తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 16న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రకటన నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 26న కాగా నామినేషన్ల చివరి తేదీ మార్చి 5 వరకూ చేయనున్నట్లు తెలిపింది. నామినేషన్ల పరిశీలన మార్చి 6 నామినేషన్లు ఉపసంహరణ మార్చి 9ని గడువుగా విధించింది. తెలంగాణ సహా మొత్తం పది రాష్ట్రాల్లో 37 ఎంపీ సీట్లకు షెడ్యూల్ విడుదల చేసింది.
రాజ్యసభ స్థానాలు అత్యధికంగా ఖాళీ అయ్యే స్థానాలు వరుసగా మహారాష్ట్ర 7, తమిళనాడు 6, పశ్చిమబెంగాల్ 5, బిహార్ 5, ఒడిశా 4, ఛత్తీస్ గఢ్ 2 వరుసగా ఉన్నాయి. కాగా ఏప్రిల్ 9తో రాష్ట్రంలో సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ పదవి కాలం ముగియనుంది.


