రైతును పెళ్లాడే అమ్మాయిలకు రూ.10 లక్షలు..! | 10 Lakh Deposit for Girls Marrying Farmers? | Sakshi
Sakshi News home page

రైతును పెళ్లాడే అమ్మాయిలకు రూ.10 లక్షలు..!

Feb 18 2026 11:45 AM | Updated on Feb 18 2026 11:56 AM

10 Lakh Deposit for Girls Marrying Farmers?

సర్కారుకు కర్షక నేతల వినతి 

బనశంకరి(బెంగుళూరు): యువ రైతులను వివాహం చేసుకునే యువతులకు రూ.10 లక్షలు డిపాజిట్‌ చేయాలని, బడ్జెట్లో రైతులకు సాయం ప్రకటించాలని రైతు సంఘాలు సీఎం సిద్దరామయ్యను కో­రా­యి. మంగళవారం విధాసౌధలో రైతుసంఘాల నాయకులతో సీఎం బడ్జెట్‌ సన్నాహక సమావేశం జరిపారు. రైతు నేతలు మాట్లాడుతూ యువ రైతులకు పిల్లనిచ్చే వారు లేకపోవడం సామా­జిక విషాదమన్నారు. కాబట్టి యువ రైతులను పెళ్లాడే వధువుకు ప్రభుత్వం కనీసం రూ.10 లక్షలు డిపాజిట్‌ చేయాలన్నారు. 

రైతులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడానికి రూ.20 వేల కోట్లతో ప్రత్యేక నిధి కేటాయించాలన్నారు. రైతుల భూ­ముల సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. కిసాన్‌ సమ్మాన్‌ పథకాన్ని మళ్లీ అమలు చేసి రైతులకు ఆర్థిక సాయం చేయాలన్నారు. చెరు­వులను అభివృద్ధి చేయాలి, రుణ సదుపా­యం పెంచాలి, నాణ్యమైన విత్తనాలు, ఎరువులనే విక్రయించేలా సర్కారు చర్యలు తీసుకోవాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement