
బీజింగ్: చైనాలో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది.
భారత కాలమానం ప్రకారం ఉదయం 6:29 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. భూమి లోతులో 10 కిలోమీటర్ల లోపల భూకంపం నమోదైనట్లు ఎన్‌సీఎస్ అధికారులు తెలిపారు. ఈ మేరకు భూకంప వివరాలను ఎన్‌సీఎస్ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఈనెల మే 12న తెల్లవారుజామున 2:41 గంటలకు టిబెట్, చైనా పలు ప్రాంతాల్లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంపం భూమిలో 9 కిలోమీటర్ల లోతులో నమోదైంది.
EQ of M: 4.5, On: 16/05/2025 06:29:51 IST, Lat: 25.05 N, Long: 99.72 E, Depth: 10 Km, Location: China.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/08mQNfOwyd— National Center for Seismology (@NCS_Earthquake) May 16, 2025