భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఇలీవల బెంగళూరు పర్యటనకు వచ్చారు. ఈ నగరాన్ని చూసి..దాని ఉత్సాహభరితమైన చైతన్యానికి అబ్బురపడుతూ..సాటిలేని శక్తిగా అభివర్ణించారు. ఆ తర్వాత బెంగళూరు దక్షిణ పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్యతో కలిసి స్థానిక వంటకాలను ఆస్వాదించారు.
అందుకు సంబంధించిన ఫోటోలను గోర్ సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేశారు. ఇక సూర్య కూడా తన ఎక్స్ ఖాతాలో ఆ మధుర క్షణాలను పంచుకుంటూ..భారతదేశంలో బెంగళూరు నగరానికి అమెరికా రాయబారి హెచ్. ఇ సెర్గియో గోర్‌ని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఇందిరానగర్‌లోని హోటల్‌లో కొన్ని మసాలా దోసెలు, చక్కటి స్ట్రాంగ్ కాఫీ సేవిస్తూ.. తాత్కాలికి వాణిజ్య ఒప్పందంపై సంభాషించినట్లు తెలిపారు.
Just arrived in Bengaluru! From startups to street food, Bengaluru’s energy is unmatched! Thank you to my great host @Tejasvi_Surya pic.twitter.com/9PsRfvKeGI
— Ambassador Sergio Gor (@USAmbIndia) February 16, 2026
ఆ సమావేశంలో భారత అమెరికా భాగస్వామ్యం, వాణిజ్యం, సాంకేతికత ఆవిష్కరణలపై చర్చించినట్లు కూడా ఎతిపారు. అలాగే గోర్‌కు నమ్మ ఆటో రైడ్‌ని పరిచయం చేసినట్లు పేర్కొన్నారు పోస్ట్‌లో. అలాగే ప్రత్యేక పోస్ట్‌లో సూర్య భారత అమెరికా సంబంధాలలో బెంగళూరు నగరం కీలక పాత్రను నొక్కి చెప్పారు. ఈ నగరం మసాలా దోసం నుంచి వివిధ యంత్ర సామర్థ్యాలు పలు ఆవిష్కరణలను మిళితం చేయడమేగాక, రెండు ప్రజాస్వామ్య దేశాల ప్రజల మధ్య ఆర్థిక సంబంధాలను బోలపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది.
ఎందుకంటే..700కు పైగా అమెరికన్ కంపెనీల్లో భారతదేశ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో 43% బెంగళూరు నుంచి వస్తున్నందున, మన నగరం US-భారత ఆర్థిక సంబంధాలకు కేంద్రంగా ఉంది. భారతదేశంలోని GCC(గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్)లలో 40%కి నిలయంగా ఉన్న బెంగళూరు, మన రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య ఆవిష్కరణ ఆధారిత భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది, ”అని సూర్యా రాసుకొచ్చారు పోస్ట్‌లో.
Delighted to welcome H.E. Sergio Gor, U.S. Ambassador to India, to Bengaluru today.
Over some masala dosa & strong coffee at Filter Coffee, Indiranagar, we had an engaging conversation on the growing India US partnership, especially in trade, technology and innovation following… pic.twitter.com/we2jautGId— Tejasvi Surya (@Tejasvi_Surya) February 16, 2026
కాగా, రాయబారి గోర్ వైట్‌హౌస్ అధ్యక్షుడిగా ప్రెసిడెన్షియల్ పర్సనల్ డైరెక్టర్‌గా పనిచేశారు. తన వృత్తిపరమైన కెరీర్ జర్నీలో రిపబ్లికన్ నేషనల్ కమిటీ, అమెరికన్స్ ఫర్ లిమిటెడ్ గవర్నమెంట్ అండ్ కాపిట్ హిల్ తదితర విభాగాల్లో పనిచేశారు. ఇక విద్యానేపథ్థ్యం వచ్చేటప్పటికీ..జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన గోర్ 2008లో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు.
(చదవండి: టెన్త్ ఫెయిల్..కానీ అద్భుతంగా పాఠాలు బోధిస్తున్నాడు..!)


