రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీ కొడితే ఎలా ఉంటుంది?.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన సోమవారం చోటుచేసుకొంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్‌స్టేట్-95 జాతీయరహదారిపై హఠాత్తుగా ఓ చిన్న విమానం నేలపై వాలిపోయింది. ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. కారు రోడ్డు మీద ల్యాండింగ్‌కు ప్రయత్నించే క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
Unbelievable scene on I-95, Florida:
A landing aircraft clipped a car on the highway.
FHP confirms the driver is safe with only minor injuries.pic.twitter.com/gDmWcmxUou— TRIDENT (@TridentxIN) December 10, 2025


