దురంధర్ మరో రికార్డ్.. ఏకంగా 59 రోజుల పాటు..! | Dhurandhar is now the longest trending Indian film beats Chhaava Pushpa 2 | Sakshi
Sakshi News home page

Dhurandhar Movie: దురంధర్‌ ఆల్‌టైమ్ రికార్డ్.. పుష్ప-2, ఛావాను దాటేసి..!

Feb 15 2026 1:04 PM | Updated on Feb 15 2026 1:22 PM

Dhurandhar is now the longest trending Indian film beats Chhaava Pushpa 2

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే వసూళ్లపరంగా పలు రికార్డులు బద్దలు కొట్టిన దురంధర్.. రెండు నెలలు పూర్తయినా తగ్గేలేదే అంటోంది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోన్న ఈ చిత్రం బుక్‌ మై షోలో క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధిక రోజులు ట్రెండింగ్‌లో ఉన్న చిత్రంగా దురంధర్ నిలిచింది. 

ఈ క్రమంలోనే ఛావా, స్త్రీ-2, ప్రేమలు, పుష్ప-2 సినిమాలను దాటేసింది. ఈ మూవీ అత్యధికంగా 59 రోజులు బుక్‌ మై షోలో ట్రెండింగ్‌లో కొనసాగింది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా సాధించని అతి పెద్ద ఘనతను దక్కించుకుంది. ఇప్పటికే 2025లో ‍‍అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన దురంధర్‌.. ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లోనూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. దీంతో బుక్‌ మై షోలో ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది.

కాగా.. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన దురంధర్‌లో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్  కీలక పాత్రల్లో కనిపించారు. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ సీక్వెల్‌గా ధురంధర్: ది రివెంజ్ మార్చి 19న విడుదల కానుంది.

బుక్‌ మై షోలో ట్రెండింగ్ సినిమాలు..

1. ధురంధర్- 59 రోజులు

2. ఛావా -58 రోజులు

3. స్ట్రీ 2 -57  రోజులు

4. ప్రేమలు- 53  రోజులు

5. పుష్ప 2: ది రూల్-  53  రోజులు

6. మంజుమ్మెల్ బాయ్స్-  50  రోజులు

7. కల్కి 2898 ఏడీ-  49  రోజులు

8. జవాన్-  48  రోజులు

9. లోకా చాప్టర్- 1- 46  రోజులు

10. మహావతార నరసింహ- 42  రోజులు

 

Advertisement
 
Advertisement
Advertisement