సాక్షి, రంగారెడ్డి: చేవెళ్లలోని అల్లావాడ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సైనికులతో వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గోల్కొండ ఆర్మీ క్యాంపు నుంచి శిక్షణ నిమిత్తం షాబాద్‌కు జవాన్లు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మార్గమధ్యంలో అల్లావాడ గేట్ సమీపానికి చేరుకోగానే ఆర్మీ వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన జవాన్లను వెంటనే గోల్కొండ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: హైదరాబాద్ సీపీగా ఇక సెలవు.. సజ్జనార్ భావోద్వేగ పోస్ట్


