
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఓ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం నాడు లోధ్రాన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెషావర్ నుండి కరాచీకి వెళ్తున్న అవామ్ ఎక్స్‌ప్రెస్ రైలు లాహోర్‌కు దాదాపు 400 కి.మీ దూరంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నాలుగు కోచ్‌లు చెల్లాచెదురయ్యాయి. డిప్యూటీ కమిషనర్ లుబ్నా నజీర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది గాయపడ్దారని, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నదన్నారు.
One killed, several injured as passenger train derails in Pakistan's Punjab#trainaccident #Pakistan #awamexpresshttps://t.co/UiKhnREKAy
— IndiaTV English (@indiatv) August 17, 2025
ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి. అధికారులు దెబ్బతిన్న కోచ్‌లను పక్కకు తొలగిస్తున్నారు. ట్రాక్‌ను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో పాక్‌లోని పంజాబ్‌లో ఇది మూడవ రైలు ప్రమాదం. కొన్ని రోజుల క్రితం ముసా పాక్ ఎక్స్‌ప్రెస్ రైవిండ్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఆగస్టు ప్రారంభంలో ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. నాడు 10 కోచ్‌లు బోల్తాపడి, 30 మంది గాయపడ్డారు. వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.