తెరపై శివతాండవం చేసిన హీరోలు వీళ్లే.. | Maha Shivaratri: Tollywood Actors who Getup as Lord Shiva | Sakshi
Sakshi News home page

Maha Shivaratri: వెండితెరపై శివయ్యగా మెప్పించిన హీరోలు

Feb 15 2026 1:23 PM | Updated on Feb 15 2026 1:54 PM

Maha Shivaratri: Tollywood Actors who Getup as Lord Shiva

హిందువుల పెద్ద పండుగల్లో శివరాత్రి ఒకటి. భోళా శంకరుడు పార్వతీదేవిని పెళ్లాడిన రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈరోజు (ఫిబ్రవరి 15న) చాలామంది ఉపవాసం, జాగరణ ఉంటారు. రాత్రంతా నిద్రపోకుండా దేవుడి సినిమాలు చూస్తారు. పలువురు నటీనటులు వెండితెరపై మహాశివుడిగా మెప్పించారు. శివుడి వేషం వేసిన ఆ నటులెవరో చూసేద్దాం..

ముందు గుర్తొచ్చేది ఆయనే..
ఇప్పుడంటే భక్తి సినిమాలు తక్కువయ్యాయి.. కానీ ఒకప్పుడు పౌరాణిక చిత్రాలు ఎన్నో వచ్చాయి. పురాణ కథలను వెండితెరపై చక్కగా చూపేవారు. వెంకటేశ్వరస్వామి, రాముడు, శివుడు, కృష్ణుడు.. ఇలా అందరి దేవుళ్ల వేషం కట్టేవారు. ఇక శివుడి పాత్ర వేసిన నటులు అనగానే ముందుగా గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు. ఉమా చండీ గౌరీ శంకరుల కథ, దక్షయజ్ఞం వంటి సినిమాల్లో ఆయన భోళాశంకరుడిగా ఆకట్టుకున్నారు.

ఏఎన్నార్‌, శోభన్‌బాబు కూడా..
మూగ మనసులు మూవీలో గౌరమ్మ నీ మొగుడెవరమ్మ పాటలో అక్కినేని నాగేశ్వరరావు శివుడి రూపంలో కనిపించాడు. శ్రీ వినాయక విజయంలో కృష్ణంరాజు, పరమానందయ్య శిష్యుల కథలో శోభన్‌బాబు, మగరాయుడు సినిమాలో కమెడియన్‌ మల్లికార్జునరావు, మావూర్లో మహాశివుడు మూవీలో రావు గోపాలరావు.., భూకైలాస్‌, నాగుల చవితి సినిమాల్లో నాగభూషణం, శ్రీ సత్యనారాయణస్వామి మూవీలో సుమన్‌ శివుడిగా మెప్పించారు.

దేవుడిగా అద్భుతాలు
శ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవి, ఢమరుకంలో ప్రకాశ్‌ రాజ్‌, కన్నప్ప మూవీలో అక్షయ్‌ కుమార్‌ శివయ్యగా ఆకట్టుకున్నారు. సీతారామ కల్యాణం సినిమాలో ఎంత నేర్చినా ఎంత చూసినా పాటలో బాలకృష్ణ కాసేపు శివుడిగా కనిపించాడు. ఇలా ఎందరో యాక్టర్స్‌ యాక్షన్‌, ఎమోషన్స్‌తోపాటు పాటు భక్తిరస చిత్రాల్లోనూ నటించగలమని నిరూపించారు. తెరపై శివతాండవం చేసి ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement