
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నతనంలోనే చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. అయితే అధికబరువుతో దారితీస్తున్న అనారోగ్యాలపై పెరుగుతున్న అవగాహన కారణంగా అధికబరువును తగ్గించేందుకు కసరత్తుల భారీగానే చేస్తున్నారు. ఆహారంలో రకరకాల ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. తమ సక్సెస్ స్టోరీను సోషల్‌మీడియాలో ఫాలోయర్స్‌తో పంచుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు ఇరవై నాలుగేళ్ల కోపాల్ అగర్వాల్. పదండి ఆమె వెయిట్‌లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం.
కోపాల్ అగర్వాల్ చిన్న వయసులోనే 101 బరువుతో బాధపడేది. ఇష్టమైన దుస్తులు వేసుకోవాలంటే కుదిరేదికాదు. పైగా ఏనుగులా వున్నావ్.. నీతో ఎవరు డేటింగ్ చేస్తారు... ఇలాంటి వెక్కింపులు, వేళాకోళాలు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినేది. దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించు కుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. చక్కటి ఫలితాన్ని సాధించింది. 101 కిలోల బరువు వద్ద మొదలైన ఆమె వెయిట్ లాస్‌జర్నీ 62 కిలోలకు చేరింది.
కోపాల్ అగర్వాల్ తన అద్భుతమైన సక్సెస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తను పాటించిన ఆహార నియమాలు, వ్యాయామల గురించి అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన భోజనం తీసుకునేది. క్రమం తప్పకుండా కఠిన వ్యాయామం చేసింది. దీంతో సుమారు 40 కిలోల బరువును తగ్గించుకుంది. ఇపుడు ఇష్టమైన మోడ్రన్ దుస్తులు కూడా వేసుకుంటోంది. బరువు తగ్గడం వల్ల తన శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా తన మానసిక శ్రేయస్సు , కాన్ఫిడెన్స్ కూడా మెరుగుపడిందని ఆమె చెప్పింది. మరో వీడియోలో, తాను కేవలం ఆరు నెలల్లో 32 కిలోలు తగ్గినట్టు చెప్పుకొచ్చింది అగర్వాల్.

బరువు తగ్గడానికి తీసుకున్న రోజువారీ ఆహారం:
అల్పాహారం: ఒక రోటీ, 5 గుడ్డులోని తెల్లసొన, ఒక గిన్నె పోహా 2 పనీర్ ముక్కలతో అధిక ప్రోటీన్ కలిగిన ఫ్రూట్స్, పెరుగు
మధ్యాహ్నం: పుచ్చకాయ , స్ట్రాబెర్రీలు బ్లాక్ కాఫీ, కొబ్బరి నీరు
భోజనం: ఆకుకూరలతో 100 గ్రాముల చికెన్, కిచ్డీ పెరుగుతో పచ్చి కూరగాయలతో పనీర్ భుర్జీ
మధ్యాహ్నం: గ్రీన్ టీ
రాత్రి భోజనం: ఆకుకూరలతో సాటేడ్ పనీర్ సలాడ్, 100 గ్రాముల చికెన్, గుడ్డు భుర్జీ
దీంతో పాటు, రాత్రి తొందరగా నిద్రపోవడం, ఉదయాన్నేతొందరగా మేల్కోవడం లాంటివి పాటించింది. ఇంకా ప్రతిరోజూ కనీసం మూడు లీటర్ల నీరు త్రాగడం , పరగడుపున గోరువెచ్చని నీరు సేవించడం, ప్రతిరోజూ కనీసం 10వేలు అడుగులు నడవడంతన దినచర్యలో భాగం చేసుకుంది. చక్కెర ఇంట్లో వండిన భోజనాన్ని మాత్రమే తీసుకుంటూ, జంక్ ఫుడ్‌కు కంప్లీట్‌గా నో చెప్పింది. మొత్తానికి కష్టపడి తన శరీర బరువు 101 నుండి 62 కిలోలకు చేరి వావ్ అనిపించుకుంది.
నోట్ : ఇదే టిప్స్ అందరికీ పాటించాలనే నియమం ఏదీ లేదు. కానీ కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవడం, పూర్తి నిబద్దత, ఓపికతో ప్రయత్నిస్తే బరువు తగ్గడం కష్టమేమీ కాదు. అయితే బరువు తగ్గే ప్రయత్నాలను ప్రారంభించేందు ముందు, బరువు పెరగడానికి గల కారణాలును వైద్యుల ద్వారా నిర్ధారించుకోవాలి. ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకుని ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండేలా జాగ్రత్త పడాలి.