
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంత కాలంగా తను నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తాను ఏడు యుద్ధాలను ఆపినట్టు ట్రంప్ చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ విషయమై వైట్‌హౌస్ ఆయనను ‘ది పీస్ ప్రెసిడెంట్’గా పేర్కొంది. కాగా, ప్రస్తుతం నోబెల్ బహుమతులకు సంబంధించి.. వివిధ విభాగాలకు విజేతలను ప్రకటిస్తున్నారు. శాంతి బహుమతికి ఇంకా ప్రకటించలేదు.
నోబెల్ శాంతి బహుమతి శుక్రవారం ప్రకటించాల్సి ఉండగా.. ఈ విషయమై తాజాగా ట్రంప్‌ను మీడియా ప్రశ్నించారు. ఈ సందర్బంగా ట్రంప్ స్పందిస్తూ..‘నాకు అదంతా తెలియదు.. నేను ఏడు యుద్ధాలను పరిష్కరించాను. ఎనిమిదో యుద్ధాన్ని(ఉక్రెయిన్, రష్య) పరిష్కరించడానికి దగ్గరగా ఉన్నాము. రష్యా పరిస్థితిని మనం పరిష్కరించుకుంటామని నేను అనుకుంటున్నాను. చరిత్రలో ఎవరూ ఇన్ని యుద్ధాలను ఆపలేదు. నోబెల్ శాంతి బహుమతి కోసం ఇప్పటికే పలు దేశాలు నన్ను నామినేట్ చేశాయి. కానీ, నోబెల్ కమిటీ మాత్రం.. నాకు శాంతి బహుమతి రాకుండగా.. ఒక కారణాన్ని కనుగొంటున్నారు అని విమర్శలు చేశారు.
THE PEACE PRESIDENT. pic.twitter.com/bq3nMvuiSd
— The White House (@WhiteHouse) October 9, 2025
మరోవైపు.. ట్రంప్‌కు నోబెల్ శాంతి విషయంలో తాజాగా వైట్‌హౌస్ స్పందించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..‘ది పీస్ ప్రెసిడెంట్’ అనే శీర్షికతో ప్రకటనను పంచుకుంది. ఇదిలా ఉండగా.. ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేసిన దేశాలలో పాకిస్తాన్ కూడా ఉంది. జూన్ 20న, ఇస్లామాబాద్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేస్తామని ప్రకటించింది ఇటీవల భారత్-పాకిస్తాన్ సంక్షోభంలో ఆయన నిర్ణయాత్మక దౌత్య జోక్యం కీలకమైన నాయకత్వం వహించారని పాక్ చెప్పుకొచ్చింది.