టెన్త్‌ ఫెయిల్‌..కానీ అద్భుతంగా పాఠాలు బోధిస్తున్నాడు..! | Sridhar Vembu offers support, hails Bihars rooftop school teacher | Sakshi
Sakshi News home page

టెన్త్‌ ఫెయిల్‌..కానీ అద్భుతంగా పాఠాలు బోధిస్తున్నాడు..!

Feb 17 2026 10:19 AM | Updated on Feb 17 2026 11:24 AM

Sridhar Vembu offers support, hails Bihars rooftop school teacher

పది కూడా పాసవ్వని వ్యక్తి పాఠాలు బోధించడం ఏంటని అనిపిస్తుంది కదూ. కానీ ఈ వ్యక్తి చెబుతున్న తీరు చూస్తే..ఆశ్చర్యంకలగక మానదు. ఆర్థిక పరిస్థితులు తనను ఆపేయొచ్చేమో కానీ..తనలోని ఆసక్తి, ప్రతిభని ఆపలేవని, అవి ఏదో రకంగా బయటకు ఉప్పొంగుతాయని చూపించాడు. చుట్టూ ఉన్నవాళ్లు పది పాస్సవ్వలేదని ఎగతాళి చేసినా..తగ్గలేదు, ఆగిపోలేదు. ఇవాళ ఏకంగా వెయ్యిమందికి పైగా విద్యార్థులకు పాఠాలు చెబుతుండటం విశేషం.

అతడే బీహార్‌కు చెందిన కూరగాయల విక్రేత రోహిత్ కుమార్. పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్‌లో ఫెయిల్‌ అయ్యాడు. అయితే అతడు కళాకారుడుగా ఉండాలనేది ఆకాంక్ష..అయితే ఆర్థిక ఇబ్బందులు ఆ కలను దూరం చేశాయి. అతడి తల్లి ఆవు పిడకలు అమ్ముతూ..ఇంటిని నడిపించేది. ఇక రోహిత్‌ ఇంటింటికి తిరుగుతూ కూరగాయలు అమ్మేవాడు. 

అలా చేస్తున్నప్పుడూ సమాజానికి తనవంతుగా ఏదో ఒకటి చేయాలని సంకల్పించి నలుగురు విద్యార్థులతో ఓ చిన్న తరగతి గదిని ప్రారంభించాడు. 

ఆ గది ఇప్పుడు ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఐదు వరకు నడుస్తోంది. ప్రస్తుతం అతడి వద్ద వెయ్యిమందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యార్థి నుంచి కేవలం రూ. 125లు వసూలు చేస్తున్నాడు. అతడు పది కూడా పాసవ్వకుండా ఇలా ఉపాధ్యాయుడిగా బాధ్యతలు తీసుకున్నందకు అంతా ఎగతాళి చూస్తున్నా..కుమార్‌ మాత్రం దృఢ నిశ్చయంతో..సాధారణ సైన్స్‌ పాఠాలతో ఆ చిన్నారులను ఆకట్టుకున్నాడు, వారి మనసులను గెలుచుకున్నాడు. 

అయితే దీన్నంతటిని రికార్డు చేసి అతడి విద్యార్థులు ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో  ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన జోహో మాజీ సీఈవో శ్రీధర్‌ వెంబు ఇలా రాశారు పోస్ట్‌లో. దీన్ని చూస్తుంటే..భారత్‌ పట్ల గర్వం ఆశావాదం కనిపిస్తోంది. బీహార్‌లోని సామాన్య నేపథ్యాల నుండి వచ్చిన ఈ పిల్లలందరూ, గణితం, సైన్స్‌ నేర్చుకోవడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. 

మన దేశ భవిష్యత్తును నిర్వచిస్తున్నారు. మా ఫౌండేషన్‌ ద్వారా అతని ప్రయత్నానికి మద్దతిచ్చే ప్రయత్నం చేస్తాం అని రాశారు. నెటిజన్లు కూడా రోహిత్‌ కుమార్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ..ప్రతిభ ప్రతిచోటా ఉంటుందని, కానీ అవకాశం దాన్ని చేరుకోవడమే అత్యంత కీలకం అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు మార్కులు ఎప్పటికీ మన విజయాన్ని నిర్ణయించలేవు అని పోస్టలు పెట్టారు. 

 

(చదవండి: కె-పాప్ గాయకుడి నోట 'శివ శివం పాట'..! సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement