breaking news
Rahul Gandhi
-
రాహుల్ చెప్పేవన్నీ అసత్యాలు
గాంధీనగర్: అమెరికా, యూకే, ఈయూతో వాణిజ్య ఒప్పందాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం తీవ్రంగా ఖండించారు. రాహుల్ రైతులను తప్పుదోవ పట్టించడంతో పాటు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయనకు చేతనైతే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. చర్చా వేదికను ఆయనే నిర్ణయించుకోవచ్చన్నారు. మన రైతులు, డెయిరీ ఉత్ప త్తులకు కేంద్రం పూర్తి రక్షణ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ‘‘వాణిజ్య ఒప్పందాలు మన రైతులకు హాని చేస్తాయన్న కాంగ్రెస్ ఆరోపణలు హాస్యాస్పదం. ప్రజలను తప్పుదోవపట్టించడంలో ఆ పార్టీ నేతలు సిద్ధహస్తులు. నిజానికి యూపీఏ హయాంలో కుదుర్చుకున్న పలు ఒప్పందాలు మన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. వాటిలోని ప్రమాదకరమైన అంశాలను మోదీ ప్రభుత్వం రాగానే తొలగించింది’’ అని అమిత్ షా చెప్పారు. -
నిత్యం అబద్ధాలేనా?
కారైకల్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాం«దీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిత్యం అబద్ధాలు చెప్పడం అనే కొత్త సంప్రదాయాన్ని రాహుల్ ప్రారంభించాడని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. గొంతు చించుకొని గట్టిగా అబద్ధం చెప్పడం, దాన్ని పునరావృతం చేయడం, అబద్ధాన్ని నిజంగా నమ్మించాలని చూడడం రాహుల్ విధానంగా మారిపోయిందని విమర్శించారు. రాహుల్ అబద్ధాల ఫ్యాక్టరీ వెనకున్న అసలు బాగోతాన్ని ప్రజలు గుర్తించారని చెప్పారు. యూకే, ఈయూ, అమెరికాలతో కుదుర్చున్న వాణిజ్య ఒప్పందాలతో మన రైతులకు, మత్స్యకారులకు, పాడి పరిశ్రమకు లాభమే తప్ప ఎలాంటి నష్టం ఉండదన్నారు. అయినప్పటికీ రాహుల్ తప్పుడు ప్రచారంతో వారిని భయోత్పాతానికి గురి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం తప్పనిసరిగా కాపాడుందన్నారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాల గురించి క్షుణ్నంగా తెలుసుకొని మాట్లాడాలని రాహుల్ గాం«దీకి హితవు పలికారు. శనివారం పుదుచ్చేరిలోని కారైకల్‌లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తేల్చిచెప్పారు. మన ప్రయోజనాలు 100 శాతం కాపాడుకొనేలా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని వివరించారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని అమిత్ షా ఉద్ఘాటించారు. పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు చేసిన ఘనత మోదీ నిర్ణయాత్మక నాయకత్వానిదేనని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్‌తో ముష్కర మూకలకు గట్టిగా బుద్ధి చెప్పామని అన్నారు. పుదుచ్చేరి అభివృద్ధి జరగాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
ఆయన ‘నరేంద్ర సరెండర్ మోదీ’
న్యూఢిల్లీ: దేశంలో పత్తి రైతులు, జౌళి ఎగుమతిదారులను మోదీ ప్రభుత్వం నిలువునా దగా చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికాతో కుదుర్చుకున్న మధ్యంతర వాణిజ్య ఒప్పందం వల్ల ఆయా రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఒప్పందాన్ని తప్పుపట్టారు. ఇది అమల్లోకి వస్తే మనదేశంలో పత్తి సాగు పూర్తిగా నిలిచిపోతుందని, ఎగుమతులు ఆగిపోతాయని, కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అమెరికా ప్రభుత్వం మన ఉత్పత్తులపై 18 శాతం టారిఫ్‌లు ప్రకటించిందని, మోదీ సర్కార్ మాత్రం అమెరికా ఉత్పత్తులపై సున్నా టారిఫ్‌లకు అంగీకరించిందని వెల్లడించారు. దీనిపై ప్రధాని మోదీ, ఆయన మంత్రివర్గ సభ్యులు అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల మన రైతులు, ఎగుమతిదారులు కచి్చతంగా నష్టపోతారని తేలి్చచెప్పారు. అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవాలన్న షరతుతో బంగ్లాదేశ్ వ్రస్తాలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సున్నా టారిఫ్‌లు ప్రకటించిందని గుర్తుచేశారు. భారతీయ వ్రస్తాలపై 18 శాతం టారిఫ్‌లను ఖరారు చేసిందని పేర్కొన్నారు. మన వ్రస్తాలపై కూడా సున్నా టారిఫ్‌లు కావాలంటే అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం దాచి పెడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మన వ్రస్తాలపై సున్నా టారిఫ్‌లు కావాలంటే అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవాలని, దానివల్ల మన రైతులు నష్టపోతారని తెలిపారు. అమెరికా ఎదుట ప్రధాని మోదీ లొంగిపోయారని రాహుల్ విమర్శించారు. ప్రధానమంత్రిని ‘నరేంద్ర సరెండర్ మోదీ’గా అభివరి్ణంచారు. -
రాహుల్ సభ్యత్వం రద్దు! జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా
-
రాహుల్ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ గురువారం కీలక అడుగు వేసింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా లోక్‌సభలో ‘సబ్‌స్టాంటివ్ మోషన్’ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా, ఆయన జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని దూబే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే ఇది ప్రివిలేజ్ మోషన్ కాదని, ఆయనపై ఉన్న తీవ్రమైన ఆరోపణల దృష్ట్యా ప్రవేశపెట్టిన ప్రత్యేక తీర్మానమని ఆయన పేర్కొన్నారు.రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు, పలు అంతర్జాతీయ సంస్థలతో ఆయనకు ఉన్న సంబంధాలపై ఎంపీ నిషికాంత్ దూబే తీవ్ర విమర్శలు గుప్పించారు. సోరోస్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, యూఎస్ఏఐడి వంటి సంస్థలతో రాహుల్ సంబంధాలు కలిగి ఉన్నారని, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, అమెరికా పర్యటనల్లో ఆయన భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారని దూబే ఆరోపించారు. ఈ అంశాలన్నింటినీ తాను దాఖలు చేసిన తీర్మానంలో వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగించేలా రాహుల్ వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శించారు.బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఈ వివాదానికి బీజం పడింది. కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ, భారత్-అమెరికా మధ్య జరిగిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని 'టోకు లొంగుబాటు'గా అభివర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా దేశ ఇంధన భద్రతను అమెరికాకు అప్పగించారని, రైతు ప్రయోజనాలను విస్మరించారని ఆయన ఆరోపించారు. బీజేపీ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి భారత ప్రయోజనాలను తాకట్టు పెట్టారని రాహుల్ విమర్శించారు. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యర్థిని ఎలాగైతే ఉక్కిరిబిక్కిరి చేస్తారో, అలాగే ఈ ఒప్పందం భారత్‌ను చిక్కుల్లో పడేసిందని ఆయన వ్యాఖ్యానించారు.సబ్‌స్టాంటివ్ మోషన్ అనేది అవిశ్వాస తీర్మానం లేదా అభిశంసన తీర్మానం లాంటి అత్యంత కీలకమైన ప్రక్రియ. ఉన్నత పదవుల్లో ఉన్న వారిపై నిర్దిష్టమైన ఆరోపణలు ఉన్నప్పుడు దీనిని సభలో ప్రవేశపెడతారు. దీనిని సభ చర్చకు స్వీకరించాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభ్యుడు, తాను చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలను సభ ముందు ఉంచాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీపై బీజేపీ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై సభ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. -
దేశాన్ని అమ్మింది కాంగ్రెసే
న్యూఢిల్లీ: వాణిజ్య ఒప్పందం పేరిట దేశాన్ని మోదీ సర్కారు అమెరికాకు అమ్మేసిందన్న విపక్ష నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ‘‘దేశ ప్రయోజనాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వంటి అంతర్జాతీయ సంస్థలకు తాకట్టు పెట్టింది కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వమే. పేదలు, రైతుల ప్రయోజనాలను వాటికి అమ్మేసింది. ఏకంగా దేశాన్నే అమ్మేసింది’’అంటూ దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉండగా షెర్మెల్ షేక్ చర్చల సందర్భంగా దేశాన్ని దాయాది పాకిస్తాన్‌కు తనఖా పెట్టిన, ఏకంగా మన సార్వ¿ౌమత్వం విషయంలో రాజీ పడ్డ చరిత్ర కూడా కాంగ్రెస్‌దేనని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ 2026–27పై లోక్‌సభలో జరిగిన చర్చకు నిర్మల బుధవారం సాయంత్రం బదులిచ్చారు. మన దేశాన్ని అమ్మగల, కొనగల వాడెవరూ పుట్టలేదంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలను ఆమె పునరుద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అలాంటి పని ఎప్పటికీ చేయబోరని స్పష్టం చేశారు. ఇంధన, ఆర్థిక, ఆహార, డేటా భద్రత తదితరాలపై రాహుల్ లేవనెత్తిన ఆందోళనలను కొట్టిపారేశారు. ఆ విషయాల్లో అవసరమైన అన్ని చర్యలూ కేంద్రం తీసుకుందని, బడ్జెట్లో వాటికి చాలినన్ని నిధులు కేటాయించిందని చెప్పారు. సంబంధిత గణాంకాలను సభకు చదివి వినిపించారు. రాహుల్ అసలు బడ్జెట్‌నే చదవకుండా నిరాధార ఆరోపణలకు దిగారని మండిపడ్డారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ వ్యయాన్ని రూ.53.47 లక్షల కోట్లుగా అంచనా వేసినట్టు నిర్మల సభకు తెలిపారు. ‘‘మా ప్రభుత్వం కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోంది. 2027 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు 4.3 శాతానికి పరిమితం కావచ్చు’’అని అంచనా వేశారు. దేశంలో ఎరువుల కొరత ఉందన్న వార్తలను కొట్టిపారేశారు. వాటి దిగుమతికి బడ్జెట్లో ఏకంగా రూ.1.71 లక్షల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. బెంగాల్లో బాంబుల రాజ్యం! కేంద్ర బడ్జెట్లో పశి్చమబెంగాల్‌కు కేటాయింపులే లేవన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను నిర్మల తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీ ఏలుబడిలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా మంటగలిశాయంటూ మమతా బెనర్జీ సర్కారు పనితీరును దుయ్యబట్టారు. బెంగాల్లో ఎక్కడ చూసినా బాంబుల సంస్కృతే రాజ్యమేలుతోందని ఆరోపించారు. ‘బెంగాల్లో బాంబులే మాట్లాడతాయి, చట్టాలు కాదు’అంటూ పలు ఉదంతాలను ఉటంకించారు. దాంతో విపక్ష సభ్యులు పెద్దపెట్టున నినదిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పాలు, స్టేషనరీ, విద్యపై జీఎస్టీ వసూలు చేస్తున్నారన్న తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు అభిõÙక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నిర్మల తీవ్రంగా ఖండించారు. ‘‘వాస్తవాలను ఆయన ఉద్దేశపూర్వకంగా పూర్తిగా వక్రీకరించారు. పెన్సిళ్లు, షార్పనర్లపైనా జీఎస్టీ వేశామట! మరీ ఈ స్థాయిలో అబద్ధాలా? 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టిన నాటి నుంచీ పాలపై ఎన్నడూ జీఎస్టీ విధించలేదు. చావుపైనా జీఎస్టీ వేశారని పచ్చి అబద్ధాలు చెప్పారు. అంతిమక్రియలపై కూడా ఎప్పుడూ జీఎస్టీ లేదు. వింటున్న సభ్యులకు తెలివి లేదని అభిõÙక్ భావిస్తున్నారా?’’అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. బహుశా పశ్చిమబెంగాల్లో నడుస్తున్న సిండికేట్ మరణాలపైనా పన్నులు వసూలు చేస్తోందేమో అంటూ అధికార తృణమూల్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అన్యాయానికి గురయ్యామంటూ సానుభూతి కార్డు వాడటం, ప్రతిదానికీ సుప్రీంకోర్టు దగ్గరికి పరుగెత్తడం, చివరికి కోర్టుతో చీవాట్లు తినడం తృణమూల్‌కు అలవాటుగా మారిందన్నారు. -
భరతమాతనే... అమెరికాకు అమ్మేశారు
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై మోదీ సర్కారును విపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఒప్పందం పేరిట మన తల్లి భరతమాతనే అమెరికాకు అమ్మేశారంటూ నిప్పులు చెరిగారు. ‘‘వ్యవసాయం, ఇంధనంతో సహా అన్ని రంగాలనూ అమెరికా చేతికి అప్పగించేశారు. ఆ దేశానికి పూర్తిస్థాయి లొంగిపోయారు. దేశాన్ని ఇలా అడ్డంగా అమ్మేసినందుకు మీకు కనీసం సిగ్గుగా అనిపించడం లేదా?’’అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. బుధవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చలో రాహుల్ ప్రసంగించారు. అమెరికాతో ఏకపక్ష ఒప్పందాన్ని మోదీ సర్కారు ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. ‘‘పలు విషయాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా నేరుగా విపరీతమైన ఒత్తిడి పెట్టింది. పూర్తిగా ఆయన మెడలు వంచి నొక్కిపట్టింది. అందుకే దేశాన్ని మోదీ అమెరికాకు అమ్మేశారు. కేవలం అధికారం కాపాడుకోవడానికి జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టారు. లేదంటే ఇలాంటి ఏకపక్ష ఒప్పందానికి ఆయనే కాదు, ఏ భారత ప్రధానీ అంగీకరించబోడు’’అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యర్థి మెడను దొరకబుచ్చుకున్నాక దాన్ని గట్టిగా నొక్కిపడతారు. దాంతో అతను అల్లాడిపోతాడు. లొంగిపోయానంటూ చేతులెత్తేస్తాడు. మోదీ చేసింది సరిగ్గా అదే’’అంటూ ఎద్దేవా చేశారు. ‘‘వాణిజ్య ఒప్పందం ద్వారా మన రైతుల ప్రయోజనాల విషయంలో కేంద్రం పూర్తిగా రాజీ పడింది. జౌళి రంగాన్ని నేలమట్టం చేశారు. మన డేటాను, రైతులను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను, మన శక్తియుక్తులను, చిన్న, మధ్యతరహా వ్యాపారాలనూ అమ్మేశారు. ఇంధన భద్రతను గాలికొదిలేశారు. ఇకపై మనం ఎవరి నుంచి చమురు కొనుగోలు చేయాలో నిర్ణయించేది అమెరికాయే తప్ప మన ప్రధాని కాదు! పైగా ఆ కొనుగోళ్లను అగ్ర రాజ్యమే నిత్యం పర్యవేక్షిస్తుంటుంది. వారు చెప్పిన వాళ్ల దగ్గర కొనకపోతే మనపై మళ్లీ 50 శాతం టారిఫ్‌లు బాదుతారు. మన ఆర్థిక, ఇంధన రంగాలను మనపైకే ఆయుధాలుగా గురి పెట్టేందుకు అమెరికాను కేంద్రం అనుమతించింది’’అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ ప్రయోజనాల కోసమే... వాణిజ్య ఒప్పందం పేరుతో మోదీ సర్కారు అమెరికాకు దాసోహమన్న తీరు చాలా విషాదకరమని రాహుల్ అన్నారు. ‘‘మోదీ కేవలం తాను మాత్రమే లొంగిపోలేదు. 150 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తునే అమెరికాకు అప్పగించేశారు. అధికార బీజేపీ ఆర్థిక ఆయువుపట్లలో ఒకరిపై అమెరికాలో కేసు నడుస్తుండటమే ఇందుకు కారణం. సొంత పార్టీ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికే దేశాన్ని అగ్ర రాజ్యానికి మోదీ అమ్మకం పెట్టారు’’అంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘డిజిటల్ వాణిజ్య నిబంధనలపై నియంత్రణను కేంద్రం పూర్తిగా అమెరికాకు వదిలేసుకుంది. డేటా లోకలైజేషన్‌ను తొలగించేసింది. అమెరికా నుంచి డేటా వరదకు గేట్లెత్తేందుకు ఒప్పుకుంది. బడా టెక్ కంపెనీలకు 20 ఏళ్ల ట్యాక్స్ హాలిడేలు ప్రకటించేసింది. మొదట్లో మనపై కేవలం 3 శాతంగా ఉండే అమెరికా టారిఫ్‌లు ఇప్పుడు 18 శాతానికి పెరిగాయి. అమెరికా వస్తూత్పత్తులపై భారత టారిఫ్‌లు మాత్రం 16 శాతం నుంచి ఎకాయెకి సున్నాకు పడిపోయాయి. అమెరికా దిగుమతులు 46 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 146 బిలియన్ డాలర్లకు పెరగనున్నాయి’’అంటూ రాహుల్ మండిపడ్డారు. ‘‘కేంద్రం మన వ్యవసాయ రంగాన్ని అమెరికాకు బార్లా తెరిచేసింది. దాంతో అక్కడి వ్యవసాయోత్పత్తులు మన మార్కెట్లను ముంచెత్తనున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా మన రైతులు భారీ సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారు. మోదీకి ముందు ఏ ప్రధానీ ఇలాంటి సిగ్గుచేటైన పని చేయలేదు. ఇకముందు మరే ప్రధానీ చేయబోడు’’అన్నారు. అధికార పక్ష సభ్యులు పదేపదే లేచి రాహుల్ ప్రసంగానికి అడ్డుతగిలారు. ఆయన నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. చేతనైతే వాటికి రుజువులు చూపాలని సవాలు చేయగా అందుకు తాను సిద్ధమేనని రాహుల్ బదులిచ్చారు.మేమైతే ఇలా చేసేవాళ్లం ‘‘యుద్ధాల శకం ముగిసిందని మోదీ అంటున్నారు. కానీ నిజానికి మనమున్నదే యుద్ధాల శకంలో! ఇలాంటప్పుడు మన బలాలేమిటో అవగాహన ఉండాలి. ప్రజలే మన నిజమైన బలం’’అని రాహుల్ అన్నారు. ‘‘ఇండియా కూటమే గనుక అధికారంలో ఉంటే వాణిజ్య ఒప్పందం విషయంలో పూర్తిగా భిన్నంగా వ్యవహరించేది. డేటా మన అతి పెద్ద ఆస్తి. అది అమెరికాకు అందుబాటు ఉండాలంటే భారత్‌ను అమెరికా సేవకునిలా గాక సమాన భాగస్వామిగా పరిగణించాలని ట్రంప్‌కు కుండబద్దలు కొట్టేవాళ్లం. ఆ హోదాలోనే చర్చలు జరిపేవాళ్లం. దేశ ఇంధన భద్రతపై, మన రైతుల ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని, వాటిపై చర్చలకు తావు లేదని ఆయన ముఖం మీదే చెప్పేవాళ్లం. పాక్ ఆర్మీ చీఫ్‌తో ట్రంప్ అల్పాహార భేటీ వంటి ఉదంతాలపై కచి్చతంగా అభ్యంతరం వ్యక్తం చేసేవాళ్లం’’అని చెప్పుకొచ్చారు.ఎప్స్టీన్ ఫైల్స్‌లో అంబానీ, పురీ అమెరికాతో పాటు పలు దేశాల్లో సంచలనం సృష్టిస్తున్న ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం టేపుల్లో కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురీ, వ్యాపారవేత్త అనిల్ అంబానీ పేర్లు కూడా ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. బుధవారం సాయంత్రం పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. -
లోక్ సభలో రాహుల్ వ్యాఖ్యలు దుమారం
-
‘అస్థిరత దిశగా ప్రపంచం’: రాహుల్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై జరుగుతున్న చర్చల్లో బుధవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ప్రపంచమంతా స్థిరత్వం నుండి తీవ్రమైన అస్థిరత వైపు వేగంగా పయనిస్తున్నదని ఆయన హెచ్చరించారు. ప్రపంచ దేశాల మధ్య మారుతున్న సంబంధాలను గమనించకుండా.. ఆర్థిక ప్రణాళికలు రచించడం సాధ్యం కాదని రాహుల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో తలెత్తుతున్న అలజడులు భారత ఆర్థిక వ్యవస్థపై, దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతాయని, దీనిని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలని రాహుల్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన ఎకనామిక్ సర్వేను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ, అందులో తాను గమనించిన రెండు అత్యంత లోతైన అంశాలను సభకు వివరిస్తున్నానని అన్నారు. అందులో మొదటిది ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, అమెరికా ఆధిపత్యాన్ని చైనా, రష్యా లాంటి శక్తులు సవాలు చేస్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు. ఇక రెండవది ఇంధనం, ఆర్థిక వ్యవస్థలను ఆయుధాలుగా మలుచుకుంటున్న తీరు అని అన్నారు. ఈ పరిణామాలు ప్రపంచాన్ని మునుపెన్నడూ లేని విధంగా అంచనాలకు అందని స్థితికి నెట్టేస్తున్నాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) చేసిన ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అనే వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఈ సందర్భంగా తప్పుబట్టారు. ప్రస్తుతం మనం యుద్ధాల యుగంలోకే ప్రవేశిస్తున్నామని రాహుల్ పేర్కొన్నారు. ఉక్రెయిన్, గాజా, ఇరాన్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ మేఘాలను ఆయన ఉదాహరణగా చూపారు. శాంతి స్థాపన జరుగుతుందన్న అంచనాలు ఇక చెల్లవని, నిరంతర సంఘర్షణలే నేటి ప్రపంచ వాస్తవమని రాహుల్ స్పష్టం చేశారు.అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్ ఆధిపత్యం క్రమంగా తగ్గుతోందని రాహుల్ అన్నారు. ప్రపంచమంతా అస్థిరమైన, ఊహించని కొత్త ఒరవడిలోకి మారుతోందని విశ్లేషించారు. లోక్‌సభలో అధికార పక్ష సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, డాలర్ ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవాలని రాహుల్ సూచించారు. పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం తదితర అంతర్గత సమస్యలతో పాటు, ప్రపంచ అస్థిరతలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపకల్పన ఉండాలని రాహుల్ తన ప్రసంగంలో డిమాండ్ చేశారు. -
మౌనం వీడిన జనరల్ నరవణే.. ఏమన్నారంటే..
న్యూఢిల్లీ: తన ఆత్మకథ ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ ప్రచురణకు సంబంధించి గత కొద్దిరోజులుగా సాగుతున్న వివాదంపై మాజీ సైన్యాధిపతి జనరల్ (రిటైర్డ్) ఎంఎం నరవణే ఎట్టకేలకు స్పందించారు. ఈ పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదని ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’ ఇచ్చిన వివరణను ఆయన సమర్థించారు. ఒక పుస్తకాన్ని ప్రకటించడం లేదా ముందస్తు ఆర్డర్ కోసం అందుబాటులో ఉంచడం అంటే అది పబ్లిక్ రిలీజ్ అయినట్టు కాదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ప్రచురణకర్త సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌ను ఆయన షేర్ చేస్తూ, వాస్తవ పరిస్థితులను మీడియాకు వివరించారు.కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంటు ఆవరణలో ఈ పుస్తకానికి సంబంధించిన కాపీని ప్రదర్శించడమే కాకుండా, 2023లో నరవణే చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్‌ను ప్రస్తావించడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై స్పందించిన ప్రచురణ సంస్థ, పుస్తక ప్రచురణ ప్రక్రియ గురించి వివరించింది. ఒక పుస్తకాన్ని ప్రకటించడం అంటే భవిష్యత్తులో దానిని తీసుకురాబోతున్నామని చెప్పడమే తప్ప, అది అమ్మకానికి సిద్ధంగా ఉందని కాదని స్పష్టం చేసింది. రిటైలర్లు, పాఠకుల సౌకర్యార్థం ముందస్తు ఆర్డర్లు తీసుకోవడం అనేది ప్రచురణ రంగంలో సాధారణ పద్ధతి మాత్రమేనని తెలిపింది. This is the status of the book. https://t.co/atLtwhJvl0— Manoj Naravane (@ManojNaravane) February 10, 2026ఈ పుస్తకం ఇంకా అధికారికంగా మార్కెట్లోకి రాకముందే దాని మాన్యుస్క్రిప్ట్ డిజిటల్, ఇతర రూపాల్లో అక్రమంగా చలామణి అవుతుండటంపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై విచారణ వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పుస్తకానికి సంబంధించి తమకు మాత్రమే ప్రచురణ హక్కులు ఉన్నాయని, అనుమతి లేకుండా పిడిఎఫ్ లేదా ముద్రిత రూపంలో పంపిణీ చేయడం కాపీరైట్ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రచురణకర్త హెచ్చరించారు.గత వారం పార్లమెంటులో రాహుల్ గాంధీ ఈ పుస్తక ప్రతిని చూపిస్తూ, చర్చకు ప్రయత్నించారు. ఫిబ్రవరి 2 నుంచి లోక్‌సభలో ఈ ఆత్మకథలోని అంశాలను ప్రస్తావించాలని ఆయన భావించినప్పటికీ, పుస్తకం ఇంకా అధికారికంగా ప్రచురితం కాలేదనే కారణంతో ఆయనను అడ్డుకున్నారు. పుస్తకం రిటైల్ ఛానళ్లలో అందుబాటులోకి వచ్చినప్పుడే అది ప్రచురితమైనట్లు పరిగణించాలని ప్రచురణ సంస్థ స్పష్టం చేయడంతో, రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.ఇది కూడా చదవండి: ‘మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెప్పరు’: రాహుల్ గాంధీ -
ఆ రెండు పుస్తకాలు ఒక్కటి కావు
న్యూఢిల్లీ: చైనా బలగాలతో భారత సైన్యం పోరాటానికి సంబంధించి పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పుస్తకం చర్చనీయాంశం కావడంతో దాని ప్రచురణసంస్థ ‘పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా’మంగళవారం స్పష్టతనిచ్చింది. ఆ పుస్తకాన్ని ఇప్పటిదాకా ముద్రించలేదని, ఆన్లైన్ వేదికలపై ప్రత్యక్షమైనదంతా అనధికార కాపీ అని పెంగ్విన్ ర్యాండమ్ వెల్లడించింది. ఈ మేరకు సంస్థ మంగళవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ప్రీ–ఆర్డర్ అని పేర్కొన్నంత మాత్రాన అది ఇప్పటికే ముద్రితమై అమ్మకానికి సిద్ధంగా ఉందని కాదు. త్వరలో ప్రచురితంకావొచ్చు అని అర్థం. అంతేగానీ పుస్తకం ముద్రించామని మేం ఎక్కడా పేర్కొనలేదు’’అంటూ పుస్తకాలకు సంబంధించి తాము అనుసరించే 4 విధానాలను పెంగ్విన్ ర్యాండమ్ వివరించింది. అవి.. 1. కొత్త పుస్తకాన్ని ప్రకటించం: అంటే కొత్త రచన, నూతన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం జరిగిందని అర్థం. అంతేగానీ ఈ పుస్తకం ఇప్పటికే ముద్రితమైందని కాదు. అది ఇంకా ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకికూడా రాదు. 2. ప్రీ–ఆర్డర్: ఇది ప్రచురణకు సంబంధించిన ప్రామాణిక అనుసరణీయ విధానం. నచి్చతే పాఠకులు లేదా రిటైల్ సంస్థలు త్వరలో ప్రచురితంకాబోయే ఈ పుస్తకం కోసం ఆర్డర్లు పెట్టుకోవచ్చు. ఈ దశలోనూ పుస్తకం ముద్రితంకాదు. అందుబాటులో ఉండదు. 3. రాబోయే తేదీ ఖరారు: ఫలానా తేదీన పుస్తకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయం జరిగిదంతే. అంతమాత్రాన ఆరోజుకల్లా పుస్తకం ముద్రితమైపోతుందని అర్థంకాదు. 4.ముద్రిత పుస్తకం: విక్రయాల కోసం రిటైల్ దుకాణాల్లోకి వచ్చాకే ఆ పుస్తకం అధికారికంగా ముద్రితమైందని భావించాలి. పుస్తకాన్ని ఏరకంగానూ విడుదల చేయలేదు: పెంగ్విన్‘‘నరవణె రాసిన ఈ పుస్తకాన్ని ప్రింట్ లేదా డిజిటల్ లేదా పీడీఎఫ్ ఇలా ఏ ఫార్మాట్లోనూ అందుబాటులోకి తేలేదు. ఒక్క పుస్తకాన్ని కూడా ముద్రించలేదు. ఎవరికీ విక్రయించలేదు. ఆన్లైన్ వేదికలపై ప్రత్యక్షమైనదంతా అనధికార వెర్షన్ మాత్రమే. దానితో మాకు సంబంధం లేదు. పుస్తకం ప్రచురణ హక్కులు మాకే ఉన్నాయి. పుస్తకాన్ని ఏ రూపంలోనూ మేం పంపిణీ చేయలేదు. బహిర్గతంచేయలేదు. ప్రస్తుతం ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్ రూపాల్లో షేర్ అవుతుంటేగనక అది పూర్తిగా మా సంస్థ కాపీరైట్ హక్కులను ఉల్లంఘించినట్లే లెక్క. ఈ అంశంలో మేం చట్టపర చర్యలు తీసుకుంటున్నాం’’అని సంస్థ స్పష్టం చేసింది. మౌనం వీడిన నరవణె పుస్తకం వివాదం కావడంతో ఎట్టకేలకు నరవణె మౌనం వీడారు. ఈ పుస్తకం ఇంకా ప్రచురితంకాలేదని ఆయన స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం పెంగ్విన్ ఇండియా సంస్థ వెల్లడించిన ఒక ప్రకటనను నరవణే మంగళవారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు. ‘‘పుస్తకం తాజా స్థితి ఇదే’’అని దానికి ఒక క్యాప్షన్ పెట్టారు. పుస్తకమొచ్చిందని రెండేళ్ల క్రితమే చెప్పారు: రాహుల్పుస్తకం ప్రచురితంకాలేదన్న పెంగ్విన్ వాదనల్లో నిజంలేదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో రాహుల్ మాట్లాడారు. గతంలో నరవణే చేసిన ట్వీట్‌ను రాహుల్ అందరిఎదుట బయటకు చదివి వినిపించారు. ‘‘హలో ఫ్రెండ్స్. నేను రాసిన పుస్తకం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇక్కడున్న లింక్‌ను క్లిక్‌చేసి చదవండి. ఆనందంగా పఠనం పూర్తిచేయండి. జైహింద్ అని నరవణె రాసుకొచ్చారు. ఇది డిసెంబర్ 2023లో నరవణె ఆయన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు. పుస్తకం అసలు ప్రచురితంకాలేదని పెంగ్విన్ చెబుతోంది. కానీ ఇప్పటికే ఈ పుస్తకం అమెజాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది’’అని రాహుల్ అన్నారు. -
లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం
న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మంగళవారం నోటీసు ఇచ్చింది. లోక్‌సభ సెక్రటరీ జనరల్ ను కలిసి నోటీసు ఇచ్చినట్లు కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గగోయ్ వెల్లడించారు. ఇందుకోసం వందమందికి పైగా ఎంపీల సంతకాలను కాంగ్రెస్ సేకరించింది. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధాని పై దాడి చేస్తారన్న స్పీకర్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.మొత్తం 118 మంది ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. భారత రాజ్యాంగంలోని అధికరణ 94(సి) ప్రకారం, స్పీకర్‌ను తొలగించాలంటే 14 రోజుల ముందు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ఆ గడువు ముగిసిన తర్వాత సభలో తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. గత కొన్ని రోజులుగా సభలో జరుగుతున్న పరిణామాలు, వరుస వాయిదాల నేపథ్యంలో విపక్ష నేతలు సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కొన్ని కీలక అంశాలను రాహుల్ గాంధీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని భావించినా అందుకు అనుమతి లభించలేదని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంటును కేవలం ప్రభుత్వానికే పరిమితం చేయాలని చూస్తున్నారని విపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, విపక్షాల వద్ద తీర్మానాన్ని నెగ్గించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం లేదని అన్నారు. కాగా మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఇండియా కూటమి సమావేశాల్లో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ముందుగా స్పీకర్‌కు ఫిర్యాదు లేఖ ఇవ్వాలని కొందరు సూచించినప్పటికీ, చివరికి అవిశ్వాస తీర్మానానికే మొగ్గు చూపారు. -
‘మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెప్పరు’: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ‘అన్పబ్లిష్డ్ మెమోయిర్’ పుస్తకం చుట్టూ నెలకొన్న వివాదంపై తీవ్రంగా స్పందించారు. ఈ పుస్తక ప్రచురణ కర్త పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఇచ్చిన వివరణను ఆయన తప్పుబట్టారు. ఢిల్లీ పోలీసులు ఈ పుస్తక ప్రతుల చలామణిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదన్న పెంగ్విన్ సంస్థ వాదనలో పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నాయని ఆరోపించారు.జనరల్ నరవణే గతంలో చేసిన ఒక ట్వీట్‌ను ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రదర్శించారు. ‘తన పుస్తకాన్ని కొనుగోలు చేయడానికి ఈ లింక్‌ను అనుసరించండి’ అని నరవణే స్వయంగా ట్వీట్ చేశారని ఆయన గుర్తు చేశారు. తాను చెప్పదలుచుకున్న పాయింట్ ఒక్కటేనని, అయితే నరవణే అబద్ధం చెబుతున్నారు లేదా పెంగ్విన్ సంస్థ అబద్ధం చెబుతోంది.. అయితే దేశ మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెబుతారని తాను అనుకోవడం లేదన్నారు. నరవణే మాటలకే తాను ప్రాధాన్యత ఇస్తానని రాహుల్ స్పష్టం చేశారు.ఈ పుస్తకం గతంలో ‘అమెజాన్’లో అందుబాటులో ఉందని, 2023లోనే దీనిని కొనమని నరవణే కోరారని రాహుల్ పేర్కొన్నారు. ఈ మెమోయిర్‌లో ఉన్న కొన్ని అంశాలు భారత ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రికి ఇబ్బందికరంగా మారాయని, అందుకే వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా దీనిపై స్పందిస్తూ.. 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తక ప్రచురణ హక్కులు తమకే ఉన్నాయని, అయితే దానిని తాము ఇంకా మార్కెట్లోకి విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న ఏవైనా డిజిటల్ లేదా ప్రింట్ కాపీలు కాపీరైట్ ఉల్లంఘన కిందకే వస్తాయని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఇది కూడా చదవండి: విద్యార్థులకు శుభవార్త.. ఇకపై మార్కుల్లో పొరపాట్లకు చెల్లు! -
నరవణే పుస్తక వివాదం.. పెంగ్విన్ కీలక ప్రకటన
ఢిల్లీ: నరవణే పుస్తకం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ బుక్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ‘‘తన బుక్ అందుబాటులోకి వచ్చిందని నరవణె చెప్పారు. బుక్ విడుదలపై నరవణే అయినా అబద్ధం చెప్పాలి.. లేకపోతే పెంగ్విన్ అయినా అబద్ధం చెప్పాలి. మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెబుతున్నారని అనుకోను’’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.కాగా, ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకం ఉదంతంపై లోక్‌సభలో కొనసాగుతోంది. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు విపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రయత్నించడం.. అందుకు మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలపడం రగడకు దారితీసింది. నాటినుంచి సభలో ఆందోళనలు మినహా కార్యకలాపాలేవీ సాగడం లేదు.పెంగ్విన్ ఏం చెప్పిందంటే?ఇదిలాఉండగా.. నరవణే పుస్తక వివాదంపై పెంగ్విన్ సంస్థ వివరణ ఇచ్చింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రాసిన జ్ఞాపకాల సంకలనం 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'పై పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ పుస్తక ప్రచురణకు సంబంధించి తమకే ప్రత్యేక హక్కులు ఉన్నాయని, ఇది ఇప్పటివరకు ఏ రూపంలోనూ అధికారికంగా విడుదల కాలేదని స్పష్టం చేసింది.ముద్రణ రూపంలో గానీ, డిజిటల్ రూపంలో గానీ ఈ పుస్తకాన్ని తాము ఇప్పటివరకు పంపిణీ చేయలేదని.. డిజిటల్ కాపీలు చట్టవిరుద్ధమని, అవి కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తాయని సంస్థ హెచ్చరించింది. ఇలాంటి అనధికారిక పంపిణీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.ఢిల్లీ పోలీసుల విచారణమరోవైపు, అధికారికంగా విడుదల కాకముందే ఈ పుస్తకంలోని అంశాలు బయటకు ఎలా వచ్చాయనే దానిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఆర్ఐ నమోదు చేశారు. స్పెషల్ సెల్ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది. -
భయంతోనే డుమ్మా
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో పాటు దేశ భద్రత, ప్రజా ప్రయోజనాలతో ముడిపడ్డ పలు అంశాలపై బదులివ్వడానికి మోదీ సర్కారు భయపడుతోందని విపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. అందుకే కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో జరగాల్సిన చర్చ నుంచి పారిపోతోందని ఆరోపించారు. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నవరణె పుస్తకానికి సంబంధించి సభలో తాను లేవనెత్తిన ఇబ్బందికర అంశాలపై బదులివ్వాల్సి వస్తుందనే భయంతోనే ప్రధాన నరేంద్ర మోదీ గత వారం లోక్‌సభకు డుమ్మా కొట్టారంటూ ఎద్దేవా చేశారు. విపక్షాల నుంచి ముప్పు కారణంగానే ఆయన రాలేదన్న స్పీకర్ ప్రకటనపై తీవ్రంగా మండిపడ్డారు. ‘‘అది పచ్చి అబద్ధం. అది నిజమే అయితే ముప్పుందంటున్న వాళ్లు అందుకు బాధ్యుడైన వ్యక్తిపై తక్షణం ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?’’అని ప్రశ్నించారు. సోమవారం రాహుల్ మీడియాతో మాట్లాడారు. ‘‘నిండు సభలో మోదీపై దాడి చేసే ఆలోచనే కాంగ్రెస్ సభ్యులకు లేదు. ప్రజా సమస్యలతో పాటు అన్ని అంశాల మీదా అర్థవంతమైన చర్చ జరగాలనే విపక్షం కోరుకుంటోంది. సభకు వచ్చేందుకు మోదీకి దమ్ముండాలి. కానీ ఆయనకు నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదు. సభలో అడుగు పెట్టగానే మేమెక్కడ నరవణె పుస్తకాన్ని తన చేతిలో పెడతామో అని మోదీ భయపడుతున్నారు. ప్రభుత్వం కూడా చర్చకు భయపడుతోందన్నదే నా వ్యక్తిగత అభిప్రాయం’’అన్నారు. -
లోక్‌సభలో అవే దృశ్యాలు.. మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. అధికార, విపక్షాల మధ్య పలు అంశాలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉండటంతో సోమవారం కూడా సభ కార్యకలాపాలేవీ చేపట్టకుండానే వాయిదా పడింది. తొలుత ఉదయం రెండుసార్లు, అనంతరం మధ్యాహ్నం రెండింటి తర్వాత మంగళవారానికి సభను వాయిదా వేయాల్సి వచ్చింది. వారం రోజులుగా సభ నిత్యం అంతరాయాలనే ఎదుర్కొంటూ వస్తుండటం తెలిసిందే. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు విపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రయత్నించడం, అందుకు మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలపడం రగడకు దారితీసింది. నాటినుంచి సభలో ఆందోళనలు మినహా కార్యకలాపాలేవీ సాగడం లేదు. పదేపదే అవాంతరాలు ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టింది. ఆ వెంటనే విపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నినాదాలకు దిగారు. తాము లేవనెత్తిన పలు అంశాలపై తక్షణ చర్చకు పట్టుబట్టారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వాటిని లేవనెత్తవచ్చని స్పీకర్ ఓం బిర్లా సూచించారు. రాహుల్‌తో సహా సభ్యులంతా తమ అంశాలను లేవనెత్తవచ్చన్నారు. అయినా సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. కేవలం కార్యకలాపాలను స్తంభింపజేయడమే లక్ష్యంగా వారు వ్యూహం రూపొందించుకుని సభకు వచ్చారంటూ మండిపడ్డారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా వేశారు. తిరిగి సమావేశం కాగానే, ముందుగా రాహుల్‌ను మాట్లాడనివ్వాల్సిందేనని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. నిబంధనల మేరకు బడ్జెట్‌పై చర్చ ప్రారంభం కావాల్సి ఉందని సభాపతి స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ తమ ప్రధాన వక్తగా శశి థరూర్ పేరు ఇచి్చనందున ఆయన మాట్లాడాలని సూచించారు. విపక్షాల నినాదాలు ఆగకపోవడంత సభ మధ్యాహ్నం రెండిటితో వాయిదా పడిడంది. తిరిగి సమావేశం కాగానే సభాపతి స్థానంలో ఉన్న సంధ్యా రాయ్ బడ్జెట్‌పై చర్చను ప్రారంభించాల్సిందిగా థరూర్‌కు సూచించారు. తన ప్రసంగానికి ముందు విపక్ష నేత రాహుల్ కొన్ని అంశాలను లేవనెత్తదలచారని థరూర్ పేర్కొన్నారు. రాహుల్ బడ్జెట్‌పై ప్రసంగిస్తే అభ్యంతరం లేదని రాయ్ బదులిచ్చారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ, బడ్జెట్‌పై చర్చకు ముందు పలు అంశాలపై మాట్లాడేందుకు తనకు అవకాశమివ్వాలని పట్టుబట్టారు. అందుకు తనకు అవకాశమిస్తానని విపక్ష సభ్యులతో సమావేశం సందర్భంగా స్పీకర్ అంగీకరించినట్టు వెల్లడించారు. కానీ అలాంటిదేమీ లేకుండా నేరుగా బడ్జెట్‌పై చర్చను మొదలు పెడుతున్నారంటూ ఆక్షేపించారు. తనకు అలాంటి సమాచారమేదీ లేనందున ఇతర అంశాలు లేవనెత్తేందుకు అనుమతించలేనని రాయ్ పేర్కొన్నారు. స్పీకర్ అలాంటి అంగీకారానికి రాలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు స్పష్టం చేశారు. ఒప్పందంపైనే రాహుల్ మాట్లాడాలనుకుంటే దానిపై స్పందించేందుకు స్పీకర్ సభలో అందుబాటులో ఉండాల్సి ఉంటుందన్నారు. అధికార, విపక్షాల్లో ఎవరూ పట్టు వీడకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు రాయ్ ప్రకటించారు. ప్రధాని ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానం ఫిబ్రవరి 5న ఆమోదం పొందడం తెలిసిందే! ఇలా జరగడం 22 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఫిబ్రవరి 4న ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే సందర్భంగా ఆయన స్థానం వద్దకు వెళ్లి అనూహ్య చర్యకు పాల్పడాలని కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించుకున్నట్టు కచి్చతమైన సమాచారం అందిందని స్పీకర్ పేర్కొన్నారు. అందుకే ఆయన భద్రత దృష్ట్యా సభకు రావద్దని తానే సూచించినట్టు తెలిపారు. దీన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా తోసిపుచ్చారు. అది పచ్చి అబద్ధమన్నారు. -
జీవితం పూలపాన్పు కాదు
న్యూఢిల్లీ: జీవితం అనేది ఎత్తుపల్లాల్లేకుండా సరళరేఖలా ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని యువ ఎన్ఐఆర్ విద్యార్థులతో వీడియో ద్వారా రాహుల్ సంభాషించారు. ఆ సంభాషణ తాలూకు వివరాలను రాహుల్ తన యూట్యూబ్ ఖాతాలో ఆదివారం పోస్ట్‌చేశారు. ‘‘ వాస్తవిక ప్రశ్నలు, నిజాయతీ అయిన సమాధానాలు. ఇందులో ఎలాంటి వడబోతలు లేవు. నేటి యువత గుర్తింపు సమస్యతోపాటు ఒత్తిడిని బాగా ఎదుర్కొంటోంది. జెన్ జెడ్ యువత తమ ఇష్టాయిష్టాలను, వృత్తిజీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలో తెలీక సతమతమవుతోంది. స్వేచ్ఛగా ఆలోచించడానికి తమ భావాలను వ్యక్తపర్చడానికి యువత ఇబ్బందిపడుతోంది. కొత్త విషయాలను తెల్సుకోవడం మొదలలు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, ఒక నిర్ణయం నుంచి ఎలా బయటపడాలి అనే సమస్యలూ జెన్‌జెడ్‌ను చుట్టుముట్టాయి. తమకు తమకు నమ్మకం లేక ఎలా ఇబ్బందులపాలవుతున్నారో, అభద్రతా భావంతో కుంగిపోతున్నారో వాళ్లు నాతో చెప్పారు. ఇబ్బందులు పడే జెన్‌జెడ్‌కు నేనిచ్చే సందేశం ఒక్కటే. సమయానుకూలంగా వ్యవహరిస్తూ దృఢచిత్తంతో పోరాడాలి. అన్నింటినీ ఎదుర్కోవాలి’’ అని సూచించారు. -
సభాపర్వం నిరాశాజనకం
‘మీ స్వరాన్ని పెంచకండి... చట్టసభల్లో మెరుగుపరుచుకోవాల్సింది మీ వాదనను మాత్రమే’ అన్నారు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా హక్కుల యోధుడు డెస్మండ్ టుటు. దేశంలో చట్టసభల తీరుతెన్నులు చూస్తున్నవారికి ఎప్పుడూ ఖేదమే మిగులుతోంది. చట్టసభల పేరుచెబితే వాగ్యుద్ధాలూ, వాకౌట్లూ గుర్తుకొస్తున్నాయి. ఎప్పటిలాగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కూడా ఆ ధోరణిలోనే సాగుతున్నాయి. ఈసారి పార్లమెంటు లోపలే కాదు, వెలుపల కూడా ఆధిక్యతా ప్రదర్శన కనబడుతోంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కావొచ్చు, అధికార విపక్షాలు ప్రత్యర్థుల్లాకాక శత్రుపక్షాల్లా పోట్లాడుకుంటున్నాయి. చివరకు ఎక్కడివరకూ పోయిందంటే... కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ పట్ల అవాంఛ నీయ చర్యకు పాల్పడే అవకాశం ఉందంటూ తనకు సమాచారం అందటంతో ఆయన్ను సభకు రావొద్దంటూ తానే సూచించానని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అదంతా అబద్ధమన్నది కాంగ్రెస్ వాదన. నిజానిజాల సంగతలా ఉంచి లోక్‌సభ స్పీకర్ ప్రధానిని సభకు రావద్దని సూచించటం ఊహకందనిది. ఇలాంటి పరిణామాలు ప్రపంచం దృష్టిలో మన ప్రజాస్వామ్యాన్ని పలచబారుస్తాయి. కాంగ్రెస్ తీరుచూస్తే సభను సాగనివ్వకపోవటమే దాని ఏకైక వ్యూహంగా కనబడు తోంది. దీనిద్వారా ఆ పార్టీ ఎలాంటి సందేశం పంపదల్చుకున్నదోగానీ, కీలకమైన బిల్లులు ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో ఆమోదం పొందుతున్నాయి. పద్దులు గిలెటిన్ అవుతున్నాయి. పాలక పక్షం పని సులభమవుతోంది. సభలో మెజారిటీయే దేన్నయినా నిర్ణయిస్తుంది. విపక్షాలు దాన్ని అడ్డుకోలేవు. కనీసం అర్థవంత మైన చర్చంటూ జరిగితే ఎలాంటి బిల్లులు వస్తున్నాయో, వాటి లోటుపాట్లేమిటో,అందువల్ల కలిగే పరిణామాలేమిటో సామాన్యులు అర్థం చేసుకునే వీలుంటుంది. తమ వ్యూహం సామాన్య పౌరులకు ఆ అవకాశాన్ని నిరాకరిస్తున్నదని కాంగ్రెస్ గ్రహించటం లేదు. యూపీఏ హయాంలో కూడా బీజేపీ ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. దాన్నే తామూ ప్రయోగించి పైచేయి సాధించాలని చూడటం ద్వారా కాంగ్రెస్ ఆశిస్తున్న ప్రయోజనమేమిటో అర్థంకాదు. తోచింది చేసుకుంటూ పోవటం, జరిగే ఘటనలపై అప్పటికప్పుడు అనాలోచితంగా స్పందించటం తప్ప కాంగ్రెస్‌కు పకడ్బందీ వ్యూహం ఉన్నట్టు కనబడదు. బుధవారం పార్లమెంటు మకరద్వారం వద్ద జరిగిన ఘటనే ఇందుకు తార్కాణం. కేంద్ర మంత్రి రవనీత్‌సింగ్ బిట్టూతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జగడం నివారించదగింది. బిట్టూ అక్కడ ధర్నాకు కూర్చున్న కాంగ్రెస్ ఎంపీలనుద్దేశించి అవహేళనగా వ్యాఖ్యానించి ఉండొచ్చు. కానీ అవి యథాలాపంగా అన్న మాటలు కాదు. ఇరుపక్షాల మధ్యా యుద్ధం సాగుతున్న వేళ వ్యూహాత్మకంగా మాట్లాడినవి. రాహుల్ గాంధీ ఆయన్ను కాస్తా ద్రోహి అంటూ నిందించటం ద్వారా బీజేపీకి పదునైన ఆయుధం ఇచ్చారు. పార్టీ మారటం ద్రోహమైతే, అలాంటివారు కాంగ్రెస్‌లో లేరా? అసలు పార్టీని నమ్ముకుని ఉన్నవారి పట్ల అధినేతలుగా తాము చేసిన, చేస్తున్న ద్రోహం మాటేమిటి? అవసరార్థం పక్క పార్టీలతో కుమ్మక్కవుతూ మొత్తంగా పార్టీలో ఉన్నవారందరికీ చేస్తున్న ద్రోహమెంత? రాహుల్‌గాంధీ ఆలోచించారా? పరిస్థితులు మళ్లీ చక్కబడితే బిట్టూ లాంటివారు తిరిగి కాంగ్రెస్ లోకి రారనీ, రాహుల్ తీసుకోబోరనీ ఎవరైనా చెప్పగలరా?ఎందుకో ఈసారి పార్లమెంటులోనూ, వెలుపలా ‘పుస్తక ప్రదర్శన’ జరిగింది. చైనా నుంచి ముప్పు ముంచుకొస్తున్నవేళ బాధ్యతంతా రాజకీయ నాయకత్వం అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ నరవణేపై వదిలేసి, చేతులు దులుపుకొన్నదని రాహుల్ ఆరోపించారు. జనరల్ నరవణే పుస్తక సారాంశాన్ని సభలో చెబుతానన్న భయంతోనే తనను అడ్డుకున్నారని అన్నారు. దీనికి పోటీగా బీజేపీ సభ్యులు సభలో పుస్తకాలు ప్రదర్శించారు. ఈ దఫా పుస్తకాల ప్రస్తావన రావటం బాగున్నా, వాటిని ప్రదర్శించటంతో సరిపెట్టక ఇరుపక్షాలవారూ ఎవరికివారు చదువుకోవాలి. అప్పుడు మన చట్టసభల తీరు ఇంత అధ్వాన్నంగా అయితే ఉండదు. కనీసం సభల నిర్వహణకయ్యే వ్యయాన్నయినా దృష్టిలో ఉంచుకుని సమావేశాలను వృథా కానీయరాదని రెండు పక్షాలూ గ్రహించటం అవసరం. -
ద్రోహి.. శత్రువు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీ, కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది. బుధవారం ఉదయం పార్లమెంట్ మకరద్వారం వద్ద ఇరువురు నేతలు ఎదురుపడ్డారు. పార్లమెంట్ నుంచి సస్పెండైన విపక్ష ఎంపీలకు సంఘీభావంగా రాహుల్ మాట్లాడేందు సిద్ధమవుతుండగా ఇంతలోనే బిట్టూ అక్కడికి వచ్చారు. విపక్ష ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఏదో యుద్ధంలో గెలిచి వచి్చనట్లు ఇక్కడ కూర్చున్నారంటూ బిట్టూ ఎద్దేవా చేశారు. దానిపై రాహుల్ ఘాటుగా బదులిచ్చారు. ‘‘ఒక ద్రోహి మన పక్కనుంచే వెళ్తున్నాడు. అతడి ముఖం చూడండి. ఎలా కనిపిస్తున్నాడో చూడండి. హలో బ్రదర్. నా ద్రోహి మిత్రుడా.. ఆందోళన చెందకు. నువ్వు మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తావు’’ అంటూ వ్యాఖ్యానించారు. బిట్టూతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే, రాహుల్‌తో కరచాలనానికి బిట్టూ నిరాకరించారు. రాహుల్ వైపు చూస్తూ దేశానికి శత్రువు(దేశ్ కీ దుష్మన్) అంటూ నిందించారు. అక్కడున్న సస్పెండైన ఎంపీలను, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి దేశ్ కీ దుష్మన్ అంటూ పలుమార్లు అన్నారు. ఈ వీడియోలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టుచేసింది. అనంతరం బిట్టూ మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ చెడిపోయిన పిల్లాడు’ అంటూ నిందించారు. అక్కడ ఎంతోమంది ఎంపీలు ఉండగా, సిక్కు మతస్థుడినైన తనను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారని రాహుల్‌పై మండిపడ్డారు. ‘‘తామే పెద్ద దేశభక్తులమని గాం«దీలు పదేపదే చెప్పుకుంటారు. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని అంటుంటారు. మా తాత బియాంత్ సింగ్ పంజాబ్‌లో బలిదానం చేశారు. గాంధీ కుటుంబం సృష్టించిన ఉగ్రవాదానికి ఆయన బలయ్యారు. సిక్కుల రక్తంతో గాం«దీల చేతులు తడిచాయి. సిక్కు వ్యతిరేక గొడవల్లో ఎంతోమంది చనిపోయారు. సిక్కులను హత్య చేసి, గురుద్వారాలను కూల్చేసిన గాంధీ కుటుంబ వారసులతో ఈ సర్దార్ ఎప్పటికీ చేతులు కలపడు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తే లేదు. నాకు జరిగిన అవమానాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తా’’ అని బిట్టూ స్పష్టంచేశారు. రాహుల్ క్షమాపణ చెప్పాలి కేంద్ర మంత్రి రవనీత్‌సింగ్ బిట్టూ ద్రోహి అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురి సహా బీజేపీ నేతలు, సిక్కు నాయకులు తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ సిక్కులకు వ్యతిరేకం అన్న సంగతి మరోసారి తెలిసిపోయిందని అన్నారు. రాహుల్ గాం«దీని సిక్కులు ఎప్పటికీ క్షమించబోరని తేలి్చచెప్పారు. మరోవైపు రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. సిక్కు వర్గాన్ని కించపర్చినందుకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ అమరీందర్ సింగ్ రాజా సమర్థించారు. ద్రోహిని ద్రోహి అనకపోతే ఇంకేం అంటారని ప్రశ్నించారు. బిట్టూకు కాంగ్రెస్ ఎంతో చేసిందని, అయినా సరే పారీ్టకి ద్రోహం చేసి వెళ్లిపోయాడని ఆరోపించారు. -
బాధ్యత దులిపేసుకున్న మోదీ
న్యూఢిల్లీ: భారత్–చైనా మధ్య 2020లో జరిగిన ఘర్షణ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ముఖ్యమైన బాధ్యతను అప్పటి ఆర్మీ చీఫ్‌పైకి నెట్టేసి, చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సంక్షోభ సమయంలో మోదీ అలా తప్పించుకోవడం ఏమిటని నిలదీశారు. ప్రజలు ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోతోందని విమర్శించారు. రాహుల్ బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణే రచించి, ఇంకా అధికారికంగా విడుదల చేయని జ్ఞాపకాల పుస్తకాన్ని ప్రదర్శించారు. అందులోని కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ పుస్తకం నిజంగా ఉందన్న సంగతిని యువత తెలుసుకోవాలని కోరారు. అసలు ఇలాంటి పుస్తకమే లేదని ప్రభుత్వం నమ్మబలుకుతోందని, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ అదేమాట చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తూర్పు లద్ధాఖ్‌లో గల్వాన్ ఘర్షణ సమయంలో ఏం జరిగిందో నరవణే సవివరంగా రాశారని తెలిపారు. మోదీ వస్తే పుస్తకం అందజేస్తా.. ‘‘చైనా యుద్ధ ట్యాంకులు కైలాస పర్వతం దాకా దూసుకొచ్చాయి.. ఇప్పుడేం చేయాలని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోపాటు రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అడిగారు. అందుకు వారు సమాధానం చెప్పలేదు. దాంతో రాజ్‌నాథ్ సింగ్‌ను మళ్లీ అడిగారు. ఉన్నత స్థాయి వాళ్లను(ప్రధానమంత్రి) అడిగి చెప్తానని రాజ్‌నాథ్ బదులిచ్చారు. రాజ్‌నాథ్ వెళ్లి ప్రధానమంత్రిని అడిగితే.. మీకు ఏది సముచితం అనిపిస్తే అదే చేయండి అంటూ మోదీ బాధ్యత దులిపేసుకున్నారు. చైనా యుద్ధ ట్యాంకులు మన భూభాగంలోకి ప్రవేశించినా తనకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారు. దాంతో ఈ అంశంలో పూర్తిగా ఒంటరిగా మారిపోయినట్లు భావించానని నరవణే తన పుస్తకంలో రాశారు. ఇదే విషయం నేను పార్లమెంట్లో చెప్తానని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే నన్ను సభలో మాట్లాడనివ్వడం లేదు. లోక్‌సభకు వచ్చేంత ధైర్యం ప్రధాని మోదీకి ఉందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఆయన వస్తే ఈ పుస్తకం అందజేస్తా’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఈ పుస్తకం ప్రతిపక్ష నేత గానీ, విదేశీ రచయిత గానీ రాయలేదని వెల్లడించారు. మాజీ ఆర్మీ చీఫ్ రాశారని పేర్కొన్నారు. అయినా ఇలాంటి పుస్తకం లేనేలేదని అంటున్నారని తప్పుబట్టారు. పార్లమెంట్‌కు వచి్చ, నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం మోదీకి లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం భయపడుతోంది: ప్రియాంక చైనాతో ఘర్షణ జరిగినప్పుడు మోదీ ప్రభుత్వ నిర్వాకం ఏమిటో జనరల్ నరవణే బయటపెట్టారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా పేర్కొన్నారు. నిజాలు ప్రజలకు తెలుస్తాయని మోదీ సర్కార్ భయపడుతోందని, అందుకే లోక్‌సభలో మాట్లాడేందుకు రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వడం లేదని బుధవారం విమర్శించారు. బీజేపీ ఎంపీలు కూడా గతంలో పుస్తకాలు, మేగజైన్లు, రిపోర్టులను ప్రస్తావిస్తూ పార్లమెంట్లో మాట్లాడారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ కూడా సంజయ్‌బారు పుస్తకం గురించి మాట్లాడారని తెలిపారు. నరవణే పుస్తకంపై రాహుల్ మాట్లాడితే తప్పేమిటని ప్రశ్నించారు. అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఎంపీలకు ఉందన్నారు. -
సభలో రచ్చరచ్చ
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం, మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణే పుస్తకంపై లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు బుధవారం సైతం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు నిజాలు బహిర్గతం చేయాలని పట్టుబట్టారు. సభలో బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉండగా, ఆయన సభకు హాజరు కాలేదు. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు ప్రారంభించారు. శాంతించాలంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. దాంతో స్పీకర్ సభను ఉదయం 11 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యుల ఆందోళన ఆగలేదు. ప్రభుత్వం సమాధానం చెప్పేదాకా విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. విపక్ష ఎంపీలు తొలుత వెల్‌లో బైఠాయించారు. అనంతరం బ్యానర్లు ప్రదర్శిస్తూ అధికార పక్ష సభ్యులవైపు దూసుకొచ్చారు. నరవణే పుస్తకంపై సభలో రాహుల్ గాం«దీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి తీరును కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అమిత్ షా తప్పుపట్టారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల దాకా, తర్వాత 2 గంటల దాకా వాయిదా వేశారు. మరో వాయిదా తర్వాత 5 గంటలకు సభ మళ్లీ ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ సమయంలోనే ప్రధాని ప్రసంగించాల్సి ఉంది. కాంగ్రెస్ మహిళా ఎంపీ వర్షా గైక్వాడ్ సహా మరికొందరు మహిళా సభ్యులు ప్రధాని కూర్చొనే స్థానం వద్దకొచ్చి ఘోరావ్ చేశారు. అప్పుడు మోదీ సభలో లేరు. వెనక్కి రావాలంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కోరినా విపక్ష సభ్యులు పట్టించుకోలేదు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రాయ్ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. పరిస్థితి అదుపులో లేకపోవడం వల్లనే మోదీ సభకు రాలేదని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ చెప్పారు. రాహుల్‌కు పోటీగా దూబే పుస్తక ప్రదర్శన..మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ‘ఎడ్వినా అండ్ నెహ్రూ’, ‘మిత్రోఖిన్ ఆర్కైవ్’ అనే పుస్తకాలను సభలో ప్రదర్శిస్తూ వాటి గురించి ప్రస్తావించడంతో వివాదం మొదలైంది. దివంగత ప్రధానమంత్రులు నెహ్రూ, ఇందిరా గాం«దీ, రాజీవ్ గాంధీపై ఆయన విమర్శలు చేశారు. వారు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అయితే, సభలో పుస్తకాల గురించి ప్రస్తావించడానికి వీల్లేదని సభాపతి స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెన్నేటి స్పష్టంచేశారు. నిషికాంత్ దూబ్ తీరుపై మండిపడుతూ కాంగ్రెస్ సహా ఇతర విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో సభాపతి లోక్‌సభను సాయంత్రం 5 గంటల దాకా వాయిదా వేశారు. తర్వాత కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. నిషికాంత్ దూబేపై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేశారు. -
రాహుల్ వ్యాఖ్యలతో పార్లమెంట్లో కలకలం
న్యూఢిల్లీ: బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తన మాజీ అనుచరుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూపై విమర్శలు గుప్పించారు. విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో ఈ ఇద్దరు నేతలు ఎదురుపడటంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి, బీజేపీలో చేరిన బిట్టూను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నిరసన తెలుపుతున్న ఎంపీల మధ్య నుండి బిట్టూ వెళ్తుండగా, రాహుల్ గాంధీ ఆయనను చూపిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇదిగోండి.. ఒక ద్రోహి ఇటుగానే వెళ్తున్నారు.. అతని ముఖం చూడండి’ అని ఎద్దేవా చేశారు. అంతటితో ఆగకుండా, బిట్టూ వైపు చేయి చాపి ‘హలో బ్రదర్, నా ద్రోహి మిత్రమా.. కంగారు పడకు, నువ్వు మళ్లీ తిరిగి కాంగ్రెస్‌లోకే వస్తావు" అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.రాహుల్ గాంధీ కరచాలనం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, రవనీత్ బిట్టూ తిరస్కరించారు. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బిట్టూ ఆయనను దేశ శత్రువు అని అభివర్ణించారు. కాంగ్రెస్ దేశాన్ని అమ్మేస్తోందని ఆయన ఆరోపించగా, దానికి బదులుగా బీజేపీయే దేశాన్ని విక్రయిస్తోందని కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య కొద్దిసేపు వాడీవేడీ చర్చ జరిగింది.రవనీత్ బిట్టూ-రాహుల్ గాంధీ మధ్య విభేదాలు ఈనాటివి కావు. 2024లో రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో సిక్కుల గురించి చేసిన వ్యాఖ్యలపై బిట్టూ తీవ్రంగా మండిపడ్డారు. అప్పట్లో రాహుల్‌ను ‘దేశంలోనే నంబర్ వన్ ఉగ్రవాది’ అని బిట్టూ విమర్శించడం పెను దుమారం రేపింది. తాజాగా పార్లమెంట్ వేదికగా జరిగిన ఈ పరిణామం, గత కొంతకాలంగా వీరి మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరాన్ని మరోసారి బహిర్గతం చేసింది. -
లోక్‌సభలో అదే రగడ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకం ఉదంతంపై సోమవారం సభలో రేగిన వివాదం మంగళవారం కూడా కొనసాగింది. దానిపై తనను మాట్లాడనివ్వాలంటూ విపక్ష నేత రాహుల్‌గాంధీ పట్టుబట్టారు. అందుకు సభాపతి అనుమతించకపోవడంతో కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్ష సభ్యులు నిరసనలకు దిగారు. నినాదాలతో సభను హోరెత్తించారు. కాగితాలను చించి స్పీకర్ కేసి విసిరారు. పోడియంపైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ ఉదంతం చివరికి ఎనిమిది మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్‌కు దారితీసింది. ఉదయం నుంచే... మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగా నే రాహుల్‌గాంధీ మాట్లాడారు. 2020 నాటి భారత్, చైనా ఘర్షణకు సంబంధించి నాటి ఆర్మీ చీఫ్ నరవణె తన పుస్తకంలో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఓ మేగజైన్లో వచి్చన వ్యాసాన్ని సోమవారం ఆయన సభలో ఉటంకించడం, అందుకు స్పీకర్ బిర్లా అభ్యంతరం తెలపడం తెలిసిందే. స్పీకర్ సూచించిన మేరకు సదరు వ్యాసాన్ని తాను ధ్రువీకరిస్తున్నట్టు మంగళవారం రాహుల్ సభలో ప్రకటించారు. ఈ మేరకు దానిపై తాను సంతకం చేసిన కాపీని సమరి్పంచారు. దాన్ని పరిశీలించాక స్పందిస్తానని సభాపతి స్థానంలో ఉన్న ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు.అయినా నరవణె అంశంపై మాట్లాడేందుకు రాహుల్ తిరిగి ప్రయత్నించారు. దాంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు అభ్యంతరం తెలిపారు. స్పీకర్ ఒకసారి రూలింగ్ ఇచ్చాక అదే అంశాన్ని పదేపదే లేవనెత్తకుండా అక్కడితో వదిలేయాలని సూచించారు. తాను విపక్ష నేతనని, మాట్లాడేందుకు అనుమతి కోరాల్సిన అవసరం లేదని రాహుల్ బదులిచ్చారు. మేగజైన్లోని అంశంపై మాట్లాడి తీరతానని పట్టుబట్టారు. ప్యానెల్ స్పీకర్ మాత్రం ఇతర విపక్ష సభ్యులను మాట్లాడాల్సిందిగా కోరారు. కానీ వరుసగా ముగ్గురు సభ్యులు మాట్లాడేందుకు నిరాకరించారు. తద్వారా రాహుల్‌కు సంఘీభావం ప్రకటించారు. దాంతో ఎన్డీఏ భాగస్వామి టీడీపీకి చెందిన హరీశ్ బాలయోగిని మాట్లాడాల్సిందిగా ప్యానెల్ స్పీకర్ కోరారు.ఆయన మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాంతో సభ పదేపదే వాయిదా పడింది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోగా విపక్ష సభ్యులు కాగితాలు చించి స్పీకర్ కేసి విసిరారు. పోడియంపైకి, లోక్‌సభ సెక్రెటరీ జనరల్ టేబుల్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. దాంతో తీవ్ర గందరగోళం నడుమ సభ మరోసారి వాయిదా పడింది. మధ్యాహ్నం మూడింటికి సభ తిరిగి సమావేశం కాగానే సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా నేరుగా ఎనిమిది మంది విపక్ష సభ్యులు గుర్జీత్‌సింగ్ ఔజ్లా, హబీ ఈడెన్, సి.కిరణ్‌కుమార్‌రెడ్డి, అమరీందర్‌సింగ్ రజా వారింగ్, మాణిక్కం ఠాగూర్, ప్రశాంత్ పడోలే, డీన్ కురియకోసే (కాంగ్రెస్), ఎస్.వెంకటేశన్ (సీపీ ఎం) పేర్లు చదివి విని్పంచారు. వారిని సస్పెండ్ చేయాల్సిందిగా రిజిజు తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యులు సభ పట్ల, సభాపతి అధికారాల పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఆక్షేపించారు. తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. 8 మంది సభ్యులను ఏప్రిల్ 2న బడ్జెట్ సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్ చేస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. విపక్ష ఎంపీలు రాహుల్ నేతృత్వంలో పార్లమెంటు ఆవరణలో ధర్నాకు దిగారు.ప్రజాస్వామ్యానికి తీరని మచ్చస్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ లేఖజాతీయ భద్రతకు సంబంధించిన అంశంపై విపక్ష నేతను లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకోవ డం ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. సభాపతి స్థానంలో ఉన్నవారు సోమ, మంగళవారాల్లో తనతో ప్రవర్తించిన తీరును తీవ్రంగా నిరసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విపక్ష నేతను మాట్లాడకుండా అడ్డుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని రాహుల్ అన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వ సూచన మేరకే స్పీకర్ నన్ను మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. ఇలా జరగడం మన పార్లమెంటరీ చరిత్రలోనే తొలిసారి!’’ అంటూ మండిపడ్డారు. -
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు
ఢిల్లీ: అమెరికాతో ట్రేడ్ డీల్‌పై కేంద్రం ప్రకటన చేసింది. అమెరికాతో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరిందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ట్రేడ్‌డీల్‌తో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం.ఆక్వా,టెక్స్టైల్స్ ఎగుమితిలో మనకు ఇబ్బందులున్నాయి. వాణిజ్యం ఒప్పందం విషయాన్ని పార్లమెంట్లో చెప్పాలని చూశాం. ఈలోపే ట్రేడ్ డీల్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషం చిమ్మారు.వాణిజ్య ఒప్పందంతో ఏ వర్గానికి నష్టం జరగదు. బలహీనవర్గాల ప్రజలకు మేలు జరగడం రాహుల్‌కు ఇష్టం లేదు. ట్రేడ్ డీల్‌తో లక్షలమంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని స్పష్టం చేశారు. -
సభలో ‘చైనా’ రగడ!
న్యూఢిల్లీ: ‘చైనా రగడ’ సోమవారం లోక్‌సభను కుదిపేసింది. 2020 నాటి భారత్, చైనా ఘర్షణలకు సంబంధించి విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. వాటికి సంబంధించి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె పుస్తకంలోని పలు అంశాలను రాహుల్ సభలో ప్రస్తావించడం కలకలం రేపింది. విపక్ష నేత వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు బీజేపీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ప్రచురణ కాని పుస్తకంలోని అంశాలను ఉటంకించడాన్ని ఆక్షేపించారు.సభను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారంటూ దుయ్యబట్టారు. నరవణె పుస్తకం గురించిన ఉటంకింపులను అనుమతించబోనని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించినా రాహుల్ పట్టించుకోలేదు. పలువురు విపక్ష నేతలు ఆయనకు మద్దతుగా నిలవడంతో గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. దాంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.ఒక్క వాక్యానికే భయమెందుకు?సోమవారం లోక్‌సభ సమావేశమై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టింది. బీజేపీ సభ్యుడు తేజస్వి సూర్య మాట్లాడుతూ కాంగ్రెస్ దేశభక్తిపై పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. అనంతరం ప్రసంగించిన రాహుల్ వాటిపై మండిపడ్డారు. ‘‘నెహ్రూ–చైనా అంశంపై మాట్లాడాలని నేను అనుకోలేదు. కానీ కనుక సూర్య చేసిన విమర్శలకు బదులుగా దానిపై మాట్లాడక తప్పడం లేదు. నెహ్రూ కేవలం తాను రాజనీతిజ్ఞుడినని చెప్పుకునేందుకు వేలాది ఎకరాల భూభాగాన్ని చైనాకు సరెండర్ చేశారని నిరాధారణ ఆరోపణలకు దిగుతున్నారు’’ అన్నారు. ఆ క్రమంలో 2020 భారత్, చైనా గాల్వాన్ ఘర్షణల గురించి జనరల్ నరవణె తన పుస్తకంలో రాసిన అంశాలను ఉటంకించారు. అందుకు అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ పుస్తకం ప్రచురణ అయిందో లేదో ముందుగా రాహుల్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో మొదలైన రగడ 50 నిమిషాలకు పైగా కొనసాగింది. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి పుస్తకం, వార్తా పత్రిక క్లిప్పింగ్ తాలూకు అంశాలనూ సభలో ప్రస్తావించడానికి అనుమతి లేదని ఓం బిర్లా స్పష్టం చేశారు. వాటి ప్రస్తావనకు అడ్డంకులేమీ లేవని రాహుల్ వాదించారు. నరవణె పుస్తకం ప్రచురితం కాలేదని రాజ్‌నాథ్ అభ్యంతరం తెలిపారు. దానిపై ఒక మేగజైన్లో వచ్చిన వ్యాసంలోని అంశాలనే ఉటంకిస్తున్నానని రాహుల్ బదులిచ్చారు. ‘‘ఉగ్రవాదంపై రాజీలేని పోరు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటారు. నేను ఒక్క వాక్యం చదివితే ఎందుకంతగా బెంబేలెత్తిపోతున్నారు?’’ అంటూ ఎద్దేవా చేశారు. ఆ పుస్తక ప్రస్తావనను అనుమతించడం లేదని ఓం బిర్లా పునరుద్ఘాటించారు. ‘అయితే నేనేం మాట్లాడాలో మీరే చెప్పండి’ అని రాహుల్ అనడంతో, ‘నేనేమీ మీ సలహాదారును కాదు’ అంటూ స్పీకర్ ఆగ్రహించారు. స్పీకర్ రూలింగ్‌కు కట్టుబ డకుంటే ఏం చర్యలు తీసుకోవాలో సభ నిర్ణయించాల్సి వస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు హెచ్చరించారు. అయినా రాహుల్ వెనక్కు తగ్గకపోవడంతో పుస్తక ప్రస్తావన తగదంటూ ఆయన్ను బిర్లా పదేపదే వారించారు. పుస్తకాన్ని ప్రచురించొద్దంటూ నరవణెను కేంద్రం బెదిరించిందంటూ రాహుల్ తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజ్‌నాథ్ మండిపడ్డారు. అదే నిజమైతే దానిపై నరవణె కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రాహుల్‌కు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మద్దతుగా నిలిచారు. ఆయనను మాట్లాడేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. వెంటనే అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలకు దిగారు. గందరగోళం నడుమ సభను మధ్యాహ్నం మూడింటిదాకా స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం కూడా ఇండో–చైనా సరిహద్దు అంశాన్ని లేవనెత్తేందుకు రాహుల్ తిరిగి ప్రయత్నించారు. అందుకు అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సైన్యాన్ని న్యూనతపరిచే వ్యాఖ్యలకు దిగొద్దని రాహుల్‌కు రిజిజు సూచించారు. ప్రతిష్టంభన నడుమ సభ సాయంత్రం నాలుగింటిదాకా వాయిదా పడింది. మోదీకి, మంత్రులకు నచ్చదు!సభ మళ్లీ సమావేశమయ్యాక రాహుల్ తన ప్రసంగం కొనసాగించారు. తాను లేవనెత్తుతున్నది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పారు. ‘‘సహజంగానే ప్రధాని మోదీకి, రక్షణ మంత్రికి ఇది నచ్చదు. అందుకే నన్ను మాట్లాడనివ్వడం లేదు’’ అంటూ దుయ్యబట్టారు. మహువా మొయిత్రా, కల్యాణ్ బెనర్జీ (టీఎంసీ), మనోజ్ ఝా (ఆర్జేడీ) తదితర విపక్ష సభ్యులు రాహుల్‌కు బాసటగా నిలిచారు.మోదీ, రాజ్‌నాథ్ దోషులుగా తేలతారనే...సభలో నన్ను అడ్డుకున్నారు: రాహుల్‘‘2020లో చైనాతో ఘర్షణ సందర్భంగా మన సైనిక బలగాల నమ్మకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వమ్ము చేశారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె పుస్తకంలోని అంశాలు వెలుగులోకి వస్తే ఆ ఉదంతంలో వారిద్దరూ దోషులుగా రుజువవుతారు. ఆ భయంతోనే నేను సదరు అంశాలను ప్రస్తావించకుండా బీజేపీ సభ్యులు లోక్‌సభలో పదేపదే అడ్డుకున్నారు’’ అని విపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. సోమవారం సభ వాయిదా పడ్డాక పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ, రాజ్‌నాథ్ గురించి ఆ పుస్తకంలో నరవణె రాశారు. చైనాతో ఘర్షణకు సంబంధించి వారిద్దరూ తనకు ఏం చెప్పిందీ, ఎలాంటి ఆదేశాలిచ్చిందీ స్పష్టంగా పేర్కొన్నారు. దాన్నే నేను సభలో ప్రస్తావించా. ఆ రెండు మూడు వాక్యాల్లో విషయమంతా స్పష్టంగా బయటపడిపోయేది. పైగా వాటిని రాసింది నాటి ఆర్మీ చీఫ్! కానీ ఆ మాత్రానికే మోదీ సర్కారు బెంబేలెత్తిపోతోంది. ఎందుకంటే అది వెలుగులోకి వస్తే వారిద్దరి బండారం బయటపడుతుంది’’ అన్నారు. 2020లో చైనా చొచ్చుకొస్తున్నప్పుడు మోదీ 56 అంగుళాల ఛాతీ ఏమైపోయిందంటూ ఎద్దేవా చేశారు. ‘‘అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని నడిపే నాయకుడు స్పష్టంగా దిశానిర్దేశం చేయాలి. అంతే తప్ప నిర్ణయాలను ఇతరుల భుజస్కంధాలపై నెట్టి బాధ్యతల నుంచి తప్పించుకోవద్దు. కానీ మోదీ చేసింది సరిగ్గా అదే! ఆర్మీ మాజీ చీఫ్ రాసిన పుస్తకాన్ని ప్రచురణ కూడా కానివ్వడం లేదు’’ అని రాహుల్ ఆరోపించారు.నిబంధనల దుర్వినియోగం: కాంగ్రెస్సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీని మోదీ సర్కారు అవహేళన చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. పైగా ఆయన గొంతు నొక్కేందుకు నిబంధనలను కూడా దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడింది. నరవణె పుస్తకంలోని నిజాలు వెలుగులోకి వస్తాయన్న భయంతోనే చౌకబారు చేష్టలకు దిగారని కాంగ్రెస్ సీనియర్ నేత కె.సి.వేణుగోపాల్ ఆరోపించారు. ఇది నయా ఫాసిజానికి తిరుగులేని తార్కాణమంటూ ధ్వజమెత్తారు.పార్లమెంటును కించపరిచారువిపక్ష నేత రాహుల్‌గాంధీ తన ప్రవర్తనతో పార్లమెంటు గౌరవానికే భంగం కలిగించారని బీజేపీ దుయ్యబట్టింది. అంతేగాక భారత్–చైనా సరిహద్దు అంశంపై నిరాధారణ ఆరోపణలు, బాధ్యతారహిత వ్యాఖ్యలతో సైనికుల ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బ తీశారంటూ ఆక్షేపించింది. రాహుల్ పూర్తిగా భారత వ్యతిరేక శక్తుల భాష మాట్లాడుతున్నారని మంత్రులు, బీజేపీ నేతలు మండిపడ్డారు. సభలో రాహుల్ ప్రవర్తన భారత్ పరువును మంటగలిపేందుకు పక్కా పథకం ప్రకారం పన్నిన కుట్రలో భాగమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆరోపించారు. పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. విలువైన సభా సమయాన్ని రాహుల్ వ్యర్థపరిచారని మండిపడ్డారు. ‘‘జాతీయ భద్రతతో ఆటలాడొద్దు. దాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకోవద్దు’’ అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో భారత భూభాగాన్ని చైనాకు కోల్పోయినందుకు రాహుల్ తక్షణం దేశానికి క్షమాపణ క్షమాపణ చెప్పాలని రిజిజు డిమాండ్ చేశారు. రాహుల్ ఏకంగా నిండు సభలోనే మన దేశ శత్రువుల భాష మాట్లాడుతున్నారంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ మండిపడ్డారు.ఆ పుస్తకంలో ఏముంది?లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ, మంత్రుల నడు మ రగడకు కేంద్ర బిందువుగా మారిన ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణె పుస్తకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన తన సైనిక జీవితం తాలూకు జ్ఞాపకాలకు ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పేరిట పుస్తక రూపమిచ్చారు. పెంగ్విన్ పబ్లిషింగ్ హౌజ్ దాన్ని ప్రచురించాల్సి ఉంది. అందుకు రక్షణ శాఖ అనుమతి కోసం ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నట్టు నరవణె గత అక్టోబర్‌లో పేర్కొన్నారు! ఈ నేపథ్యంలో ఆ పుస్తకంపై ద కారవాన్ మేగజైన్ గత నెలలో కవర్ పేజీ వ్యాసం ప్రచురించింది. రాహుల్ సోమవారం సభలో ఉటంకించింది ఆ వ్యాసంలోని అంశాలనే! తద్వారా, గాల్వాన్ ఘర్షణ వంటి అతి కీలక ఉదంతంపై సరైన నిర్ణయం తీసుకోవడంలో మోదీ సర్కారు తాత్సారం చేసిందని చెప్పేందుకు ఆయన ప్రయత్నించారు.నిర్ణయాన్ని నాకే వదిలారు: నరవణె2020 జూన్15 రాత్రి తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత, చైనా సైనిక దళాల మధ్య భారీ ఘర్షణ జరిగింది. వాటిలో కల్నల్ సంతోష్‌కుమార్‌తో సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనావైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగి నా డ్రాగన్ దేశం ఆ వివరాలను బయ టికి రానివ్వ లేదు. ఆ ఘర్షణల సమయంలో నరవణె ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న వేళ 2020 ఆగస్టు 31న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో తన భేటీ గురించి పుస్తకంలో నరవణె రాశారు. ‘‘(గాల్వాన్ ఉద్రిక్తతలపై) ప్రధాని మోదీతో మాట్లాడానని రాజ్‌నాథ్ నాకు చెప్పారు. ‘అది పూర్తిగా సైనిక నిర్ణయం. మీకు ఏది సరైందనిపిస్తే అలా చేయండి’ అన్నారు. దాంతో బాధ్యతంతా పూర్తి గా నాపైనే పడింది. ‘చైనా దూకుడును అడ్డుకు నేందుకు) నేనే సరైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఏం చేయాలా అని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపో యాను’’ అని అందులో నరవణె రాసుకొచ్చి నట్టు కారవాన్ వ్యాసం పేర్కొంది. ‘‘పుస్తకం బ్యాక్ కవర్‌పై 1999 కార్గిల్ యుద్ధ సమయంలో ఆర్మీ చీఫ్‌గా చేసిన జనరల్ వి.పి.మాలిక్ రాసిన అభిప్రాయం కూడా ఆసక్తికరంగా ఉంది. ‘గాల్వన్ లోయ ఘర్షణ, దానికి ముందు, తర్వాత జరిగిన పలు ఉదంతాల గురించి పుస్తకంలో రాసిన అంశాలు చదువుతుంటే పాఠకులంతా భావోద్వేగాలతో ఊగిపోవడం ఖాయం’ అని మాలిక్ రాసుకొ చ్చారు’’ అంటూ వ్యాసం ముక్తా్తయించింది. -
విమర్శలకు దీటైన జవాబు
న్యూఢిల్లీ: రైతులు, యువత, తయారీ దారులు, కుటుంబాల వ్యథలను పట్టించుకోకుండా బడ్జెట్‌ను తయారుచేశారని విపక్ష నేత రాహుల్‌గాంధీ చేసిన విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మల మీడియా భేటీలో తిప్పికొట్టారు. ‘‘ రాహుల్‌గాంధీ ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థంకాలేదు. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ అనిశ్చితి, ప్రతికూల పరిస్థితుల ప్రభావం మన రంగాల మీదా పడుతోంది. అందుకే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మొదలు వస్త్ర, తోలు పరిశ్రమల దాకా అన్నింట్లోనూ కొత్త పథకాలు తీసుకొచ్చాం. రైతులు, మహిళా వ్యవస్థాపకుల దాకా అందరి ప్రయోజనాలకు పెద్దపీట వేశాం. ఇవన్నీ చూశాక కూడా మీరు(రాహుల్) రాజకీయంగా విమర్శలు గుప్పించాలనుకుంటే అది మీ ఇష్టం.కానీ మీరు ఏ అంశాల మీదయితే విమర్శించాలనుకుంటున్నారో అవన్నీ నాకు చెప్తే నేను సావధానంగా వింటా. అందుకు తగ్గట్లు బదులిస్తా’’ అని నిర్మల అన్నారు. ‘‘ గత 12 ఏళ్లుగా భారతీయ ఆర్థికపథం స్థిరంగా ముందుకు సాగుతోంది. స్థిర అభివృద్ధిని సాధిస్తోంది. ద్రవ్యోల్బణం మధ్యస్తంగా ఉంది. అత్యధిక అనిశ్చితి, అస్తవ్యస్త పరిస్థితుల్లోనూ ఉమ్మడిగా మేం తీసుకున్న నిర్ణయాల వల్లే భారత ఆర్థికవ్యవస్థ స్థిరంగా ఉంది. నిర్మాణాత్మక సంస్కరణలకు జై కొట్టాం. ప్రజోపయోగ పథకాలపై పెట్టుబడులు పెడుతూనే ఆర్థిక వివేకం ప్రదర్శించాం. ఆత్మనిర్భరతను మదిలో నిలుపుకుని దేశీయ తయారీరంగ సామర్థ్యాన్ని ఇనుమడింపజేశాం. ఇంధన భద్రతకు పట్టంకట్టాం. దిగుమతులపై ఆధారపడే తత్వం నుంచి కాస్తంత దూరం జరిగాం’’ అని ఆమె అన్నారు. డెరివేటివ్ మార్కెట్లో ఎస్టీటీ పన్ను పెంపుఅత్యాశకు పోయి పెట్టుబడులను పోగొట్టుకొనే మదుపరులను అప్రమత్తంచేసే లక్ష్యంతో డెరివేటివ్ మార్కెట్లో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ పన్ను(ఎస్టీటీ)ని కాస్తంత పెంచామని నిర్మల చెప్పారు. తాజా బడ్జెట్లో ఎస్టీటీని ప్రస్తుతమున్న 0.02 నుంచి 0.05 శాతానికి పెంచారు. ‘‘ నేనేం డెరివేటివ్ ట్రేడింగ్‌కు వ్యతిరేకం కాదు. చిన్న మదుపరులు పెట్టుబడులను నష్టపోవద్దనే సదుద్దేశంతోనే ఎఫ్ అండ్ ఓ మార్కెట్లో పన్నులను పెంచాం’’ అని నిర్మల పేర్కొన్నారు. -
మార్చి 2న రాష్ట్రానికి రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మార్చి 2వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోని హరిత రిసార్ట్స్‌లో ఈనెల 21 నుంచి నిర్వహించనున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం ముగింపు రోజున ఆయన హాజరవుతారని గాందీభవన్ వర్గాలు వెల్లడించాయి. 21వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు పది రోజులపాటు హరిత రిసార్ట్స్‌లో తెలంగాణ, ఏపీకి చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు. టీపీసీసీ శిక్షణ కమిటీ చైర్మన్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి (టీఆర్ఆర్) ఈ శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌కు ఏఐసీసీ అనుమతి లభించడంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రామ్మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం హరిత రిసార్ట్స్‌లో శిక్షణ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై తెలంగాణ, ఏపీలకు చెందిన డీసీసీ అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపుతో సహా పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాల్లో పీసీసీ అధ్యక్షులను క్రియాశీలం చేయాలనేది రాహుల్ గాంధీ ఆలోచన. ఇందుకు సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షులను నియమిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలోని 14 రాష్ట్రాలకు డీసీసీ అధ్యక్షులను నియమించారు. అందులో గుజరాత్, హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ డీసీసీ అధ్యక్షులకు పది రోజుల రెసిడెన్షియల్ శిక్షణను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ దఫా అనంతగిరి కొండలు వేదికగా తెలంగాణ, ఏపీ జిల్లాల అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు. -
Shashi Tharoor: నేనెప్పుడూ కాంగ్రెస్‌లోనే..!
-
మోదీ మార్క్ రాజకీయం.. ఇండియా కూటమికి బిగ్ షాక్
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభంజనం కొనసాగుతోంది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిపై తాజాగా ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీయేకు 352 సీట్లు వస్తాయని సర్వేలో పేర్కొంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 182 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. దీంతో, రానున్న ఎన్నికల్లో కూడా కేంద్రంలో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో, కాషాయ పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నెలకొంది.ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ప్రకారం.. ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించే అవకాశం ఉందని తేలింది. దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి 41 శాతం(287 సీట్లు), కాంగ్రెస్ పార్టీకి 20 శాతం(80సీట్లు), మిగతా పార్టీలకు 39 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55 శాతం మంది భావించినట్లు సర్వే వెల్లడించింది. కాగా, ఆరు నెలల కిందటితో పోల్చితే మూడు శాతం ఓటింగ్ పెరిగినట్లు స్పష్టం చేసింది. ప్రధాని మోదీ పనితీరుపై 57 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాహుల్ గాంధీ 27 శాతం మంది మొగ్గు చూపినట్లు సమాచారం.#MoodOfTheNation | BJP at 41% vote share, Congress at 20% if polls are held todayProjected seat shareBJP - 287 Congress - 80 BJP national spokesperson @Sanju_Verma_ decodes the findings of the #MOTN survey.@BJP4India | @SardesaiRajdeep @maryashakil pic.twitter.com/luJIoaCpER— IndiaToday (@IndiaToday) January 29, 2026ఇక, ఆగస్టు 2025లో నిర్వహించిన ఇండియా టుడే సర్వేలో ఎన్డీయేకి 324 సీట్లు, ఇండియా బ్లాక్‌కు 208 సీట్లు వస్తాయని అంచనా వేశారు. తాజా సర్వేలో ఎన్డీయే సీట్ల సంఖ్య మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 293 సీట్లు, ఇండియా బ్లాక్ 234 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. మరోవైపు.. తాజా సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అలాగే, ఇండియా బ్లాక్ ఈ సర్వేలను జాగ్రత్తగా తీసుకోవాలని, అసలు పోరు ఎన్నికల సమయంలోనే తేలుతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. మోదీ వేవ్‌లో భాగంగా 2025లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి.. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 2026 కూడా మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో విజయాలతో శుభారంభం చేసింది. ప్రస్తుతానికి ఎన్డీయే కూటమి ఫోకస్ మొత్తం రానున్న బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. ఆయా రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో మోదీ ముందుకు సాగుతున్నారు. -
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
సాక్షి,చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని హీరో, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తు ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ తన పాత వైభవాన్ని తిరిగి పొందాలని ఆకాంక్షించారు.తమిళనాడు తిరువాయూర్లో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఎస్.ఏ. చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపాయి. కాంగ్రెస్‌తో పొత్తు సాధ్యమని, విజయ్ ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించడం ద్వారా కొత్త చర్చలు మొదలయ్యాయి. టీవీకే పొత్తు ప్రతిపాదనను పరిశీలిస్తోందని, ఆ ప్రతిపాదనకు కాంగ్రెస్ కూడా అంగీకరించాలని ఆయన కోరారు.కాంగ్రెస్‌కు ఒక చరిత్ర, వారసత్వం ఉంది. విజయ్ ఆ పార్టీకి మద్దతు ఇచ్చి వారి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కాంగ్రెస్ చేతిలోనే ఉంది. కాంగ్రెస్ రాజకీయ ప్రాబల్యం కోసం పోరాడుతోంది. వారి ప్రాభవం తగ్గుతుంటే రక్షించేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నారు’ అని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై అటు టీవీకే అధికార ప్రతినిధులు కానీ.. ఇటు విజయ్ కానీ ధృవీకరించరించలేదు. ఖండించలేదు.అయితే, చంద్రశేఖర్ ప్రతిపాదనను తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై తోసిపుచ్చారు. ‘మా పార్టీ కార్యకర్తలకు విజయ్ నుండి ఎలాంటి ఉత్తేజం అవసరం లేదు. మా కార్యకర్తలను చూడండి, వాళ్లలోనే ఉత్తేజం కనబడుతోంది. మా నాయకుడు రాహుల్ గాంధీ మాకు అవసరమైన ‘బూస్ట్, హార్లిక్స్, బోర్న్‌విటా’ ఇస్తున్నారు’ అని ఆయన స్పష్టం చేశారు. -
ఖర్గే, రాహుల్‌కు మూడో వరుసా?
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలు ప్రొటోకాల్ రగడకు వేదికయ్యాయి. విపక్ష నేతలకు వెనక వరుసల్లో సీట్లు కేటాయించడం వివాదానికి దారితీసింది. సోమవారం కర్తవ్యపథ్‌లో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీకి మూడో వరుసలో స్థానం కల్పించారు. లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలైన వారిద్దరినీ మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అవమానించిందని కాంగ్రెస్ ఆరోపించింది. వారు మూడో వరుసలో కూర్చున్న ఫొటోలను ఆ పారీ్టకి చెందిన పలువురు నేతలు ఎక్స్‌లో పంచుకున్నారు.తమ నేతలకు సీట్ల కేటాయింపులో వివక్ష ఎందుకని నిలదీశారు. ఇవి చిల్లర చేష్టలంటూ మండిపడ్డారు. మోదీ సర్కారు ఆత్మన్యూనతకు ఈ ఉదంతం నిదర్శనమని రణ్‌దీప్ సుర్జేవాలా తదితరులు విమర్శించారు. యూపీఏ హయాంలో బీజేపీకి చెందిన విపక్ష నేత ఎల్కే అడ్వాణీకి తొలి వరుసలోనే స్థానం దక్కేదని వారు గుర్తు చేశారు. అయితే వేడుకలు ప్రారంభమైన కాసేపటికి ఖర్గే మొదటి వరుసలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పక్క సీటుకు మారారు. కాంగ్రెస్ విమర్శల్లో అహంకారమే తప్ప మరేమీ లేదంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనేవాలా ఎదురుదాడికి దిగారు.क्या देश के विपक्ष के नेता के साथ ऐसा व्यवहार किसी मर्यादा, परंपरा और प्रोटोकॉल के मापदंड पर खरा उतरता है ?ये केवल हीन भावना से ग्रस्त सरकार की कुंठा दिखाता है ।प्रजातंत्र में मतभेद रहेंगे मगर श्री @RahulGandhi के साथ किया जाने वाला ये व्यवहार अस्वीकार्य है। pic.twitter.com/b4mdU9BU7G— Randeep Singh Surjewala (@rssurjewala) January 26, 2026 -
టికెట్ల కోసం పైరవీలు వద్దు.. క్షేత్రస్థాయిలో నిలబడండి..!
సాక్షి, న్యూఢిల్లీ: ‘రాజకీయమంటే మైకుల ముందు ఉపన్యాసాలు దంచడం కాదు.. ఓటరు జాబితాలో అక్రమాలను అడ్డుకోవడం! ఏసీ గదుల్లో కూర్చుని రాజకీయాలు నడిపే రోజులు పోయాయి.. ఇకపై ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుగ్గా నిలబడాల్సిందే. బీజేపీని ఎదుర్కోవాలంటే కేవలం ప్రసంగాలు సరిపోవు.. బూత్ స్థాయి పోరాటమే శరణ్యం’అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. హరియాణాలోని కురుక్షేత్రలో జరిగిన పార్టీ శిక్షణ శిబిరంలో ఆయన 2029 ఎన్నిక లను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలకు తగు హెచ్చరి కలు చేశారు. బీజేపీ అధికార బలంతో వ్యవస్థలను హైజాక్ చేస్తోందంటూ ఆయన.. ‘కాంగ్రెస్ నాయకులు ఇకపై యుద్ధం చేయాల్సింది వేదికలపై కాదు, ఓటరు జాబితాలపై’అని స్పష్టం చేశారు.అసలు కథ బూత్‌లోనే ఉంది..బీజేపీ గెలుపు గురించి రాహుల్‌గాంధీ మాట్లాడుతూ, ‘వాళ్లు కేవలం ప్రచారంతో గెలవడం లేదు. అధికార యంత్రాంగాన్ని వాడుకుని ఓటరు లిస్టుల ను ట్యాంపర్ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకున్నారు. అందుకే మన నిఘా బూత్ స్థాయి నుంచే మొదలుకావాలి. ప్రతీ గల్లీలో పహారా కాయాలి. నిరుద్యోగం, రైతు సమస్యలు, ధరల పెరు గుదల వంటి అంశాలను ఆయుధాలుగా మలుచు కుని జనంలోకి వెళ్లాలి’అని పిలుపునిచ్చారు. బీజేపీ పాలనా తీరుపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కేవలం ప్రచారం, ఈవెంట్ల మయంగా మార్చేశారని ధ్వజమెత్తారు. ‘ప్రకటనలు, ఆర్భాటాలతో ప్రజాస్వా మ్యం బతకదు. బీజేపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని వాడుకుంటోంది. ఓటరు జాబితా నుంచి ఈవీఎంల నిర్వహణ వరకు ప్రతి చోటా వారి కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయి. హరియా ణాలో ఓట్ల గల్లంతు, దొంగ ఓట్ల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. అందుకే కాంగ్రెస్ కార్యకర్తలు ఇకపై ప్రతి గల్లీలో, ప్రతి బూత్‌లో కాపలాదారులుగా మారాలి. కేవలం ఓట్లు అడగడమే కాదు.. మన ఓట్లను కాపాడుకోవడం కూడా యుద్ధంలో భాగమే’అని రాహుల్ ఉద్బోధించారు.నేనే రాజు అనుకుంటే కుదరదు..సొంత పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, పైరవీ రాజకీయాలపై రాహుల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వేదికపై ఉన్న సీనియర్ నేతలను ఉద్దేశించి పరోక్షంగా చురకలు అంటించారు. ‘కొందరు నేతలు తమను తాము పార్టీ కంటే గొప్పవారని, తాము లేకపోతే పార్టీయే లేదని భ్రమపడుతున్నారు. అలాంటి వారి వెనుక తిరగడం, వారి కోటరీలలో చేరడం జిల్లా అధ్యక్షులు మానుకోవాలి. టికెట్ల కోసం ఢిల్లీలో సిఫార్సులు, పెద్దల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసే సంస్కృతికి కాలం చెల్లింది. గ్రూపు రాజకీయాలను నేను సహించను. ఎవరైతే క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉంటారో వారికే భవిష్యత్తు ఉంటుంది. మీరే క్షేత్రస్థాయిలో సేనాపతులు. ఎవరి బెదిరింపులకు లొంగకండి. కష్టపడి పనిచేసే వారికే టికెట్ దక్కుతుంది తప్ప.. సిఫార్సులతో వచ్చే వారికి కాదు,’అని రాహుల్ తేల్చి చెప్పారు. బీజేపీకి చెక్ పెట్టాల్సిందేసంస్థాగతంగా ఎంతో పటిష్టంగా ఉన్న బీజేపీని ఢీకొట్టేందుకు డేటా మేనేజ్మెంట్, బూత్ స్థాయి కమిటీలే కీలకమని రాహుల్ స్పష్టం చేశారు. ప్రచార ఆర్భాటాల కంటే, క్షేత్రస్థాయి నిఘానే 2029లో కాంగ్రెస్‌ను గెలిపిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సంస్థాగతంగా ఎంతో పటిష్టంగా ఉన్న బీజేపీ యంత్రాంగాన్ని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ కూడా సాంకేతికతను, డేటాను నమ్ముకోవాలని రాహుల్ పిలుపునిచ్చారు. బూత్ మేనేజ్మెంట్లో డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించుకోవాలని, ఇది బీజేపీ సంస్థాగత బలానికి గట్టి పోటీ ఇస్తుందని ఆయన సూచించారు. -
మారని శశిథరూర్ తీరు..!
తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ మరోసారి పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేయనున్నారా?, కాంగ్రెస్‌తో అంటీ ముట్టనట్లు, బీజేపీతో అత్యంత దగ్గరగా ఉండే శశిథరూర్.. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఏదొక వంకతో కాంగ్రెస్‌ను దూరం పెడుతూనే ఉన్నారు. తాజాగా కేరళ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు సమావేశం కావడానికి సమయం ఫిక్స్ చేశారు. ఈరోజు(శుక్రవారం, జనవరి 23వ తేదీ) మధ్యాహ్నం గం. 2.30 ని.లకు సమావేశం కానున్నారు. అయితే దీనికి కేరళ సీనియర్ కాంగ్రెస్ నేత, నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన శశిథరూర్ దూరంగా ఉండనున్నారట.తనను ఒకానొక సందర్భంలో రాహుల్ గాంధీ నుంచి అవమానం ఎదురైందనే భావనలో ఉన్నారు శశిథరూర్. ఇటీవల కేరళ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ.. తనకు తగినంత గౌరవం ఇవ్వలేదని శశిథరూర్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అందుచేతనే ఆయన.. కేరళ కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఏఐసీసీ నేతల సమావేశానికి హాజరు కావడం లేదని సదరు వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ కారణంగా శశిథరూర్.. కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందే జరిగే ఈ సమావేశానికి శశిథరూర్ దూరంగా ఉండటం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సీడబ్యూసీ సమావేశానికి వెళ్లిన శశిథరూర్.. రాహుల్ గాంధీ సమావేశాలకు మాత్రం డుమ్మా కొడుతున్నారు. ఇదే ఇప్పుడు కేరళ కాంగ్రెస్‌లో అలజడికి కారణమైంది. ఎన్నికలు వచ్చిపడుతున్న వేళ.. శశిథరూర్ తీరు కాంగ్రెస్ నేతలకు అంతు చిక్కడం లేదు. -
ఒక్కటై పోరాడుదాం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. గతంలో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాల వెనుక ఉన్నట్లే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. వీబీ–జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ చట్టం రద్దు కోసం కూలీలతో కలిసి పోరాటం సాగించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సందీప్ దీక్షిత్ నేతృత్వంలోని రచనాత్మక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో జరిగిన ఉపాధి హామీ కూలీల సదస్సులో రాహుల్ గాందీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కూలీలు తరలివచ్చారు. తాము పనులు చేసే స్థలాల నుంచి పిడికెడు మట్టి తీసుకొచ్చారు. మొక్కల కుండీల్లో ఈ మట్టిని చల్లారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పేదలకు హక్కు లు కల్పించడమే ఉపాధి హామీ చట్టం అసలు ఉద్దేశమని పేర్కొన్నారు. కూలీలంతా ఏకమై పోరాడితే మోదీ వెనక్కి తగ్గుతారని, ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరిస్తారని చెప్పారు. ఈ సదస్సులో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వ్యవసాయ పనిముట్లను చేతబూని పలుగు పారలు ప్రదర్శించడం విశేషం.పేద కూలీలకు తీవ్ర నష్టం ‘‘పనులు కావాలని కోరుకునేవారు అందుకోసం గౌరవంగా డిమాండ్ చేసే వెసులుబాటు ఉపాధి హామీ పథకంలో ఉంది. పేదలకు పని హక్కు లభిస్తుంది. ఈ ఉద్దేశాన్ని నాశనం చేయడానికి మోదీ సర్కార్ ప్రయత్నిస్తోంది. 2020లో ఇలాగే రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చింది. పార్లమెంట్‌లోపల, బయట రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించాం. దాంతో నల్ల చట్టాలను కేంద్రం రద్దు చేసింది. అప్పుడు రైతులను లక్ష్యంగా చేసుకున్నారు.. ఇప్పుడు పేద కూలీలను టార్గెట్ చేస్తున్నారు. ఉపాధి పనుల కోసం ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇవ్వాలన్నది ఇక కేంద్రమే నిర్ణయిస్తుంది. సహజంగానే బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు, విపక్ష పాలిత రాష్ట్రాలకు తక్కువ నిధులు ఇస్తారు. పనులు ఎప్పుడు, ఎక్కడ కల్పించాలి? కూలీలకు ఎంత వేతనం ఇవ్వాలన్నది కేంద్రమే నిర్ణయించబోతోంది. దాంతో కూలీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. స్వాతంత్య్రం ముందునాటి పరిస్థితులను మళ్లీ తీసుకురావాలన్నదే బీజేపీ నాయకుల ఎత్తుగడ. అప్పట్లో రాజు చేతిలోనే మొత్తం అధికారాలు, సంపద ఉండేవి. ఆధునిక భారతదేశ నిర్మాణాన్ని మార్చాలని బీజేపీ పెద్దలు ఆరాటపడతున్నారు. వారిని అడ్డుకోవాలంటే మనమంతా ఒక్కటై పోరాటం సాగించాల్సిందే. బీజేపీ నాయకులు నిజంగా పిరికిపందలు. మనం కలిసికట్టుగా ముందుకెళ్తే వారంతా పారిపోతారు’’ అని రాహుల్ తేల్చిచెప్పారు. గాందీజీ పేరును తుడిచిపెట్టే కుట్ర: ఖర్గే ప్రజల హృదయం నుంచి జాతిపిత మహాత్మాగాంధీ పేరును తుడిచేయడానికి మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని, అందులో భాగంగానే ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని, ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కూలీల సదస్సులో ఆయన మాట్లాడారు. బడుగు బలహీన అణగారిన వర్గాలను నిర్బంధ కూలీలుగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. పేదలకు ఉపాధి కల్పించే మహత్తర పథకాన్ని రద్దు చేయడం ఏమిటని మండిపడ్డారు. తాను చాయ్‌వాలా అని చెప్పుకుంటున్నారని, నిజానికి ఏనాడూ ఆయన చాయ్ తయారు చేయలేదని, రైళ్లలో తిరుగుతూ విక్రయించలేదని ఖర్గే అన్నారు. చాయ్‌వాలా పేరిట మోదీ చేసేదంతా ఉత్త డ్రామా అని కొట్టిపారేశారు. -
అరుదైన కానుక : రాహుల్ గాంధీ భావోద్వేగం, వైరల్ వీడియో
రాయ్‌బరేలి: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరుదైన అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలోని తన పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా ఒక అభిమాని కుటుంబం రాహుల్‌ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ అపురూప జ్ఞాపకాన్ని తిరిగి పొందడంపై రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. వేదికపై దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించిన రాహుల్ వెంటనే దాని ఫోటోను తన తల్లి, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీతో వాట్సాప్‌లో షేర్ చేశారు. దీనికి సంబంధించి, అంకిత్ మయాంక్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.రాహుల్ గాంధీ తాత, దశాబ్దాల క్రితం రాయ్‌బరేలీ మాజీ ఎంపీ ఫిరోజ్ గాంధీ పోగొట్టుకున్న పర్సును అక్కడి ఒక కుటుంబం ఇన్నాళ్లూ ఆయన జ్ఞాపకార్థం భద్రంగా దాచిందట. తాజాగా రాయ్‌బరేలీ పర్యటనలో ఉన్న ఆయన మనవడు, ఎంపీ రాహుల్ గాంధీని కలిసి ఆ పర్సును అందజేయడం విశేషంగా నిలిచింది. స్థానిక కుటుంబం దశాబ్దాలుగా భద్రపరిచిన ఈ లైసెన్స్‌ను, రాయ్ బరేలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహక కమిటీ సభ్యుడు వికాస్ సింగ్, కాంగ్రెస్ నాయకుడు తన నియోజకవర్గంలో పర్యటన రెండో రోజున గాంధీకి అందజేశారు. వారు ఏమన్నారంటే.. "చాలా ఏళ్ల క్రితం, రాయ్‌బరేలిలో జరిగిన ఒక కార్యక్రమంలో, నా మామగారు ఈ డ్రైవింగ్ లైసెన్స్ దొరికింది. అప్పటినుంచీ ఆయన దానిని భద్రంగా ఉంచుకున్నారు. ఆయన మరణం తర్వాత, నా అత్తగారు దానిని భద్రపరిచారు" అని సింగ్ అన్నారు. "రాహుల్ గాంధీ రాయ్‌బరేలిని సందర్శిస్తు న్నారని తెలిసి దానిని అతనికి అందజేయడం మా బాధ్యతగా భావించాము." దీన్ని తమ కుటుంబం ఒక "అమానత్" (విలువైన ట్రస్ట్)గా దీన్ని గాంధీ కుటుంబానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించామని సింగ్ అన్నారు.కాగా భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇందిరా ప్రియదర్శిని గాంధీ, ఇందిరా గాంధీగా సుపరిచితులు. ఆమె ఈ దేశానికి మూడవ ప్రధానమంత్రి మరియు భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి కూడా. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ,కమలా నెహ్రూల కుమార్తె ఇందిరా గాంధీ,ఫిరోజ్ గాంధీ 1942 మార్చి 26న ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి కొడుకులే దివంగతులు రాజీవ్ గాంధీ, సంజీవ్ గాంధీ. డిసెంబర్ 1912లో జన్మించిన ఫిరోజ్ గాంధీ 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో రాయ్ బరేలి సీటును గెలుచుకున్నారు. 1960 సెప్టెంబర్ 7న గుండెపోటుతో ఫిరోజ్ గాంధీ మరణించారు. Rahul Gandhi’s grandfather Feroze Gandhi, who was also Raebareli MP, had lost his wallet many decades agoOne family in Raebareli kept it safe all these years as his memoryToday they returned his wallet to his grandson Rahul GandhiBeautiful moment ❤️pic.twitter.com/SVVCi1pckR— Ankit Mayank (@mr_mayank) January 20, 2026 -
రాహుల్ తో రాజకీయం.. NDAలో ఉంటూ కాంగ్రెస్ తో అక్రమ సంబంధం
-
‘బీఎంసీ’ ఓట్ల లెక్కింపు వేళ.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఇటువంటి తరుణంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం (ఈసీ) తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరులను తప్పుదోవ పట్టిస్తూ (గ్యాస్‌లైటింగ్), ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు కారణంగానే మన ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని రాహుల్ ఆరోపించారు.‘ఓటు చోరీ అనేది ముమ్మాటికీ దేశద్రోహ చర్యే’ అంటూ రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహారాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతున్న వేళ, ప్రజాస్వామ్య విలువల పతనంపై రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. కాగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ-శివసేన (మహాయుతి) కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, మహాయుతి కూటమి దాదాపు 52 వార్డుల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ 35 స్థానాల్లో, ఏక్నాథ్ షిండే వర్గపు శివసేన 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 22 స్థానాల్లో, రాజ్ థాకరేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) 8 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే ఆధిక్యాన్ని కనబరుస్తూ వెనుకబడిపోయింది. అయితే అధికారిక ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా వెల్లడించాల్సి ఉంది. కాగా ముంబై నగరానికి అత్యంత కీలకమైన ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సుదీర్ఘ విరామం తర్వాత జరిగాయి. చివరిసారిగా 2017లో బీఎంసీ ఎన్నికలు జరగగా, అప్పుడు ఎన్నికైన మేయర్ కిషోరి పెడ్నేకర్ పదవీకాలం 2022 మార్చితోనే ముగిసింది. ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఎన్నికలు జరగడం, నాలుగేళ్ల తర్వాత ముంబై నగరానికి కొత్త మేయర్ రాబోతుండటంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ఎయిర్ పోర్ట్ మధ్యలో నిలబడి మంతనాలు: రాహుల్ గాంధీ
-
రాహుల్ వద్దకు కర్ణాటక పంచాయితీ.. సిద్దరామయ్య ప్లాన్ అదేనా?
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో సీఎం మార్పు లేదంటూ వార్తలు బయటకు వచ్చిన వేళ.. మరోసారి రాజకీయం వేడెక్కింది. రాహుల్‌తో సీఎం సిద్దరామయ్య సమావేశం కావాలనుకోవడం చర్చకు దారి తీసింది. ఈ మేరకు ఇండియా టుడే ఓ కథనంలో పేర్కొంది.వివరాల మేరకు.. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంటూ నెలకొన్న నిరంతర గందరగోళం గురించి బయట పడేందుకు సీఎం సిద్ధరామయ్య ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నుండి స్పష్టత కోరుతూ సిద్ధరామయ్య ఆయనతో సమావేశం కావాలని అభ్యర్థించారు. అంతేకాకుండా సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని విస్తరించడానికి ఆసక్తిగా ఉన్నానని చెప్పారని ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ సమావేశం కోసం చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే.. డీకే శివకుమార్ సహా ఆయన మద్దతుదారులకు అవకాశం ఉంటుందా? అనే చర్చ కూడా మొదలైంది.ఇదిలా ఉండగా.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రం ఎలాంటి అంతర్గత సంక్షోభం లేదని పదేపదే ఖండిస్తోంది. అంతర్గత సమస్యలను రాష్ట్ర నాయకత్వమే పరిష్కరించుకోవాలని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం స్పష్టం చేశారు. ఇక, అంతకుముందు కూడా సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ సీఎం మార్పు విషయంలో స్పందించారు. ఇద్దరూ విభేదాల నివేదికలను నిరంతరం ఖండిస్తున్నారు. తాను పార్టీ నాయకత్వంపై విశ్వాసం కలిగి ఉన్నానని, తన పదవీకాలాన్ని పూర్తి చేస్తానని సిద్ధరామయ్య పేర్కొన్నారు, రొటేషనల్ ముఖ్యమంత్రి ఏర్పాటుకు సంబంధించిన వాదనలను తోసిపుచ్చారు.రాష్ట్రంలో సీఎం కుర్చీ కోసం ఎలాంటి గొడవ లేదని, ఇదంతా కేవలం మీడియా సృష్టి మాత్రమేనన్నారు. అనవసరమైన ప్రశ్నలతో గందరగోళం సృష్టించకండి అంటూ మీడియాపై సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సంక్రాంతి తర్వాత కాంగ్రెస్‌లో అసలు సిసలైన కుర్చీ పోరు మొదలవుతుందని బీజేపీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. తన ప్రభుత్వానికి, పదవికి ఎలాంటి ఢోకా లేదని, ఐదేళ్లు తామే సుస్థిర పాలన అందిస్తామని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.అసలు గొడవ ఎందుకు వచ్చింది?కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా రెండున్నరేళ్లు పూర్తైన క్రమంలో సీఎం మార్పు ఉంటుందన్న ప్రచారం జోరందుకుంది. గత నవంబర్ 20తో ప్రభుత్వం ఐదేళ్ల కాలపరిమితిలో రెండున్నరేళ్లు దాటింది. 2023లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికార పంపిణీ ఒప్పందం జరిగిందన్న ఊహాగానాలు ఉన్నాయి. దీని ప్రకారం, సగం కాలం సిద్ధూ, మిగతా సగం డీకే సీఎంగా ఉంటారని టాక్. ఇప్పుడు ఆ సమయం దాటడంతో బీజేపీ దీనిని రాజకీయ అస్త్రంగా వాడుకుంటోంది. "సంక్రాంతి తర్వాత చూడండి, కాంగ్రెస్ కుర్చీలాట మొదలవుతుంది" అని బీజేపీ నేతలు, సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నాయి. దీనిపైనే సిద్ధరామయ్య సీరియస్‌గా స్పందించారు. "అసలు గొడవ ఎక్కడుంది? మీరే (మీడియా) సృష్టిస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్‌కు రాహుల్ మద్దతు..!
ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ నటించిన జన నాయకన్ సినిమాకు ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మద్దతు తెలపడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. భవిష్యత్‌లో టీవీకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి వ్యూహాత్మకంగా రాహుల్ పావులు కదుపుతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి,వ్యూహాత్మక ఎత్తుగడా.?రాహుల్ గాంధీ తాజా ట్వీట్‌తో కాంగ్రెస్ పార్టీ,.. డీఎంకేతో ఉన్న దీర్ఘకాలిక కూటమి కొనసాగుతుందా? లేక విజయ్ పార్టీ టీవీకేతో కలిసి కొత్త వ్యూహం రూపొందిస్తుందా అన్న చర్చలు మొదలయ్యాయి.2017లో విజయ్ నటించిన మెర్సల్ సినిమా మీద కేంద్రం అభ్యంతరాలు తెలిపినప్పుడు కూడా రాహుల్ గాంధీ ఆయనకు మద్దతు ఇచ్చారు. ఒకవైప విజయ్.. తమిళ రాజకీయాల్లో బలంగా ఎదిగే అవకాశం ఉండటంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే టీవీకేతో పొత్తుకు రాహుల్ గాంధీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని, దీనిలో భాగంగానే విజయ్‌కు మరోసారి మద్దతు పలికారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. The I&B Ministry’s attempt to block ‘Jana Nayagan’ is an attack on Tamil culture.Mr Modi, you will never succeed in suppressing the voice of the Tamil people.— Rahul Gandhi (@RahulGandhi) January 13, 2026 అయితే డీఎంకేతోనే పొత్తు కొనసాగించాలని అధిక శాతం మంది కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎప్పుడూ ఒక పార్టీనే అధికారంలో ఉండే అవకాశాలు తక్కువ కాబట్టి.. విజయ్‌కు ఈ రకంగా రాహుల్ మద్దతు ఇవ్వడం వ్యూహాత్మక ఎత్తుగడగా ఆ పార్టీకి చెందినే పలువురు నేతలు అంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌కు ఉన్న ప్రజాదరణ, ఆయన సినిమాలపై కేంద్రం చూపుతున్న అడ్డంకులు, కాంగ్రెస్ పార్టీకి కొత్త అవకాశాలను తెచ్చేలా కనిపిస్తున్నాయి.గతంలో కూడా చర్చ..కొన్ని రోజుల క్రితం కూడా కాంగ్రెస్-టీవీకేల పొత్తు అంశానికి సంబంధించి చర్చ వచ్చింది. ఇరు పార్టీలు త్వరలో పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగాయి. అయితే అధికారంలో ఉన్న డీఎంకేతో బంధం తెంచుకోవడం మంచిది కాదని కాంగ్రెస్‌లోని ఒక వర్గం భావిస్తోంది. దాంతోనే విజయ్ పార్టీతో పొత్తుపై అధిష్టానం కూడా ఎటువంటి ముందుకు సాగడం లేదు. కేవలం మద్దతు ఇస్తూ ట్వీట్లు పెట్టడం తప్పితే ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోవడం లేదు. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలోకాంగ్రెస్ కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం డీఎంకే పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందనే అంశాన్ని అతి దగ్గరగా పర్యవేక్షిస్తోంది. -
ప్రజలు కోరింది ఇవ్వకుంటే ఓట్లెలా వేస్తారు?
అహ్మదాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు ఓట్లెలా వేస్తారని రాహుల్‌ను ప్రశ్నించారు. ఇంత చిన్న లాజిక్‌ను రాహుల్‌కు అర్థమయ్యేలా చెప్పడం తనవల్ల కానిపని అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలే ఆయనకు ఈ విషయం చెప్పలేకపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. మంత్రి అమిత్ షా ఆదివారం అహ్మదాబాద్ నగర సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల లోక్‌సభలో చర్చ సందర్భంగా ఓ విషయం నన్నడిగారు..ఎన్నికల్లో ప్రతిసారీ కాంగ్రెసే ఎందుకు ఓటమిపాలవు తోంది అని. ప్రజలను అడగటానికి బదులుగా రాహుల్ ఈ ప్రశ్న నన్నడిగారు. రాహుల్ బాబా..! నేను ఇక్కడ ప్రారంభించిన ఈ రెండు కార్యక్రమాలను అర్థం చేసుకుంటే, నీకు సమాధానం దొరుకుతుంది’అని అమిత్ షా అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లలోనే కాదు, 2029 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమిపాలవుతుంది. మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధిస్తుందని రాహుల్ తెలుసుకుంటారని ఆయన అన్నారు. ‘మా సిద్ధాంతాలతో ప్రజలు మమేకమ య్యారు. ‘అయోధ్యలో ఆలయాన్ని, ఉగ్రవాదు లపై సర్జికల్ స్ట్రయిక్స్‌ను, ఆర్టికల్ 370 రద్దును, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని, బంగ్లాదేశీ అక్రమ వలసదారులను వెళ్లగొట్టడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇలా ప్రజలు కోరుకునే వాటిని వ్యతిరేకిస్తూ పోతే ఆ పార్టీకి ప్రజలు ఓట్లెలా వేస్తారు’అని అమిత్ షా పేర్కొన్నారు. -
కాంగ్రెస్ సిద్ధాంతాలకు మరణం లేదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అంటేనే ఒక సిద్ధాంతమని ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు మరణం లేదని అన్నారు. ఆదివారం ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’లో కాంగ్రెస్ 140వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఖర్గే పార్టీ జెండాను ఎగరేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే ప్రసంగించారు. మహోన్నత కాంగ్రెస్ నాయకుల కృషి వల్లే భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పని అయిపోందని చెబుతున్నవాళ్లు ఒక్క విషయం తెలుసుకోవాలని సూచించారు. తమ శక్తి కొంత తగ్గినప్పటికీ వెన్నెముక మాత్రం నిటారుగానే ఉందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం, లౌకికవాదం, పేదల హక్కుల పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తాము అధికారంలోకి లేనప్పటికీ ఇతరుల వద్ద యాచించబోమని అన్నారు. మతం పేరిట కాంగ్రెస్ ఏనాడూ ఓట్లు అడగలేదన్నారు. మందిరం–మసీదు పేరిట ఏనాడూ విద్వేషాలు రగిలించలేదని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ఏకం చేస్తుందని, బీజేపీ విడదీస్తుందని చెప్పారు. తమ దృష్టిలో మతం అంటే విశ్వాసం మాత్రమేనని పేర్కొన్నారు. కొందరు మాత్రం మతాన్ని రాజకీయంగా మార్చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ఎప్పటికీ ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తుందని ఖర్గే స్పష్టంచేశారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. #WATCH | Delhi: Congress National President Mallikarjun Kharge says, "... On December 28, 1885, in Mumbai, Congress was founded. For 62 years, crores of Congressmen struggled, were jailed, and fought for the country, leading to our freedom. I pay tribute to the founders of… https://t.co/vl2DOsI0bC pic.twitter.com/KqkHbnQOud— ANI (@ANI) December 28, 2025భారతీయ ఆత్మ గొంతుక కాంగ్రెస్కాంగ్రెస్ అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని.. అది భారతీయ ఆత్మ గొంతుక అని పార్టీ నేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ప్రతి బలహీనుడికి, అణగారినవర్గాలకు, కష్ట జీవు లకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. విద్వేషం, అన్యాయం, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి బలమైన సంకల్పం తీసు కున్నట్లు తెలిపారు. సత్యం కోసం తమ పోరా టం కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ వ్యవ స్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు రాహుల్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగానికి పునాదులు వేయడంతోపా టు ప్రజాస్వా మ్యం, లౌకికవాదం, సామాజిక న్యా యం, సమానత్వ విలువలను బలోపేతం చేసినవారిని స్మరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
రాహుల్‌నే కాదు.. ప్రధానిని కూడా కలుస్తా
ఉన్నావ్ కేసు రాజకీయ మలుపు తీసుకుంటోంది. నిందితుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌కు బెయిల్ రావడంపై అభ్యంతరాలతో బాధితురాలు, ఆమె తల్లి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అయితే.. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది వాళ్లను మీడియాతో మాట్లాడనీయకుండా.. బలవంతంగా ఈడ్చుకెళ్లడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో.. ఆ తల్లీకూతుళ్లు బుధవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. జర్మనీ పర్యటన ముగించుకుని నిన్ననే వచ్చిన రాహుల్.. ఈ కేసు పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేపిస్టులకు బెయిల్.. బాధితులను నేరస్తుల్లా చూస్తారా?.. ఇదెక్కడి న్యాయం??. భారతదేశం కేవలం మృత ఆర్థిక వ్యవస్థగా(డెడ్ ఎకానమీ) మాత్రమే కాకుండా.. మృత సమాజంగా(డెడ్ సొసైటీ) కూడా మారుతోందని అంటూ ఇండియన్ గేట్ పరిణామంపై ఓ ట్వీట్ చేశారు. क्या एक गैंगरेप पीड़िता के साथ ऐसा व्यवहार उचित है?क्या उसकी “गलती” ये है कि वो न्याय के लिए अपनी आवाज़ उठाने की हिम्मत कर रही है?उसके अपराधी (पूर्व BJP MLA) को ज़मानत मिलना बेहद निराशाजनक और शर्मनाक है - खासकर तब, जब पीड़िता को बार-बार प्रताड़ित किया जा रहा हो, और वो डर के… https://t.co/BZqrVNXMOy— Rahul Gandhi (@RahulGandhi) December 24, 2025బుధవారం సాయంత్రం జన్‌పథ్‌లోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లిన బాధితురాలు, ఆమె తల్లి.. రాహుల్ గాంధీని కలిసి ఉన్నావ్ కేసు పురోగతిని.. తమకు ప్రాణహాని పొంచి ఉన్న విషయాన్ని తెలియజేయడమే కాకుండా పారామిలిటరీ సిబ్బంది తమతో ఎంత దురుసుగా ప్రవర్తించింది కూడా వివరించినట్లు తెలుస్తోంది. కుటుంబం కోసమే తానింకా బతికి ఉన్నానని.. తన పోరాటం ఆగదని బాధితురాలు రాహుల్‌కి చెప్పినట్లు తెలుస్తోంది. అంతకు ముందు.. ప్రతిపక్ష నేతనే కాదు.. ప్రధానిని కూడా కలిసే ప్రయత్నం చేస్తానని బాధితురాలు మీడియాకు తెలిపింది. ‘‘ప్రధాని, కేంద్ర హోం మంత్రి, రాష్ట్రపతిని కూడా కలవాలని ఉంది. వాళ్లను కలిసి మేం ఎదుర్కొంటున్న పరిస్థితులను చెప్పాలనుకుంటున్నాం. మాకు కావాల్సింది న్యాయం.. అంతే’’ అని చెప్పిందామె. కోర్టు తీర్పుపై స్పందిస్తూ.. ‘‘ఈ తీర్పుతో దేశంలోని అడబిడ్డలు తమ మానప్రాణాల కోసం భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నేరానికి పాల్పడిన వ్యక్తిని మా ఇంటికి 5 కిలోమీటర్ల పరిధిలోకి రాకూడదని కోర్టు ఆదేశించింది. అంటే.. మేం ఇంటిలోనే బంధీగా ఉండాలని కోర్టు ఉద్దేశమా?’’ అని ఆందోళన వ్యక్తం చేసిందామె. అయితే తమ ఆశలు చావలేదని.. సుప్రీం కోర్టులో న్యాయం దక్కుతుందనే ఆశ నెలకొందని బాధితురాలు అంటోంది. ఇదిలా ఉంటే.. సెంగర్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో బాధితురాలు ఓ పిటిషన్ వేసింది.2017లో ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆనాడ.. మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్, ఆపై ఆమెను అమ్మే ప్రయత్నమూ చేశారు. ఈ ఘటనతో పార్టీ అంతేకాదు.. ఈ కేసు వెలుగులోకి వచ్చాక ఆమె తండ్రి హత్యకు గురికావడంతో పాటు బాధితురాలిపైనా హత్యాయత్నం జరిగాయి. అదృష్టవశాత్తూ ఆమె ప్రమాదం నుంచి బయటపడగా ఇద్దరు బంధువులు ఈ ప్రమాదంలో మరణించారు. సీబీఐ దర్యాప్తు అనంతరం.. ఈ అభియోగాలన్నింటిని నిజాలుగా నిర్ధారించుకున్న ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్లో సెంగర్‌కి జీవితఖైదు విధించింది. ఆ సమయంలో పార్టీ ఆయన్ని బహిష్కరించింది. అయితే ఈ శిక్షను సెంగర్ సవాల్ చేయగా.. మంగళవారం(డిసెంబర్ 23, 2025) ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. దీంతో నిందితుడు బయటకు వస్తే తమకు ప్రాణహాని తప్పదని ఆ తల్లీకూతుళ్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరుగుతుండడం.. సెంగార్ వర్గ ఓట్లను ఆకర్షించేందుకే కుల్దీప్ను బయటకు తెచ్చారనే రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మంత్రి వ్యాఖ్యల దుమారంఉన్నావ్ బాధిత కుటుంబం నిరసన తెలపకుండా ఢిల్లీ ఇండియన్ గేట్ వద్ద పారామిలిటరీ సిబ్బంది అడ్డుకోవడంపై ఉత్తర ప్రదేశ్ మంత్రి ఒకరు వెటకారంగా స్పందించారు. ‘‘ఆమెది ఉన్నావ్ కదా.. ఢిల్లీలో ఏం పని?’’ అంటూ యూపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ బిగ్గరగా నవ్వారు. ఈ వీడియో నెట్టింటకు చేరడంతో జనం ఆయన్ని తిట్టిపోస్తున్నారు. -
‘విజయ్‌తో రాహుల్’.. సీక్రెట్ వెల్లడించిన టీవీకే నేత
చెన్నై: తమిళనాడు రాజకీయ రంగస్థలంపై సరికొత్త సమీకరణలు మొదలయ్యాయి. దళపతి విజయ్ తన ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీతో ప్రజల్లోకి దూసుకుపోతుంటే, జాతీయ నేత రాహుల్ గాంధీ ఆయనకు సంఘీభావం తెలపడం సంచలనంగా మారింది. ఆమధ్య కరూర్‌లో జరిగిన విషాదకర ఘటన తర్వాత విజయ్ తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో, రాహుల్ ఆయనకు స్వయంగా ఫోన్ చేసి, మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఆ ఫోన్ కాల్ వెనుక అసలు కథ.. తాజాగా కన్యాకుమారిలో జరిగిన ఒక కార్యక్రమంలో టీవీకే నేత ఆధవ్ అర్జున ఒక ఫోన్ కాల్ రహస్యాన్ని బయటపెట్టారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ మానసిక వేదనలో ఉన్నప్పుడు, ఆయనకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆయన తెలిపారు. ‘బ్రదర్.. నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను, దేనికీ చింతించకు’ అంటూ ఫోన్లో రాహుల్ అన్నారని ఆధవ్ అర్జున తెలిపారు. ఈ భరోసా వెనుక ఉన్నది కేవలం వారి వ్యక్తిగత స్నేహం మాత్రమే కాదని, లోతైన రాజకీయ వ్యూహం ఉందనే చర్చ సర్వత్రా మొదలైంది. అయితే ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఇలా నేరుగా విజయ్‌కు మద్దతు పలకడం అధికార పక్షానికి మింగుడు పడటం లేదు.డీఎంకేకు ఇది ‘ప్లాన్ బి’ హెచ్చరికా? తమిళనాడులో దశాబ్దాలుగా డీఎంకే నీడలో జూనియర్ భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు తన వ్యూహాన్ని మారుస్తోందా? అన్న అనుమానాలు ఇప్పుడు విశ్లేషకుల్లో మొదలయ్యాయి. అయితే రాహుల్ గాంధీ, విజయ్ మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు. 2009లోనే విజయ్‌కు యూత్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని రాహుల్ భావించారు. ఇప్పుడు విజయ్ సొంత పార్టీ పెట్టడంతో, రాహుల్ ఆయనకు అండగా నిలవడం ద్వారా డీఎంకేపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇది భవిష్యత్తులో డీఎంకేకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.బహిర్గతమైన అసహనం విజయ్ పార్టీ కార్యక్రమాలకు పెరుగుతున్న ఆదరణ చూసి డీఎంకే ఇప్పటికే అప్రమత్తమైంది. అరుమనైలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు చివరి నిమిషంలో గైర్హాజరు కావడం వెనుక డీఎంకే ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు సీనియర్ రాజకీయ నేతలు కూడా విజయ్ వైపు మొగ్గు చూపుతుండటం విశేషం. 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సెంగుట్టయ్యన్ వంటి వారు విజయ్‌కు మద్దతుగా నిలవడం చూస్తుంటే భవిష్యత్తులో టీవీకే ఒక బలమైన శక్తిగా ఎదగబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి.2026 సమరానికి నాంది 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్-విజయ్ దోస్తీ తమిళనాడులో కొత్త కూటములకు బాటలు వేసేలా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ తన మద్దతును విజయ్ వైపు మళ్లిస్తే, రాష్ట్రంలో దశాబ్దాల రాజకీయ చరిత్ర మారిపోతుంది. 1967లో కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించాలనే కాంగ్రెస్ ఆశలకు విజయ్ ఒక వేదికగా మారతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: కెనడాలో భారత యువతి హత్య.. కీలక వివరాలు వెల్లడి -
రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర: రాహుల్ ఆరోపణ
బెర్లిన్: జర్మనీలోని బెర్లిన్‌లో గల హెర్టీ స్కూల్ విద్యార్థులతో జరిగిన సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ సమాన హక్కులు కల్పించే భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల మధ్య, భాషల మధ్య, మతాల మధ్య ఉన్న సమానత్వ భావనను దెబ్బతీస్తూ, రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను బీజేపీ కాలరాస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఒక గంట నిడివి గల వీడియోను విడుదల చేసింది.ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఇది కేవలం భారతీయుల ఆస్తి మాత్రమే కాదని, ప్రపంచ సంపద అని రాహుల్ అభివర్ణించారు. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న ఏ దాడి అయినా, దానిని అంతర్జాతీయ ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగే దాడిగానే పరిగణించాలని రాహుల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని రాజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లోకి తీసుకుని, రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు, వాటిని ఆయుధాలుగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. This battle is no longer just about elections. It’s about protecting the foundation of our Constitution and Democracy - One Person, One Vote. pic.twitter.com/QjecwCtjxr— Congress (@INCIndia) December 22, 2025దేశంలోని దర్యాప్తు సంస్థలైన ఈడీ (ఈడీ), సీబీఐ (సీబీఐ)ల పనితీరును రాహుల్ తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో కాంగ్రెస్ ఈ సంస్థలను నిర్మించడంలో సహకరించినప్పటికీ, బీజేపీ మాత్రం వాటిని తమ సొంత ఆస్తులుగా వాడుకుంటూ, ప్రతిపక్షాలపై రాజకీయ కేసులు పెడుతోందని విమర్శించారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని తాము నిరూపించామని, అలాగే మహారాష్ట్ర ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయని తాము భావించడం లేదని రాహుల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఆర్థిక నమూనాపై కూడా రాహుల్ విమర్శలు గుప్పించారు. మన్మోహన్ సింగ్ కాలం నాటి ఆర్థిక విధానాలనే బీజేపీ ముందుకు తీసుకెళ్తోందని, ప్రస్తుత మోదీ ఆర్థిక విధానం పూర్తిగా నిలిచిపోయిందని రాహుల్ అన్నారు. దేశంలోని సంస్థాగత వ్యవస్థపై జరుగుతున్న ఈ దాడిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఒక బలమైన ప్రతిఘటన వ్యవస్థను రూపొందిస్తున్నాయన్నాయన్నారు. కేవలం ఎన్నికల లోపాలను ఎత్తిచూపడమే కాకుండా గెలుపు వైపు నడిచే పద్ధతిని సిద్ధం చేస్తున్నామని రాహుల్ పేర్కొన్నారు.ఇండియా కూటమి పార్టీల మధ్య వ్యూహాత్మక విభేదాలు ఉన్నప్పటికీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఎదుర్కోవడంలో, రాజ్యాంగాన్ని రక్షించడంలో తామంతా చాలా ఐక్యంగా ఉన్నామని రాహుల్ గాంధీ తెలిపారు. పార్లమెంటులో ప్రతిరోజూ ప్రతిపక్షాల ఐక్యత కనిపిస్తున్నదని, తమకు సమ్మతం లేని చట్టాలపై బీజేపీని గట్టిగా నిలదీస్తామని రాహుల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: బోండి బీచ్ ఎఫెక్ట్.. ‘గన్ బైబ్యాక్’ సంచలనం! -
రాహుల్, సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
-
తయారీ రంగం క్షీణిస్తోంది : రాహుల్ గాంధీ విమర్శలు, TVS 450ccతో ఫోజులు
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం జర్మనీలోని మ్యూనిచ్‌లోని ఆటోమొబైల్ దిగ్గజం BMW ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా భారతదేశంలో క్షీణిస్తున్న తయారీరంగంపై విచారం వ్యక్తం చేశారు. తన జర్మనీ పర్యటన సందర్భంగా రాహుల్ BMW కారు నడుపుతూ దాని, ఫీచర్ల గురించి తెలుసుకుంటూ కనిపించారు. దుబాయ్‌కు చెందిన ఒక కుటుంబంతో సహా అనేక మంది భారతీయులతో కూడా ఆయన సంభాషించారు సందర్శకులతో చిత్రాలకు పోజులిచ్చారు. రాహుల్ గాంధీవీడియోను కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది.BMWతో భాగస్వామ్యంతో భారత్ అభివృద్ధి చేసిన TVS 450cc మోటార్ సైకిల్‌ను చూసి గాంధీ సంతోషించారు. భారతీయ ఇంజనీరింగ్‌ను నైపుణ్యాన్ని ఇక్కడ చూడటం గర్వకారణమన్నారు. View this post on Instagram A post shared by Rahul Gandhi (@rahulgandhi)అయితే తయారీ బలమైన ఆర్థిక వ్యవస్థలకువెన్నెముక. విచారకరంగా, భారతదేశ తయారీ రంగం క్షీణిస్తోంది. వృద్ధిని వేగవంతం చేయడానికి, మరింత ఉత్పత్తి చేయాలని, అర్థవంతమైన తయారీ పర్యావరణ వ్యవస్థలను నిర్మించాలని, అధిక-నాణ్యత ఉద్యోగాలను సృష్టించాలని గాంధీ పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 5 రోజుల జర్మనీ పర్యటన సందర్భంగా బెర్లిన్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు IOC (ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్) బృందం ఆయనకు ఘన స్వాగతం పలికింది. యూరప్‌లోని IOC నాయకులను రాహుల్ కలుస్తారు. NRIలతో భేటీ అయ్యి, వారి సమస్యలపై, పార్టీ సిద్ధాంతాన్ని మరింతగా వ్యాప్తి చేయాలనే దానిపై చర్చలు జరుపుతారు. -
బీజేపీ టార్గెట్ సోనియా, రాహుల్... కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
-
లోక్‌సభలో ‘ప్రియాంకం’.. అన్న లేని లోటు తీరుస్తూ..
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష నేత రాహుల్ విదేశీ పర్యటనలో ఉండగా.. ఆయన గైర్హాజరీపై విమర్శలు గుప్పించిన బీజేపీకి సభలో సీన్ రివర్స్ అయింది. తొలిసారి ఎంపీగా అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా.. కాంగ్రెస్‌కు సారధ్యం వహిస్తూ, అధికార పక్షంపై విరుచుకుపడుతున్నారు. ప్రియాంక తన వాగ్ధాటితో రాహుల్ లేని లోటును భర్తీ చేయడమే కాకుండా, విపక్షాలకు కొత్త ఊపిరి పోశారు.ముఖ్యంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ (ఉపాధి హామీ) స్థానంలో కేంద్రం తెచ్చిన ‘జి రామ్ జి’ బిల్లుపై ప్రియాంక పోరాటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త బిల్లు పేదల ఉపాధి హక్కును హరిస్తుందని, గ్రామ సభల అధికారాలను బలహీనపరుస్తుందని ఆమె సభలో గట్టిగా వాదించారు. నిధుల కేటాయింపులో కేంద్రం పెత్తనాన్ని ప్రశ్నిస్తూ, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆమె చేసిన విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.సభలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార పక్షం ‘కుటుంబం’ పేరుతో చేసిన వ్యాఖ్యలకు ప్రియాంక ఇచ్చిన కౌంటర్ అందరినీ ఆకట్టుకుంది. ‘గాంధీ మా కుటుంబ సభ్యుడు కాదు. కానీ ఆయన ఈ దేశానికి తండ్రి, మన అందరికీ కుటుంబ సభ్యునితో సమానం’ అంటూ ఆమె ఇచ్చిన సమాధానం బీజేపీ నేతలను ఆత్మరక్షణలో పడేసింది. కేవలం పేరు మార్పుల కోసమే ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని, చర్చ లేకుండా బిల్లులను ఏకపక్షంగా ఆమోదించడం ప్రజాస్వామ్యానికే చేటని ఆమె హెచ్చరించారు.కేవలం వారం రోజుల వ్యవధిలోనే ప్రియాంక ఒక అనుజ్ఞురాలైన నాయకురాలిగా లోక్‌సభలో తనదైన ముద్ర వేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీలపై బీజేపీ చేసే విమర్శలకు గట్టి సమాధానమిస్తూ.. ‘ఒకేసారి చర్చ పెట్టి ఆ అధ్యాయాన్ని ముగించండి’ అంటూ ఆమె విసిరిన సవాల్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. రాహుల్ విదేశాల్లో ఉన్నా, లోక్‌సభలో కాంగ్రెస్ గళం మరింత బలంగా వినబడటంలో ప్రియాంక సక్సెస్ అయ్యారని పలువురు అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘సింధూర్‌లో అదే జరిగింది’.. క్షమాపణలు లేవన్న చవాన్ -
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జిషిట్ స్వీకరించలేం
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్ గాందీతోపాటు మరో ఐదుగురికి ఊరట లభించింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీ కోర్టు మంగళవారం నిరాకరించింది. చార్జిషిట్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా కాకుండా, ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై జరిపిన విచారణ ఆధారంగా చార్జిషీట్ దాఖలు చేశారని ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి విశాల్ గాగ్నే తప్పుపట్టారు.చట్టప్రకారం దీన్ని స్వీకరించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు న్యాయమూర్తి గుర్తుచేశారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శామ్ పిట్రోడాతోపాటు యంగ్ ఇండియా కంపెనీ పాత్ర ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తోంది.నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను వారు అక్రమంగా కొట్టేశారని చెబుతోంది. యంగ్ ఇండియా కంపెనీలో సోనియా గాం«దీకి 76 శాతం వాటా ఉంది. ఏజేఎల్‌కు ఈ కంపెనీ రూ.90 కోట్లు రుణంగా ఇచ్చింది. రుణాన్ని తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఏజేఎల్ ఆస్తులను కుట్రపూరితంగా లాక్కున్నారని ఈడీ వాదిస్తోంది. మరోవైపు ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వుపై అప్పీల్ చేస్తామని ఈడీ వెల్లడించింది. -
ప్రధాని మీటింగ్ లీక్స్.. కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఓటు చోరీ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అనైతికమని, ప్రధానమంత్రి స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండటం దేశానికి దురదృష్టకరమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి సమావేశం జరిగిన విషయాన్ని కిషన్ రెడ్డి వివరించారు. ఆ సమావేశం మర్యాదపూర్వక భేటీ అని, అన్ని రాష్ట్రాల ఎంపీలను పిలిచినట్లే తెలంగాణ ఎంపీలను కూడా పిలిచారని తెలిపారు. పార్టీని బలోపేతం చేయాలని, సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉండాలని ప్రధానమంత్రి సూచించారని చెప్పారు.ప్రధానితో జరిగిన సమావేశ వివరాలను బయట పెట్టడం మంచిది కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మీటింగ్ వివరాలు ఎవరైనా లీక్ చేస్తారా? లీక్ చేసినోడు మెంటలోడు. ఎవరో తెలిస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అంతర్గత విషయాలను బయటకు చెప్పడం పార్టీ ఐకమత్యానికి విఘాతం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. -
సోనియా.. రాహుల్ మోదీకి క్షమాపణ చెప్పండి బీజేపీ నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్
-
బీజేపీ డీఎన్ఏలో ఓటు చోరీ
సాక్షి, న్యూఢిల్లీ: అసత్యం, ఓట్ల చోరీ బీజేపీ–ఆర్ఎస్ఎస్ డీఎన్ఏలోనే ఉన్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. సత్యం, అహింస అనే నినాదంతో బీజేపీ–ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ప్రతిన బూనారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు చోర్–గద్దీ ఛోడ్’మహాధర్నాలో రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు సోనియా గాం«దీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాం«దీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సుఖూ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీతోపాటు ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో రాహుల్ గాంధీ విచుచుకుపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీల పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ వారంతా బీజేపీ కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు అధికారం అండతో విచ్చలవిడిగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని అనుసరించేవారి డీఎన్ఏలో సత్యం ఉంటుందన్నారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ డీఎన్ఏలో మాత్రం అసత్యం, ఓట్ల చోరీ మాత్రమే ఉంటాయని తేల్చిచెప్పారు. సత్యానికి, అసత్యానికి మధ్య పోరాటం ‘‘సత్యమే మన ఆయుధం. సమయం పట్టొచ్చు గానీ ఎప్పటికైనా సత్యానిదే విజయం. ప్రపంచం సత్యాన్ని పట్టించుకోదని, అధికారాన్ని, బలాన్ని మాత్రమే చూస్తుందని ఆర్ఎస్ఎస్ అధినేత భాగవత్ చెప్పడం దారుణం. బీజేపీ కోసమే ఎన్నికల సంఘం పనిచేస్తున్న సంగతి నిజం కాదా? ఎన్నికల కమిషనర్లను కాపాడేందుకు ప్రధాని మోదీ కొత్త చట్టం తీసుకొచ్చారు. మేమే వచ్చాక ఈ చట్టాన్ని తప్పనిసరిగా మారుస్తాం’’ అని అన్నారు. దొంగతనమే వారి డీఎన్ఏ దొంగతనం బీజేపీ డీఎన్ఏలో ఉందని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. డబ్బు దొంగతనం, భూమి దొంగతనం, వ్యవస్థల దొంగతనం, హక్కుల దొంగతనం, ఉద్యోగాల దొంగతనం, ప్రజా తీర్పును దొంగిలించడం, ప్రభుత్వాన్ని దొంగిలించడం, ఎన్నికలను, ఓట్లను దొంగిలించడం బీజేపీకి అలవాటేనని ధ్వజమెత్తారు. ప్రజలను దోచుకొని అధికారం అనే నిచ్చెనపైకి ఎగబాకడం బీజేపీ విధానమని దుయ్యబట్టారు. ప్రజల కోసమే రాహుల్ పోరాటం: ఖర్గే ప్రజల కోసమే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆయనను బలపర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓట్ చోర్–గద్దీ ఛోడ్ ధర్నాలో ఖర్గే ప్రసంగించారు. రాహుల్ గాం«దీకి మద్దతు ఇవ్వకుంటే దేశానికి నష్టం జరుగుతుందన్నారు. దేశాన్ని, ఓటు హక్కును, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మనమంతా కలిసి పోరాటం చేయాలన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, భావజాలం దేశాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. హిందూమతం, హిందుత్వం పేరుతో పేదలను బానిసలుగా మార్చడానికి ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్న బీజేపీని అధికారం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. దేశాన్ని కాపాడగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. దేశ ద్రోహులైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దలకు, ఓట్ల దొంగలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి మరింత బలోపేతం చేయాలని ప్రజలకు ఖర్గే విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్ పేపర్లతో గెలిచే దమ్ముందా?బ్యాలెట్ పేపర్లతో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి గెలిచే దమ్ముందా? అని బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సవాలు విసిరారు. ఓట్ల చోరీపై ఎన్నికల సంఘం ఏదో ఒకరోజు దేశ ప్రజలకు సమాధానం చెప్పక తప్పదని అన్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ అనుమానాస్పదంగా సాగుతోందని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును కూడా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం సహకరించకపోతే ఎన్నికల్లో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ నెగ్గలేదని తేల్చిచెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలన్నీ మోదీ సర్కార్ ఎదుట మోకరిల్లుతున్నాయని ఆరోపించారు. -
ఓట్లే కాదు.. అన్నీ లాగేసుకుంటారు!
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓట్ చోరీ (ఓట్ల దొంగతనం) అనే అంశం ఒక్క కాంగ్రెస్ పార్టీ సమస్యే కాదు.. ఇది మొత్తం దేశం సమస్య..’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. లోక్‌సభలో ఓట్ చోరీపై జరుగుతున్న యుద్ధంలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీకి మనమంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ ఒక సిపాయిలా మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని, తెలంగాణ నుంచి తాము వెన్నంటి ఉంటామని చెప్పారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’పేరుతో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాం«దీ, రాహుల్ గాందీ, ఎంపీ ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్న సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ యుద్ధంలో రాహుల్‌ను గెలిపించాలి ‘దేశ ప్రజల రాజ్యాంగ హక్కు కోసం చేస్తున్న యుద్ధంలో రాహుల్‌ను దేశ ప్రజలు గెలిపించాలి. లేదంటే ఓటు హక్కును లాక్కుంటారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ముందుగా ఓటరు లిస్టు నుంచి పేరు తొలగిస్తారు. ఆ తర్వాత ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, భూమి, ఆస్తులు కూడా లాక్కుంటారు. రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో చట్ట సభలో విస్తృత్తంగా చర్చ జరిగింది. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, నిరుపేదలకు ఓటు హక్కు కల్పించాలని మహాత్మాగాం«దీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కోరారు. కానీ ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త ఎం.ఎస్ గోల్వాల్కర్ తదితరులు ఈ వర్గాలకు ఓటు హక్కును నిరాకరించారు. కానీ మహాత్మాగాందీ, అంబేడ్కర్ పేదలకు ఓటు హక్కు కల్పించి దేశంలో ప్రభుత్వ ఏర్పాటులో వారికి అవకాశం ఇచ్చారు..’అని సీఎం చెప్పారు. రాహుల్ ముందే హెచ్చరించారు.. ‘ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆలోచనా విధానంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోదీ, అమిత్‌షా గత పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలంటూ ఓటర్లను అడిగారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని రాహుల్‌గాంధీ అప్పుడు చెప్పారు. అందుకే దేశ ప్రజలు బీజేపీకి 240 సీట్లతోనే సరిపెట్టారు. కాబట్టే రాజ్యాంగం రక్షించబడింది. ఇవాళ రాజ్యాంగం, రిజర్వేషన్లు ఉన్నాయంటే వారికి 400 సీట్లు రాలేదు కాబట్టే. వారు ఎస్ఐఆర్ పేరిట ఓట్ చోరీ చేస్తున్నారు. దళిత, ఆదివాసీ, మైనారిటీ, నిరుపేదల ఓట్లు తొలగించే పనిలో పడ్డారు. గతంలో దళిత, ఆదివాసీ, మైనారిటీ, నిరుపేదలకు జరుగుతున్న అన్యాయానికి వ్య తిరేకంగా మహాత్మాగాందీ, అంబేడ్కర్ నిలబడ్డారు. ఇప్పుడు రాహుల్, ఖర్గే ఈ వర్గాలకు మద్దతుగా, మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా.. ఆర్ఎస్ఎస్, గోల్వార్కర్ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా రామ్‌లీలా మైదానంలో మీ ముందు ఉన్నారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్‌గాందీకి మద్దతుగా నిలవాలి..’అని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీపీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తదితరులు కూడాధర్నాలో పాల్గొన్నారు. -
కేంద్రం,ఈసీపై రాహుల్ గాంధీ ఆగ్రహం
సాక్షి,ఢిల్లీ: ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చే ఓటర్లను ఓటర్ల జాబితానుంచి తొలగిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఓట్ చోర్, గద్దీ ఛోడ్ ర్యాలీలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘ఈసీ బీజేపీ కుమ్మక్కయ్యి వ్యవస్థల్ని నిర్విర్యం చేస్తున్నారు. ఓట్ చోరీపై దేశ వ్యాప్తంగా 5.5కోట్ల మందికి పైగా సంతకాలు సేకరించాం. ఓట్చోరీపై అందరూ ఏకమవ్వాలి. ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు జోడించారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత,నిస్పక్షపాతం ఉండాలి. కానీ ఇక్కడ అలా లేదు. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి మీ అందరి మద్దతు కావాలి’అని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. -
తెలంగాణలో పార్టీ పనితీరుపై రాహుల్‌గాంధీ సంతృప్తి
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పనితీరు పట్ల లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. మెస్సీ, రేవంత్‌రెడ్డిల మధ్య జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్‌గాంధీకి పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి వివరించారని, ఈ సందర్భంగా ఆయన ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా గెలిచిన విషయాలను వివరించారని తెలిపాయి. ఇందుకు రాహుల్ సానుకూలంగా స్పందించారని, మున్ముందు ఇదే పనితీరు కనబర్చాలని సూచించారని సమాచారం. కాగా, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్ వరకు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌లు ఒకే కారులో రాహుల్‌తో కలిసి వచ్చారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన రాహుల్‌గాందీకి సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథ్, సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎం.ఎ.ఫహీమ్ తదితరులు స్వాగతం పలికారు. ఫీజు బకాయిలు చెల్లించాలి: కేటీఆర్సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఫీజు బకాయిల కోసం నవంబర్ 17 నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి నాయకుడు రాకేశ్ దత్తా చేస్తున్న పాదయాత్ర 250 కి.మీ.తో శనివారం హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా రాకేశ్ దత్తా బృందాన్ని కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభినందించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... విద్యార్థులకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వానికి చేతులు రావడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాకేశ్ దత్తా మాట్లాడుతూ ఫీజు బకాయిలు విడుదల చేయాలని 20 రోజులుగా పాదయాత్ర చేశానన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కే విధంగా డ్రోన్లు వద్దని విద్యార్థులకు టాయిలెట్లు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పాదయాత్రలో ఖమ్మం నుంచి రాకేశ్ దత్తాతో పాటు విద్యార్థి నాయకులు గోనె శ్రీశ్రీ, ముదిగొండ పవన్, వాజెడ్ల అనిల్ తదితరులున్నారు. -
పరస్పర ఆరోపణలు పక్కనపెట్టి కాలుష్యంపై చర్చిద్దాం
న్యూఢిల్లీ: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికార, విపక్షాలు కలిసికట్టుగా కృషి చేయాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విన్నవించారు. పరస్పరం ఆరోపణలు చేసుకోవడం పక్కనపెట్టి.. వాయు కాలుష్యంపై అధికార, విపక్ష సభ్యులు కలిసి సభలో సమగ్ర చర్చ జరపాలని కోరారు. ప్రజల ఇక్కట్లు తీర్చడానికి ఇరుపక్షాలు కలిసి పని చేస్తాయన్న సందేశాన్ని ఇద్దామన్నారు. దేశవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న కాలుష్యంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధాన నగరాల్లో ప్రజలు విష వాయువు దుప్పటి కింద నివసిస్తున్నారని చెప్పారు. లక్షలాది మంది చిన్నారులు ఉపిరితిత్తుల జబ్బుల బారిన పడుతున్నారని, వారి భవిష్యత్తు దెబ్బతింటోందని అన్నారు. ప్రజలు క్యాన్సర్ పీడితులుగా మారుతున్నారని, వృద్ధులు శ్వాస సంబంధిత వ్యాధులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలుష్య సమస్యపై లోక్‌సభలో చర్చ చేపట్టాలని కోరారు. శుక్రవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిన కాలుష్యం రాజకీయ సిద్ధాంతపరమైన అంశం కాదని అన్నారు. ఈ సమస్యకు తక్షణమే పరిష్కార మార్గం కనిపెట్టాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు. చర్చకు సిద్ధం: కిరణ్ రిజిజు రాహుల్ విజ్ఞప్తిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సానుకూలంగా స్పందించారు. కాలుష్యంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. దీనిపై లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమయం కేటాయిస్తుందన్నారు. -
నేడు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శని వారం హైదరాబాద్‌కి వస్తున్నారు. ఉప్పల్ స్టేడియం వేదికగా మెస్సీ వర్సెస్ రేవంత్ టీంల ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం మేరకు రాహుల్ రానున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం రాత్రి ఆయన ఢిల్లీ తిరిగి వెళ్లనున్నారు. రాహుల్ టూర్ ఇలా! కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం 2:15 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయ ల్దేరనున్న రాహుల్ గాంధీ సాయంత్రం 4:15 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానా శ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి సాయంత్రం 5 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్తారు.అక్కడ రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకోనున్న రాహుల్ గాంధీ రాత్రి 7:15 గంటలకు బయల్దేరి 7:55 నిమిషాలకు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంకు చేరుకుంటారు. మెస్సీ టీంతో రేవంత్ టీం ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షిస్తారు. ఆ తర్వాత రాత్రి 9:15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి బయల్దేరుతారు. 10:30 గంటలకు ఎయిరిండియా విమానంలో ఢిల్లీ వెళ్తారు. -
ప్రభుత్వ వాదనను విజయవంతంగా తిప్పికొట్టాం
న్యూఢిల్లీ: వందేమాతరం, ఎన్నికల సంస్కరణలపై ఉభయ సభల్లో ఇటీవల జరిగిన చర్చల సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వాదనల్లో పస లేదని నిరూపించామని రాహుల్ గాంధీ తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత కూడా అయిన రాహుల్ శుక్రవారం పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాల నుంచి ఎదురైన దాడితో ప్రభుత్వం ఒత్తిడికి గురైన ట్లుగా కనిపించిందన్నారు. ‘వందేమాతరం, ఎస్ఐఆర్ అంశాలపై ఉభయసభల్లో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆ రెండు చర్చలలోనూ, మేము ప్రభుత్వ వాదనలను తిప్పికొట్టినందుకు సంతోషంగా ఉంది. ఎస్ఐఆర్ చర్చ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలవర పడ్డారని, పార్లమెంటులో దుర్భాషను కూడా ఉపయోగించారు’అని ఎంపీలతో భేటీ అనంతరం రాహుల్ మీడియాతో అన్నారు. ఓటు చోరీ అంశంపై ప్రభుత్వానికి ప్రమేయం ఉందన్న విషయం యావత్ దేశానికే తెలుసన్నారు. ఇండిగో సంక్షోభం, వాయు కాలుష్యం, కార్మిక చట్టాలు వంటి ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైందన్నారు. -
శశి థరూర్.. మళ్లీనా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. శుక్రవారం ఆ పార్టీకి చెందిన అగ్రనేత నేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఎంపీల భేటీకి డుమ్మా కొట్టారు. అయితే.. ఆయన ఇలా గైర్హాజరు కావడం ఇది వరుసగా మూడోసారి. అదీ పార్లమెంట్ సమావేశాల వేళ కావడంతో ఆసక్తికర చర్చకు దారి తీసింది.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం కోసం రాహుల్ గాంధీ అధ్యక్షతన శుక్రవారం కాంగ్రెస్ ఎంపీల సమావేశం జరిగింది. ఈ భేటీకి థరూర్ దూరంగా ఉన్నారు. థరూర్‌తో మరో సీనియర్ నేత, ఛండీగఢ్ ఎంపీ మనీశ్ తివారీ కూడా గైర్హాజరు అయ్యారు. అయితే..థరూర్ గత రాత్రి కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో తాను అందుబాటులో ఉండటంలేదని థరూర్ ముందే సమాచారం ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ కాంగ్రెస్ చీఫ్ విప్ మాత్రం థరూర్, తివారీల గైర్హాజరు గురించిన సమాచారం తనకు తెలియదని చెబుతుండడం గమనార్హం.శశిథరూర్ ఈ మధ్యకాలంలో తరచూ పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్డీయే హయాంలోని విదేశాంగ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. కొన్ని సందర్భాల్లో ఆయన నేరుగా ప్రధానమంత్రి మోదీని ప్రశంసించడం పార్టీ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. అదే సమయంలో థరూర్ అభిప్రాయాల ఆధారంగానే కాంగ్రెస్‌పైకి బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఈలోపు..నవంబర్ 30వ తేదీన జరిగిన మీటింగ్‌కు విమాన ప్రయాణంలో ఉన్నందున హాజరు కాలేకపోయానని థరూర్ మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. అంతకు ముందు.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద జరిగిన చర్చలోనూ ఆయన పాల్గొనలేదు. ఆ సమయంలో అనారోగ్యం కారణంగా పాల్గొనలేకపోయానని అన్నారాయన. కానీ, ఆయన కార్యాలయం మాత్రం తన తల్లి(90) వెంట ఉండాల్సి రావడంతోనే హాజరు కాలేకపోయారని భిన్నమైన ప్రకటన చేసింది. ఇదిలా ఉంటే.. థరూర్ వరుసగా ఇలా ఎగ్గొట్టడాన్ని కాంగ్రెస్ నేతలు తేలికగా తీసుకోవడం లేదు.పుతిన్ పర్యటన సమయంలో ప్రభుత్వం రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన విందుకు హాజరు కావడంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు పలువురు కాంగ్రెస్ సీనియర్లు. ఇలా పార్టీ మీటింగ్‌కు హాజరు కాకపోవడంపై పెదవి విరుస్తున్నారు. అయితే థరూర్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.ఐదేళ్ల కిందటే మొదలై..2020లో కాంగ్రెస్‌లో జీ-23 గ్రూప్ పరిణామం తీవ్ర కలకలం రేపింది. పార్టీలోని 23 మంది సీనియర్ నేతలు ‘కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్థిరమైన నాయకత్వం’ కోరుతూ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ గ్రూప్‌లో థరూర్ కూడా ఉన్నారు. ఆ సమయంలో దీనిని సోనియా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా(మరీ ముఖ్యంగా అప్పటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..) ఓ తిరుగుబాటులాగా భావించారంతా. ఆపై 2022లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇది మరోసారి బయటపడింది. మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా శశిథరూర్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అధిష్టానం అండతో ఖర్గే గెలిచినా, థరూర్‌కు 1,000కి పైగా ఓట్లు రావడం కొసమెరుపు.2025.. ఆపరేషన్ సిందూర్ తర్వాత కాంగ్రెస్‌కే షాకిస్తూ ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ను అఖిలపక్ష బృందంలో ఎంపిక చేసింది బీజేపీ. పలు దేశాల సమావేశాల్లో థరూర్ మోదీ నాయకత్వంపై ప్రశ్నలు గుప్పించారు. ఇది ఆయన కొందరు కాంగ్రెస్ నేతలతో సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి కారణమైంది. విదేశాల నుంచి తిరిగి వచ్చాక పార్టీ అధిష్టానంతో విభేదాలున్నాయని అంగీకరిస్తూనే.. అవి నాలుగు గోడల మధ్య చర్చించుకునే విషయమని కేరళలో స్పష్టం చేశారు. ఆపై ది హిందూ కోసం ఆయన రాసిన ఓ కథనం.. ప్రధాని మోదీ శక్తి, చురుకుదనం భారతదేశానికి ప్రధాన ఆస్తి అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మరింత ఆగ్రహం తెప్పించాయి. అయితే ఇవేవీ తాను బీజేపీలో చేరతాననే సంకేతాలు మాత్రం కాదని శశిథరూర్ చెబుతూ వస్తున్నారు. -
ఓట్ చోరీ.. అమిత్ షా ఒత్తిడిలో ఉన్నారు: రాహుల్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాస్త ఒత్తిడితో కనిపిస్తున్నారు అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ చోరీ విషయంలో తాను సవాల్ విసిరినా అమిత్ షా ఎందుకు స్పందించలేదని రాహుల్ ప్రశ్నించారు.కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా మాట్లాడుతూ..‘ఓటు చోరీ అంశంపై నేను ఇప్పటికే మూడు ప్రెస్ కాన్ఫరెన్స్‌లపై పార్లమెంట్లో చర్చించాలని అమిత్ షాకు సవాల్ విసిరాను. అయినా అమిత్ షా నుంచి దానిపై ఎటువంటి సమాధానం రాలేదు. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా అమిత్ షా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారు. నిన్న అమిత్ షా చాలా ఆందోళనగా ఉన్నారు. ఆయన తప్పుడు భాష ఉపయోగించారు. ఆయన చేతులు వణికాయి. అమిత్ షా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఇది నిన్న అందరూ చూశారు.నేను ఆయన్ని అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఎలాంటి రుజువు ఇవ్వలేదు. పార్లమెంట్లో నా మీడియా సమావేశాల్లోని అన్ని అంశాల గురించి చర్చించడానికి నేరుగా క్షేత్రస్థాయికి రావాలని నేను అమిత్ షాకు సవాలు విసిరాను. నాకు ఎలాంటి సమాధానం రాలేదు. అందరికీ వాస్తవమేంటో తెలుసు అని ఆరోపించారు. దీంతో, రాహుల్ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. -
అమిత్ షా, రాహుల్ మాటల యుద్ధం
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, అమిత్ షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఓట్ల చోరీపై తనతో చర్చకు సిద్ధమా? అని రాహుల్ సవాలు విసిరారు. ఎన్నికల సంఘం అండతోనే బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తోందని మంపడ్డారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల కమిషనర్లకు పూర్తి స్వేచ్ఛ, అధికారాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, దీని వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. హరియాణాలో ఓట్ల చోరీ జరగలేదంటూ అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. అక్కడ ఓట్ల చోరీకి ఆధారాలున్నాయని చెప్పారు. అమిత్ షా స్పందిస్తూ ప్రతిపక్ష నాయకుడు చెప్పినట్లు తాను నడుచుకోవాలా? అని నిలదీశారు. విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపారు. అమిత్ షా భయపడుతున్నారని, ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్లిపోయారని రాహుల్ ఎద్దేవా చేశారు. నా ప్రశ్నకు సమాధానమేది?ఓట్ల చోరీ అనేది అతిపెద్ద దేశద్రోహమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభలో తాము అడిగిన ప్రశ్నలకు అమిత్ షా సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. రాహుల్ బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత, ఓట్ల చోరీ, ఈవీంఎల పనితీరు గురించి తాము ప్రశి్నస్తే అమిత్ షా ఒక్కమాట కూడా మట్లాడలేదని అన్నారు. ఓట్ల చోరీపై ఇప్పటికే ఆధారాలు చూపించానని గుర్తుచేశారు. కానీ, అమిత్ షా దానిపై స్పందించలేదని రాహుల్ ఆక్షేపించారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేర్వేరు రాష్ట్రాల్లో ఓట్లు వేస్తున్నారని, దీనిపై అమిత్ షా ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలని నిలదీశారు. ‘సర్’ను గబ్బర్‌సింగ్‌లా మార్చారు ‘‘గౌరవప్రదమైన ‘సర్’ పదాన్ని గబ్బర్‌సింగ్‌లా భయంకరమైన అంశంగా మార్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరిట ప్రజలను వేధిస్తున్నారు. సర్ సర్ అంటూ బీజేపీ ఎంతగా గొంతు చించుకున్నా బెంగాల్ ప్రజలు మాత్రం మేడమ్‌కు(మమతా బెనర్జీ) అండగా నిలుస్తారు. బీజేపీ నేతలు బెంగాల్లో కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజలకు కనిపిస్తుంటారు. ఎన్నికల్లో ఓడిపోయి ఇంటికి తిరిగివెళ్లారు. బీజేపీ బిహార్‌లో గెలిచిందేమో గానీ బిహార్‌లో వారి ఆటలు సాగవు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎందుకు చేపట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ – శతాబ్ది రాయ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బ్యాలెట్ పేపర్ల విధానం కావాలి ‘‘ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానం తీసుకురావాలి. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేస్తోంది. చాలా ఏళ్లుగా బీజేపీకి సహకరిస్తోంది. ఎన్నికల సంఘానికి కలి్పంచిన కొన్ని చట్టపరమైన వెసులుబాట్లను తొలగించాలి. ప్రధాని ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల ఎంపికకు సంబంధించిన ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలి’’ – డింపుల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఎస్ఐఆర్ అంటే బ్యాక్‌డోర్ ఎన్ఆర్సీ ‘‘పౌరుల జాతీయ రిజిస్టర్(ఎన్ఆర్సీ)కి మరో రూపమే ఎస్ఐఆర్. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసుగులో దొడ్డిదారిన ఎన్ఆర్సీని అమలు చేస్తున్నారు. మతం ఆధారంగా ఓటు హక్కును తొలగించడానికి ద్రోహపూరితమైన ప్రక్రియ జరుగుతోంది. ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చాలి. ఎస్ఐఆర్ చేపట్టడం పార్లమెంటరీ వ్యవస్థను ఉల్లంఘించడమే అవుతుంది. పౌరులకు పార్లమెంట్ ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు కూడా ఈ ప్రక్రియ విరుద్ధమే’’ – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ప్రజల హృదయాలను మోదీ హ్యాక్ చేశారు ఎన్నికల్లో నెగ్గడానికి ఈవీఎంలను హ్యాక్ చేయాల్సిన అసవరం ప్రధాని మోదీకి ఎంతమాత్రం లేదు. ఎందుకంటే ఆయన ప్రజల హృదయాలను హ్యాక్ చేశారు. వారి మనసులు గెల్చుకున్నారు. ప్రజల అండతో ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగకుండా ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టిస్తున్నారు’’ – కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ మళ్లీ బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్ కావాలా? ‘‘ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల విధానం మళ్లీ ప్రవేశపెడితే అప్పటి అరాచకాలు పునరావృతం అవుతాయి. బూత్ ఆక్రమణ, రిగ్గింగ్ మళ్లీ జరుగుతుంది. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ల వాడకాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు సమరి్థంచాయి. ఈవీఎంలకు అనుకూలంగా ఎన్నో తీర్పులిచ్చాయి. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదు. ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేస్తే ఎవరూ ముందుకు రాలేదు. ఈవీఎంలను అనుమానాలను ఇకనైనా మానుకోవాలి. ఈవీఎంలతో ఎన్నికలు వేగంగా, సురక్షితంగా జరుగుతాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. కానీ, ఎన్నికలు ముసిగిన తర్వాత ఓట్ల చోరీ అంశంపై ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. నిజంగా ఓట్ల చోరీ జరిగిందని రుజువులుంటే ఎందుకు ఫిర్యాదు చేయలేదో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఎన్నికలు స్వచ్ఛంగా, పారదర్శకంగా జరగడానికి ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది. ఎన్నికల వరుస పరాజయాలను జీరి్ణంచుకోలేక ఎన్నికల సంఘంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ మరో 15–20 ఏళ్లపాటు అధికారంలో కొనసాగడం తథ్యం’’ – రవి శంకర్ ప్రసాద్, బీజేపీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి -
ఢిల్లీకి సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: సీఎం రేవంత్‌రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈసారి పర్యటనలో ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాందీని కలుస్తారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. గ్లోబల్ సమ్మిట్‌కు రాహుల్‌గాంధీ హాజరు కాని నేపథ్యంలో, సమ్మిట్ జరిగిన తీరు గురించి సీఎం ఆయనకు వివరిస్తారని సమాచారం. గురువారం పార్లమెంటుకు వెళ్లి వీలును బట్టి కొందరు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని తెలుస్తోంది. సోనియా గాందీని కలిసి జన్మదిన శుభాకాంక్షలుతెలియజేస్తారని, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె. సి.వేణుగోపాల్‌తో సమావేశమై పార్టీ పరిస్థితులు, డీసీసీ అధ్యక్షుల నియామకాలు, కార్పొరేషన్ పదవుల భర్తీ లాంటి అంశాలపై చర్చించే అవకాశముందని సమాచారం. శరద్ పవార్ విందులో రేవంత్, రాహుల్ భేటీ ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన విందుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 12న శరద్ పవార్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఢిల్లీలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ తదితరులు హాజరయ్యారు. ఢిల్లీ వచ్చిన సీఎం రేవంత్ తోపాటు, మధుయాష్కీ గౌడ్ ఈ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శరద్ పవార్‌కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేతలు..కాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. -
నెహ్రూ, ఇందిర, సోనియానే ఓట్ చోరీ చేశారు
సాక్షి, ఢిల్లీ: ఓట్ చోరీ వ్యవహారంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ఒక్కసారిగా వేడెక్కాయి. లోక్‌సభలో రాహుల్ గాంధీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ అంశంపై చర్చకు రావాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. అయితే.. ఆ సవాల్‌కు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోక్‌సభలో ఎస్ఐఆర్పై చర్చకు అమిత్ షా భయపడుతున్నారు. మొదటిసారి ఈసీకి పూర్తి ఇమ్యూనిటీ ఇచ్చారు. హర్యానాలో 19 లక్షల నకిలీ టోర్లు ఉన్నారు. ఓట్ల చోరీ వ్యవహారంలో నా ఆరోపణలకు జవాబివ్వగలారా? చర్చకు సిద్ధమా? అని రాహుల్ అన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ.. నేను ఎప్పుడు మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో ఎవరూ నిర్ణయించలేరు. వాళ్లకు(రాహుల్‌ను ఉద్దేశించి..) కాస్త సహనం ఉండాలి. అన్ని ప్రశ్నలకు జవాబిస్తా. ధైర్యంగా ఉండాలి. రాహుల్ గాంధీ ఓట్ చోరీ పేరిట హైడ్రోజన్ బాంబు వేశారు. హర్యానాలో నకిలీ ఓటర్లు ఉన్నారని అంటున్నారు. కానీ, అక్కడ ఎలాంటి నకిలీ ఓటర్లు లేరు. నెహ్రూ హయాంలోనే ఓట్ చోరీ జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు మెజారిటీ వచ్చినా.. నెహ్రూనే ప్రధాని అయ్యారు. ప్రధాని విషయంలో నెహ్రూ ఓట్ చోరీకి పాల్పడ్డారు. అలహాబాద్‌లో ఇందిరా గాంధీ ఓట్ చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోనియా గాంధీ భారత పౌరురాలు కాకముందే ఓటేసి ఓట్ చోరీ చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ మేం ఈసీని తప్పుబట్టలేదు’’ అని అమిత్ షా అన్నారు. ఈ క్రమంలో నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధమైన సంస్థ. సీఈసీని ఎన్నుకునే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా ఉంటారు. ఓటర్ల సవరణ బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఎస్ఐఆర్ ప్రక్రియ తాము మొదలుపెట్టిందేం కాదని.. ఏనాటి నుంచో కొనసాగుతోందని.. అలాంటప్పుడు దీనిపై చర్చే అనవసరం అని అన్నారాయన. చివర్లో.. భారత్‌లోని విదేశీ ఓటర్లను ఏరిపారేయాల్సిన అవసరం ఉందని షా వ్యాఖ్యానించారు. -
బ్రెజిల్ మహిళ ఫొటోపై సమాధానం లేదు: రాహుల్
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఎనిమిదవ రోజున(బుధవారం) లోక్‌సభలో.. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ప్రారంభించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కసరత్తుపై లోక్‌సభ చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మనీష్ తివారీ ఈ చర్చను ప్రారంభించారు. ఆయన ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలను డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ చర్చను ముందుకు తీసుకెళుతూ.. ఎన్నికల కమిషన్.. ఎన్నికలను రూపొందించేందుకు పాలక భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో కుమ్మక్కవుతున్నదంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓటు చోరీని మించిన జాతి వ్యతిరేక చర్య మరొకటి లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారు. ఎలక్షన్ కమిషన్, సిబిఐ , ఈడి, ఐటి విభాగాలను బిజెపి కబ్జా చేసిందన్నారు. ఎన్నికల కమిషనర్ల సెలక్షన్ల కమిటీ నుంచి సిజెఐ ని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో సీసీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వడం లేదని చెబతూ, ఈవీఎం వెరిఫికేషన్ కు యాక్సెస్ ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల జాబితాలో 22 సార్లు బ్రెజిల్ మహిళ ఫోటో ఉందని, దీనిపై తన ప్రశ్నలకు ఎన్నికల సంఘం జవాబులు చెప్పడం లేదన్నారు. ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని, తాను అధికారంలోకి వస్తే అన్నింటిని చక్కదిద్దుతామని రాహుల్ పేర్కొన్నారు.కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ ఇండిగో వైఫల్యం వల్ల ఆర్థిక నష్టం అత్యంత భారంగా మారిందని అన్నారు. ఇప్పటివరకు మొత్తం ఆర్థిక నష్టం ఎంతో తెలియదు. ఎన్ని టిక్కెట్లు రద్దు చేశారో తెలుస్తోంది.ఈ విషయంలో ఇతర నష్టాల సంగతేంటి? హోటల్ బుకింగ్, ఈవెంట్లు రద్దు అయ్యాయి. వీటన్నింటినీ ఎవరు భరిస్తారు? ఈ భారీ వైఫల్యం కారణంగా ప్రయాణికులు ఎంత ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారో ప్రభుత్వానికి ఏమైనా అంచనా ఉందా?" అని కార్తీ చిదంబరం ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనను సమర్థించారు. పార్లమెంట్ సమావేశం జరుగుతోంది. అయినప్పటికీ కాలుష్యం గురించి లేదా ఎన్నికల సంస్కరణల గురించి ప్రధానమంత్రికి పెద్దగా పట్టింపు లేదు.వారు 150 ఏళ్ల నాటి వందేమాతరం గురించి మాట్లాడుతున్నారు, కానీ యువత నిరుద్యోగం గురించి ఎటువంటి ఆందోళన లేదు అని రంజీత్ రంజన్ ఎద్దేవా చేశారు. వారు ఎవరి సమస్యలను పరిష్కరిస్తున్నారు? రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్తున్నారు? అని అడుగుతున్నారు. 140 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసే అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందా?" అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో కూడా ఎన్నికల సంస్కరణలపై చర్చ చేపట్టనున్నారు. దీనికి ముందు వందేమాతరం 150వ వార్షికోత్సవంపై చర్చ కొనసాగింది. అంతకు ముందు రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వందేమాతరం 150వ వార్షికోత్సవంపై రాజ్యసభలో ప్రత్యేక చర్చను చేపట్టారు. వందేమాతరంపై విమర్శలు చేసేవారు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. -
ఎస్ఐఆర్ పాతదే: మేఘ్వాల్
న్యూఢిల్లీ: ఎస్ఐఆర్ పేరిట మోదీ సర్కార్ మరోమారు పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీకి తెగిస్తోందంటూ కేంద్ర ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేసిన లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీకి ప్రభుత్వం తరఫున బీజేపీ నేతలు దీటైన జవాబులిచ్చారు. మంగళవారం లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చలో ప్రభుత్వం తరఫున న్యాయశాఖ సహాయమంత్రి అర్జున్‌సింగ్ మేఘ్వాల్ మాట్లాడారు. ‘‘ వాస్తవానికి తొలి సార్వత్రిక ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీకి పాల్పడింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను ఓడించాలనే దుర్బుద్ధితో ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడింది.ఈవీఎంలు, ఎస్ఐఆర్పై కాంగ్రెస్ పదేపదే ఆరోపణలు గుప్పిస్తోందిగానీ సహేతుక కారణాలను వెల్లడించలేక చతికిలపడింది. 1952 నుంచి 2002 ఏడాదిదాకా ఎస్ఐఆర్ను పలుమార్లు చేపట్టారు. ఇది కొత్తదేమీ కాదు. గత 2 దశాబ్దాలుగా ఎస్ఐ ఆర్ నిర్వహించట్లే రు. దీంతో వల సలు, మరణాలు, సవరణలు, పట్ట ణీకర కారణాలతో ఓటర్ల జాబితాలో మార్పులొచ్చాయి.వాస్తవాలు ప్రతిబింబించేలా పారదర్శకంగా ఎస్ఐఆర్ను తాజాగా చేపట్టాల్సిన సమయం వచ్చింది. అందుకే బిహార్‌లో పూర్తిచేశాం. మిగతా రాష్ట్రాల్లోనూ చేస్తాం. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు సూచించిన కమిటీ అనేది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకే నూతన చట్టం తెచ్చాం’’ అని మేఘ్వాల్ చెప్పారు.ఈవీఎంలు రాజీవ్ హయాంలోనే..ఈవీఎంలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై జార్ఖండ్ నేత, గోధా నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తప్పుబట్టారు. ‘‘ఈవీఎంలపై విపక్ష పార్టీలు యాగీచేస్తున్నాయి. వాస్తవానికి నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ హయాంలో 1987లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈవీఎంలను పరీక్షించారు. 1991లో కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఎన్నికల్లో ఉపయోగించారు. ఇప్పుడు విమర్శిస్తున్న ఇదే కాంగ్రెస్‌లోని ఆనాటి నేతలు ఈవీఎంలను వేనోళ్ల పొగిడారు. అత్యంత పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ పరికరం ఇదేనని ఆకాశానికి ఎత్తేశారు. రిగ్గింగ్‌ను నివారించేందుకు ఈవీఎంలే సరైన పరిష్కారమని 1961లో కమిటీ సైతం అభిప్రాయపడింది’’ అని దూబే.. రాహుల్‌కు దీటైన బదులిచ్చారు. -
అది అతిపెద్ద దేశద్రోహం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంతో కలిసి మోదీ సర్కార్ ఓట్ల చోరీకి పాల్పడుతూ భారత్‌లోనే అతిపెద్ద దేశద్రోహానికి ఒడిగట్టిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల సంస్కరణలు అంశంపై మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా విపక్షాల తరఫున కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్షనేత హోదాలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈసీపై, మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌పై విమర్శల జడి కురిపించారు. అతిపెద్ద నేరమేదంటే.. అది ఇదే‘‘అతిపెద్ద దేశద్రోహ నేరమంటూ ఉందంటే అది ఓట్ల చోరీనే. మీరు చేసిన ‘ఓట్ల చోరీ’ స్థాయి అతిపెద్ద నేరం దేశంలో ఇంతవరకు జరగలేదు. నిజమైన పౌరుల వాస్తవిక ఓటును హరించి దేశ ప్రజాస్వామ్య వస్త్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చేస్తున్నారు. నవభారత్ను విధ్వంసం చేస్తున్నారు. భారత్ అనే భావనను కూలదోస్తున్నారు. లోక్‌సభలో అటు పక్క అధికార కుర్చీల్లో కూర్చున్న వాళ్లంతా కలిసి దేశ వ్యతిరేక దుశ్చర్యలు తెగిస్తున్నారు’’ అని అన్నారు.ఈవీఎం సంగతేంటి?‘‘ఈవీఎంతో మీరెన్నో గిమ్మిక్కులు చేస్తున్నారు. మాకూ ఈవీఎంను తనిఖీచేసే అవకాశం ఇవ్వండి. మా సాంకేతిక నిపుణులు సైతం ఈవీఎంల పనిపడతారు. అసలు ఈవీఎంలోపల ఏం పెట్టా్టరో తేలుస్తారు. ఇప్పటిదాకా మాకు ఈవీఎంలపై కనీస హక్కు లేదు’’ అని రాహుల్ అన్నారు. ఎలక్షన్ కమిషన్లనుద్దేశిస్తూ రాహుల్ పలు వ్యాఖ్యలుచేశారు. ‘‘వాళ్లకో విషయం చెబుతున్నా. ఇప్పుడున్న సవరణ చట్టాన్ని భవిష్యత్తులో మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ మారుస్తాం. అధికారంలో ఉన్నప్పుడు కమిషనర్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు వాళ్లనే బాధ్యులను చేస్తాం. కారకుల భరతం పడతాం’’ అని రాహుల్ పరోక్షంగా హెచ్చరించారు. మళ్లీ బ్రెజిల్ యువతి ప్రస్తావనహరియాణాలో బ్రెజిల్ యువతి పేరు ఓటర్ల జాబితాలో 22 సార్లు వచ్చిందన్న అంశాన్ని రాహుల్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘బ్రెజిల్ యువతి మాత్రమేకాదు ఎంతో మందిపేర్లు ఇలా హరియాణా ఓటర్ల జాబితాలో పలుమార్లు పునరావృతమయ్యాయి. ఒక మహిళ పేరు ఏకంగా 200 సార్లు ఉంది. ఇవన్నీ చూశాక హరియాణా ఎన్నికలు చోరీ అయ్యాయనేది సుస్పష్టం. ఇది ఎలక్షన్ కమిషన్ కనుసన్నల్లోనే జరిగింది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.‘‘బిహార్‌లో ప్రతిష్టాత్మకంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే చేపట్టామని ఈసీ ఘనంగా చెప్పుకుంది. మరి అలాంటప్పుడు మళ్లీ 1.2 లక్షల డూప్లికేట్ ఫొటోలు ఎలా తుది జాబితాలో ప్రత్యక్షమయ్యాయి? ఈ ప్రశ్నకు ఈసీ దగ్గర సూటి సమాధానమే లేదు’’ అని రాహుల్ ఎద్దేవాచేశారు.మనది గొప్పదైన ప్రజాస్వామ్యంఅందరూ మనది అతిపెద్ద ప్రజాస్వామ్యం అంటారు. వాస్తవానికి మనది గొప్పదైన ప్రజాస్వామ్యం. అమెరికా తమది పురాతన ప్రజాస్వామ్యం అంటుంది. నిజానికి మనదే గొప్పది. అత్యధిక మంది ఓటర్లు, భిన్న ప్రాంతాలు, మతాలు, భాషలు, రాష్ట్రాల సమ్మేళనంగా భారత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. ప్రజలందర్నీ ఒక్కతాటి మీదకు తెస్తున్న ఇదే ప్రజాస్వామ్యభావనకే బీజేపీ తూట్లు పొడుస్తోంది. ధ్వంసం చేస్తున్నామని వాళ్లకూ తెలుసు. ఆనాడు గాంధీజీని ఆర్ఎస్ఎస్ వ్యక్తి నాథూరాం గాడ్సే మూడు బుల్లెట్లు ఛాతీలో దింపి మహాత్ముడి ప్రాణాలను బలితీసుకున్నాడు.బీజేపీ వాళ్లు నాటి చేదు నిజాన్ని ఒప్పుకోవాల్సిందే. గాంధీజీ హత్యతో అక్కడితో ఆ ఘోర క్రతువు ఆగిపోలేదని నేడు ఇప్పుడు నాకు అనిపిస్తోంది. ఓటు చోరీతో సాధించిన అధికారంతో రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ ఆర్ఎస్ఎస్ గుప్పిటపట్టే దుస్సాహసానికి తెరతీసింది. నాడు గాంధీజీ హత్యోదంతం తొలి మెట్టు అయితే తర్వాతి మెట్టు ఇప్పటి రాజ్యాంగబద్ధ వ్యవస్థను కబళించడం’’ అని అన్నారు. ‘‘ ఓటు చోరీ అనేది అతిపెద్ద దేశద్రోహం. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసంచేసేందుకు బీజేపీ, ఈసీ మూకుమ్మడిగా బయల్దేరాయి. ప్రజల గొంతుకను తొక్కిపెడుతున్నాయి’’ అని తర్వాత ‘ఎక్స్’లో రాహుల్ ఒక పోస్ట్ పెట్టారు.3 ప్రశ్నలకు సమాధానం చెప్తారా?చర్చ సందర్భంగా మోదీ సర్కార్‌పై రాహుల్ మూడు సూటి ప్రశ్నలను సంధించారు.1.‘‘ఎలక్షన్ కమిషన్ల నియామక ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తప్పించారు?. సీజేఐను తొలగించడానికి వెనుక మతలబు ఏంటి? సీజేఐ అంటే మాకు పూర్తి విశ్వాసం ఉంది. అలాంటి సీజేఐకు ఎలక్షన్ కమిషన్ నియామక ప్రక్రియ నుంచి ప్రభుత్వం ఏ కారణంతో పక్కకు తప్పించింది?. ఆనాడు ఎలక్షన్ కమిషన్ల ఎంపిక సంబంధ భేటీకి నేనూ హాజరయ్యా. ఇటు పక్క నేను కూర్చున్నా. అటు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసీనులయ్యారు. అక్కడ నా వాదనలకు వీసమెత్తయిన విలువ లేకుండా పోయింది. వీళ్లిద్దరు ఏం ఆలోచించారో అది మాత్రమే ఆచరణలోకి వచ్చింది. కేవలం ఫలానా వ్యక్తులు మాత్రమే ఎలక్షన్ కమిషనర్లుగా రావాలని ఎందుకు ప్రధాని, హోం మంత్రి అంతగా దృష్టిసారిస్తున్నారు?2.‘‘దేశ చరిత్రలో గతంలో ఏ ప్రధాని చేయనట్లుగా మోదీ 2023 డిసెంబర్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్లకు నేర విచారణ నుంచి మినహాయింపు కల్పిస్తూ చట్టసవరణ తీసుకొచ్చారు. దీంతో ఎలక్షన్ కమిషనర్లు ఈసీలో విధుల్లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు పక్షపాతంతో కూడినవి అని తేలినా సరే వాళ్లపై ఎలాంటి విచారణ మొదలుపెట్టలేని దురవస్థ ఏర్పడింది. వాళ్లపై కేసుల ఈగ వాలకుండా మోదీ రక్షణ కల్పించారు. కమిషనర్లకు ఇంతటి రక్షణను ప్రధాని, హోం మంత్రి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?3.‘‘ఎన్నికలు పూర్తయిన కేవలం 45 రోజులకే సంబంధిత సీసీటీవీ ఫుటేజీని ధ్వంసంచేయాలంటూ మోదీ సర్కార్ చట్టాన్నే మార్చేసింది. అంత అవసరం ఏమొచ్చింది?. ఇది డేటాకు సంబంధించిన అంశమంటూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూసింది. ఇది డేటాకు సంబంధించిన అంశం కాదు. దీనికి ఎన్నికల చోరీతో సంబంధముంది. ఎన్నికలకు నెల రోజుల ముందే మెషీన్ చదవగలిగే ఓటర్ల జాబితాను రాజకీయపక్షాలకు అందివ్వాల్సిందే. సీసీటీవీ ఫుటేజీ తొలగింపు చట్టాన్ని సవరించాల్సిందే. అసలు సీసీటీవీ ఫుటేజీ డిలీట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? -
ఎస్ఐఆర్పై లోక్‌సభలో వాడీవేడీగా చర్చ
Parliament Session Updates.. లోక్‌సభలో ఎస్ఐఆర్పై చర్చ.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..ఎన్నికల సంస్కరణలపై కేంద్రం గొప్పలు చెబుతోంది: రాహుల్ గాంధీక్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు: రాహుల్ గాంధీఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలుఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థలనూ తన గప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తోంది: రాహుల్ గాంధీఎన్నికల వ్యవస్థ ఆర్ఎస్ఎస్ చేతుల్లోనే ఉందిరాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల అభ్యంతరంరాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజురాహుల్ గాంధీ అనవసరంగా పార్లమెంట్లో ఆర్ఎస్ఎస్ టాపిక్ లేవనెత్తుతున్నారు: కిరెణ్ రిజిజురాహుల్ వ్యాఖ్యలతో బీజేపీ-విపక్ష ఎంపీల పోటాపోటీ నినాదాలు.. స్వల్ప ఉద్రిక్తతవిపక్షాల తీరుపై స్పీకర్ ఆగ్రహంస్పీకర్ చెయిర్‌ను మీరు బెదిరించలేరు: స్పీకర్ ఓం బిర్లానేను ఏదీ తప్పుగా మాట్లాడలేదు: రాహుల్ గాంధీనేను ఆరోపణలు చేయడం లేదు.. అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నా: రాహుల్ గాంధీఎన్నికల వ్యవస్థ, సీబీఐ, ఈడీలను ప్రభుత్వం తన గుప్పిట పెట్టుకుంది: రాహుల్ గాంధీసీబీఐ చీఫ్‌ను సీజేఐ ఎందుకు ప్రతిపాదించడం లేదు?: రాహుల్ గాంధీవిద్యావ్యవస్థను కూడా ఆర్ఎస్ఎస్ తన గుప్పిట పెట్టుకుంది : రాహుల్ గాంధీఇప్పటికే విద్యా వ్యవస్థను మార్చేశారు: రాహుల్ గాంధీమెరిట్తో సంబంధం లేకుండా యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తున్నారు: రాహుల్ గాంధీప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం ఈసీని అస్త్రంగా ఉపయోగించకుంటున్నారు: రాహుల్ గాంధీఎన్నికల సీసీ ఫుటేజీని ధ్వంసం చేశారు: రాహుల్ గాంధీఉత్తర ప్రదేశ్, హర్యానాలో ఓట్చోరీ జరిగింది: రాహుల్ గాంధీఫేక్ ఓట్లపై ఈసీ క్లారిటీ కూడా ఇవ్వలేదు: రాహుల్ గాంధీఆర్ఎస్ఎస్ వ్యతిరేకులను ప్రభుత్వం టార్గెట్ చేసింది: రాహుల్ గాంధీ లోక్‌సభలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై చర్చప్రసంగిస్తున్న విపక్ష నేత రాహుల్ గాంధీ సర్ చర్చలో పాల్గొన్న ఎంపీ మిథున్రెడ్డిఎస్ఐఆర్పై లోక్‌సభలో చర్చచర్చలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డిఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయిఅనేక నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌పై ప్రజలకు అనేక డౌట్లు ఉన్నాయిఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని అనేకమంది టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారుపేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలిపేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయిఅందరికీ సౌకర్యంగా ఉంటే, ఎస్ఐఆర్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదుఅన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలివెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలిఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతంఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సా.6 గంటల తర్వాత అకస్మాత్తుగా ఓటింగ్ శాతం పెరిగిందిసాయంత్రం 6.. తర్వాత 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి మేము ఇచ్చిన ఫిర్యాదుల పైన ఈసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదువిజయనగరం పార్లమెంటులో కౌంటింగ్ సమయంలో 99 శాతం, పోలింగ్ సమయంలో 60 శాతం చార్జింగ్ ఉందిఈవీఎంలో చార్జింగ్ ఎలా పెరిగిందని అడిగితే సమాధానం లేదువివి ప్యాట్ స్లిప్పులు అడిగితే అప్పటికే తగలబెట్టామని చెప్పారువెరిఫికేషన్ కోసం ఈవీఎంలు అడిగితే వేరే వాటిని ఇచ్చారుఈసీ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఫిర్యాదులు చేసిన ఉపయోగం ఉండడం లేదుహిందూపురం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బూత్ లో మా పార్టీ కికు 472 ఓట్లు వస్తే, అక్కడే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఒక్క ఓటు మాత్రమే వచ్చిందిఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఎలన్ మస్క్ సహా అనేక మంది నిపుణులు అంటున్నారుఅభివృద్ధి చెందిన దేశాల్లో సైతం పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తున్నారుపేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలిపేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయిఅందరికీ సౌకర్యంగా ఉంటే, ఎస్ఐఆర్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదుఅన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలివెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలిఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతం SIRపై లోక్‌సభలో ప్రత్యేక చర్చఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అమలుపై కాంగ్రెస్ అభ్యంతరంఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే ఎస్ఐఆర్ చేస్తున్నారు: కాంగ్రెస్ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి: కాంగ్రెస్ఈసీల నియామక ప్రక్రియ చేపట్టిండి: మనీశ్ తివారీఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో ప్రత్యేక చర్చ.కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ కామెంట్స్..బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలి.అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి.ఎన్నికల సంస్కరణల్లో తొలుత జరగాల్సింది ఈసీల నియామక ప్రక్రియ.ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయండి.ప్రస్తుత ముగ్గురు సభ్యులతో పాటు రాజ్యసభలో విపక్ష నేత సీజేఐను చేర్చండి. Congress MP Manish Tewari speaks in Lok Sabha during debate on electoral reforms He says, "...The first reform that should happen is an amendment to the law governing the selection of members of the Election Commission. My suggestion is that LoP Lok Sabha and Chief Justice of… https://t.co/qt6rVkTu4d pic.twitter.com/ZZiLL1DzfN— ANI (@ANI) December 9, 2025ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వాడాలి: అఖిలేష్ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో ప్రసంగించిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్అఖిలేష్ కామెంట్స్..ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ప్రతిపక్షాలకు అనేక అనుమానాలు ఉన్నాయి.బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించాలిSpeaking in Lok Sabha on electoral reforms, Samajwadi Party MP Akhilesh Yadav says, "Elections should be conducted using ballot papers because many questions are being raised on the use of electronic devices." pic.twitter.com/QCO063kGIN— ANI (@ANI) December 9, 2025ప్రియాంక గాంధీ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్..రాజ్యసభలో వందేమాతరం 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చ.కొందరు బెంగాల్ ఎన్నికల కోసమే వందేమాతరంపై చర్చిస్తున్నారని అంటున్నారు.బెంగాల్ ఎన్నికలకు చూపిస్తూ వందేమాతరాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు.కాలంతో సంబంధం లేకుండా ‘వందేమాతరం’ దేశ ప్రజల్లో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది.ఆ గేయానికి గతంలోనూ ఎంతో ఔచిత్యం ఉంది.. భవిష్యత్తులోనూ ఉంటుంది. రామ్మోహన్ నాయుడు సమాధానంపై విపక్షాల అసంతృప్తిఇండిగో విమానాల రద్దుపై లోక్‌సభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనరామ్మోహన్ నాయుడు సమాధానంపై విపక్షాల అసంతృప్తితమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో చర్చ..చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.రాజీవ్ గాంధీ హయాంలో కీలక ఎన్నికల సంస్కరణ జరిగాయి.వన్ నేషన్-వన్ ఎలక్షన్ గురించి చర్చ జరుగుతోంది. #WinterSession2025 लोकसभा में ''ELECTION REFORMS'' पर चर्चा शुरु I#LokSabha @LokSabhaSectt @loksabhaspeaker #ParliamentWinterSession2025 Watch Live : https://t.co/16ABiCqhz5 pic.twitter.com/hICFXNVRot— SansadTV (@sansad_tv) December 9, 2025 ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..ప్రజలను వేధించడానికి నిబంధనలు వాడకూడదువ్యవస్థలను మెరుగుపరిచేందుకే నిబంధనలుఇండిగో సంక్షోభంపై ప్రధాని మాట్లాడారని వెల్లడించిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజుఎన్డీయే పక్ష సమావేశ వివరాలను వెల్లడించిన కిరణ్ రిజిజునేడు లోక్‌సభలో ఎస్ఐఆర్పై చర్చవిపక్షాల తరఫున చర్చను ప్రారంభించనున్న రాహుల్ గాంధీఎస్ఐఆర్ పై చర్చ జరపాలని గత వర్షాకాల సమావేశాల నుంచి డిమాండ్ చేస్తున్న విపక్షాలుఎట్టకేలకు ఎన్నికల సంస్కరణలు అనే అంశం కింద ఎస్ఐఆర్ చర్చకు ఒప్పుకున్న ప్రభుత్వంఎస్ఐఆర్తో ఓటు చోరీ జరుగుతుందని ఆరోపిస్తున్న విపక్ష పార్టీలుఎస్ఐఆర్తో బీఎల్వోలు ఆత్మహత్య చేసుకుంటున్నారని, పని భారం పెరుగుతుందని విపక్షాల ఆరోపణలుపెద్ద ఎత్తున ఓటర్లను తొలగించేందుకే ఎస్ఐఆర్ చేపట్టారని ఆరోపణలుప్రభుత్వం తరఫున జవాబు చెప్పనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్వైఎస్సార్సీపి తరఫున చర్చలో పాల్గొననున్న ఎంపీ మిథున్ రెడ్డిరాజ్యసభలో వందేమాతరంపై చర్చనేడు రాజ్యసభలో వందేమాతరంపై చర్చవైఎస్సార్సీపీ తరఫున చర్చలో పాల్గొననున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.కొనసాగుతున్న ఎన్డీయే సమావేశం..కొనసాగుతున్న ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంసమావేశానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాగస్వామ్య పక్షాలు ఎంపీలుఎస్ఐఆర్ పై చర్చ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం#WATCH | Delhi | NDA leaders felicitate PM Narendra Modi during the NDA Parliamentary Party meeting. pic.twitter.com/di7IGDBozP— ANI (@ANI) December 9, 2025 -
నేడు ఎస్ఐఆర్పై చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే, ఎన్నికలపై సంస్కరణలపై మంగళవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు చర్చను లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. ఈ అంశంపై లోక్‌సభలో మొత్తంగా పది గంటల సమయం కేటాయించారు. కాంగ్రెస్ తరఫున కేసీ వేణుగోపాల్, మనీష్ తివారీ, వర్ష గైక్వాడ్, మొహమ్మద్ జావైద్, ఉజ్వల్ రామన్ సింగ్, ఇషా ఖాన్ చౌదరి, మల్లు రవి, ఇమ్రాన్ మసూద్‌లు మాట్లాడతారు. తర్వాత ప్రభుత్వం తరఫున కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బుధవారం చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ‘ఓట్ల చోరీ‘, ఎన్నికల కమిషన్ జవాబుదారీతనం అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశముంది. ఓటర్ల జాబితాలో గణనీయమైన వ్యత్యాసాలు, ఎన్నికల విధానాలను తారుమారు చేయడం వంటి అంశాలపై ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించడం తెల్సిందే. మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల్లో తీవ్రమైన తప్పిదాలు జరిగాయని, ఓటరు జాబితా సవరణ పేరిట పెద్ద ఎత్తున నిజమైన పౌరుల ఓట్లను తొలగించారని, నకిలీ ఓట్లను కలిపారని రాహుల్ గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఎస్ఐఆర్ కసరత్తు చాలా మంది బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ) పాలిట శాపంగా తయారైందని, అందుకే తీవ్ర ఒత్తిడితో పలువురు చనిపోయారని విపక్షాలు ఆరోపి స్తున్నాయి. ఈ అంశాన్ని విపక్ష సభ్యులు సభలో లేవనెత్తేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. -
ప్రభుత్వ విందు వివాదం: విమర్శలపై థరూర్ ఏమన్నారంటే..
పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన అధికారిక విందు కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలను ఆహ్వానించకపోవడంపై రాజకీయ దుమారం రేగింది. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ అనూహ్యంగా ఆ కార్యక్రమంలో పాల్గొనడం హాట్ టాపిక్ అయ్యింది.శశిథరూర్‌ను కేంద్రం ఆహ్వానించడం.. దానిని అంగీకరించి ఆయన హాజరు కావడం కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత కలహాలను బయటపెట్టింది. పలువురు సీనియర్లు ఆయన్ని బహిరంగంగానే తప్పుబడుతున్నారు. థరూర్ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందని పవన్ ఖేడా, జైరాం రమేష్‌లాంటి సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే.. థూరూర్ను ఆహ్వానిస్తే కాంగ్రెస్‌కు వచ్చిన సమస్య ఏంటో అర్థం కావడం లేదని బీజేపీ అంటోంది. ఈ అభ్యంతరాలు.. రాజకీయ విమర్శల దరిమిలా శశిథరూర్ ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు.తిరువనంతపురం(కేరళ) ఎంపీ శశిథరూర్.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ హోదాలోనే తాను కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చిందని అన్నారాయన. ‘‘20 ఏళ్ల క్రితం నేను జియోపాలిటికల్ అలైన్మెంట్స్ కోసం అన్వయించిన ఓ పదం.. ఇప్పుడు వాస్తవరూపం దాల్చినందుకు సంతోషం. రాష్టప్రతి భవన్లో గతంలో భిన్నమైన వైఖరి ఉండేది. కానీ, ఈసారి ఇతర గళాలను కూడా వినిపించాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. అందుకే నన్ను ఆహ్వానించి ఉంటారు. అలాగే..ఇతర దేశాలతో సంబంధాలు మా కమిటీ పరిధిలోకి వస్తాయి. అందువల్ల అక్కడ జరిగే సంభాషణలు, వాతావరణం గురించి అవగాహన కలగడం మాకూ మంచిదే అని అన్నారాయన. అంతేకాదు.. ప్రభుత్వం ఇచ్చిన ఈ విందును అద్భుతం(Excellent Dinner) అని అభివర్ణించారు.ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో రెండు రోజులు పర్యటించారు. ఆయన కోసం శుక్రవారం రాష్ట్రపతి భవన్లో శుక్రవారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయితే అధికారిక కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలకు ఆహ్వానం అందలేదు. ఈ పరిణామంపై థరూర్ స్పందిస్తూ.. ఆ విషయం తనకు తెలీదన్నారు. ఏ ప్రతిపాదికన ఆహ్వానాలు పంపారో తనకు అవగాహన లేదన్నారు. అలాగే అధికారిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారం కోరారా? అనే ప్రశ్నకు.. రాష్ట్రపతి భవన్ విందుతో దానికి సంబంధం లేదన్నారు. విందు ముందు జరిగిన సంభాషణల్లో తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను ప్రభుత్వ అధికారులతో ప్రస్తావించానని తెలిపారు. “ప్రజల కోసం, ఓటర్ల కోసం పని చేయడం నా రాజకీయ బాధ్యత” అని అన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేయడంపై స్పందిస్తూ.. కొన్ని విషయాల్లో విభేదాలు ఉంటాయి, కొన్ని విషయాల్లో ఏకీభవిస్తాం. ఏకీభవించే చోట కలిసి పనిచేయాలి అని వ్యాఖ్యానించారు. థరూర్ గతకొంతకాలంగా ప్రభుత్వంపై సానుకూల వ్యాఖ్యలు చేయడం.. ఆపరేషన్ సిందూర్ కోసం దూతలా ప్రపంచమంతా తిరగడం కాంగ్రెస్‌లో అసంతృప్తికి దారి తీసింది తెలిసిందే. ఈ తరుణంలో.. ఆయనకు పార్టీ మారతారా? అనే ప్రశ్నా తాజా ఇంటర్వ్యూలోనూ ఎదురైంది. ‘‘నేను కాంగ్రెస్ ఎంపీని. ఎన్నికల్లో గెలవడానికి చాలా కష్టపడ్డాను. వేరే నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచన అవసరం’’ అంటూ ఆచితూచి స్పందించారాయన. -
కేంద్రం ఏకపక్ష పోకడల ఫలితమిది
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ‘ఇండిగో’లో తలె త్తిన గందరగోళ పరిస్థితులపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష పోకడల వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందన్నారు. ‘ప్రతి రంగంలోనూ ఆరోగ్య కర మైన పోటీ ఉండాలే తప్ప, మ్యాచ్– ఫిక్సింగ్ ఏకపక్ష పోకడలు తగవు. విమానాల ఆలస్యం, సర్వీసుల రద్దు తదితరాలతో సామాన్య భారతీయులు ఇందుకు మూల్యం చెల్లిస్తున్నారు’అని శుక్రవారం ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.దీంతోపాటు ఆయన గతేడాది వార్తా పత్రికకు రాసిన కథనాన్ని షేర్ చేశారు. ఈస్టిండియా కంపెనీ 150 క్రితమే మూతపడినా అది మరో రూపంలో తిరిగి అవతరించిందంటూ అందులో ఆయన పేర్కొ న్నారు. కాంగ్రెస్ పవన్ ఖేరా కూడా ఇండిగో సమ స్యకు ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. ‘ఇద్ద రు వ్యక్తులు పార్టీని నడుపుతున్నారు. ఇద్దరే ప్రభు త్వాన్నీ నిర్వహిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులే వ్యాపా రాలను శాసిస్తున్నారు. ఇప్పుడు జరుగుతు న్నదంతా ఇదే’అని ఆయన ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. -
పుతిన్‌తో అధికారిక విందుకు శశిథరూర్‌కు ఆహ్వానం!
