breaking news
interesting points
-
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నతనంలోనే చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. అయితే అధికబరువుతో దారితీస్తున్న అనారోగ్యాలపై పెరుగుతున్న అవగాహన కారణంగా అధికబరువును తగ్గించేందుకు కసరత్తుల భారీగానే చేస్తున్నారు. ఆహారంలో రకరకాల ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. తమ సక్సెస్ స్టోరీను సోషల్‌మీడియాలో ఫాలోయర్స్‌తో పంచుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు ఇరవై నాలుగేళ్ల కోపాల్ అగర్వాల్. పదండి ఆమె వెయిట్‌లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం. కోపాల్ అగర్వాల్ చిన్న వయసులోనే 101 బరువుతో బాధపడేది. ఇష్టమైన దుస్తులు వేసుకోవాలంటే కుదిరేదికాదు. పైగా ఏనుగులా వున్నావ్.. నీతో ఎవరు డేటింగ్ చేస్తారు... ఇలాంటి వెక్కింపులు, వేళాకోళాలు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినేది. దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించు కుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. చక్కటి ఫలితాన్ని సాధించింది. 101 కిలోల బరువు వద్ద మొదలైన ఆమె వెయిట్ లాస్జర్నీ 62 కిలోలకు చేరింది.కోపాల్ అగర్వాల్ తన అద్భుతమైన సక్సెస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తను పాటించిన ఆహార నియమాలు, వ్యాయామల గురించి అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన భోజనం తీసుకునేది. క్రమం తప్పకుండా కఠిన వ్యాయామం చేసింది. దీంతో సుమారు 40 కిలోల బరువును తగ్గించుకుంది. ఇపుడు ఇష్టమైన మోడ్రన్ దుస్తులు కూడా వేసుకుంటోంది. బరువు తగ్గడం వల్ల తన శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా తన మానసిక శ్రేయస్సు , కాన్ఫిడెన్స్ కూడా మెరుగుపడిందని ఆమె చెప్పింది. మరో వీడియోలో, తాను కేవలం ఆరు నెలల్లో 32 కిలోలు తగ్గినట్టు చెప్పుకొచ్చింది అగర్వాల్. View this post on Instagram A post shared by KOPAL AGARWAL | Fitness | Nutrition | Skincare | Travel (@_kopal.agarwal_)బరువు తగ్గడానికి తీసుకున్న రోజువారీ ఆహారం:అల్పాహారం: ఒక రోటీ, 5 గుడ్డులోని తెల్లసొన, ఒక గిన్నె పోహా 2 పనీర్ ముక్కలతో అధిక ప్రోటీన్ కలిగిన ఫ్రూట్స్, పెరుగుమధ్యాహ్నం: పుచ్చకాయ , స్ట్రాబెర్రీలు బ్లాక్ కాఫీ, కొబ్బరి నీరుభోజనం: ఆకుకూరలతో 100 గ్రాముల చికెన్, కిచ్డీ పెరుగుతో పచ్చి కూరగాయలతో పనీర్ భుర్జీమధ్యాహ్నం: గ్రీన్ టీరాత్రి భోజనం: ఆకుకూరలతో సాటేడ్ పనీర్ సలాడ్, 100 గ్రాముల చికెన్, గుడ్డు భుర్జీదీంతో పాటు, రాత్రి తొందరగా నిద్రపోవడం, ఉదయాన్నేతొందరగా మేల్కోవడం లాంటివి పాటించింది. ఇంకా ప్రతిరోజూ కనీసం మూడు లీటర్ల నీరు త్రాగడం , పరగడుపున గోరువెచ్చని నీరు సేవించడం, ప్రతిరోజూ కనీసం 10వేలు అడుగులు నడవడంతన దినచర్యలో భాగం చేసుకుంది. చక్కెర ఇంట్లో వండిన భోజనాన్ని మాత్రమే తీసుకుంటూ, జంక్ ఫుడ్‌కు కంప్లీట్‌గా నో చెప్పింది. మొత్తానికి కష్టపడి తన శరీర బరువు 101 నుండి 62 కిలోలకు చేరి వావ్ అనిపించుకుంది.నోట్ : ఇదే టిప్స్ అందరికీ పాటించాలనే నియమం ఏదీ లేదు. కానీ కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవడం, పూర్తి నిబద్దత, ఓపికతో ప్రయత్నిస్తే బరువు తగ్గడం కష్టమేమీ కాదు. అయితే బరువు తగ్గే ప్రయత్నాలను ప్రారంభించేందు ముందు, బరువు పెరగడానికి గల కారణాలును వైద్యుల ద్వారా నిర్ధారించుకోవాలి. ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకుని ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండేలా జాగ్రత్త పడాలి. -
జయలలిత గురించి తెలియని విశేషాలు
న్యూఢిల్లీ: జయలలిత... ఇటు రాజకీయ జీవితానికి, అటు సినీ జీవితానికి సంబంధించి అందరకి తెలియని ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఆమె తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించారనే విషయం అందరికి తెల్సిందేగానీ హిందీ చిత్రం హిజ్జత్లోనే కాకుండా చిత్ర రంగంలోకి ప్రవేశించక ముందు ఓ ఆంగ్ల లఘు చిత్రంలో నటించారన్నది ఎందరికి తెలుసు! ► మాజీ భారత రాష్ట్రపతి వీవీ గిరి కుమారుడు శ్రీ శంకర్ గిరీ 1961లో నిర్మించి, దర్శకత్వం వహించిన ‘ఎపిస్టిల్’ అనే ఆంగ్ల లఘు చిత్రంలో ఆమె నటించారు. ► వెన్నిర అదయ్ అనే తమిళ చిత్రంలో తొలిసారిగా లీడ్ రోల్లో ‘యువ వితంతువుగా’ నటించారు. ఆ సినిమాకు పెద్దలకు మాత్రమే అని సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల అప్పటికీ జయలలితకు 15 ఏళ్లే ఉండడం వల్ల ఆమె థియేటర్లో ఆ సినిమాను చూడలేకపోయారు. ► తల్లి వేదవతి (సంధ్య) బలవంతంపై చిన్న వయస్సులో సినిమా రంగంలోకి వచ్చారు. ఇజ్జత్ అనే హిందీ సినిమాలో ధర్మేంద్ర సరసన నటించారు. ► తమిళ సినిమా పాటలో స్లీవ్‌లెస్ జాకెట్ ధరించి, జలపాతంలో తడిసిన తొలితారగా రికార్డు నెలకొల్పారు. ► జయలలిత కర్ణాటకలో పుట్టినప్పటికీ కావేరీ జలాల విషయంలో కర్ణాటక ప్రజలను తీవ్రంగా విమర్శించారు. ఓ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు వెళ్లినప్పుడు ఆమెను ప్రజలు చుట్టుముట్టి విమర్శలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించకపోవడంతో ఆమెపైకి రాళ్లు రువ్వారు. అప్పుడు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ► 1981లో సినీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడం, పెళ్లైన శోభన్ బాబును ప్రేమించడం, ఆ ప్రేమ ఫలించే అవకాశాలు లేకపోవడం వల్ల జయలలిత బాగా కంగిపోయారట. ఓసారి ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నించారట. ఆ సమయంలోనే ఎంజీ రామచంద్రన్ ఆమెకు ఎంతో నచ్చచెప్పి 1982లో రాజకీయాల్లోకి తీసుకొచ్చారట. ► ఆమె 85 తమిళ చిత్రాల్లో హీరోయిన్గా నటించగా, వాటిలో 80 చిత్రాలు సూపర్ హిట్టయ్యాయి. తెలుగులో కేవలం 25 చిత్రాలు మాత్రమే హిట్టయ్యాయి. ► ఇంగ్లీషు నవలలు ఎక్కువ చదివేవారు. ఎక్కడికి షూటింగ్‌కు వెళ్లినా చేతిలో పుస్తకం ఉండాల్సిందే. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆమె ఇంగ్లీషు నవలలను వదల్లేదు. ► ఆమె తమిళ భాషలో బాగా రాస్తారని పేరుంది. థాయ్ పేరుతో తమిళ పత్రికలు వ్యాసాలు రాసేవారు. ఓ నవల కూడా రాశారట. ► ఆమె తన దగ్గర తోట పనిచేసే యువకుడిని చేరదీసి ఉన్నత చదువులు చదివించారు. 2009లో వచ్చిన వార్తల ప్రకారం ఇప్పుడు పెద్దవాడైన ఆ యువకుడు ‘అమెజాన్’ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవారు. ► మూడేళ్ల వయస్సులో భరత నాట్యం, ఆ తర్వాత మోహిణి హట్టం, మణిపూరి, కథక్ నత్యాల్లో శిక్షణ పొందారు. ► జయలలిత మరి పిన్న వయస్సులో మైసూర్‌లోని రెండు ఇళ్లలో ఉన్నారట. అందులో ఒకటి జయ విలాస్ కాగా, మరొకటి లలిత విలాస్ అట. ఆ రెండు కలపి జయలలితగా ఆమె తల్లి, తండ్రులు నామకరణం చేశారట.