అంకిత అద్భుత విజయం | Anjali Sardana: the 23-year-old Pronto founder behind a 100 million house help startup | Sakshi
Sakshi News home page

అంకిత అద్భుత విజయం

Mar 13 2026 1:28 AM | Updated on Mar 13 2026 1:28 AM

Anjali Sardana: the 23-year-old Pronto founder behind a 100 million house help startup

ఎప్పుడూ నడిచే దారిలో నడిస్తే కొత్తేముంది! కొత్త దారులు వెదకాలి. అప్పుడే కొత్త వెలుగు కనిపిస్తుంది. అలాంటి వెలుగును చూసింది అంజలి.  ఇన్వెస్టర్‌గా ప్రయాణం ప్రారంభించిన అంజలి ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలనుకుంది. తన ఆలోచనలకు సృజన, శ్రమలను జోడించి విజయకేతనం ఎగరేసింది.

కొన్ని నెలల క్రితంప్రారంభమైన 10–మినిట్‌ హోమ్‌ సర్వీసెస్‌ స్టార్టప్‌ 'ప్రొంటో’కు ఇన్వెస్టర్‌లు, వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. తక్షణ గృహ సహాయాన్ని ఆర్డర్‌ చేయడానికి వినియోగదారులకు 'ప్రొంటో’ వీలు కల్పిస్తుంది. బెంగళూరు కేంద్రంగా మొదలైన ఈ స్టార్టప్‌ ఆ తరువాత ఎన్నో నగరాలకు విస్తరించింది. 23 సంవత్సరాల అంజలి సర్దానా 'ప్రొంటో’కు వ్యవస్థాపకురాలు, సీయీవో.

'ప్రొంటో’ అనేది శిక్షణ పొందిన డొమెస్టిక్‌ వర్కర్‌లతో వినియోగదారులను అనుసంధానించే వేదిక. వినియోగదారులు ఈ యాప్‌ ద్వారా స్వీపింగ్, పాత్రలు కడగడం, వంటగది, బాత్రూమ్‌ శుభ్రపర్చడం, లాండ్రీ... మొదలైన ఇంటి పనుల కోసం స్లాట్‌లను బుక్‌ చేసుకోవచ్చు. మరిన్ని నగరాల్లోకి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న
'ప్రొంటో’ రాబోయే రోజుల్లో వంట, కార్‌ వాషింగ్, సెలూన్‌ సేవలపై కూడా దృష్టి పెట్టనుంది.

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడం, సుదీర్ఘమైన పనిగంటలు, బిజీ షెడ్యూల్స్‌ నేపథ్యంలో'ప్రొంటో’లాంటి హౌస్‌–హోల్డ్‌ యాప్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది.ప్లాట్‌ఫామ్‌లో రోజుకు 18,000 బుకింగ్స్‌ జరుగుతున్నాయి. మంచి వేతనం,ప్రోత్సాహకాలు, నాణ్యతతో కూడిన పని విధానం ద్వారా పట్టణ భారతదేశంలో గృహ సేవలకు సంబంధించి కొత్త అధ్యయనాన్ని సృష్టించింది ప్రొంటో. పనుల ఒత్తిడిలో ఆఫీసులోనే నిద్రించడం నుంచి ఒక సంవత్సరం లోపు కంపెనీని పై స్థాయికి తీసుకువెళ్లడం వరకు అంజలి కృషి ఎంతో ఉంది. జార్జ్‌టౌన్‌ యూనివర్శిటీలో జీవశాస్త్రంలో డిగ్రీ చేసిన అంజలి బెయిన్‌ క్యాపిటల్, బీవిసిలలో ఇన్వెస్టర్‌గా పనిచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement