breaking news
Peace Prize
-
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం
వెనెజులాకు చెందిన ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం వరించింది. చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా శాంతి కోసం ఆమె చేసిన విశేష కృషికి గాను ఈ పురస్కారం లభించింది. 1967 అక్టోబర్ 7న జన్మించిన మరియా కొరీనా మచాడో.. 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి వెనిజులా ఐరన్ లేడీగా కూడా ఆమె పేరు పొందారు, టైమ్ మ్యాగజైన్ -'2025లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు' జాబితాలో ఆమె చోటు సంపాదింకున్నారు కూడా. 2012లో వెనుజులా అధ్యక్ష పదవి కోసం పోటి చేసిన మరియా.. 2014లో దేశంలో ఆందోళనలకు న్యాయకత్వం వహించారు .వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె అవిశ్రాంత కృషి, నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత పరిష్కారాన్ని సాధించడానికి చేసిన పోరాటం కోసం మచాడోను గుర్తిస్తున్నట్లు నోబెల్ కమిటి స్పష్టం చేసింది. పెరుగుతున్న చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా, నిబద్ధత కలిగిన శాంతి విజేతగా మచాడోను కమిటీ ప్రశంసించింది.రాజకీయ పాత్ర..Vente Venezuela అనే రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. Súmate అనే సంస్థ స్థాపించి స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం పనిచేశారు2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హత పొందిన తర్వాత, ప్రత్యామ్నాయ అభ్యర్థికి మద్దతు ఇచ్చి ప్రజలలో చైతన్యం కలిగించారు.ఎన్నికల మోసాలను బయటపెట్టేందుకు స్వయంగా పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.విద్యా నేపథ్యం:ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్ఫైనాన్స్ స్పెషలైజేషన్యేలె యూనివర్శిటీ వరల్డ్ ఫెల్లోస్ ప్రోగ్రామ్అంతర్జాతీయ గుర్తింపుబీబీసీ-100 మంది అత్యంత ప్రభావంతుల జాబితాలో చోటు(2018)చార్లెస్ టి. మానాట్ ప్రైజ్(2014)లిబరల్ ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ ప్రైజ్(2019)ఇదీ చదవండి: బిగ్ షాక్.. డొనాల్డ్ ట్రంప్‌కి దక్కని నోబెల్ శాంతి బహుమతి -
ట్రంప్..‘ది పీస్ ప్రెసిడెంట్’: వైట్‌హౌస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంత కాలంగా తను నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తాను ఏడు యుద్ధాలను ఆపినట్టు ట్రంప్ చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ విషయమై వైట్‌హౌస్ ఆయనను ‘ది పీస్ ప్రెసిడెంట్’గా పేర్కొంది. కాగా, ప్రస్తుతం నోబెల్ బహుమతులకు సంబంధించి.. వివిధ విభాగాలకు విజేతలను ప్రకటిస్తున్నారు. శాంతి బహుమతికి ఇంకా ప్రకటించలేదు.నోబెల్ శాంతి బహుమతి శుక్రవారం ప్రకటించాల్సి ఉండగా.. ఈ విషయమై తాజాగా ట్రంప్‌ను మీడియా ప్రశ్నించారు. ఈ సందర్బంగా ట్రంప్ స్పందిస్తూ..‘నాకు అదంతా తెలియదు.. నేను ఏడు యుద్ధాలను పరిష్కరించాను. ఎనిమిదో యుద్ధాన్ని(ఉక్రెయిన్, రష్య) పరిష్కరించడానికి దగ్గరగా ఉన్నాము. రష్యా పరిస్థితిని మనం పరిష్కరించుకుంటామని నేను అనుకుంటున్నాను. చరిత్రలో ఎవరూ ఇన్ని యుద్ధాలను ఆపలేదు. నోబెల్ శాంతి బహుమతి కోసం ఇప్పటికే పలు దేశాలు నన్ను నామినేట్ చేశాయి. కానీ, నోబెల్ కమిటీ మాత్రం.. నాకు శాంతి బహుమతి రాకుండగా.. ఒక కారణాన్ని కనుగొంటున్నారు అని విమర్శలు చేశారు.THE PEACE PRESIDENT. pic.twitter.com/bq3nMvuiSd— The White House (@WhiteHouse) October 9, 2025మరోవైపు.. ట్రంప్‌కు నోబెల్ శాంతి విషయంలో తాజాగా వైట్‌హౌస్ స్పందించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..‘ది పీస్ ప్రెసిడెంట్’ అనే శీర్షికతో ప్రకటనను పంచుకుంది. ఇదిలా ఉండగా.. ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేసిన దేశాలలో పాకిస్తాన్ కూడా ఉంది. జూన్ 20న, ఇస్లామాబాద్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేస్తామని ప్రకటించింది ఇటీవల భారత్-పాకిస్తాన్ సంక్షోభంలో ఆయన నిర్ణయాత్మక దౌత్య జోక్యం కీలకమైన నాయకత్వం వహించారని పాక్ చెప్పుకొచ్చింది. -
ట్రంప్‌కు కంబోడియా మద్దతు.. అసాధారణ రాజనీతిజ్ఞుడంటూ కితాబు
న్యూఢిల్లీ:ప్రపంచంలోని పలు దేశాలపై ఇష్టమొచ్చిన రీతిలో సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, దీనికి భిన్నంగా కంబోడియా ట్రంప్‌కు మద్దతు పలుకుతోంది. పైగా ఆయన అసాధారణ రాజనీతిజ్ఞుడంటూ కితాబిచ్చింది. దీనివెనుక ప్రత్యేక కారణముంది.పాకిస్తాన్, ఇజ్రాయెల్ ఇప్పుడు కంబోడియా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని ప్రధానం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ట్రంప్ కూడా తాను ప్రపంచ శాంతిదూతను అని చెప్పుకుంటూ నోబెల్‌కు అర్హుడనని అంటున్నారు. ఇస్లామాబాద్, టెల్ అవీవ్ ఇప్పుడు కంబోడియాలోని మిత్రదేశాలు ట్రంప్‌కు నోబెల్ ఇవ్వాలంటూ ఒకే స్వరాన్ని ఆలపిస్తున్నాయి. తాజాగా యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కంబోడియా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. దీనితో నోబెల్ శాంతి బహుమతి డిమాండ్‌కు మద్దతు ఇస్తున్న మూడవ దేశంగా కంబోడియా నిలిచింది.ఈ అంశంపై కంబోడియా ప్రధాని హున్ మానెట్ మాట్లాడుతూ తాము ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నామని, కంబోడియా- థాయిలాండ్ మధ్య సరిహద్దు వివాదాన్ని నియంత్రించడంలో ఆయన అసాధారణ రాజనీతిజ్ఞతను చూపారని ప్రశంసించారు. అలాగే తమ దేశంపై సుంకాన్ని 49 శాతం నుంచి 19 శాతానికి తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫేస్బుక్ పోస్ట్‌లో హున్ మానెట్ ఈ ప్రకటన చేశారు. ట్రంప్ జోక్యం అనేది ప్రపంచంలోని అత్యంత అస్థిర ప్రాంతాలలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, దోహదపడుతున్నదంటూ నార్వేజియన్ నోబెల్ కమిటీకి ఆయన పేరును పంపినట్లు పేర్కొన్నారు. జూలై 26న ట్రంప్ పిలుపు కారణంగా థాయిలాండ్- కంబోడియా మధ్య యుద్ధ ప్రతిష్టంభన తొలగిందని, జూలై 28న కాల్పుల విరమణ జరిగిందనే వార్తలు వినిపించాయి. ఈ ఘర్షణల్లో 43 మంది మృతిచెందగా, మూడు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కాగా భారత్- పాక్ మధ్య జరిగిన ఘర్షణలతో సహా ఆరు వివాదాలకు ట్రంప్ ముగింపు పలికేలా చేశారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఇటీవల అన్నారు. -
నాడు బెదిరింపులు, నిషేధానికి గురైన అమ్మాయి..నేడు ప్రపంచమే..!
‘నువ్వు మాట్లాడకూడదు’ అని బెదిరింపులు ఎదుర్కొన్న అమ్మాయి గురించి ఇప్పుడు ప్రపంచం గొప్పగా మాట్లాడుకుంటోంది. ‘నువ్వు ఇంటికే పరిమితం కావాలి’ అనే అప్రకటిత నిషేధానికి గురైన అమ్మాయి గురించి..‘నీలాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో ఉండాలి’ అంటున్నారు. అఫ్గానిస్థాన్‌కు చెందిన పదిహేడేళ్ల నీలా ఇబ్రహీమి ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్ (కిడ్స్ రైట్స్ ప్రైజ్) గెలుచుకుంది. మహిళలు, బాలికల హక్కుల కోసం బలంగా తన గొంతు వినిపించినందుకు నీలా ‘కిడ్స్ రైట్స్ ప్రైజ్’కు ఎంపికైంది....‘కిడ్స్ రైట్స్’ ఫౌండేషన్ అందించే అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి మానవహక్కులు, సామాజిక న్యాయానికి సంబంధించి గణనీయమైన కృషిచేసిన వారికి ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా 47 దేశాల నుంచి 165 మంది నామినీల నుంచి గట్టి పోటీని అధిగమించి ఈ బహుమతికి ఎంపికైంది నీలా ఇబ్రహీమి.‘నీలా ధైర్యసాహసాలకు ముగ్ధులం అయ్యాం’ అన్నారు ‘కిడ్స్ రైట్స్ ఫౌండేషన్’ ఫౌండర్ మార్క్ డల్లార్ట్.లింగ సమానత్వం, అఫ్గాన్ మహిళల హక్కుల పట్ల నీలా పాట, మాట ఆమె అంకితభావం, ప్రతిఘటనకు ప్రతీకలుగా మారాయి. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఊహించినట్లుగానే మహిళల హక్కులను కాలరాయడం మొదలుపెట్టారు. ఆడపిల్లలు ప్రాథమిక పాఠశాలకు మించి చదువుకోకూడదు. మహిళలు మార్కులు, జిమ్, బ్యూటీ సెలూన్లకు వెళ్లడాన్ని నిషేధించారు. మహిళలు ఇల్లు దాటి బయటికి రావాలంటే పక్కన ఒక పురుషుడు తప్పనిసరిగా ఉండాల్సిందే. దీనికితోడు కొత్త నైతిక చట్టం మహిళల బహిరంగ ప్రసంగాలపై నిషేధం విధించింది. ఈ పరిస్థితినిఐక్యరాజ్యసమితి ‘లింగ వివక్ష’గా అభివర్ణించింది. తాలిబన్ ప్రభుత్వం మాత్రం ఇది నిరాధారమని, దుష్ప్రచారం అని కొట్టి పారేసింది. మహిళల హక్కులపై తాలిబన్ల ఉక్కుపాదం గురించి నీలా పాడిన శక్తిమంతమైన నిరసన పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పాట అఫ్గాన్ సమాజంపై చూపిన ప్రభావం ఇంతా అంతా కాదు. నీలా ‘ఐయామ్ మైసాంగ్’ మూవ్మెంట్ మహిళల హక్కులపై గొంతు విప్పడానికి ఎంతోమందికి స్ఫూర్తినీ, ధైర్యాన్ని ఇచ్చింది.‘నేను చేసిన పని రిస్క్‌తో కూడుకున్నది. అది అత్యంత ప్రమాదకరమైనదని కూడా. అయితే ఆ సమయంలో నాకు అదేమీ తెలియదు. ఎందుకంటే అప్పుడు నా వయసు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది నీలా. ‘అంతర్జాతీయ బాలల శాంతి బహుమతిని గెలుచుకోవడం అంటే అఫ్గాన్ మహిళలు, బాలికల గొంతు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించడం. తాలిబన్ల ΄పాలనలో అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళల హక్కుల కోసం పోరాడాను. పోరాడుతూనే ఉంటాను’ అంటూ పురస్కార ప్రదానోత్సవంలో మాట్లాడింది నీలా.నీలా పట్ల అభిమానం ఇప్పుడు అఫ్గాన్ సరిహద్దులు దాటింది. అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు అభిమానులు ఉన్నారు. అఫ్గాన్‌ను విడిచిన నీలా ఇబ్రహీమి ‘30 బర్డ్స్ ఫౌండేషన్’ సహాయంతో కుటుంబంతో కలిసి కెనడాలో నివసిస్తుంది. ‘నేను నా కొత్త ఇంట్లో సురక్షితంగా ఉన్నాను. అయితే అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమ్మాయిల గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. ప్రపంచంలో ఏ ్ర΄ాంతంలో మహిళల హక్కులు దెబ్బతిన్నా అది యావత్ ప్రపంచంపై ఏదో ఒకరకంగా ప్రభావం చూపుతుంది’ అంటుంది నీలా. ‘హర్ స్టోరీ’ కో–ఫౌండర్‌గా అఫ్గానిస్థాన్‌లోని అమ్మాయిలు తమ గొంతు ధైర్యంగా వినిపించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తోంది.అఫ్గాన్‌లో మహిళా విద్య, హక్కులకు సంబంధించి జెనీవా సమ్మిట్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రసీ. యూకే హౌజ్ ఆఫ్ లార్డ్స్, కెనడియన్ ఉమెన్ ఫర్ ఉమెన్ ఆఫ్ అఫ్గానిస్థాన్ మాంట్రియల్ సమ్మిట్, టెడ్ వాంకూవర్లాంటి వివిధ కార్యక్రమాలలో తన గళాన్ని వినిపించిన నీలా ఇబ్రహీమీ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలాతో కలిసి పనిచేస్తోంది. -
ప్రైజ్‌మనీని విరాళం ఇచ్చిన మోదీ
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి.. దక్షిణా కొరియా ప్రభుత్వం ప్రతిష్టాత్మక సియోల్ శాంతి బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డు ద్వారా వచ్చిన కోటిన్నర ప్రైజ్‌మనీని ‘నమామీ గంగే ఫండ్’కు విరాళంగా ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు. అంతేకాక తనకు వచ్చిన అవార్డును భారతీయులకు అంకింతం చేస్తున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ అవార్డు నాకు దక్కిన వ్యక్తిగతమైన గౌరవం కాదు. ఇది దేశ ప్రజలకు చెందుతుంది.. గత ఐదేళ్లలో భారత్ సాధించిన ప్రగతికి ఈ అవార్డు నిదర్శనం. 130 కోట్ల మంది భారతీయుల సత్తాకు ఈ అవార్డు అంకితమిస్తున్నాను’ అన్నారు మోదీ. -
మోదీకి సియోల్ శాంతి బహుమతి ప్రదానం
సియోల్: దక్షిణా కొరియా ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక సియోల్ శాంతి బహుమతిని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అందుకున్నారు. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ అభివృద్ధి, మానవ అభివృద్ధికి చేసిన సేవలకుగానూ దక్షిణకొరియా ప్రభుత్వం సియోల్ శాంతి బహుమతిని మోదీకి ప్రదానం చేసింది. ఈ అవార్డు తనకు దక్కిన వ్యక్తిగతమైన గౌరవం కాదని, ఇది దేశ ప్రజలకు చెందుతుందని మోదీ అన్నారు. గత అయిదేళ్లలో భారత్ సాధించిన ప్రగతికి ఈ అవార్డు నిదర్శనమన్నారు. 130 కోట్ల మంది భారతీయుల సత్తాకు ఈ అవార్డు దక్కుతుందన్నారు. మహాత్మా గాంధీ150వ జయంతి జరుగుతున్న సంవత్సరంలో ఈ అవార్డును అందుకోవడం గర్వంగా ఉందని మోదీ చెప్పారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెనుసవాళ్లని పేర్కొన్నారు. 1988లో సియోల్‌లో ఒలింపిక్స్ క్రీడలు జరగడానికి కొన్ని వారాల ముందే ఆల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థ ఏర్పడిందని, ఇప్పుడు తీవ్రవాదం, ఉగ్రవాదం .. ప్రపంచదేశాలకు సమస్యగా మారిందన్నారు. సియోల్ శాంతి బహుమతి గతంలో అందుకున్న ప్రముఖుల్లో ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ కోఫీ అన్నన్, జర్మనీ ఛాన్స్లర్ ఏంజిలా మోర్కెల్‌లు ఉన్నారు. -
మోదీకి అరుదైన విదేశీ పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్షిణకొరియా ప్రతిష్టాత్మక సియోల్ శాంతి పురస్కరాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ సహకారం, అభివృద్ధిలో కృషి చేసినందుకు 2018 ఏడాదికి గాను మోదీకి ఈ అవార్డు దక్కింది. భారత్‌ను అభివృద్ధి బాట పట్టించిన మోదీ.. ప్రపంచ శాంతికై పనిచేశారనీ, భారత్‌లో మానవ వనరుల అభివృద్ధితో ‘మోదినామిక్స్’ చేశారని, భారత్‌లో అవినీతి కట్టడికి ప్రధాని మోదీ కృషి చేశారనీ, నోట్ల రద్దు వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారని సియోల్ శాంతి పురస్కార కమిటీ పేర్కొంది. 1990లో 24వ ఒలింపిక్ క్రీడలను సియోల్‌లో విజయవంతంగా నిర్వహించిన దానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ పురస్కారం అందుకుంటున్న పద్నాలుగో వ్యక్తి మోదీ. ఆయనకంటే ముందు యూఎన్ సెక్రటరీ జనరల్ కోఫి అన్నన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ వంటి ప్రముఖులకు ఈ అవార్డు అందజేశారు. కాగా.. తనకు సియోల్ శాంతి పురస్కారం ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు. దక్షిణకొరియాతో భారత్‌కు ఉన్న మెరుగైన భాగస్వామ్య ఒప్పందాల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. -
ప్రధాని మోదీకి సియోల్ శాంతి పురస్కారం
-
మదర్‌కు నోబెల్ శాంతి బహుమతి
ఆ నేడు 1979 అక్టోబర్ 17 నార్వేలో గల నోబెల్ కమిటీ మదర్ థెరిస్సాకు శాంతి బహుమతిని ప్రకటించింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ బహుమతిని జాతి, కుల, మత, లింగ, వర్ణ, వర్గ వివక్షలు లేకుండా అవసరమైన వారికి ఆపన్న హస్తం అందిస్తూ, ప్రజలందరి మధ్యా, శాంతి, సుహృద్భావనలకు బాటలు వేస్తూ మదర్ థెరిస్సా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆమెను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. సమాజంలో అట్టడుగున అణగారిన బలహీన వర్గాల వారికి, నిర్భాగ్యులకు నిరుపమానమైన సేవలు అందిస్తూ, అందరినీ అమ్మలా ఆదరిస్తూ విశ్వశాంతికి తోడ్పడుతున్న ఈ విశ్వమాతను ఈ పురస్కారానికి ఎంపిక చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. -
'ఒబామాకు నోబెల్ ఇవ్వడం ఓ పెద్ద తప్పిదం'
ఓస్లో: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ బహుమతి ఇవ్వడంపట్ల నార్వే నోబెల్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ లుండెస్టెడ్ విచారం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ఒబామాను మరింత ప్రోత్సహించేలా ఉంటుందని భావించాము. కమిటీ ఏమైతే ఆశించి ఒబామను 2009 నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంపిక చేసిందో..దాంట్లో ఆయన పూర్తిగా విఫలమయ్యాడని ఆయన రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఒబామా కూడా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవడం నమ్మలేక పోయాడని తెలిపారు. 2009లో నోబెల్ శాంతికి ఒబాను ఎంపిక చేయడం మీద జరిగినంత చర్చ.. మరే సంవత్సరానికి ఎంపిక అయిన వారి మీద జరగలేదన్నారు. చాలా మంది ఒబామా అనుచరులు కూడా ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేయడం ఒక తప్పిదంగానే భావిస్తున్నారని పేర్కొన్నారు. నోబుల్ శాంతి బహుమతికి అతను అర్హుడు కాదని యూఎస్ లోని చాలా మంది అభిప్రాయపడ్డారని తెలిపారు. -
సత్యార్థి కార్యాలయం కిటకిట
సాక్షి, న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త కైలాష్ సత్యార్థి నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికైన నేపథ్యంలో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలోగల ఆయన కార్యాలయం సందర్శకులతో కిటకిటలాడుతోంది. పరిచయం ఉన్నవారు, పరిచయం లేనివారు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నిజానికి నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించేంతవరకు నగరంలో చాలామందికి ఆయన ఎవరో తెలియదు. కైలాష్ సత్యార్థి నేతృత్వంలోని ఎన్జీఓ బచ్పన్ బచావో ఆందోళన సంస్థ పేరు తరచూ వార్తాపత్రికల్లో కనిపించడమే తప్ప మీడియాలో పెద్దగా రాలేదు. బాలకార్మికుల విముక్తి కోసం, అక్రమ వ్యాపారుల కోరల్లోంచి బాలలను రక్షించడం కోసం జరిపిన కృషికి ఆయనకు ఎన్నో పురస్కారాలు లభించినప్పటికీ వాటిలో ప్రముఖ భారతీయ పురస్కారమేదీ లేదు. నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యేంతవరకు ఆయన ట్విటర్ అకౌంట్ ఫాలోయర్ల సంఖ్య 150 మాత్ర మే పురస్కారం వార్త తెలిసిన వెంటనే పరిస్థితి మారిపోయింది. శుక్రవారం సాయంత్రం నాటికి ఆయన ట్విటర్ ఫాలోయర్ల సంఖ్య 13,500కు పెరిగింది. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపాయినా బచ్పన్ బచావో ఆందోళన్ మూడు దశాబ్దాలుగా దేశమంతటా బాలకార్మికుల విముక్తి కలిగించడానికి కృషి చేస్తూనే ఉంది. ఈప్రయత్నంలో ఎన్నో సార్లు బెదిరంపులకు, దాడులకు గురైనా సత్యార్థి వెరవలేదు. నగర పరిధిలో మొత్తం ఏడు వేలమంది బాలకార్మికులకు ఈ సంస్థ విముక్తి కలిగించింది. సత్యార్థి, ఆయన నడిపే బచ్పన్ బచావో ఆందోళన్ తప్పిపోయిన పిల్లల ఆచూకీ తెలుసుకోవడం కోసం, ప్ల్లేస్మెంట్ ఏజెన్సీల ద్వారా ఇళ్లలో పనిచేసే పిల్లలను వేధింపుల బారినుంచి రక్షించడానికి పోరాటం కొనసాగిస్తున్నారు. తప్పిపోయిన పిల్లలకు సంబంధించిన అన్ని కేసులను తప్పనిసరిగా నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడం వెనుక బచ్పన్ బచావో ఆందోళన్ కృషి ఎంతో ఉంది.