
వెనెజులాకు చెందిన ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం వరించింది. చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా శాంతి కోసం ఆమె చేసిన విశేష కృషికి గాను ఈ పురస్కారం లభించింది. 1967 అక్టోబర్ 7న జన్మించిన మరియా కొరీనా మచాడో.. 2002లో రాజకీయాల్లోకి వచ్చారు.
ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి వెనిజులా ఐరన్ లేడీగా కూడా ఆమె పేరు పొందారు, టైమ్ మ్యాగజైన్ -'2025లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు' జాబితాలో ఆమె చోటు సంపాదింకున్నారు కూడా. 2012లో వెనుజులా అధ్యక్ష పదవి కోసం పోటి చేసిన మరియా.. 2014లో దేశంలో ఆందోళనలకు న్యాయకత్వం వహించారు .
వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె అవిశ్రాంత కృషి, నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత పరిష్కారాన్ని సాధించడానికి చేసిన పోరాటం కోసం మచాడోను గుర్తిస్తున్నట్లు నోబెల్ కమిటి స్పష్టం చేసింది. పెరుగుతున్న చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా, నిబద్ధత కలిగిన శాంతి విజేతగా మచాడోను కమిటీ ప్రశంసించింది.
రాజకీయ పాత్ర..
- Vente Venezuela అనే రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు.
- Súmate అనే సంస్థ స్థాపించి స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం పనిచేశారు
- 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హత పొందిన తర్వాత, ప్రత్యామ్నాయ అభ్యర్థికి మద్దతు ఇచ్చి ప్రజలలో చైతన్యం కలిగించారు.
- ఎన్నికల మోసాలను బయటపెట్టేందుకు స్వయంగా పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
విద్యా నేపథ్యం:
- ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్
- ఫైనాన్స్ స్పెషలైజేషన్
- యేలె యూనివర్శిటీ వరల్డ్ ఫెల్లోస్ ప్రోగ్రామ్

అంతర్జాతీయ గుర్తింపు
- బీబీసీ-100 మంది అత్యంత ప్రభావంతుల జాబితాలో చోటు(2018)
- చార్లెస్ టి. మానాట్ ప్రైజ్(2014)
- లిబరల్ ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ ప్రైజ్(2019)
ఇదీ చదవండి:
బిగ్ షాక్.. డొనాల్డ్ ట్రంప్‌కి దక్కని నోబెల్ శాంతి బహుమతి