breaking news
small plane crash
-
108 అంతస్తులు భవనాన్ని ఢీకొన్న విమానం.. వీడియో వైరల్
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత ఎత్తైన సిటిక్ టవర్ (చైనా జున్) భవనాన్ని ఓ చిన్న విమానం ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో భవనం పైభాగం దెబ్బతినగా, గాజు ముక్కలు, విమాన శకలాలు కింద రోడ్డుపై పడటంతో అక్కడ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఫ్లైట్ ట్రాకింగ్ వివరాల ప్రకారం.. ప్రమాదానికి గురైనది రెండు సీట్లతో కూడిన తేలికపాటి Sunward SA60L Aurora విమానంగా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల అసలు కారణం ఏమిటి? పైలట్ పరిస్థితి ఎలా ఉంది? ఎవరైనా ప్రాణనష్టం లేదా గాయాలు జరిగాయా? అనే అంశాలపై చైనా అధికారులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.今天下午,一架型号为 B-12PP 的国产轻型通航小飞机,撞到了北京第一高楼 - 中国尊 pic.twitter.com/CobNs6fSBA— Sea (@Sea_Bitcoin) June 26, 2026ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశాయి. భవనంలోని కొంతమందిని సురక్షితంగా బయటకు తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, చైనాలో వాటి ప్రచారంపై ఆంక్షలు విధించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇదిలా ఉండగా.. చైనా రాజధాని బీజింగ్‌లోనే అతిపెద్దదైన ఈ భవనాన్ని ‘చైనా జున్’ (China Zun)గా పిలుస్తుంటారు. దీని ఎత్తు 528 మీటర్లు (1732 అడుగులు). పురాతన చైనీస్ వైన్ పాత్ర ఆకారంలో దీన్ని నిర్మించారు. ఈ భవనంలో 108 అంతస్తులు ఉన్నట్టు తెలిసింది. -
కూలిన విమానం.. ఐదుగురు మృతి
వింబర్లీ: అమెరికాలోని టెక్సాస్‌లో చిన్న విమానం కూలిన ఘటనలో అందులోని మొత్తం ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఆస్టిన్‌కు 64 కిలోమీటర్ల దూరంలోని వింబర్లీ వద్ద గురువారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన సెస్నా 421సీ రకం విమానంలో మొత్తం ఐదుగురు ఉన్నట్లు హేస్ కౌంటీ జడ్జి రుబెన్ బెసెర్రా తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. మృతుల వివరాలను వెల్లడించలేదు. ప్రమాదానికి ముందు ఆ విమానం చాలా వేగంతో ప్రయాణించినట్లు తెలిసిందన్నారు. అదే మార్గంలో ప్రయాణించిన మరో విమానం సమీపంలోని శాన్ ఆంటోనియోలో సురక్షితంగా ల్యాండైనట్లు వెల్లడించారు.ఈ విమానం టెక్సాస్ పాన్‌హ్యాండిల్‌లోని అమరిల్లో సమీపంలోని విమానాశ్రయం నుండి బయలుదేరి.. న్యూ బ్రాన్ఫెల్స్లో దిగాల్సి ఉంది. అమరిల్లోకి చెందిన ఒక పికిల్‌బాల్ క్రీడా బృందం టోర్నమెంట్లో పాల్గొనడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.ప్రమాద సమయంలో వాతావరణం అనుకూలంగానే ఉందని.. వర్షం లేదని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, తెల్లవారుజామున 3 గంటల నుండి వర్షం కురవడంతో దర్యాప్తు బృందాలకు సహాయక చర్యలు చేపట్టడం సవాలుగా మారింది. ప్రస్తుతం ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తు చేస్తున్నాయి. -
విమానం మిస్సింగ్ విషాదాంతం.. 15 మంది దుర్మరణం
బొగొటా: కొలంబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నపాటి విమానం కుప్పకూలి 15 మంది మరణించారు. మృతుల్లో కొలంబియా చట్ట సభ్యుడు కూడా ఒకరు ఉన్నారు. తొలుత విమానం అదృశ్యం కాగా.. ఎక్కడో దగ్గర సేఫ్ ల్యాండ్ అయి ఉంటుందని అంతా ఆశలు పెట్టుకున్నారు. అయితే చివరకు విషాదమే మిగిలింది. బుధవారం ఉదయం 11గం. సమయంలో 15 మందితో కూడిన సటేనా ఎయిర్‌లైన్స్ విమానం కుకుటా నుంచి ఒకానాకు బయల్దేంది. అయితే కాసేపటికే అది ఏటీసీ(air traffic control)తో సంబంధాలు తెగిపోయింది. ఈ క్రమంలో ప్రయాణికుల క్షేమంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. నార్తె డె సంటాన్‌డెర్ ప్రావిన్స్‌లోని కురాసికా గ్రామం సమీపంలో అది కుప్పకూలింది. అది గమనించిన గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు. ఆ వెంటనే ప్రమాదంపై కొలంబియా పౌరవిమానయాన శాఖ అధికారిక ప్రకటన చేసింది. కొలంబియా-వెనెజువెలా సరిహద్దు ప్రాంతంలో విమానం ప్రమాదానికి గురైందని.. ప్రమాదంలో అంతా మరణించారని.. మృతుల్లో 13 మంది ప్రయాణికులు.. ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారని పేర్కొంది. విమానం ప్రమాదానికి గురైన ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం. పైగా రెబల్ గ్రూప్స్‌నకు ఆవాసం. దీంతో మృతదేహాల రికవరీ కోసం ఆర్మీని రంగంలోకి దించింది. ఈ ఘటనలో పార్లమెంటేరియన్ డియోగెనెస్ క్విన్టెరో(Diógenes Quintero)తో పాటు మరో రాజకీయ నేత సాలకెడో కూడా ఉన్నారు. కొలంబియాలో అంతర్యుద్ధం కారణంగా నలిగిపోతున్న బాధితుల తరఫున క్విన్టెరో పోరాడుతున్నారు. సాలకెడో రాబోయే హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. సటేనా ఎయిర్‌లైన్స్‌ను కొలంబియా ప్రభుత్వమే నడిపిస్తోంది. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎయిర్‌లైన్స్.. దర్యాప్తునకు సహకరిస్తామని అంటోంది. ప్రమాదానికి గురైన బీచ్‌క్రాఫ్ట్ 1900 తేలికపాటి విమానం కండిషన్లోనే ఉందని చెబుతోంది. -
షాకింగ్ వీడియో.. కారుపై విమానం క్రాష్ ల్యాండ్
రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీ కొడితే ఎలా ఉంటుంది?.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన సోమవారం చోటుచేసుకొంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్‌స్టేట్-95 జాతీయరహదారిపై హఠాత్తుగా ఓ చిన్న విమానం నేలపై వాలిపోయింది. ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. కారు రోడ్డు మీద ల్యాండింగ్‌కు ప్రయత్నించే క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.Unbelievable scene on I-95, Florida:A landing aircraft clipped a car on the highway.FHP confirms the driver is safe with only minor injuries.pic.twitter.com/gDmWcmxUou— TRIDENT (@TridentxIN) December 10, 2025 -
దక్షిణ కాలిఫోర్నియా.. ఇళ్లపైకి దూసుకెళ్లిన విమానం
శాన్‌డియాగో: దక్షిణ కాలిఫోర్నియాలో జనావాసాల్లోకి ఓ చిన్నపాటి విమానం దూసుకెళ్లింది. దీంతో 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్ల కూడా దెబ్బతిన్నాయి. భారీ మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో మృతుల వివరాలపై ఇప్పటి వరకు శాన్‌డియాగో పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గురువారం తెల్లవారుజామున పొగమంచు కారణంగా విమానం.. ఇళ్లలోకి దూసుకెళ్లినట్లు సమాచారం. The Cessna 550 plane crashed in San Diego's Murphy Canyon neighbourhood around 3.47am during a period of dense fog.A huge fireball erupted after the crash, setting multiple homes and cars ablaze. At least 15 properties have been affected.https://t.co/QAxenqSOWk via @MailOnline pic.twitter.com/jN4dr6T4Es— Tamra M McDougall (@TamraMcDougall) May 22, 2025 -
కూలిన విమానం.. తొమ్మిది మంది దుర్మరణం
Sweden Plane Crash స్వీడన్లో చిన్నసైజు విమానం కూలిన దుర్ఘఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో పైలట్ సహా ఎనిమిది మంది స్కై డైవర్లు ఉన్నట్లు సమాచారం. గురువారం స్టాక్‌హోంకి వంద మైళ్ల దూరంలో ఉన్న ఒరెబ్రో ఎయిర్పోర్ట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్వీడన్ జాయింట్ రెస్క్యూ కో ఆర్టినేషన్ సెంటర్ ప్రతినిధులు సహాయక చర్యలకు రంగంలోకి దిగారు. విమానం దిగే టైంలోనే ఘటన జరిగిందని భావిస్తున్నారు. కాగా, ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన స్వీడన్ ప్రభుత్వం.. బాధితుల కుటుంబాలను ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. 2019లో ఇలాగే ఓ చిన్న విమానం స్కై డైవర్లతో వెళ్తుండగా.. ఈశాన్య స్వీడన్‌లోని ఉమేయాలో ఘోర ప్రమాదానికి గురైంది. -
నాటకీయంగా రద్దీ రోడ్డుపై కూలిన విమానం
-
నాటకీయంగా రద్దీ రోడ్డుపై కూలిన విమానం
అమెరికాలో ఓ చిన్న విమానం నాటకీయరీతిలో నడిరోడ్డుపై కూలిపోయింది. వాషింగ్టన్ లోని ముకిల్‌టియోలో మంగళవారం ఓ చిన్న విమానం రద్దీగా ఉన్న నడిరోడ్డుపై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిశాయి. అదృష్టం బాగుండి ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. విమానం ఇంజన్లో సాంకేతికలోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ సురక్షితంగా తప్పించుకున్నాడు. ఒక్కసారిగా కిందవైపుగా వచ్చిన విమానం కరెంటు వైర్లను తాకడంతో ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో విమానంలో మంటలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఈ ఘటనను ఓ వాహనదారుడు కెమెరాలో బంధించాడు. సినిమాలో భారీ గ్రాఫిక్స్ ను తలపించేరీతిలో జరిగిన ఈ వాస్తవిక ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
కారును ఢీకొన్న విమానం..
కాలిఫోర్నియా: ఓ ప్రైవేట్ విమానం అనుకోకుండా ప్రమాదానికి గురైంది. విమానం కారును ఢీకొన్న ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన దక్షిణ కాలిఫోర్నియాలో శనివారం చోటుచేసుకుంది. కాలిఫోర్నియా పెట్రోలింగ్ అధికారి క్రిస్ పేరెంట్ తెలిపిన వివరాల ప్రకారం... ఒకే ఇంజిన్ విమానం లాంకేర్ 4 లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పైలట్ జాగ్రత్త వహించాడు. విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ల్యాండ్ అయ్యే సమయంలో రోడ్డుపై ఆగిఉన్న ఓ కారును విమానం ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ మహిళ(38) మృతిచెందింది. పైలట్ తో పాటు కారులో ఉన్న నలుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. పైలట్ మాత్రం ఈ విషయంలో తన తప్పేమీ లేదని, ల్యాండింగ్ చేస్తున్నప్పుడు విమానం ఓవైపు ఒరిగిపోవడం వల్ల కారును ఢీకొట్టిందని చెప్పాడు. విమానం కారును ఢీకొట్టే సమయంలో కారు డ్రైవర్ పాటలు వింటున్నాడని, శబ్ధాన్ని గ్రహించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన వల్ల రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి లాస్ వేగాస్ కు వెళ్లే దారిని కొన్ని గంటల పాటు మూసివేశారు. విమానం రోడ్డుపై ల్యాండ్ కావడంతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఆశ్చర్చానికి లోనయ్యారు. -
అమెరికాలో కుప్ప కూలిన విమానం


