గోవాలో చిల్‌ అవుతున్న సారా.. చేతిలో బీర్‌ బాటిల్‌.. | Sara Tendulkar Goa video goes viral on Social Media | Sakshi
Sakshi News home page

గోవాలో చిల్‌ అవుతున్న సారా.. చేతిలో బీర్‌ బాటిల్‌..

Jan 1 2026 8:02 AM | Updated on Jan 1 2026 8:50 AM

Sara Tendulkar Goa video goes viral on Social Media

భారత క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar) కుమార్తె సారా టెండూల్కర్‌ (Sara Tendulkar) ప్రస్తుతం గోవా వెకేషన్‌లో ఉన్నారు. గోవా ట్రిప్‌లో సారా.. ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

గోవాలో పబ్లిక్‌గా బీరు బాటిల్‌తో సారా కనిపించడం విమర్శలకు దారి తీసింది. సోషల్‌ మీడియాలో వీడియో ప్రకారం.. సారా టెండుల్కర్‌ తన ఫ్రెండ్స్‌తో గోవా వీధుల్లో వెళ్తున్నారు అటుగా వెళ్తున్న ఓ బైకర్‌.. వారికి వీడియో తీశారు. అయితే, ఆ సమయంలో సారా చేతుల్లో బీర్‌ బాటిల్‌ ఉండటం గమనార్హం. దీంతో సారా టెండూల్కర్ బీర్ తాగుతుంది అంటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది.

ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. తండ్రి ఆదర్శాలకు విరుద్ధంగా కూతురి ప్రవర్తన ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం సారాకు మద్దతు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ కాలంలో మందు తాగడం చాలా కామన్ గురూ అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఓ నెటిజన్‌ మాత్రం.. ఎంజాయ్‌ చేయాలి బ్రో అంటూ సెటైరికల్‌ వ్యాఖ్యలు చేశారు. ఇక మరి కొంతమంది తాగడం అవసరమా అని నెగిటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు.  అయితే, సచిన్ మాత్రం ‘తాను ఎప్పుడూ మద్యం, పొగాకు ఉత్పత్తులను ప్రచారం చేయనని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.  

ఇక, సారా టెండుల్కర్‌ హీరోయిన్‌కు మించిన అందం అభినయంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తాను పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తాయి. ఆమె నిత్యం ఏదో ఒక ఫోటోను, వీడియోను సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement