చలి పంజా విసురుతోంది | Coldwave intensifies across Telangana | Sakshi
Sakshi News home page

చలి పంజా విసురుతోంది

Nov 13 2026 5:58 AM | Updated on Nov 13 2026 5:58 AM

Coldwave intensifies across Telangana

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలో రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు వేగంగా పతనమవుతున్నాయి. గత ఏడాదితో నవంబర్‌తో పోలిస్తే గురువారం తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. గత నాలుగు రోజుల్లో సగటున 4–6 డిగ్రీల మేర తగ్గిపోయాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. హైదరాబాద్, సూర్యాపేట మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంగారెడ్డి జిల్లా కొహీర్‌లో అత్యల్పంగా 11.3 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా చందనవెళ్లిలో 11.4, వికారాబాద్‌ జిల్లా నవాబుపేటలో 11.7, మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌లో 12.0, కుమ్రంభీం జిల్లా సిర్పూర్‌(యూ)లో 12.2, నాగర్‌కర్నూల్‌ జిల్లా తోటపల్లిలో 12.4, సిద్దిపేట జిల్లా కొండపాకలో 12.7, కామారెడ్డి జిల్లా గాందారిలో 12.7, సిరిసిల్ల జిల్లా గజసింగారంలో 12.8, మెదక్‌ జిల్లా చిలిపిచెడ్, నల్లగొండ జిల్లా గొడుకొండ్లలో 13.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

ఉత్తర దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన చల్లని గాలులు రాష్ట్రం వైపు వీస్తుండడమే కారణమని హైదరాబాద్‌ వాతావరణ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ స్టెల్లా వెల్లడించారు. మరో 2 వారాలు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అయితే పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థితిలో ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి తీవ్ర లోటు వర్షపాతం నమోదవడంతోపాటు పగటి ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement