స్వప్నలిపి | Interesting facts about daydreams and night dreams | Sakshi
Sakshi News home page

స్వప్నలిపి

Feb 17 2026 5:56 AM | Updated on Feb 17 2026 5:56 AM

Interesting facts about daydreams and night dreams

‘పగటి కలలు కనకు’ అంటారేగానీ ‘రాత్రి కలలు కనకు’ అనరు. జలుబు చేసినప్పుడు తుమ్మినంత సహజంగా రాత్రి నిద్రలో మనకు కలలు వస్తాయి. ఆ కలలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు...

4-7: దాదాపు ప్రతి ఒక్కరికి సగటున నాలుగు నుంచి ఏడు వరకు కలలు వస్తాయి.

5-20: ప్రతి కల అయిదు నుంచి ఇరవై నిమిషాల మధ్య ఉంటుంది. ఎక్కువ కలలు రాత్రి ఆలస్యంగా వస్తాయి.

2: రాత్రి సుమారు రెండు గంటలు స్వ΄్నావస్థలోనే గడుపుతాము.

95 శాతం: 95 శాతం కలలు ఎక్కువ కాలం గుర్తుండవు.

0.9-6.8 శాతం: తరచుగా వచ్చే పీడకలలు (కనీసం వారానికి ఒకసారి) 0.9 శాతం నుంచి 6.8 శాతం వరకు ప్రభావితం చేస్తాయి.

50 శాతం : ఒక అధ్యయనంలో 50 శాతం మంది తాము కలర్‌ఫుల్‌ కలలు కన్నామని చెప్పారు.

12 శాతం: ఒక అధ్యయనం ప్రకారం పన్నెండు శాతం మంది తాము నలుపు, తెలుపు రంగులలో మాత్రమే 
కలలు కంటామని చెప్పారు.

25 ఏళ్లలోపు వయసు ఉన్నవారు తమకు నలుపు, తెలుపు కలలు అరుదుగా వస్తాయని చెప్పారు.

కలలలో లింగ భేదాలు!
→ కలల విషయంలో స్త్రీ, పురుషుల మధ్య ఉండే తేడాను పరిశోధకులు కనుగొన్నారు. పురుషులు ఎక్కువగా ఆయుధాల గురించి కలలు కంటారని, మహిళల కలలు 
సున్నితంగా ఉంటే  పురుషుల కలలు దూకుడుగా ఉంటాయని చెబుతున్నారు.

→ పురుషులతో పోల్చితే స్త్రీలకు ఎక్కువగా పీడకలలు వస్తాయట!

→ అధ్యయనాలు వివిధ రకాల కలల గురించి చెప్పాయి. అందులో ఒకటి... కలలు అశాస్త్రీయంగా, అసంబద్ధంగా ఉంటాయి.

→ కలలకు సంబంధించి స్లీప్‌ ఎక్స్‌పర్ట్‌ల మధ్య భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ‘జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడంలో కలలు ఉపకరిస్తాయి’ అనేవారు ఉన్నారు.
‘కలలకు అర్థం, పరమార్థంలాంటివేమీ లేవు. కల అంటే ఇన్సిడెంటల్‌ బ్రెయిన్‌ యాక్టివిటీ, నిద్రకు సంబంధించి బై– ప్రాడక్ట్‌’ అనే వారూ ఉన్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement