breaking news
Maria Corina Machado
-
అంతా ట్రంప్ చలవే.. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం: ‘నోబెల్ శాంతి’ విజేత
నోబెల్ శాంతి పురస్కారం ప్రకటన తర్వాత వైట్‌హౌస్ నుంచి విమర్శల వాన కురిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కాకుండా వెనెజులా ప్రతిపక్ష నేత, ఆ దేశంలో ప్రజాస్వఘ్యానికి పాటుబడ్డ మరియా కొరీనా మచోడాకు నోబెల్ శాంతి పురస్కారం లభించడమే అందుకు కారణం.నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించే క్రమంలో సదరు కమిటీ రాజకీయ దురుద్దేశంతోనే మరియాకు ఆ ప్రతిష్టాత్మక బహుమతిని కేటాయించిందని మండపడింది వైట్‌హౌస్. శాంతి అవార్డుల్లో కూడా పాలిటిక్స్‌ను జోడించారని విమర్శించింది. ఇదిలా ఉంచితే, మరియా పదే పదే ట్రంప్‌పై గతంలో ప్రశంసలు కురిపించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. వెనెజులా శాంతి స్థాపనలో ట్రంప్ కృషి వెలకట్టలేనిదని నోబెల్ శాంతి పురస్కారం గెలుచుకున్న మరియా ప్రశంసించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘ అంతా మీ చలవే.. ట్రంప్‌ను గుర్తుపెట్టుకుంటాం’ అంటూ ఆమె చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారాయి. 2025 నోబెల్ శాంతి పురస్కారం విజేత మరియా కొరీనా మచాడో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి పలు సందర్భాల్లో కొనియాడారు. ముఖ్యంగా వెనిజులా ప్రజాస్వామ్య పోరాటానికి ఆయన మద్దతును కొనియాడారు.. ట్రంప్‌ను “వెనిజులా స్వేచ్ఛకు అత్యంత గొప్ప అవకాశంగా” ఆమె అభివర్ణించారు. ట్రంప్ పాలనలో మడురో ప్రభుత్వంపై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగి, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు దోహదపడిందన్నారు.President Trump,Your unwavering support for Venezuela’s fight for democracy is deeply valued. With extraordinary courage, the Venezuelan people have consistently defied fear and brutal repression, standing united to reject a criminal regime desperate to cling to power and… https://t.co/7EVCvHiQ2v— María Corina Machado (@MariaCorinaYA) January 11, 2025 ఇక ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారం దక్కకపోవడంతో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘ నా నోబెల్ నాకు కావాలి’ అంటూ ట్రంప్‌ను ట్రోల్స్ చేస్తున్నారు. ఇవి కూడా చదవండి: మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారంనోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర?.. ట్రంప్ సంచలన ఆరోపణ! -
నోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర?.. ట్రంప్ సంచలన ఆరోపణ!
వాషింగ్టన్: నోబెల్ కమిటీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుందని నిరూపించిందని ఆరోపించారు.వెనిజులా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న మరియా కొరీనా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి లభించింది. అయితే, నార్వే నోబెల్ కమిటీ అవార్డు ప్రకటనపై వైట్ హౌస్ తీవ్రంగా స్పందించింది .ఈ అవార్డును డొనాల్డ్ ట్రంప్ తనకు తానుగా ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుందని ఈ అవార్డుల ప్రధానంతో నిరూపించింది’ అని వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. కానీ, అధ్యక్షుడు ట్రంప్ శాంతి ఒప్పందాలు చేసుకోవడం, యుద్ధాలను ముగించడం, ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తుంటారు. ఆయన గొప్ప మానవతావాది. అలాంటి వారు తమ సంకల్ప శక్తితో పర్వతాలను కదిలించగలరు’ అని పేర్కొన్నారు. -
నోబెల్ బహుమతి అంటే పేరు మాత్రమే కాదు.. కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కూడా!
ఓస్లో: ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి మరియా కొరనీ మచాడోను వరించింది. వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కల కోసం పోరాడినందుకు గానూ నార్వే నోబెల్ కమిటీ ఆమెకు ఈ బహుమతి అందిస్తున్నట్లు తెలిపింది.ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన నోబెల్ శాంతి పురస్కారం పొందిన గ్రహితలకు అందే ప్రొత్సహకాలపై చర్చ మొదలు కాగా.. వాటి వివరాలు నోబెల్ పీస్ ప్రైజ్ వెబ్సైట్లో ఉన్నాయి. వాటి ఆధారంగా ఎవరైతే నోబెల్ శాంతి బహుమతి పొందారో వారికి ప్రైజ్ మనీ కింద 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ (SEK) అందుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ.102 కోట్లు పైచీలుకు మొత్తాన్ని దక్కించుకోవచ్చు. స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ కోరిక మేరకు 1901 నుంచి అవార్డుల ఇవ్వడం ప్రారంభమైంది. మానవాళికి ప్రయోజనం చేకూర్చుతూ పాటుపడిన శాంతి, సాహిత్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, ఆర్థిక శాస్త్రాలు ఆరురంగాల వారికి అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు.తన మరణానికి ఒక సంవత్సరం ముందు, 1895 నవంబర్ 27న తన వీలునామాపై సంతకం చేసిన ఆల్ఫ్రెడ్ నోబెల్, తన సంపదలో ఎక్కువ భాగాన్ని, SEK 31 మిలియన్లకు పైగా (నేడు సుమారు SEK 2.2 బిలియన్లు) సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి నుంచి వచ్చిన ఆదాయాన్ని ఏటా మానవాళికి గణనీయంగా ప్రయోజనం చేకూర్చిన వారికి బహుమతులుగా పంపిణీ చేసేలా వీలునామాలో పేర్కొన్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ఆధారంగా పైన పేర్కొన్న ఆరు రంగాల్లో విశేష కృషి చేసినందుకు నోబెల్ బహుమతి అందివ్వడం ఆనవాయితీగా వస్తుంది. నోబెల్ బహుమతి పొందిన వారికి భారీ మొత్తంలోప్రైజ్ మనీ దక్కనుంది.పతకం రూపకల్పన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని నార్వేజియన్ శిల్పి గుస్తావ్ విజిలాండ్, స్వీడిష్ శిల్పి ఎరిక్ లిండ్బర్గ్ సహకారంతో రూపొందించారు. ఈ పతకం మొదట 1902లో అవార్డు వేడుకలో ఉపయోగించారు. ఆరంభంలో..23-క్యారెట్ బంగారంతో తయారు చేశారు. బరువు 192 గ్రాములు 1980 తర్వాత.. 18 క్యారెట్ బంగారంగా మార్చారు. బరువు కొద్దిగా పెరిగి 196 గ్రాములు అయ్యింది.వ్యాసం: 6.6 సెంటీమీటర్లు ఇది స్థిరంగా ఉంది.పతకం రూపం,చిహ్నాలు:నోబెల్ ప్రైజ్ ముందు భాగం ఆల్ఫ్రెడ్ నోబెల్ పోర్ట్రెయిట్ఆయన పేరు, జనన తేదీ, మరణ సంవత్సరంవెనుక భాగం:ముగ్గురు నగ్న పురుషులు కౌగిలించుకున్న దృశ్యంఇది అంతర్జాతీయ సోదరభావానికి చిహ్నంలాటిన్ శాసనం: Pro pace et fraternitate gentium ‘ప్రజల మధ్య శాంతి, సోదరభావం కోసం’అంచు:5 మిల్లీమీటర్ల మందపాటి అంచు చుట్టూసంవత్సరం, అవార్డు గ్రహీత పేరు చెక్కబడి ఉంటుందిఈ పతకం రూపకల్పన, దాని చిహ్నాలు, దాని వెనుక ఉన్న భావన నోబెల్ శాంతి బహుమతికి ఉన్న ఆధ్యాత్మికత, గౌరవం, ప్రపంచ శాంతికి అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి. -
బిగ్ షాక్.. డొనాల్డ్ ట్రంప్‌కి దక్కని నోబెల్ శాంతి బహుమతి
ఓస్లో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భారీ షాక్ తగిలింది. ట్రంప్‌కు 2025 నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) దక్కలేదు. బదులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వెనుజులా ప్రతిపక్షనేత మరియా కొరీనా మచాడోకు (María Corina Machado) నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ క్రమంలో 2025 నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ మిస్ కావడం ఇపుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు ప్రపంచ శాంతికి కృషి చేసిన మహానుభావులు నోబెల్ శాంతి బహుమతిని అందుకుంటుంటే, మరోవైపు కొన్ని వివాదాస్పద వ్యక్తులు కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని పొందిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలను పరశీలిస్తే..👉ఇదీ చదవండి : మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారంయాసిర్ అరాఫత్ (1994): ఇజ్రాయెల్-పాలస్తీన్ మధ్య ఒప్పందానికి కృషి చేసినందుకు బహుమతి పొందారు. కానీ ఆయనపై తీవ్రవాద కార్యకలాపాల ఆరోపణలు ఉండటం వల్ల విమర్శలు ఎదురయ్యాయి.బరాక్ ఒబామా (2009): అధ్యక్ష పదవిలోకి వచ్చిన ఏడాదిలోనే శాంతి ప్రయత్నాలకు బహుమతి రావడం అనేక ప్రశ్నలు రేకెత్తించింది. ట్రంప్ సైతం తాజాగా ఒబామా ఏం చేశారని అధ్యక్ష పదవి చేపట్టిన 8 నెలలకే నోబెల్ ఇచ్చారని, పైగా ఆయన అమెరికాను నాశనం చేశారని మండిపడ్డారు కూడా.ఆంగ్ సాన్ సూకీ (1991): మయన్మార్ ప్రజాస్వామ్య పోరాటానికి గుర్తింపుగా బహుమతి పొందారు. కానీ 2017లో రోహింగ్యా ముస్లింలపై జరిగిన హింసను నిరసించకపోవడం వల్ల ఆమెపై విమర్శలు వచ్చాయి.హెన్రీ కిస్సింజర్ (1973): వియత్నాం యుద్ధం ముగింపుకు కృషి చేసినందుకు బహుమతి పొందారు. కానీ యుద్ధంలో అమెరికా పాత్రపై తీవ్ర విమర్శలు ఉన్నాయి.అబి అహ్మద్ (2019): ఈథియోపియాలో శాంతి ఒప్పందానికి కృషి చేసినందుకు బహుమతి పొందారు. కానీ తరువాత దేశంలో అంతర్గత హింస పెరగడం వల్ల ఆయనపై విమర్శలు వచ్చాయి.వంగారి మాథై (2004): పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఆమె, HIV బాధితులపై చేసిన వ్యాఖ్యల వల్ల వివాదంలోకి వచ్చారు.గాంధీకి నోబెల్ ఎందుకు రాలేదంటే.. మహాత్మా గాంధీ.. శాంతి, అహింసకు ప్రతిరూపం. ఆయన నోబెల్ శాంతి బహుమతికి పలు మార్లు నామినేట్ అయ్యారు. 1948లో ఆయన హత్యకు గురైన టైంలో నోబెల్ కమిటీ.. ఈ గౌరవానికి అర్హులే లేరు అంటూ ఓ ప్రకటన విడుదల చేయడం వివాదాస్పదమైంది. రాజకీయ కారణాలు, బ్రిటిష్ ప్రభావం, అంతర్జాతీయ పరిస్థితులు ,ఇవన్నీ బహుమతి రాకపోవడానికి కారణాలుగా భావించబడ్డాయి. అయితే.. నోబెల్ కమిటీ 2006లో “గాంధీకి బహుమతి ఇవ్వకపోవడం మా పెద్ద తప్పు” అని అంగీకరించింది. ట్రంప్‌కి నోబెల్ శాంతి బహుమతి వచ్చి ఉంటే గనుక.. పై జాబితాలో చేరి ఉండేదే. కానీ, ప్చ్.. ఆయన కల నెరవేరలేదు. -
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం
వెనెజులాకు చెందిన ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం వరించింది. చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా శాంతి కోసం ఆమె చేసిన విశేష కృషికి గాను ఈ పురస్కారం లభించింది. 1967 అక్టోబర్ 7న జన్మించిన మరియా కొరీనా మచాడో.. 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి వెనిజులా ఐరన్ లేడీగా కూడా ఆమె పేరు పొందారు, టైమ్ మ్యాగజైన్ -'2025లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు' జాబితాలో ఆమె చోటు సంపాదింకున్నారు కూడా. 2012లో వెనుజులా అధ్యక్ష పదవి కోసం పోటి చేసిన మరియా.. 2014లో దేశంలో ఆందోళనలకు న్యాయకత్వం వహించారు .వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె అవిశ్రాంత కృషి, నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత పరిష్కారాన్ని సాధించడానికి చేసిన పోరాటం కోసం మచాడోను గుర్తిస్తున్నట్లు నోబెల్ కమిటి స్పష్టం చేసింది. పెరుగుతున్న చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా, నిబద్ధత కలిగిన శాంతి విజేతగా మచాడోను కమిటీ ప్రశంసించింది.రాజకీయ పాత్ర..Vente Venezuela అనే రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. Súmate అనే సంస్థ స్థాపించి స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం పనిచేశారు2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హత పొందిన తర్వాత, ప్రత్యామ్నాయ అభ్యర్థికి మద్దతు ఇచ్చి ప్రజలలో చైతన్యం కలిగించారు.ఎన్నికల మోసాలను బయటపెట్టేందుకు స్వయంగా పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.విద్యా నేపథ్యం:ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్ఫైనాన్స్ స్పెషలైజేషన్యేలె యూనివర్శిటీ వరల్డ్ ఫెల్లోస్ ప్రోగ్రామ్అంతర్జాతీయ గుర్తింపుబీబీసీ-100 మంది అత్యంత ప్రభావంతుల జాబితాలో చోటు(2018)చార్లెస్ టి. మానాట్ ప్రైజ్(2014)లిబరల్ ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ ప్రైజ్(2019)ఇదీ చదవండి: బిగ్ షాక్.. డొనాల్డ్ ట్రంప్‌కి దక్కని నోబెల్ శాంతి బహుమతి