ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు | manasa wedding celebrations in karimnagar | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు

May 20 2025 9:37 AM | Updated on May 20 2025 9:37 AM

manasa wedding celebrations in karimnagar

ప్రారంభమైన మానస వివాహ వేడుకలు 

రేపు సుభముహూర్తం  

రామగుండం(కరీంనగర్): పట్టణంలోని తబితా ఆశ్రమంలో 16ఏళ్లుగా ఆశ్రయం పొందుతున్న నక్క మానస వివాహ వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం హల్దీవేడుకలు ఘనంగా నిర్వహించింది. యువతి పెళ్లి పెద్దగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ కోయ శ్రీహర్ష.. ఈనెల 21వ తేదీన కలెక్టరేట్‌లోని ఆలయంలో వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. 

తొలిరోజు వేడుకల కోసం సింగరేణి ఆర్జీ–1 జీఎం సతీమణి అనిత, ఆర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భీమనాథి విజయ పుస్తె, మట్టెలు, చీర, సారె, అంతర్గాం అబ్దుల్‌ కలాం చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు రూ.ఐదు వేల నగదు, ఎనీ్టపీసీ శ్రీసీతారామ సేవాసమితి నిర్వాహకులు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, బిల్లా శ్రీదేవి, కొండు రమాదేవి పెళ్లి బట్టలు అందజేశారు.

ఫైట్‌ఫర్‌ బెటర్‌ సొసైటీ నిర్వాహకుడు మద్దెల దినేశ్, లెనిన్‌ జయహో సంస్థ ప్రతినిధి చక్కెన శ్రీలత పెళ్లి కుమార్తెను తయారు చేశారు. జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్‌రావు, అంతర్గాం తహసీల్దార్‌ రవీందర్‌పటేల్‌ ముఖ్య అతిథులుగా  హాజరయ్యారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement