డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ | US Court of International Trade Orders Refunds of IEEPA Tariffs | Sakshi
Sakshi News home page

డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

Mar 6 2026 7:19 AM | Updated on Mar 6 2026 9:01 AM

US Court of International Trade Orders Refunds of IEEPA Tariffs

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తన పరిధిలో లేని 1977 అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ)ను అడ్డుపెట్టుకుని విదేశాలపై విధించిన అధిక టారిఫ్‌ల మాటున వసూలుచేసిన 130 బిలియన్‌ డాలర్లను తిరిగి ఆయా కంపెనీలకే చెల్లించాలని మాన్‌హట్టన్‌ నగరంలోని ‘యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌’లో జడ్జి రిచర్డ్‌ ఈటన్‌ తీర్పు చెప్పారు.

టెన్నిస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్లే నగరంలోని అట్మాస్‌ ఫిల్‌ట్రేషన్‌ అనే సంస్థ వేసిన పిటిషన్‌ను విచారిస్తూ జడ్జి ఈ తీర్పు వెలువర్చారు. ప్రపంచదేశాలపై ట్రంప్‌ విధించిన టారిఫ్‌లు చట్టవిరుద్ధమంటూ ఫిబ్రవరి 20వ తేదీన అమెరికా దేశ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. కానీ ఆయా దేశాల కంపెనీలు చెల్లించిన అధిక టారిఫ్‌లను తిరిగి వాళ్లకే రీఫండ్‌ చేయాలని తీర్పులో ఎక్కడా పేర్కొనలేదు. అయితే గురువారం ట్రేడ్‌ కోర్టు ఇచ్చిన తీర్పుతో రీఫండ్‌ విషయంలో స్పష్టత వచి్చనట్లయింది.

Advertisement
 
Advertisement
Advertisement