లండన్‌ వీధుల్లో గోరియాదేవి సమోసాలు, ఫన్నీవీడియో వైరల్‌ | Bihari Samosa Desi Style Goes Viral In London | Sakshi
Sakshi News home page

లండన్‌ వీధుల్లో గోరియాదేవి సమోసాలు, ఫన్నీవీడియో వైరల్‌

Feb 17 2026 6:54 PM | Updated on Feb 17 2026 7:16 PM

Bihari Samosa Desi Style Goes Viral In London

వేడి వేడి సమోసాలు అంటే  ఎవరికైనా నోరు ఊరాల్సిందే. సప్త సముద్రాల ఆవల కూడా సమోసా తన ఉనికిని గొప్పగా చాటుకుంటోంది. హాట్ సమోసాల మాయాజాలం అలాంటిది మరి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

యూకే రాజధాని లండన్‌ వీధుల్లో మహిళ బిహారీ సమోసాలను అందిస్తున్న క్షణాన్ని ఇన్‌స్టాగ్రామ్ వీడియో వైరల్ అవుతోంది. ఆన్‌లైన్‌లో "గోరియా దేవి" అచ్చమైన దేశీ స్టైల్లో సమోసాలను విక్రయిస్తూ జనాన్ని ఆకర్షిస్తోంది. యాప్రాన్, టోపీ ధరించి,ధోతీ-శైలి స్కర్ట్‌ వేసుకున్న ఆమె"సమోసా సమోసా!" అంటూ ఉల్లాసంగా వీధిలో విక్రయిస్తుంది. దీంతో అక్కడున్నవారంత ఉత్సాహంగా నవ్వులు కురిపించారు.

"గోరియా దేవి ఆజ్ లండన్ కే స్ట్రీట్స్ మే బిహారీ సమోసా బేచేగీ ( లండన్‌ వీధుల్లో గోరియా దేవి సమోసాలు అమ్ముతుంది)." అంటుంది, మరోవైపు సహోద్యోగి వైపు తిరిగి, "జల్దీ జల్దీ బనావో (త్వరగా తయారు చేయి), నేను మార్కెట్‌లో వెళ్లాలి, బాబూ" అని చెబుతుంది, ఆపై తాజాగా వేయించిన సమోసాల ట్రేలతో బయలు దేరుతుంది. "సమోసే సమోసే, బిహార్ కే సమోసే, గోరియా నే పరోసే" అంటూ నవ్వులు పూయించింది.

ఇదీ  చదవండి: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు

అంతేనా.. ఆమె ఒక ఆలయం దగ్గర ఆగి, "హర్ హర్ మహాదేవ్" భక్తితో మొక్కడం కూడా చూడొచ్చు. "మేహెనాత్ కర్తే హై జీ" ( కష్టపడి పని చేస్తున్నామండీ) అని చెబుతూ సమోసాలు అమ్మడం చూడొచ్చు.

నెటిజన్లు ప్రశంసలు
ఈ వీడియో సోషల్ మీడియాలో నెలిజన్ల ప్రశంసలను అందుకుంది, బిహారీగా ఉండటం గర్వంగా ఉందని ఒకరు,  వావ్‌.. చాలా రుచిగా ఉంది, మీ వ్యాపారాన్ని మార్కెటింగ్ చేయడానికి, ప్రోత్సహించడానికి చాలా మంచి మార్గం అని  మరో యూజర్‌ కొనియాడారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement