జలదిగ్బంధంలో ఢిల్లీ.. ప్రమాద స్థాయికి ‘యమున’ | Delhi NCR Rains Waterlogging in Several Areas | Sakshi
Sakshi News home page

జలదిగ్బంధంలో ఢిల్లీ.. ప్రమాద స్థాయికి ‘యమున’

Aug 14 2025 12:55 PM | Updated on Aug 14 2025 1:07 PM

Delhi NCR Rains Waterlogging in Several Areas

న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంతోపాటు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో నేటి (గురువారం) ఉదయం నుండి ఎడతెరిపిలేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి.
 

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన తాజాగా  రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. ఢిల్లీ, నోయిడా,  గురుగ్రామ్‌లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. రోడ్లు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం  ఏర్పడింది.

ఆగస్టు 17 వరకు ఈ ప్రాంతంలో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. మరింత అంచనా వేసింది. ఢిల్లీలోని యమునా నది నీటి మట్టం పాత రైల్వే వంతెన వద్ద 204.43 మీటర్లకు చేరుకుంది.

అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వర్షం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 23.6 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. ఇది సాధారణం కంటే 3.2 డిగ్రీలు తక్కువ. సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రత దాదాపు 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని ఐఎండీ తెలిపింది.

వర్షం కారణంగా రింగ్ రోడ్, దక్షిణ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు ఢిల్లీని కలిపే అనేక ప్రధాన మార్గాలతో సహా అనేక ప్రాంతాలలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

సుబ్రోతో పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు, ద్వారకా సెక్టార్-20, గురుగ్రామ్‌లోని బసాయి రోడ్డు, ఘజియాబాద్, నోయిడాలోని కొన్ని ప్రాంతాలలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తూర్పు ఢిల్లీలోని పాండవ్ నగర్ అండర్‌పాస్‌లో నీరు నిలిచిపోయింది.  ప్రజలు దాని గుండా వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement