నోబెల్ వేడుకకు ‘మచాడో’ దూరం
కూతురు చేతికి శాంతి బహుమతి
ఓస్లో: వెనెజులాలో ప్రజాస్వామ్యం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న సాహసి, ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో.. ఆ నిప్పుకణిక లేకుండానే.. నోబెల్ శాంతి బహుమతి ప్రదానోత్సవం బుధవారం ఓస్లోలో జరిగింది. భయంకరమైన పరిస్థితుల నడుమ రాలేకపోయినప్పటికీ, ఆమె కూతురు అనా కొరినా సోసా.. వేదికపై తల్లి తరపున ఆ చారిత్రక గౌరవాన్ని స్వీకరించారు. మచాడో ఈ ఏడాది జనవరి 9 నుండి అజ్ఞాతంలో ఉన్నారు. అదేరోజు, ఆమె వెనెజులా రాజధాని కారకాస్‌లో తన మద్దతుదారులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.
త్వరలో మనతో మారియా..
నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్, జోర్జెన్ వాట్నే ఫ్రైడ్నెస్ సభలో చేసిన వ్యాఖ్యలు ఆహూతులను కదిలించాయి. ‘మారియా కొరినా మచాడో ఈ రోజు వేడుకకు హాజరయ్యేందుకు తన శక్తి మేరకు ప్రయతి్నంచారు. ఆమె రాలేకపోయినా, సురక్షితంగా ఉన్నారని ధ్రువీకరించడానికి ఎంతో సంతోíÙస్తున్నాం. ఆమె త్వరలోనే ఓస్లోలో మనతో ఉంటారు’.. అని ప్రకటించగానే సభ చప్పట్లతో దద్దరిల్లింది. ముందుగా నోబెల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, మచాడో ప్రతినిధి ఆమె రాలేకపోతున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా మచాడో కుమార్తె అనా కొరినా సోసా.. తన తల్లి స్థానాన్ని అలంకరించారు.
ఈ బహుమతి వెనెజులా ప్రజలందరిది
నోబెల్ వెబ్‌సైట్‌లో విడుదలైన మచాడో ప్రసంగం ఆద్యంతం ఉద్వేగాన్ని నింపింది. ‘నేను ఓస్లో చేరుకోవడానికి ఎందరో ప్రాణాలను పణంగా పెట్టారు. వారికి నేను కృతజ్ఞురాలిని. ఈ గుర్తింపు వెనెజులా ప్రజలకు ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది’.. అన్న ఆమె గొంతులో పోరాట స్ఫూర్తి ప్రతిధ్వనించింది. ‘ఈ బహుమతి మొత్తం వెనెజులా ప్రజలందరిది. నేను రాగానే, రెండేళ్లుగా చూడని నా కుటుంబ సభ్యులను, నా పిల్లలను కౌగిలించుకుంటాను’.. అని ఉద్వేగంతో ఆమె చెప్పారు.
ఐదుగురూ నిర్బంధంలోనే..
గతంలో కూడా ఐదుగురు నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు (నర్గెస్ మొహమ్మది–2023, అలెస్ బియాలియాట్సి్క–2022, లియు జియాబో–2010, ఆంగ్ సాన్ సూ కీ–1991, కార్ల్ వాన్ ఒసియెట్జీ్క–1935) నోబెల్ అవార్డు ప్రకటించే సమయానికి జైలులో లేదా నిర్బంధంలో ఉండటం గమనార్హం.


