పేద గుండెల అందెల రవళి | how NCPA is helping poor kids become classical dance performers: Manas Ahire | Sakshi
Sakshi News home page

పేద గుండెల అందెల రవళి

Mar 13 2026 3:45 AM | Updated on Mar 13 2026 3:45 AM

how NCPA is helping poor kids become classical dance performers: Manas Ahire

మట్టిలో మాణిక్యాలకుప్రోత్సాహం తోడైతే ఎలాంటి ఫలితం వస్తుందో ఆచరణా త్మకంగా చూపిస్తోంది నృత్య పరిచయ్‌.

ముంబైలోని మురికివాడలో నివసించే పేదింటి బిడ్డ మానస్‌ అహిరేకు డ్యాన్స్‌ నేర్చుకోవడం అనేది ఒకప్పుడు కలలో మాట. డ్యాన్స్‌ అంటే అతడికిప్రాణం. కాని చాలామంది పిల్లలలాగే మానస్‌ దగ్గర డ్యాన్స్‌ నేర్చుకోవడానికి డబ్బు, సరైన వేదిక లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ది పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ (ఎన్‌సీపీఏ) మానస్‌ కలను నిజం చేసింది. సంగీత నాటక అకాడమీ అవార్డ్‌ అందుకున్న లతసనాదేవి ఆధ్వర్యంలో మానస్‌ మణిపురి నేర్చుకోవడంప్రారంభించాడు. శిక్షణ ఉచితం.
 

ఈ నృత్యశిక్షణ అభిరుచికి మాత్రమే కాదు క్రమశిక్షణ విషయంలోనూ మానస్‌లాంటి విద్యార్థులకు బాగా ఉపయోగపడింది. మూడు సంవత్సరాల డి΄÷్లమా పూర్తి చేసిన తరువాత, మానస్‌ అసిస్టెంట్‌ టీచర్‌గా ఎంపికయ్యాడు. ఈ ఉద్యోగం ద్వారా వచ్చే జీతం తన ఇంజినీరింగ్‌ చదువుకు ఉపయోగపడుతోంది. ‘నృత్యం నాలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అంటున్నాడు మానస్‌.

‘ఎన్‌సీపీఏ’ నృత్య పరిచయ్‌ కార్యక్రమం ద్వారా పేదపిల్లలకు నృత్యంలో ఉచిత శిక్షణ ఇస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా మానస్‌లాంటి ఎంతోమంది పేదింటి పిల్లలు లబ్ధి పొందుతున్నారు. ముంబై శివారులోని నెరూల్‌కు చెందిన సిద్ది మాత్రే 2019లో తన నృత్యప్రస్థానాన్నిప్రారంభించింది. నెరూల్‌లోని ధ్యాన్‌దీప్‌ సేవా మండపంలో గురు శర్మిష్ఠ చటోపాధ్యాయ ఆధ్వర్యంలో ఒడిస్సీలో శిక్షణ పొందింది. ఇప్పుడు సిద్ధి అసిస్టెంట్‌ టీచర్‌గా పనిచేస్తోంది. ఖజురహో ఉత్సవంలో ఏడు వందల మంది విద్యార్థులతో కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వనుంది సిద్ది మాత్రే.

నృత్య పరిచయ్‌ కార్యక్రమంలో భాగంగా వెయ్యి మందికి పైగా పేదింటి విద్యార్థులు నృత్యం నేర్చుకున్నారు. ‘నృత్యం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచన నుంచి పుట్టిందే నృత్య పరిచయ్‌’ అంటారు ఎన్‌సీపీఏ నృత్యవిభాగం అధిపతి స్వ΄్నోకల్పదాస్‌ గుప్తా.

‘పిల్లలకు ప్రతిభ ఉండవచ్చు. సరిౖయెన ఆదరణ,ప్రోత్సాహం లేకపోతే తమ అభిరుచి నుంచి దూరం జరుగుతారు. దీన్ని నివారించడానికి నృత్య పరిచయ్‌ పేద పిల్లలకు చేరువ అవుతుంది’ అంటారు గుప్తా. నృత్యపరిచయ్‌తో పాటు ఎన్‌సీపీఏ ‘నృత్య గురుకుల్‌’ అనే అధునాతన మార్గదర్శక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ‘నృత్యగురుకుల్‌’ కార్యక్రమం క్రింద ఇరవైనాలుగు మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ప్రతిభ, అంకితభావం, నిబద్ధత ఆధారంగా ఎనిమిది మంది గురువులు వీరిని ఎంపిక చేశారు. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకుప్రాధాన్యత ఇస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement