15న ప్రధానితో సీఎం రేవంత్‌ భేటీ | Telangana CM Revanth Reddy to Meet PM Modi on November 15 | Sakshi
Sakshi News home page

15న ప్రధానితో సీఎం రేవంత్‌ భేటీ

Nov 13 2026 5:39 AM | Updated on Nov 13 2026 5:39 AM

Telangana CM Revanth Reddy to Meet PM Modi on November 15

సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులే ప్రధాన ఎజెండా 

సాక్షి, హైదరాబాద్‌:  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 15న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా సీఎంతో పాటు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉండిపోయిన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. 

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బరాజ్‌ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి సమ్మతి ఇప్పించాలని కోరనున్నారు. ఈ ప్రాజెక్టుకు సత్వరమే అనుమతులు ఇప్పించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధాన మంత్రి కృషి సించాయ్‌ యోజన (ఏఐబీపీ) కింద ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి అవసరమైన అనుమతులతో పాటు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నుంచి ఎన్‌ఓసీ ఇప్పించాలని కోరనున్నారు.

గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ పరిధిలోని ఇచ్చంపల్లి వద్ద గోదావరిపై బరాజ్‌ నిర్మించి అక్కడి నుంచి నీళ్లను తరలించాలని, తరలించే నీళ్లలో 50 శాతం వాటాను తెలంగాణకు కేటాయించాలని కోరనున్నట్టు తెలిసింది. సీతమ్మసాగర్‌ బరాజ్, డిండి, పాలమూరు–రంగారెడ్డి తదితర ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను సత్వరమే ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించనున్నారు.రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇతర ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఆర్థిక సహాయాన్ని కూడా కోరనున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement