కె-పాప్ గాయకుడి నోట 'శివ శివం పాట'..! సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే.. | K Pop Singer Celebrates Mahashivratri In Chennai Temple Goes Viral | Sakshi
Sakshi News home page

కె-పాప్ గాయకుడి నోట 'శివ శివం పాట'..! సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే..

Feb 17 2026 9:29 AM | Updated on Feb 17 2026 9:53 AM

K Pop Singer Celebrates Mahashivratri In Chennai Temple Goes Viral

కెపాప్‌ అనగానే దక్షిణకొరియాలోని సియోల్‌కి చెందిన మ్యూజిక్‌ బ్యాండ్‌. కానీ ఆ దేశం నుంచి వచ్చి మన మహాశివుడికి సంబంధించిన పాటను అద్భుతంగా ఆలాపించి ఆశ్చర్యపరిచాడు. ఓ విదేశీయుడు మన దేశ సంస్కృతిలో భాగం కావడం ఇది కొత్తకాదు గానీ..అందులోనూ పాప్‌ గాయకులాంటి విదేశీయులు నోట మన దేవుళ్ల పాటలు పలకడం విశేషమే. ఎవరతను..? మన భాషలు ఎలా నేర్చుకున్నాడంటే..

అతడే ఔరా అనే పాప్‌ గాయకుడు. మన భారతదేశాన్ని ఎంతో ఇష్టపడే వ్యక్తి, హిందీ కూడా నేర్చుకున్నాడు. మూడు సంవత్సరాల క్రితం భారత్‌కి వచ్చి బిగ్‌బాస్‌ 17లో కనిపించి సందడి చేశాడు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పర్యటిస్తూ..ఎక్కడికి వెళ్లిన అభిమానులను సంపాదించుకుంటూ..అందరి మనసులను గెలుచుకుంటున్నాడు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి సందర్భంగా చెన్నైలోని శివాలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశాడు. 

 

ఇక్కడ అత్యంత విశేషం ఏంటంటే..అచ్చం భారతీయ వేషధారణలో ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేశాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ..చెన్నైలో ఎప్పటికీ మర్చిపోలేని వరం పొందాను అంటూ భావోద్వేగం చెందాడు. అక్కడ ఎందరో వ్యక్తులు 'శివాయ నమః'  అని జపిస్తూ ఉండటం చూశానని, తాను ఈ దేశంలో పుట్టకపోయినా.. ఈ సంస్కృతిని ప్రేమించాలని న ఈ క్షణం తనకు ఎంతో భావోద్వేగంగా అనిపించింది అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు. 

అంతేగాదు మహాశివరాత్రి రోజున సాక్షాత్తు ఆ శివుడే తనకు  "ఓం నమః శివాయ" అని మార్గదర్శకత్వం చేస్తున్నాడేమో అని పేర్కొన్నాడు పోస్ట్‌లో. కాగా ఇటీవలే ఫిబ్రవరి 10, 2026న శివ శివం అను పాటను కూడా విడుదల చేశాడు. గాయకుడు ఔరాకి ఈ భారత పర్యటన మూడోసారి. తొలిసారి ఢిల్లీ వచ్చానని, అక్కడ నుంచి ముంబై వంటి ఇతర ప్రదేశాలకు వెళ్లి..ఎంతో అనుభవాన్ని గడించడమే గాక ఎందరో ప్రేమను పొందానని కూడా పేర్కొన్నాడు పోస్ట్‌లో. 

 

 

అందుకు సదా ఆ పరమేశ్వరుడికి కృతజ్ఞుడనని అన్నాడు. అంతేగాదు తన శివ శివం పాటతో ఇక్కడ కళాకారులతో పనిచేసే అవకాశం పొందానని, ఇలా తన జర్నీలో భాగమైన వారికి ఈ పాట అంకితం అని పేర్కొన్నాడు కూడా. నిజానికి ఇది చాలా గ్రేట్‌ కదా ఓ విదేశీయుడు మన భాష, సంస్కృతిలో ఇంతలా  మమేకమైపోయిన విధం చూస్తే..చాలాఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ..!.

(చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement