నేడు హైదరాబాద్‌కు రాహుల్‌ గాంధీ | Rahul Gandhi to visit Hyderabad on november 13 | Sakshi
Sakshi News home page

నేడు హైదరాబాద్‌కు రాహుల్‌ గాంధీ

Nov 13 2026 5:35 AM | Updated on Nov 13 2026 5:40 AM

Rahul Gandhi to visit Hyderabad on november 13

భారత్‌ సమ్మిట్‌ ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న కాంగ్రెస్‌ అగ్రనేత  

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు రానున్నారు. పీసీసీ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్‌ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి వరకు శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు వస్తారు.

అక్కడి నుంచి నేరుగా శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి, శనివారం ఉదయం పార్టీ ప్రముఖులతో భేటీ కానున్నారు. అనంతరం నగరంలో జరిగే గిగ్‌వర్కర్ల ర్యాలీలో పాల్గొని వారికి సంఘీభావం తెలుపనున్నారు. అనంతరం అక్కడి నుంచి హెచ్‌ఐసీసీకి వెళ్లి అక్కడ జరిగే భారత్‌ సమ్మిట్‌ ముగింపు ఉత్సవంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు.  

ఖర్గే, డీకే శివకుమార్‌కు భట్టి ఆహ్వానం 
హైదరాబాద్‌లో ఈ నెల 13, 14 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భారత్‌ సమ్మిట్‌–2026కు హాజరు కావాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో ఆయన భేటీ అయ్యారు. సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు అందజేశారు.

తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని ఖర్గే, డీకే శివకుమార్‌లను భట్టి విక్రమార్క కోరారు. ఈ సందర్భంగా భారత్‌ సమ్మిట్‌ లక్ష్యాలు, ప్రాధాన్యతలను వారికి వివరించారు. ఈ మేరకు ఇరువురు నేతలు సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement