఎక్కువంటే... మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్ హార్మోన్ల మోతాదులు మెనోపాజ్ తర్వాత తగ్గిపోతాయి. మెదడు కణాలను, మరీ ముఖ్యంగా న్యూరాన్లకు ఈస్ట్రోజెన్ మంచి రక్షణ కల్పిస్తుంటుంది. అంతేకాదు మెదడు తాలూకు జ్ఞాపకాల సెంటర్‌గా పేర్కొనే హి΄్పోక్యాంపస్కూ ఈస్ట్రోజెన్ రక్షణ ఇస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ దేహానికీ, అందులోని అన్ని అవయవాలకూ ఏజింగ్ ప్రాసెస్ జరుగుతుంటుంది కదా. ఈస్ట్రోజెన్ స్రావాలు అకస్మాత్తుగా తగ్గగానే మెదడు ఏజింగ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అలాగే మెదడులో అమైలాయిడ్స్ అనే పాచివంటి పదార్థాలు పేరుకుపోతుంటాయి. మహిళల్లో అల్జైమర్స్ ఎక్కువగా ఉండటానికి మరో కారణమం ఏమిటంటే... పురుషులతో పోలిస్తే వారు ఎక్కువకాలం జీవిస్తారు. వాళ్ల ఆయుర్దాయం కూడా ఈ ముప్పునకు మరో కారణం. ఇక జన్యుపరమైన కారణాల విషయానికి వస్తే పురుషులతో పోలిస్తే మహిళల్లో ‘ఏపీఓఈ–ఈ4’ అనే జన్యువు ఎక్కువగా ప్రభావం చూపుతుంది. పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే... ఈ జన్యువును కలిగి ఉన్న మహిళల్లో అల్జైమర్స్ ముప్పు పురుషుల కంటే మరింత ఎక్కువ. మామూలుగానైతే వాతావరణంలో వాయుకాలుష్యానికి కారణమయ్యే సస్పెండెడ్ ఎయిర్ పార్టికిల్స్ అనే ధూళి కణాల వల్ల సాధారణంగా శ్వాససంబంధిత వ్యాధులు, ఆస్తమా వంటివి పెరుగుతాయన్నది చాలామందిలో ఉండే అభి్రపాయం. కానీ వాతావరణంలో పెరిగే కొద్దిపాటి కాలుష్యం మెదడుపై ప్రభావం చూపి మతిమరపునకు దారితీయవచ్చు. గాల్లోకి వ్యాపించే కొద్దిపాటి హానికరమైన ధూళికణాలు (టాక్సిక్ పార్టికిల్స్) ఏమాత్రం పెరిగినా అవి మతిమరపు (డిమెన్షియా) వచ్చే అవకాశాలను కనీసం 16 శాతం పెంచుతాయంటున్నారు అధ్యయనవేత్తలు. అలాగే అల్జైమర్స్ ముప్పునూ 11 శాతం వరకు పెంచవచ్చునంటున్నారు. ఈ విషయాలన్నింటినీ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ (యూడబ్ల్యూ) అధ్యయనవేత్తలు గట్టిగా చెబుతున్నారు. నాడీవ్యవస్థకు సంబంధించిన ఇలాంటి రుగ్మతలను నివారించాలంటే వాతావరణంలో వాయువుల నాణ్యత తగ్గకుండా చూసుకోవడం తప్ప మరో దారి లేదంటున్నారు. ‘అడల్ట్ ఛేంజెస్ ఇన్ థాట్ – (యాక్ట్)’ అనే అధ్యయనం కోసం దాదాపు పాతికేళ్లకు పైగానే ‘కైయిసర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ వారు సేకరించిన డేటాపై ఆ మాతృసంస్థతో పాటు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ (యూడబ్ల్యూ) పరిశోధకులు సంయుక్తంగా ఓ అధ్యయనం నిర్వహించారు. వాషింగ్టన్–సియాటెల్ప్రాంతంలోని దాదాపు 4,000 మంది పరిశీలించినప్పుడు వాళ్లలో 1,000 పైగానే డిమెన్షియా రోగులు ఉన్నట్లు తేలింది. గాలిలోని హానికరమైన ధూళులు మతిమరపునకు కారణమయ్యే డిమెన్షియా, అల్జైమర్స్ జబ్బులు పెరుగుతాయని నిర్ద్వంద్వంగా తేలింది. అధ్యయనం నిర్వహించిన వారిలో నాలుగింట ఒక వంతు మందికి (దాదాపు 25›శాతం మందిలో) డిమెన్షియా ఉండటంతో ఇది కొంత ఆందోళన కలిగించే అంశంగా పరిశోధకులు పేర్కొంటున్నారు. గాల్లోని అత్యంత సూక్ష్మమైన ధూళికణాలను ‘ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్’ అంటారు. (ఈ ధూళికణాలు ఎంత చిన్నవంటే వీటి సైజు 2.5 మైక్రోమీటర్స్ మాత్రమే. ఒక పోలిక చె΄్పాలంటే వెంట్రుకను నిలువునా 30 భాగాలు చేస్తే అందులో ఒక భాగం ఎంత సైజుంటుందో ఈ ధూళికణాల సైజు అంత ఉంటుంది). కారు ఎగ్జాస్ట్ నుంచి వెలువడే పోగ, భవన నిర్మాణ ప్రదేశాలు, మంటలూ, పోగలు ధారాళంగా వెలువడే ప్రదేశాలు... ఇలాంటిప్రాంతాలనుంచి వెలువడే ఈ ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ వల్లనే వాతావరణం బాగా కలుషితమైపోయి డిమెన్షియా, అల్జైమర్స్ వంటి నాడీ సంబంధ వ్యాధుల ముప్పు పెరుగుతోందంటున్నారు అధ్యయనవేత్తలు. ఈ అంశాలన్నీ ఇటీవలే ‘ద జర్నల్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ప్రాస్పెక్టివ్స్’లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనంతో... గాల్లోని కాలుష్యపదార్థాలను, ప్రమాదకరమైన ధూళికణాలను తగ్గిస్తే అటు శ్వాసకోశ వ్యాధులైన ఆస్తమా వంటివి వాటి నుంచి విముక్తి కలగడమే కాకుండా... ఇటు నాడీ వ్యవస్థకు సంబంధించిన మతిమరపూ, అల్జైమర్స్ వంటి సమస్యలూ తగ్గుతాయని స్పష్టమవుతోంది.∙ -
హిమాచల్‌లో అకాల ఎండలు.. 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
సిమ్లా: గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లో వాతావరణం వేడిగా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మే, జూన్ నాటి వేసవి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రుతుపవనాల నిష్క్రమణతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా వేడిగా మారింది. దీంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు.మరికొద్ది రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిజానికి హిమాచల్ ప్రదేశ్‌లో సెప్టెంబర్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈనెల 15 తర్వాత హిమాచల్‌లో రెండు రోజుల పాటు వాతావరణం చల్లగా మారింది. మనాలి, కిన్నౌర్, లాహౌల్ స్పితి తదితర ప్రాంతాల్లోని పర్వతాలపై మంచు కురిసింది. అయితే గడచిన కొద్దిరోజులుగా వర్షాలు తగ్గి, ఉష్ణోగ్రతలు పెరిగాయి. సిమ్లా, మనాలిలో ప్రస్తుతం ఏర్పడిన ఉష్ణోగ్రతలు పదేళ్ల రికార్డును బద్దలు కొట్టాయి.సిమ్లా వాతావరణ కేంద్రం విడుదల చేసిన డేటాలోని వివరాల ప్రకారం ఈ నెల 23, 24 తేదీల్లో సిమ్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా నమోదైంది. ఇది గడచిన పదేళ్లలో అత్యధికం. 1994లో సెప్టెంబర్ 30న సిమ్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెంట్రీగ్రేడ్గా నమోదయ్యింది. అదేవిధంగా మనాలిలో కూడా సెప్టెంబర్ నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ సెప్టెంబర్ 23న 27.7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.మరోవైపు సెప్టెంబర్ నెలలో కాంగ్రాలో ఆల్ టైమ్ ఉష్ణోగ్రతల రికార్డు బద్దలైంది. ఈ నెలలో ఇక్కడి ఉష్ణోగ్రత ఎప్పుడూ 35 డిగ్రీలకు చేరుకోలేదు. అయితే తాజాగా సెప్టెంబర్ 24న ఇక్కడ 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యంత వేడిగా ఉండే హిమాచల్ జిల్లాలోనూ పరిస్థితి ఇలానే ఉంది. సెప్టెంబర్‌లో ఉనాలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ధర్మశాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 10 ఏళ్ల క్రితం ఇక్కడ అత్యధికంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఇది కూడా చదవండి: నదీ జలాల భాగస్వామ్యంపై భారత్‌తో బంగ్లా చర్చలు -
దేశంలోని పలు రాష్ట్రాలకు భారీవర్ష సూచన
న్యూఢిల్లీ: దేశంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుండి పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు(గురువారం) కూడా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పూర్వాంచల్, పశ్చిమ యూపీలో భారీ వర్షాలకు కురవనున్నాయనే హెచ్చరికలు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, సెప్టెంబర్ 17 వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణశాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. కిన్నౌర్, సిర్మౌర్, సోలన్, సిమ్లా, బిలాస్పూర్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని రోజులు వర్షం కొనసాగుతుందిరాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో మరికొన్ని రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. జైపూర్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్ మీదుగా ఉంది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్ వైపు వాయువ్య దిశలో కదులుతుందనే అంచనాలున్నాయి.ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అడపాదడపా చినుకులు పడుతున్నాయి. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు బీహార్‌లో రుతుపవనాలు మరోసారి చురుగ్గా ఉంటాయని అంచనా. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడి, అది వాయువ్య దిశగా పయనిస్తోంది. ఇది బెంగాల్ తీర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి బీహార్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: నల్లమలలో పక్షుల కిలకిల -
మరో అల్పపీడనం.. మూడు రోజులు భారీ వర్షాలు
-
అలర్ట్‌లకు అర్థం తెలుసా?
రోజూ చూస్తూనే ఉన్నాం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అని.. ఇంతకీ వాటి అర్థం ఏంటో మీకు తెలుసా? పదండి తెలుసుకుందాం. గ్రీన్ అలర్ట్ఏదైనా ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో 6.4 సెం.మీ. కన్నా తక్కువ వర్షం కురిసే అవకాశం ఉంటే వాతావరణ అధికారులు ఈ అలర్ట్ జారీ చేస్తారు. వాతావరణ పరిస్థితుల్లో రాబోయే మార్పుల గురించి గ్రీన్ అలర్ట్ తెలియజేస్తుంది. అయితే ఈ అలర్ట్ కింద ప్రజలకు ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉండదు.ఎల్లో అలర్ట్ఒక నిరీ్ణత ప్రదేశంలో 6.45 సెం.మీ. నుంచి 11.55 సెం.మీ. మధ్య వర్షం కురిసే అవకాశం ఉందన్న అంచనాతో దీన్ని జారీ చేస్తారు. ఈ అలర్ట్ జారీ చేశారంటే ప్రస్తుత వాతావరణం కాస్త ప్రతికూలంగా మారుతుందని అర్థం. 30–40 కి.మీ. వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటే ఎల్లో అలర్ట్ ఇస్తారు. అంటే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలని అధికార యంత్రాంగానికి సూచిస్తారు.ఆరెంజ్ అలర్ట్24 గంటల వ్యవధిలో 11.56 సెం.మీ. నుంచి 20.44 సెం.మీ. మధ్య వర్షం కురవొచ్చన్న అంచనాతో ఆరెంజ్అలర్ట్ను ఐఎండీ జారీ చేస్తుంది. 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తూ తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఈ అలర్ట్‌ను విడుదల చేస్తుంది. ఆరెంజ్ అలర్ట్ జారీ అయిందంటే రవాణా సరీ్వసులపై ప్రతికూల వాతావరణం ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అర్థం.రెడ్ అలర్ట్24 గంటల వ్యవధిలో ఒక ప్రాంతంలో 20.45 సెం.మీ.కుపైగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులను రెడ్ అలర్ట్ సూచిస్తుంది. రవాణా, విద్యుత్ సేవలకు అవాంతరాలు ఎదురవడంతోపాటు ప్రాణనష్టం కూడా సంభవించే అవకాశం ఉన్నప్పుడు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. రెడ్ అలర్ట్ ఇస్తే.. విపత్తు నిర్వహణ దళాలు, పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. గరిష్టంగా ఐదు రోజులపాటు ఆయా అలర్ట్‌లకు సంబంధించిన హెచ్చరికలు అమల్లో ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
గుజరాత్లో వర్ష బీభత్సం
భారీ వర్షాలు గుజారాత్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని గిర్ సోమనాథ్, అమ్రేలి, ఖేడా, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, మహిసాగర్, భరూచ్, నర్మద, సూరత్, ఛోటా ఉదేపూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వరద బాధిత ప్రాంతాల్లో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరద నీటిలో చిక్కుకున్న సుమారు 300 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆగస్టు 28న సౌరాష్ట్రలోని కచ్, జామ్‌నగర్, రాజ్‌కోట్, దేవభూమి ద్వారక, జునాగఢ్ పోర్బందర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. Gujarat Rain: Sardar Sarovar Dam Water Level Rises, all the Gates Opened; Coastal Villages on High Alert…Whereas Vadodara city & district is on high alert because Ajwa Lake and Vishwamitri River crossed danger mark, causing widespread flooding in the city. pic.twitter.com/6zHM5T5428— ~ Mr_Perfect ~ (@HadkulaTiger1) August 26, 2024 -
12 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో భారత వాతావరణశాఖ పలు అంచనాలను వెల్లడించింది. రాజధాని ఢిల్లీలో శనివారం (ఆగస్టు 24) ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది.గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, అస్సాం, మేఘాలయ, గోవా, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని 12 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.వాతావరణశాఖ అందించిన డేటా ప్రకారం ఈ సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు నెలలో అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇక్కడ 269.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత దశాబ్దంలోనే అత్యధికం. ఆగస్టు 23 వరకు, ఢిల్లీలో 274 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది ఆగస్టు 2014 లో నమోదైన గరిష్ట వర్షపాతం కంటే అత్యధికం.ఆగస్టు 25న గుజరాత్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అస్సాం, మేఘాలయ, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. -
ఢిల్లీ: భారీ వర్షంతో మొదలైన వీకెండ్..
దేశరాజధాని ఢిల్లీలో భారీవర్షాలతో వారాంతం మొదలయ్యింది. గురువారం ఆకాశం మేఘావృతమైనప్పటికీ అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే కురిశాయి. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షం ఢిల్లీ-ఎన్సీఆర్లోని జనానికి ఊరటనిచ్చింది. వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో జనం అవస్థలు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా రాజోరీ గార్డెన్, ఠాగూర్ గార్డెన్, తిలక్ నగర్, సుభాష్ నగర్, వికాస్పురి, ఠాగూర్ గార్డెన్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి రోడ్డపై నీరు నిలిచింది. వాక్‌వే స్టాండ్ లెవల్ వరకు నీరు నిండిపోవడంతో వాహనాలు నిదానంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆగస్టు 15 వరకు ఢిల్లీలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీలో మరికొన్ని రోజుల పాటు చినుకులు పడే అవకాశం ఉంది. 10, 11 తేదీలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఔటర్ ఢిల్లీలోని ప్రేమ్ నగర్లో శుక్రవారం సాయంత్రం చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రేమ్ నగర్ పరిధిలోని రాణి ఖేడా గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు చెరువు వద్దకు వెళ్లారు. వారిలో ఇద్దరు చిన్నారులు నీటి లోతుల్లోకి వెళ్లిన కారణంగా మృతి చెందారు. -
తప్పుతున్న వాతావరణశాఖ అంచనాలు
ఒకవైపు వనరుల కొరత.. మరోవైపు అంచనాలలో లోపం.. ఇంకోవైపు ప్రకృతిలో మారుతున్న తీరుతెన్నులు.. ఇవన్నీ వాతావరణ శాఖ అధికారులను ఇబ్బందులకు గురిచేసి, రుతుపవనాలను సరిగ్గా అంచనావేయలేకపోయేలా చేస్తున్నాయా? ఈ సీజన్‌కు సంబంధించిన అంచనాల్లో అప్పుడప్పుడూ పొరపాట్లు తొణికిసలాడటం దీనికి ఉదాహరణగా నిలిచించిందా?వాతావరణశాఖ ఇటీవలి కాలంలో జారీచేసిన అలర్ట్‌లు అంచనాలకు విరుద్ధంగా ఉంటున్నాయి. దీంతో జనం వాతావరణశాఖపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ శాఖపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడుతున్నదనే వాదన వినిపిస్తోంది. జూన్ 28న దేశరాజధాని ఢిల్లీలో రుతుపవనాలు ప్రవేశించిన రోజున రికార్డుస్థాయి వర్షపాతం కురుస్తుందని వాతావరణశాఖ ముందుగా ప్రకటించింది. అయితే ఆ తరువాత ఆశాఖ అధికారులు వర్షపాతం అంచనాలు మార్చారు. ఇదేవిధంగా కొన్నిసార్లు గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసి, వాటిని తిరిగి మారుస్తున్న సందర్భాలున్నాయి.వాతావరణ శాఖ విడుదల చేసిన రుతుపవనాల అంచనాలు మునుపటి కంటే తక్కువ ఖచ్చితత్వంతో ఉన్నాయని గత గణాంకాలను చూస్తే స్పష్టమవుతుంది. 2011 నుండి 2024 వరకు అంటే గత 14 ఏళ్లలో రుతుపవనాల అంచనాలు 96 శాతం ఖచ్చితమైనవనిగా రుజువు చేసిన ఏకైక సంవత్సరం 2022. మిగిలిన ఏళ్లలో ఇది 77 శాతం వరకూ నిజమయ్యింది. రుతుపవనాల ట్రెండ్‌లో మార్పు కారణంగా ఒకే నగరంలో రెండు విభిన్న పోకడలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, కొన్ని చోట్ల తేలికపాటి వర్షం పడుతోంది.వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా భారతదేశంలాంటి ఉష్ణమండల ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. హిమాలయ పర్వతాలు ఆసియాలోని చల్లని గాలిని ఉత్తర భారతదేశ మైదానాలకు చేరుకోకుండా నిరోధిస్తాయి. రుతుపవనాలను కూడా ఆపుతాయి. ఇవి దేశానికి వర్షాలను తీసుకువస్తాయి. అయితే కొత్త మోడల్స్, రాడార్, రెయిన్ గేజ్‌ల సహాయంతో భవిష్యత్తులో వర్షాలు, రుతుపవనాల అంచనాలను మరింత ఖచ్చితంగా తెలుసుకునేందుకు వాతావరణశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. -
Weather Update: 9 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత వాతావరణశాఖ (ఐఎండీ) ఈరోజు (మంగళవారం) తొమ్మిది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. సోమవారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది.మరో ఐదు రోజుల పాటు ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనావేసింది. ఈరోజు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చని తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (మంగళవారం)9 రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఉన్నాయి. దీంతో పాటు జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. -
అలర్ట్: యూపీలో భారీవర్షాలు.. ఉత్తరాఖండ్‌కు కొండచరియల ముప్పు
దేశంలోని పలుప్రాంతాల్లో రుతుపవనాలు జోరందుకున్నాయి. అయితే ఢిల్లీలోకి రుతుపవనాలు ప్రవేశించి, 20 రోజులకు పైగా సమయం గడిచినా గత కొద్ది రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు లేవు. ఊహించని విధంగా ఎండలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఇక్కడికి పక్కనే ఉన్న తూర్పు యూపీలో ప్రతిరోజూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండబోతున్నదనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు (శనివారం) చినుకులు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా ఉండవచ్చు. శుక్రవారం నాటి ఉష్ణోగ్రత కంటే ఈరోజు రాజధానిలో ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదుకానున్నదని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్‌లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. తూర్పు, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఈరోజు కూడా వర్షం పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఉత్తరాఖండ్‌లో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ వారాంతంలోగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే నాలుగైదు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లోని పోర్బందర్ ప్రాంతమంతా జలమయమైంది. జూలై 22 వరకు గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. -
కుమ్మేస్తున్న వర్షాలు.. మహారాష్ట్ర, గోవాలకు రెడ్ అలర్ట్
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెంట్రల్ మహారాష్ట్ర, కొంకణ్, గోవాలోని పలు ప్రాంతాల్లో సోమ(నేడు), మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. కర్ణాటక, కేరళలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు దేశంలో చురుకుగా మారే అవకాశం ఉంది.మహారాష్ట్రలోని మరఠ్వాడా, విదర్భ ప్రాంతాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ, దక్షిణ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర కర్ణాటక, కోస్తాంధ్రలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. లక్షద్వీప్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది.గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, అండమాన్, నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడులలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని పలు గ్రామాలు వరదల బారిన పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. -
వర్షం రాకను ముందే పసిగడుతున్న బీటెక్ స్టూడెంట్
ఇంటి డాబానే అతడికి ప్రయోగశాల.. ఆకాశంలో కమ్ముకున్న మేఘాలే అతడికి స్నేహితులు.. ఆ మేఘాలే అతడితో ముచ్చటిస్తాయి.. మబ్బులతోనే అతడు సావాసం చేస్తాడు.. వాటి యోగ క్షేమాలు తెలుసుకుంటాడు.. మబ్బుల ఆకారాలను చూసి మురిసిపోతాడు.. చిన్నప్పటి నుంచి అవే తన నేస్తాలు. అందుకే ఇప్పుడు తెలంగాణ మొత్తానికీ నేస్తమయ్యాడు. అందరి ఇళ్లల్లో, మనసుల్లో చోటు సంపాదించుకున్నాడు. ఇంతకీ అతడెవరా అనుకుంటున్నారా? అతడే తెలంగాణ వెదర్ మ్యాన్‌గా పేరు గాంచిన బాలాజీ తరిణి. రుములు వస్తే చాలు ఇంట్లోకి వెళ్లి అమ్మ కొంగు చాటుకో.. నాన్న ఒడిలోకో జారుకుంటాం. కానీ బాలాజీ మాత్రం ఎంతో ఆసక్తిగా చూసేవాడు. అలా వాటిని చూస్తూనే బాల్యం గడిచిపోయింది. అయితే కరోనా సమయంలో మాత్రం తన ఆలోచనలకు పదును పెట్టాడు. ఆకాశం, మబ్బులు వర్షంపై తనకున్న ఆసక్తి కాస్తా మారింది.. నలుగురికీ సాయపడాలనే ఆలోచన తన మదిలో అంకురించింది. ఆ ఆలోచనలే తనను వెదర్‌మ్యాన్‌గా మలిచిందని చెబుతారు బాలాజీ.ఎలా అంచనా వేస్తాడుతనకున్న పరిజ్ఞానంతో ఎలాంటి మేఘాలు ఏర్పడ్డాయి.. ఏ మేఘాలు ఏర్పడితే ఎలాంటి వాతావరణం ఉంటుందనే అంచనా వేస్తాడు. వర్షం మోస్తరుగా వస్తుందా..? భారీగా వస్తుందా.. అనేది కూడా మేఘాల కదలికలను బట్టే చెప్పేస్తాడు. ఇలా గ్రౌండ్ విశ్లేషణ చేసిన తర్వాత.. శాటిలైట్ చిత్రాలు, మ్యాప్స్, వాతావరణ సంస్థలు, న్యూమరికల్ వెదర్ మోడల్స్ ద్వారా మోడల్ అనాలిసిస్ ద్వారా మరో అంచనాకు వస్తాడు. ఈ రెండింటినీ బేరీజు వేసుకుని వాతావరణం ఎలా ఉంటుందనే దాన్ని అంచనా వేస్తాడు. అత్యంత కచి్చతత్వంతో.. ˘వాతావరణాన్ని అంచనా వేయడం అంత సులువు కాదు. వెనకటి రోజుల్లో రైతులు మబ్బుల కదలికలను బట్టి వాతావరణాన్ని అంచనా వేసేవారు. కానీ ఇప్పుడు గ్లోబల్ వారి్మంగ్ వంటి కారణాలతో ఎప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో కూడా అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా అత్యంత కచ్చితత్వంతో వాతావరణాన్ని అంచనా వేస్తున్నాడు. ట్విట్టర్ (ఎక్స్) పేజీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ ఇస్తున్నాడు.సరదాలు సరదాలే..వాతావరణం అంచనా వేయడం తనకో హాబీ అని, చదువులు, సరదాల కోసం కూడా టైం కేటాయిస్తానని చెప్పుకొచ్చాడు. అయితే కొన్ని సార్లు తన ఫాలోవర్లకు సమాచారం అందించడం కోసం సరదాలు కూడా పక్కన పెడతానని వివరించారు. ఇక, ఇంజినీరింగ్ అయిపోయాక గేట్, ఏఈ, ఏఈఈ వంటి వాటిపై దృష్టి సారిస్తూనే వాతావరణాన్ని హాబీగా కొనసాగిస్తానని పేర్కొన్నాడు. అయితే అప్పుడప్పుడూ కొందరు విమర్శలు చేస్తారని, వారి కామెంట్స్‌ను పట్టించుకోకుండా ముందుకు వెళ్తానని చెప్పాడు. ఎక్కువ మంది తన అంచనాలను నమ్మి, ప్రోత్సహిస్తుంటే కొందరి విమర్శలను మనసుకు తీసుకుని బాధపడటం సరికాదని పేర్కొన్నాడు.వారి ప్రోత్సాహంతో... జేఎన్టీయూ హైదరాబాద్‌లో సివిల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న బాలాజీకి.. వాతావరణాన్ని అంచనా వేయడంలో రజినీ, వెదర్బ్రదర్ వంటి వారి ప్రోత్సాహం, సహకారంతో నైపుణ్యం సాధించానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ట్విట్టర్లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్ట్రాగామ్‌లో 35 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. వారందరికీ కచి్చతమైన సమాచారం అందిస్తే చాలా సంతృప్తిగా ఉంటుందని చెప్పాడు. -
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం నెమ్మదిగా బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.అదే రోజున అల్పపీడనం ఏపీ తీరాన్ని తాకనుంది. దీని ప్రభావంతో 26వ తేదీ సాయంత్రం నుంచి రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ముసురు వాతావరణం ఏర్పడనుంది. బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాలోలతో పాటు కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 27, 28 తేదీల్లో అనేక చోట్ల విస్తారంగా వానలు కురుస్తాయని వెల్లడించారు. -
నిరాశపరచనున్న నైరుతి రుతు పవనాలు.. సాధారణ వర్షపాతం
-
హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోత వాన
-
ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
దేశ రాజధాని ఢిల్లీలో వడగాడ్పులు వీస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనికిముందు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పుడు ఎండ తీవ్రత మరింత పెరిగిన నేపధ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనికితోడు మరో రెండు రోజుల వరకు ఢిల్లీలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించే అవకాశం లేదని వాతావరణశాఖ పేర్కొంది.ఆదివారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా 44.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్లో సగటు కంటే 5.7 డిగ్రీలు ఎక్కువ. నగరంలో వరుసగా ఎనిమిదో రోజు వడగాడ్పులు వీచాయి. వరుసగా 35వ రోజు గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే అధికంగా నమోదైంది. మధ్యాహ్నం సమయంలో ఎండలో బయటకు వెళితే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం పూట ఇంట్లోనే ఉంటూ నీరు తాగుతూ ఉండాలని సూచించింది.జూన్ 11 నుంచి రుతుపవనాలు ముందుకు సాగడం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా, దేశంలోని మధ్య, ఉత్తర ప్రాంతాలలో వేడివాతావరణం కొనసాగుతున్నదని పేర్కొంది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 27-30 మధ్య ఢిల్లీకి చేరుకుంటాయి. ఈసారి కూడా రుతుపవనాలు అదే సమయానికి ఢిల్లీకి తరలివచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. -
దక్షిణాదిన వానలు.. ఉత్తరాదిన ఎండలు
దేశంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తరాదిన ఎండలు మండిపోతుంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడు పలకరించడంతో తెలుగు రాష్ట్రాల్లో వెదర్ కాస్త చల్లబడింది. మొన్నటి వరకూ దేశవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు ఠారెత్తించాయి. అయితే రుతుపవనాలు పలకరించాక, వాతావరణం మారింది. ఉత్తరాదిన భానుడి భగభగలు కొనసాగుతుంటే.. దక్షిణాదిన మాత్రం వర్షాలు పడుతున్నాయి. వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.మరో మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు తెలంగాణలోనూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది ఐఎండీ.వర్షాలతో దక్షిణాది చల్లబడినా.. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. భానుడి భగభగలు సెగలు పుట్టిస్తున్నాయి. వేడి గాలులు వీస్తున్నాయి. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజధాని ఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ దాటింది. రానున్న రోజుల్లో ఇది 47 డిగ్రీలకు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఎల్లో అలర్ట్ ఇష్యూ చేసింది.హీట్‌వేవ్, నీటి సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న దేశ రాజధానిపై మరో పిడుగు పడింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీగా విద్యుత్ కోతలను ఎదుర్కొంటోంది. ఉత్తర్‌ప్రదేశ్ మండోలాలోని పవర్ గ్రిడ్‌లో అగ్నిప్రమాదం జరగడంతో ఢిల్లీ వాసులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. నగరానికి ఈ గ్రిడ్ నుంచి 1500 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ సరఫరా అవుతుంది. మొత్తంగా ఉత్తరాది ప్రజలు ఇటు ఉష్ణోగ్రతలు, అటు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు
-
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్‌లో అలర్ట్
హైదరాబాద్, సాక్షి: ఉత్తర తెలంగాణ నుంచి నిజామాబాద్ దాకా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో.. తెలంగాణ అంతటా నేడు(మంగళవారం) భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షపాతం నమోదు కానుంది. సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు రాజధాని హైదరాబాద్ నగరానికి కూడా భారీ వర్ష సూచన ఉండడంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసరం అయితే బయటకు రావాలని నగర పౌరులకు సూచిస్తున్నారు. మరోవైపు ఆఫీసులకు వెళ్లేవాళ్లు వాతావరణ పరిస్థితుల్ని బట్టి నడుచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. -
హైదరాబాద్ లో భారీ వర్షం
-
మండుతున్న భూగోళం...
-
ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
-
ఢిల్లీలో మారిన వాతావరణం... ఉన్నట్టుండి వర్షం
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారింది. నోయిడా-ఘజియాబాద్‌లో ఉన్నట్టుండి వర్షం కురిసింది. బలమైన గాలులతో పాటు ఢిల్లీ ఎన్సీఆర్లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల చినుకులు పడ్డాయి.గత కొన్నాళ్లుగా ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షంతో కొంత ఉపశమనం లభించింది. కాగా ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో నేడు (గురువారం) పగటిపూట తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సమయంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఇది ఉష్ణోగ్రతను తగ్గిస్తుందని పేర్కొంది. వర్షాలు కురవనున్న నేపధ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఢిల్లీ-ఎన్సీఆర్లో గంటకు 25 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన చినుకులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గత రాత్రి 12 గంటల తర్వాత ఎన్సీఆర్లో బలమైన గాలులు వీచాయి. హాపూర్‌లోని సింబావోలిలో ఎనిమిది గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
వర్షం బీభత్సం.. నిలిచిపోయిన ట్రాఫిక్
-
ఫ్లాష్ ఫ్లాష్ తెలంగాణ ఎలో అలెర్
-
12 రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వడగాలులు
దేశంలోని ఉత్తరాదిన ఎండలు దంచికొడుతున్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో పంజాబ్, హర్యానాతో సహా వాయువ్య, మధ్య , తూర్పు భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉన్నదని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది.పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్ , ఒడిశాలోని కొన్ని చోట్ల నేడు (సోమవారం) కూడా వడగాలులు కొనసాగవచ్చని ఐఎండీ పేర్కొంది. గడచిన 24 గంటల్లో ఈ రాష్ట్రాలతో పాటు జార్ఖండ్‌లో కూడా తీవ్రమైన వడగాలులు వీచాయి. రానున్న మూడు రోజుల్లో ఉత్తర భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రత రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.మరోవైపు వేసవి పరిస్థితులను, రుతుపవనాలను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రులు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ఫైర్ ఆడిట్, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్లను క్రమం తప్పకుండా నిర్వహించాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని ప్రధానికి అధికారులు ఈ సమావేశంలో వివరించారు.ఉత్తర భారతంలోని ప్రజలు వేడిగాలులకు చెమటలు కక్కుతుండగా, దక్షిణాదినగల కేరళ భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే 11-20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది.అసోంలో వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి. 10 జిల్లాల్లో ఆరు లక్షల మందికి పైగా ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలను ఖాళీ చేయించిన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కోపిలి, బరాక్, కుషియార నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. -
భిన్న సంస్కృతుల ‘ప్రశాంతి’ నిలయం
సాక్షి, పుట్టపర్తి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి భిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. ఇతర రాష్ట్రాలు, పలు దేశాల నుంచి భగవాన్ శ్రీసత్యసాయి బాబా భక్తులు వస్తుండటంతో దశాబ్దాల కాలంగా ఇతర రాష్ట్రాల పండుగలు ప్రశాంతి నిలయంలో నిర్వహించడం ఆనవాయితీగా మారింది. కుల, మతాలకు అతీతంగా అన్ని పండుగలు చేస్తుంటారు. ఏటా గుజరాత్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల అవతరణ దినోత్సవాలు, ఆయా రాష్ట్రాల ప్రధాన పండుగలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా ఏదో ఒక రాష్ట్రం నుంచి భక్తులు పర్తియాత్రగా పుట్టపర్తి వస్తున్నారు.అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను పుట్టపర్తిలో ప్రదర్శిస్తున్నారు. పుట్టపర్తి వంటకాలు, వస్త్రధారణకు విదేశీయులు సైతం ముగ్దులు కావడం విశేషం. ఇతర రాష్ట్రాల, దేశాల భక్తులు సైతం స్థానికులతో సులువుగా కలసిపోతున్నారు. ఫలితంగా దేశ, విదేశీ భాషలను స్థానికులు సులువుగా మాట్లాడగలుగుతున్నారు. చదువు రాని వారు సైతం ఆ భాషలను నేర్చుకుంటున్నారు.విదేశాల నుంచి వచ్చే భక్తులు అక్కడి సంప్రదాయం వదిలి.. తెలుగు డ్రెస్ కోడ్‌ను ఇష్టపడుతున్నారు. మహిళలు చీరకట్టులో, పురుషులు పంచెకట్టులో కనిపిస్తున్నారు. సుమారు 150 దేశాల నుంచి భక్తులు పుట్టపర్తికి వస్తుంటారు. వీరిలో చాలామంది భారతీయ జీవనశైలికి అలవాటు పడుతున్నారు. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.మనకు గర్వకారణంమేము తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం. దశాబ్దాల కాలం నుంచి విదేశీయులను చూస్తున్నాం. మన సంప్రదాయాలను వారు ఆచరిస్తుండటం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. పాశ్చాత్య దేశస్తులు మన దుస్తులను ఇష్టపడుతున్నారు. ఇక్కడి వంటకాలు అందరినీ ఆకర్షిస్తాయి. – బాల దండపాణి, పుట్టపర్తిసంప్రదాయాల కేంద్రం పలు దేశాల నుంచి భక్తి భావంతో పుట్టపర్తికి వస్తుంటారు. ఇక్కడి ప్రజల సహకారం బాగుంటుంది. మన సంస్కృతీ సంప్రదాయాలను విదేశీయులు పాటిస్తారు. దేశ, విదేశ భేదాలు లేకుండా పరస్పర సహకారంతో మెలుగుతుంటారు. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన పుట్టపర్తి.. సంప్రదాయాలకూ కేంద్రంగా ఉందని చెప్పొచ్చు. – ఆర్జే రత్నాకర్రాజు, మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు -
నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
-
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌మెట్, బోడుప్పల్, తార్నాక, సికింద్రాబాద్, నాచారం, హబ్సిగూడలో వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.వనస్థలిపురంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. గణేష్ దేవాలయం ప్రాంగణంలోని భారీ మర్రి చెట్టు రోడ్డుపై పడటం తో పలు కార్లు ధ్వంసం అయ్యాయి. భారీ ఈదురు గాలులకు పలు కాలనీలు, పార్క్‌ల్లో చెట్లు విరిగిపడ్డాయి. డీఆర్ఎఫ్ బృందం, జీహెచ్ఎంసీ సిబ్బంది చెట్లను తొలగిస్తున్నారు.


