
శాన్‌డియాగో: దక్షిణ కాలిఫోర్నియాలో జనావాసాల్లోకి ఓ చిన్నపాటి విమానం దూసుకెళ్లింది. దీంతో 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్ల కూడా దెబ్బతిన్నాయి. భారీ మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో మృతుల వివరాలపై ఇప్పటి వరకు శాన్‌డియాగో పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గురువారం తెల్లవారుజామున పొగమంచు కారణంగా విమానం.. ఇళ్లలోకి దూసుకెళ్లినట్లు సమాచారం.
The Cessna 550 plane crashed in San Diego's Murphy Canyon neighbourhood around 3.47am during a period of dense fog.
A huge fireball erupted after the crash, setting multiple homes and cars ablaze. At least 15 properties have been affected.https://t.co/QAxenqSOWk via @MailOnline pic.twitter.com/jN4dr6T4Es— Tamra M McDougall (@TamraMcDougall) May 22, 2025