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రాష్ట్రపతి భవన్లో ఇచ్చే అధికారిక విందులో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు ఆహ్వానం అందింది. ఇరు దేశాల మధ్య రాజకీయ, దౌత్య సంబంధాలను బలపరచడానికి ఇచ్చే ఈ విందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ఆహ్వానించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రోజు(శుక్రవారం) రాత్రి పుతిన్‌తో కలిసి శశిథరూర్ విందలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జన ఖర్గేలక ఆహ్వానం అందలేదట. కేవలం కాంగ్రెస్ నుంచి శశిథరూర్‌ను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపినట్ల తెలుస్తోంది. గత కొంతకాలంగా బీజేపీతో ప్రధాని నరేంద్ర మోదీతో అత్యంత సాన్నిహిత్యంగా ఉంటున్న శశిథరూర్.. ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. పుతిన్‌తో విందుకు తనకు ఆహ్వానం అందిన విషయాన్ని సూచనప్రాయంగా ధృవీకరించారు. విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడికి ఇచ్చిన మర్యాదను తన ఆహ్వానం ప్రతిబింబిస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ (External Affairs)కి శశి థరూర్ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ బయట శశిథరూర్ మాట్లాడుతూ.. ‘ ఇదొక సాంప్రదాయం. ఇది కేవలం బీజేపీ ప్రభుత్వమే మాత్రమే ఫాలో అవుతూ వస్తుంది. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయ్ దీన్ని ప్రారంభించింది. ఏ దేశం నుంచైనా అధ్యక్షులు ఇక్కడకు(భారత్) వస్తే ప్రతిపక్షం నుంచి ఒకరు హాజర కావడం జరగుతుంది. కానీ ప్రస్తుత రోజల్లో విదేశీ నేతల్ని.. ప్రతిపక్ష నేతలు కలవ కూడదని కూడా కొన్ని ప్రభుత్వాల ఆంక్షలు విధించాయి’ అని అని స్పష్టం చేశారు. -
ఇండిగో సంక్షోభంపై రాహుల్ సంచలన ట్వీట్
ఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ సంక్షోభానికి ‘గుత్తాధిపత్య మోడల్’ ఫలితమంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. కేంద్ర ప్రభుత్వమే టార్గెట్‌గా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. విమానాల ఆలస్యం, కాన్సిలేషన్ వల్ల బాధపడేది సామాన్యులేనంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం చర్యలు కారణంగా సామాన్యులు ఇబ్బందిపడుతున్నారన్నారు. ఈ సమస్య పునరావృతం కాకుండా చూడాలి. న్యాయమైన పోటీ ఉండాలన్న రాహల్... మ్యాచ్ ఫిక్సింగ్, గుత్తాధిపత్యం ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కిందటి ఏడాది ఆయన చేసిన ఓ ట్వీట్‌ను ప్రముఖంగా ప్రస్తావించారు.IndiGo fiasco is the cost of this Govt’s monopoly model. Once again, it’s ordinary Indians who pay the price - in delays, cancellations and helplessness.India deserves fair competition in every sector, not match-fixing monopolies. https://t.co/sRoigepFgv— Rahul Gandhi (@RahulGandhi) December 5, 2025దేశవ్యాప్తంగా ఇండిగో కష్టాలు కొనసాగుతున్నాయి. ఎయిర్ లైన్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఢిల్లీలోనే 220పైగా ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ప్రధాన విమానాశ్రయాల్లో ఒకే రోజు 70కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. -
మోదీ ప్రభుత్వంలో అభద్రతాభావం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అభద్రతాభావం పెరిగిపోయిందని, అందుకే విదేశాల అధినేతలు, ప్రముఖులు మన దేశానికి వచి్చనప్పుడు ప్రతిపక్ష నాయకుడితో మాట్లాడొద్దంటూ వేడుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. విదేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో ప్రతిపక్ష నాయకుడిని కలవడం ఒక సంప్రదాయమని గుర్తుచేశారు. ప్రధాని మోదీ గానీ, విదేశాంగ శాఖ గానీ ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలో విదేశీ అతిథులు ప్రతిపక్ష నాయకుడిని కలిసి మాట్లాడే సంప్రదాయం చక్కగా కొనసాగిందని గుర్తుచేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి మారిపోయిందని ఆక్షేపించారు. -
కాళ్లలో కట్టెలు పెట్టడం.. రాజకీయాల్లో గేమ్ రూల్: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ఫుట్‌బాల్ ఆడుతుంటే కాళ్లతో తంతారు. అలా తంతారని, కాళ్లు తగులుతాయని ఫుట్‌బాల్ ఆడకుండా ఉంటామా? అలా కాలితో తన్నడమే ఫుట్‌బాల్ గేమ్ రూల్. అలాగే రాజకీయాల్లో కూడా కాళ్లలో కట్టెలు పెడుతుంటారు. అదే రాజకీయాల గేమ్‌రూల్. ఆ కట్టెలను తీసి పక్కన పెట్టి ముందుకెళుతుండాలి. నా కాళ్లలో కట్టెలు పెట్టారు. నేను బోర్లా పడిపోతాను. ఎవరో ఒకరు వచ్చి నన్ను లేపాలి అంటే కుదరదు. రాజకీయాల్లో మనమే లేవాలి.’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, రాహుల్‌గాంధీ లాంటి వారిని ఇబ్బంది పెట్టాలని జీ–23 పేరుతో లేఖలు వస్తుంటాయని చెప్పారు. అలాంటి స్వేచ్ఛ ఉంది కాబట్టే పార్టీ 140 ఏళ్ల తర్వాత కూడా బతికి ఉందని, లేదంటే జనతా పార్టీలాగానో, ఇతర ప్రాంతీయ పార్టీల తరహాలోనో కనుమరుగయ్యేదని అన్నారు. మంగళవారం గాందీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం.. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. డీసీసీ పదవికి సమయస్ఫూర్తి ముఖ్యం ‘కాంగ్రెస్ పార్టీలో సీఎం, మంత్రులు కావడం కంటే పార్టీ అధ్యక్షుడు కావడమే కష్టం. డీసీసీ అధ్యక్షుడు అంటే పార్టీ కుటుంబానికి పెద్దలా వ్యవహరించాలి. ఈ పదవికి వయసు ముఖ్యం కాదు. అందరినీ సమన్వయంతో ముందుకు నడిపించే సమయస్ఫూర్తి ముఖ్యం. కాంగ్రెస్ పార్టీలో కోటి మంది కార్యకర్తలు ఉన్నారు. ఏకాభిప్రాయం సాధ్యమయ్యే పనికాదు. డీసీసీ అధ్యక్షుల విషయంలోనూ అంతే. మన సమాజంలో దాదాపు మూడు కోట్ల మంది దేవుళ్లు ఉన్నారు. దేవుళ్లు ఎంత మంది ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల మనస్తత్వాలుంటాయి. దేవుడి మీదనే ఏకాభిప్రాయం లేదు. డీసీసీ అధ్యక్షుల విషయంలో ఎలా సాధ్యమవుతుంది? మీరు డీసీసీ అధ్యక్షులు అవడం కొందరికి ఇబ్బంది కావచ్చు. మీరే వెళ్లి వారితో మాట్లాడండి. సీనియర్ల దగ్గరికెళ్లి కలిసి పనిచేద్దామని అడగండి. పదవి రాకముందు అనేక సమస్యలుంటాయి. పదవి వచి్చన తర్వాత అవన్నీ అధిగమించుకుంటూ పోవాలి. పనిచేసే క్రమంలో వచ్చే సమస్యలను పార్టీ పెద్దలతో మాట్లాడి పరిష్కరించుకోవాలి..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.ఆరు నెలలే మీకు సమయం ‘కొత్తగా డీసీసీ అధ్యక్షులుగా నియమితులైన వారికి ఆరునెలలు మాత్రమే ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో అందరూ కష్టపడి పనిచేయాల్సిందే. ప్రతి నెలా రిపోర్టు తెప్పించుకుంటారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. వచ్చే ఎన్నికల తర్వాత రాహుల్‌గాం«దీని ప్రధానిని చేసే దిశలో ఎవరు పనిచేయకపోయినా అధ్యక్ష పదవి ఉండదు..’ అని రేవంత్ అన్నారు. అభివృద్ధిపై చర్చ పెట్టండి ‘రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడం ఎంత ముఖ్యమో, చేసింది చెప్పుకోగలగడం కూడా అంతే ముఖ్యం. అందరి కృషితో రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడింది. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం దిశలో నడిపించడమే కాకుండా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకెళుతున్నాం. సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికీ చేరవేయండి. అభివృద్ధి ప్రణాళికలను ప్రతి వేదికపై చర్చ పెట్టండి. పెళ్లి, చావు, దావత్, కల్లు కాంపౌండ్లు.. ఇలా ఎక్కడైనా నాటి, నేటి పాలన గురించి చర్చ పెట్టండి. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు సారె కింద కోటి చీరలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని ఆడబిడ్డల దగ్గరికి చేర్చడం డీసీసీ అధ్యక్షులుగా మీ టాస్క్. ఏ ఆడబిడ్డా మాకు చీర రాలేదని చెప్పొద్దు. అలా చెపితే డీసీసీ అధ్యక్షులుగా మీరు పనిచేయనట్టే..’ అని సీఎం అన్నారు.మోదీ, అమిత్‌షాకు భయపడేవారెవరూ లేరు.. ‘నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాం«దీలపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ భయపడబోదు. మోదీ, అమిత్‌షాలకు భయపడేవారు ఇక్కడెవరూ లేరు. తమ ప్రాణాలనే కాదు ఆస్తులను కూడా త్యాగం చేసింది గాంధీ కుటుంబం. అలాంటి కుటుంబాన్ని కష్టపెడితే దేశ ప్రజలను కష్టపెట్టినట్టే. ఓట్ చోరీ అంశం దృష్టి మరల్చేందుకే ఈ కేసులు పెడుతున్నారు. ఇలాంటి చర్యలను దేశం సహించదు. గాంధీ కుటుంబానికి మనం అండగా నిలబడదాం. ఎందాకైనా పోరాడదాం. రావాల్సినవి ఇవ్వకపోతే కేంద్రాన్ని నేలమట్టం చేస్తాం మోదీ గుజరాత్‌కు ప్రధానిలా కాదు..దేశానికి ప్రధానిలా వ్యవహరించాలి. బుల్లెట్ ట్రైన్ ఆయన రాష్ట్రానికి తీసుకెళ్లినట్టే మన రాష్ట్రానికి కూడా ఇవ్వాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవి ఒకటికి పదిసార్లు అడుగుతాం. ఇస్తే సరి..ఇవ్వకపోతే నేల మట్టం చేస్తాం. తెలంగాణ ప్రజల వ్యవహారం ఎలా ఉంటుందో బీజేపీ రుచి చూస్తుంది..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. కాగా సోనియా, రాహుల్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. 2029లో రాహుల్‌ను ప్రధానిని చేయాలి మీనాక్షి మాట్లాడుతూ.. గుజరాత్ డీసీసీ అధ్యక్షుల పనితీరును ప్రతి వారం సమీక్షిస్తున్నారని తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. ఇది మనకు పరీక్ష. ఈ పరీక్షలో పాస్ అయితేనే 2028లో జరిగే పరీక్షలో గెలుస్తాం. ఆ తర్వాత 2029లో జరిగే ఎన్నికల్లో రాహుల్‌ను ప్రధానిని చేసుకోగలం. అలా చేసుకోలేకపోతే మీరు నేను ఉండి ప్రయోజనం లేదు.’ అని వ్యాఖ్యానించారు. మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. పార్టీలో పనిచేసుకుంటూ వెళుతుంటే ఎవరో ఒకరు ఏదో ఒకరోజు గుర్తిస్తారని చెప్పారు. ఈ రోజు పనిచేసి రేపే ఫలితం రావాలంటే కుదరదని అన్నారు. డీసీసీ అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, మహ్మద్ అజహరుద్దీన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్, డీసీసీల కొత్త, పాత అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఎన్ఎస్యూఐ, యూత్‌కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ చైర్మన్లు పాల్గొన్నారు. కొందర్ని గదిలో వేసి కొట్టాలనిపించేది – సీఎం రేవంత్‌రెడ్డి నాకు ముఖ్యమంత్రి కాక ముందు చాలామంది మీద కోపంగా ఉండేది. కొంతమందిని గదిలో వేసి కట్టె తీసుకుని అలసి పోయేంతవరకు కొట్టాలని అనిపించేది. కానీ కొట్టే అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టా. మన శక్తినెందుకు వేస్ట్ చేసుకోవాలనుకున్నా. అందుకే ప్రజలకు సేవ చేసే పని మీద ఉన్నా. -
ఓట్ చోర్ నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్
-
మోదీ.. పాత కేసులతో వేధించే ప్రయత్నం: ఖర్గే ఆగ్రహం
ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఖర్గే పలు విమర్శలు చేశారు. ఇది బీజేపీ, మోదీ రాజకీయ ప్రతీకారం అని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం, ఈడీ కలిసి కొత్త ఆరోపణలు లేక ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని పాత కేసులను తిరిగి తెరపైకి తీసుకువస్తున్నాయని అన్నారు.నేషనల్ హెరాల్డ్ కేసు విషయమై మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘12 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా గాంధీ కుటుంబంపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎందుకంటే మోదీ ప్రభుత్వం, ఈడీ వద్ద కొత్త ఆరోపణలు లేవు. వాస్తవాలు తక్కువగా ఉన్నప్పుడు నాటకీయ అంశాలు రంగంలోకి దిగాయి. రాజకీయ ప్రతీకార చర్య, పాత ఆరోపణలు తీసుకురావడం అన్నీ ప్రత్యర్థులను వేధించే ప్రయత్నం. ఇది రాజకీయ ప్రతీకార చర్య. దీనిని న్యాయవ్యవస్థ కచ్చితంగా గుర్తిస్తుందని మేం విశ్వసిస్తున్నాం’ అని పోస్టులో పేర్కొన్నారు.కేసు వివరాలు ఇలా.. దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1938లో వార్తాపత్రిక నేషనల్ హెరాల్డ్ స్థాపించారు. ఈ పత్రికలో అవకతవకలు జరిగాయంటూ 2012లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) సంస్థలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఏజెఎల్ సంస్థకు చెందిన రూ.2000 విలువైన స్థలాలను కేవలం రూ.50 లక్షలకే దక్కించుకున్నట్లు అభిమోగాలు మోపింది. వాటిలో రాహుల్‌కు 38శాతం, సోనియాకు 38శాతం షేర్లు ఉన్నాయి. ఏజేఎల్‌కు చెందిన 99 శాతం షేర్లను యంగ్ ఇండియన్ లిమిటెడ్‌కు బదిలీ చేశారు. ఈ లావాదేవీ మనీలాండరింగ్‌లో భాగమన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ 2021 నుంచి అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది.ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును పరిగణనలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్(AJL)కు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడాలతోపాటు యంగ్ ఇండియన్ అనే ఒక ప్రైవేటు కంపెనీ కుట్రకు, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది. -
డీకే విందులో సిద్దరామయ్యకు ఇష్టమైన నాన్ వెజ్ వంటకాలు
ముఖ్యమంత్రి పదవి మార్పిడి రగడను అల్పాహార విందుల ద్వారా పరిష్కరించుకునేలా కాంగ్రెస్ నాయకత్వం.. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను ఆదేశించింది. ఫలితమే వరుసగా జరుగుతున్న బ్రేక్‌ఫాస్ట్ భేటీలు. అందరికీ నోరూరేలా పలు రకాల వంటకాలతో వారి సమావేశాలు జరుగుతూ రచ్చను చల్లార్చే ప్రక్రియలుగా రూపాంతరం చెందాయి.బెంగుళూరు: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మూడురోజుల కిందట అల్పాహార విందును ఆతిథ్యమిచ్చిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. ఇప్పుడు తానే అతిథిగా మారారు. ఈదఫా డీకే విందు ఇవ్వబోతున్నారు. ఇందులో సిద్దుకు ఇష్టమైన నాన్ వెజ్ ఉండే వీలుంది. మంగళవారం ఉదయం సదాశివనగరలోని డీసీఎం నివాసంలో జరగబోయే ఈ విందు సమావేశం ఉత్కంఠ పుట్టిస్తోంది. సిద్దరామయ్య ఇంట విందులో ఇద్దరూ ఐక్యతను ప్రదర్శించి, కుర్చీ రగడకు విరామం ఇచ్చినట్లు చాటుకున్నారు. ఇది ఫలించినట్లుగా ఉందనుకున్న హైకమాండ్ తిరుగు విందు ఇవ్వాలని డీకేశిని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నెల 8 నుంచి బెళగావిలోని సువర్ణసౌధ భవనంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభం కాబోతున్నాయి. ప్రతిపక్షాలకు కుర్చీ మారి్పడి గందరగోళం ఆయుధం కాకూడదని సీఎం, డీసీఎం తీర్మానించారు. హైకమాండ్ ఆవరణలో బంతి.. గత 15 రోజుల నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌లో సీఎం సీటు తగాదా తారాస్థాయికి చేరింది. హైకమాండ్ మనసులో ఏముందో బయట పెట్టకుండా సామరస్య పరిష్కారానికి సూచనలు చేస్తోంది. మీరిద్దరే కూర్చొని చర్చించుకొని ఓ తీర్మానానికి వచ్చి ఆ తరువాత ఢిల్లీకి రండని సూచించినట్లు తెలుస్తోంది. బెంగళూరులో సీఎం, డిప్యూటీ సీఎం విందు భేటీల ద్వారా తమ టాసు్కలను పూర్తి చేస్తుండగా, ఢిల్లీలో హైకమాండ్ తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. సోనియాగాం«దీ, రాహుల్‌గాందీకి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇక్కడి పరిణామాలను వివరించి, త్వరగా పరిష్కారం కనుగొనాలని కోరారు. సోనియా, రాహుల్ త్వరలోనే ఇద్దరినీ పిలిపించుకొని కార్యాచరణను తెలియజేస్తారని కాంగ్రెస్ ఉన్నత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు వారంలో మొదలవుతాయి, ఆ తరువాత హైకమాండ్ నిర్ణయం వెలువరిస్తుందని సమాచారం. -
నేడు ఢిల్లీకి సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నా రు. ఉదయం గాందీభవన్‌లో జరిగే టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న తర్వాత.. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు తి రిగి వస్తారు.రాత్రికి ఢిల్లీ బయలుదేరి వెళ్తా రని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి బుధవారం ఉదయం పార్లమెంటులో ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాందీలను కలుస్తారు. ఈ నెల 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025కు హాజరు కావాల్సిందిగా ఆహా్వనిస్తారు. పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఆహ్వానం పలుకుతారు. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి హుస్నాబాద్‌లో జరిగే ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తారని సీఎంవో వర్గాలు తెలిపాయి. -
ప్రజల ఆస్తి కాంగ్రెస్‌కు ఏటీఎం.. రాహుల్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: రూ.5 లక్షల కోట్ల విలువైన తెలంగాణ ప్రజల ఆస్తిని కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారుస్తామంటే ఒప్పుకునేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సొంతానికి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడతామంటే ఒప్పుకునేది లేదని, ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీకి కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండ్రస్టియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్‌పి)ని భారత్‌లోని అతిపెద్ద భూ కుంభకోణాల్లో ఒకటిగా కేటీఆర్ అభివర్ణించారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసా, లేకుంటే తెలిసీ మౌనంగా ఉందా?’అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలు నామమాత్రపు ధరకే పూర్తిగా సొంతం చేసుకోవడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఫలితంగా తెలంగాణ ప్రజలకు రూ. 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని చెప్పారు. హైదరాబాద్‌లోని కీలక క్లస్టర్లలో మునుపటి ప్రభుత్వాలు 9,300 ఎకరాల పారిశ్రామిక భూమిని పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పనకు కేటాయించాయని వివరించారు. అయితే, ప్రజలకు దక్కాల్సిన ఆస్తులను హిల్ట్‌పి కింద తక్కువ ఖర్చుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, లక్షల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం నామమాత్రపు ధరకు క్రమబద్ధీస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటుతనం ఈ పాలసీలో దాగున్న రాజకీయ అవినీతిపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందన్నారు. రేవంత్ కుటుంబ సభ్యుల కోసమే... ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వెలుపలికి కాలుష్య పరిశ్రమలను తరలించాలని పైకి చెబుతున్నా.. లక్షల కోట్ల తెలంగాణ సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్లాన్ వేసిందని కేటీఆర్ ఆరోపించారు. అయితే, తరలించాలనుకునే పరిశ్రమలకు ప్రత్యామ్నాయ స్థలాలను ఈ విధానం గుర్తించలేదని చెప్పారు. ఈ భూముల బదిలీ వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం వంటి లోపాలు పాలసీలో ఉన్నాయని వివరించారు. దీనివల్ల నగరంలో కొత్త పారిశ్రామికాభివృద్ధికి బదులుగా, పాత పారిశ్రామిక యూనిట్ల స్థానంలో ఆకాశహర్మ్యాలు, వాణిజ్య సముదాయాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ‘ఈ విధానాన్ని కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు, పలుకుబడి ఉన్న రియల్ ఎస్టేట్ గ్రూపులు, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలకు, కుటుంబంలోని వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడానికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు తమ కోసం ఈ పాలసీని తెచ్చారు’అని కేటీఆర్ ఆరోపించారు. స్పందించకుంటే మీకూ భాగస్వామ్యం ఉన్నట్లే..: ‘పెద్దఎత్తున జరుగుతున్న అక్రమాల గురించి ఇప్పటివరకు తెలియకుంటే కనీసం ఇప్పుడైనా తెలంగాణలో జరుగుతున్న రూ.5 లక్షల కోట్ల కుంభకోణాన్ని అడ్డుకోండి. మౌనంగా ఉంటే మీకు (రాహుల్ గాం«దీని ఉద్దేశించి), కాంగ్రెస్ పారీ్టకి భాగస్వామ్యం ఉందని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతితోనే ఈ భూ కుంభకోణం జరుగుతున్నదని భావించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ అవినీతికి అడ్డుకట్ట వేయాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
National Herald Case: ‘గాంధీ’లకు బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) నేరపూరిత కుట్ర అభియోగాలు మోపింది. గాంధీలతో పాటు సామ్ పిట్రోడా, మరో ముగ్గురు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్), యంగ్ ఇండియన్ (వైఐ), డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల పేర్లను కూడా ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)లో చేర్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుండి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ అక్టోబర్ 3న రూపొందించారు. ఇందులో గాంధీలు దాదాపు రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఏజేఎల్‌ను మోసపూరితంగా స్వాధీనం చేసుకోవడానికి కుట్ర పన్నారని ఆరోపించారు.ఈ కేసు 2012 నాటిది. నాడు బీజేపీ నేత సుబ్రమణ్యన్ స్వామి స్థానిక కోర్టులో ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో కాంగ్రెస్ నేతలు మోసం, నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని స్వామి ఆరోపించారు. జవహర్లాల్ నెహ్రూ, ఇతర స్వాతంత్ర్య సమరయోధులు 1938లో స్థాపించిన నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ఏజేఎల్ ప్రచురించేది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2008లో ముద్రణను నిలిపివేసింది. ఆ సమయంలో, మాతృ సంస్థకు కాంగ్రెస్ పార్టీ రూ. 90 కోట్ల మేరకు బకాయి ఉంది.కాంగ్రెస్ పార్టీ తెలిపిన వివరాల ప్రకారం ఏజేఎల్ ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో, ఆ అప్పును ఈక్విటీ షేర్లుగా మార్చారు. పార్టీ ఈక్విటీ షేర్లను నిర్వహించలేని కారణంగా, వాటిని 2010లోయంగ్ ఇండియన్ (వైఐ)కి కేటాయించారు. ఈ యంగ్ ఇండియన్‌లో గాంధీ కుటుంబం 76 శాతం వాటాను కలిగి ఉంది. మిగిలిన వాటాలను మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సామ్ పిట్రోడా, సుమన్ దూబే కలిగి ఉన్నారు. ఈ విధంగా యంగ్ ఇండియన్ ఏజెఎల్‌లో మెజారిటీ వాటాదారుగా మారింది.ఈ లావాదేవీలో కోల్‌కతాకు చెందిన షెల్ కంపెనీ అయిన డోటెక్స్ మర్చండైజ్, యంగ్ ఇండియన్‌కు రూ. కోటి అందించింది. ఈ డబ్బులో యంగ్ ఇండియన్.. కాంగ్రెస్‌కు రూ. 50 లక్షలు మాత్రమే చెల్లించి, రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఏజేఎల్ నియంత్రణను పొందిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఢిల్లీ కోర్టు ఈ కేసులో నిర్ణయం ప్రకటించడానికి డిసెంబర్ 16కి వాయిదా వేసింది. ఈ నేపధ్యంలోనే ఈ నేరపూరిత కుట్ర అభియోగాలతో కూడిన తాజా ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. ఇది కూడా చదవండి: చాట్ జీపీటీకి మూడేళ్లు.. ఏం సాధించిందంటే.. -
ఢిల్లీ కాలుష్యంపై పార్లమెంట్లో చర్చించాలి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రరూపం దాల్చిన వాయు కాలుష్యంపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చకు పెట్టాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించకుండా ప్రధాని మోదీ మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందన్నారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు వెంటనే కఠినమైన, ఆచరణ సాధ్యమైన ప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు. ఇంత తీవ్రమైన సమస్యపై మోదీ ప్రభుత్వం స్పందించకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం తన నివాసంలో తనను కలిసేందుకు వచి్చన మహిళలతో మాట్లాడారు. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ విడుదల చేశారు. ‘కాలుష్యం ప్రభావం చిన్నారుల ఆరోగ్యంపై తీవ్రంగా పడుతోంది. నా వద్దకు వచి్చన ప్రతి మహిళా కాలుష్యం గురించే ఆందోళన వ్యక్తం చేశారు. ఎదిగే చిన్నారులు విష వాయువులను పీల్చుతున్నారంటూ వారు ఆగ్రహం, ఆందోళన చెందుతున్నారు. మీరెందుకు ఇది అత్యవసర సమస్య అని భావించడం లేదు? బాధ్యతగా ఎందుకు తీసుకోవడం లేదు?’అంటూ ఆయన ప్రధాని మోదీని ప్రశ్నించారు. ‘మన చిన్నారులకు కావాల్సింది స్వచ్ఛమైన గాలి.. సాకులు గానీ, పక్కదారి పట్టించే చర్యలు గానీ కాదు’అని రాహుల్ పేర్కొన్నారు. ఢిల్లీలో జీవించే అత్యంత నిరుపేదల నుంచి అత్యంత ధనికుల వరకు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. కాలుష్యంతో లాభాలను ఆర్జిస్తున్న వారు బాధితుల కంటే శక్తివంతైన వారు కావడం వల్లే ఈ సమస్య తీవ్ర రూపం దాలుస్తోందంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. కలుషిత గాలిని పీల్చుతూ దేశంలో రోజుకు 500 మంది వరకు చిన్నారులు చనిపోతున్నారని రాహుల్ చెప్పారు. అయినప్పటికీ దీనినో అత్యవసర అంశంగా ప్రభుత్వం భావించడం లేదని నిప్పులు చెరిగారు. బాధితులుగా ఉన్న సామాన్యులకు సంఘటితమైన రాజకీయ శక్తి లేకపోవడం వల్లే సమస్య తీవ్ర రూపం దాలుస్తోందని ఆయన తెలిపారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చ జరపాల్సిందేనన్నారు. ‘గడిచిన 15 ఏళ్లుగా ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత తీవ్ర స్థాయికి పడిపోయింది. వచ్చే పదేళ్లలో మరింత అధ్వానంగా మారనుంది. ఇప్పటికీ స్పందించకుంటే ఇదో విస్ఫోటంలా మారుతుంది’అని ఈ సందర్భంగా ఓ మహిళ రాహుల్‌తో అన్నారు. -
కర్ణాటకం.. ఓవర్ టు ఢిల్లీ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పారీ్టలో నెలకొన్న అధికార పంచాయితీ ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న రగడకు తెరదించేందుకు అధిష్ఠానం సిద్ధమైంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో శనివారం సాయంత్రం 5 గంటలకు అగ్ర నేత సోనియాగాంధీ నేతృత్వంలో హైక మాండ్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోకసభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాం«దీ, పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక వ్యవహారాల ఇంచార్జి రణదీప్‌సింగ్ సుర్జేవాలా పాల్గొననున్నారు. సీఎం పదవి నుంచి సిద్ధరామయ్యను తప్పించడం వల్ల జరిగే పరిణామాలు, తలెత్తే ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఆయ నను కొనసాగిస్తే గనుక ఎదురయ్యే సమస్యలు ఏమిటనేది హైకమాండ్ చర్చించనుంది. ఈ నేపథ్యంలోనే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను ఆదివారం ఢిల్లీ రావాలని అధిష్ఠానం కోరింది. దీంతో కర్ణాటకలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడే సూచనలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయం మేరకు, సిద్ధరామయ్య, శివకుమార్‌లతో మాట్లాడి, ఇద్దరినీ ఒప్పించే ప్రయత్నం చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. విదేశాల నుంచి సోనియా రాకతో... కర్ణాకటలో ఓవైపు సిద్ధు, డీకే వర్గాలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తుండగా... కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ఓసారి (గురువారం) సమావేశమై రాష్ట్ర నాయకత్వ మార్పుపై సుదీర్ఘంగా చర్చించింది. అయితే, విదేశాల్లో ఉన్న సోనియా అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించింది. కేవలం నాయకుల సలహాలు తీసుకుని భేటీని ముగించారు. ఇక విదేశాల నుంచి తిరిగి వచి్చన సోనియా శనివారం అందుబాటులో ఉండనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ సమావేశం కూడా జరగనుంది. ఇందులో సోనియాతో పాటు అధిష్ఠానం పెద్దలు కర్ణాటకపై చర్చించి తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. అందుకే సిద్ధు, డీకేలను ఢిల్లీ రమ్మని కోరినట్లు సమాచారం. వారితో సమాలోచనలు చేసి ఆదివారం సాయంత్రంలోగా సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. తమ నిర్ణయాన్ని వెల్లడించి... ఇద్దరినీ సముదాయించి పారీ్టకి నష్టం కలగకుండా చూసే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. నేడు డీకే–సిద్ధు బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ హైకమాండ్ పిలిస్తే తప్పకుండా ఢిల్లీకి వెళతానని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. వారు ఏమి తీర్మానిస్తే దాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తానన్నారు. అధిష్ఠానం సూచనలతో డీకేను శనివారం తన నివాసం కావేరికి బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహా్వనించానన్నారు. ఇద్దరం మాట్లాడుకుని ఢిల్లీకి వెళతామని తెలిపారు. కాగా, నాయకత్వ మార్పుపై సిద్ధు, డీకే కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ధారణకు వచ్చాకనే ఢిల్లీకి రావాలని అధిష్ఠానం పెద్దలు సూచించినట్లు సమాచారం. ఈ మేరకే సిద్ధు బ్రేక్‌ఫాస్ట్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. జోరందుకున్న విందు రాజకీయాలు అధికార మారి్పడిపై సీఎం, డిప్యూటీ సీఎం వర్గాలు ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఎప్పటికప్పుడు నేతలతో రహస్య చర్చలు, సమావేశాలు నిర్వహిస్తూ తమ వర్గాన్ని బలపరుచుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. దీంతో బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. శుక్రవారం మంత్రి కేహెచ్ మునియప్ప నివాసంలో అహింద నాయకుల సమావేశం జరిగింది. ఇందులో ఏఐసీసీ కార్యదర్శి మోహన్ కూడా పాల్గొన్నారు. ఈ అల్పాహార విందులో హైకమాండ్ వద్ద పరపతి ఉన్న ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ కూడా పాల్గొనడం విశేషం. వీరితోపాటు మాజీ మంత్రి ఆంజనేయ, మాజీ ఎంపీ చంద్రప్ప, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణయ్య తదితరులు గంటకుపైగా సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు. ఏ ఒక్కరి వల్లనో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని, అనేక సామాజికవర్గాలు, సంఘాలు, కాంగ్రేసేతర సంస్థలు శ్రమించాయని బీకే హరిప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలను అధిష్ఠానం చాలా సీరియస్‌గా తీసుకుందని, ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఒక మంచి నిర్ణయాన్ని వెల్లడిస్తుందన్నారు. మునియప్ప మాట్లాడుతూ అధికార మార్పిడి వివాదాన్ని హైకమాండ్ వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. అవసరమైతే తాను కూడా వెళ్లి హైకమాండ్‌తో మాట్లాడుతానని వెల్లడించారు. డీకేకు మద్దతుగా ఒక్కలిగలు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను పట్టనాయకనహళ్లికి చెందిన నంజావధూత స్వామిజీ సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార మారి్పడిపై మాట తప్పితే పరమాత్మ అభినందించడని నంజావధూత పదేపదే మాట్లాడుతూ డీకేకు మద్దతుగా నిలుస్తుండడం గమనార్హం. కాగా, డీకే శివకుమార్ సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేశ్ ఢిల్లీ చేరుకుని అధిష్ఠానం పెద్దలతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి డీకేను సీఎం చేయాలనే తమ డిమాండ్ వినిపించారు. సీఎంకు మద్దతుగా కురబలు డీకే వర్గం ప్రయత్నాలకు ప్రతిగా సిద్ధు వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలు గళం వినిపిస్తున్నారు. ఐదేళ్లు సిద్ధునే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు సంతోష్ లాడ్, జమీర్ అహ్మద్‌ఖాన్, హెచ్‌సీ మహదేవప్ప, రామలింగారెడ్డి తదితరులు, పలువురు ఎమ్మెల్యేలు వీరిలో ఉన్నారు. సిద్ధు సొంత సామాజిక వర్గం కురుబ వర్గానికి చెందిన స్వామిజీలు, నేతలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. బలప్రదర్శనకు కూడా కురుబలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకే వేదికపై సీఎం, డిప్యూటీ సీఎం.. కానీ, మాటల్లేవ్ ఓవైపు కుర్చీలాట కొనసాగుతున్నా.. సిద్ధు, డీకే శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకున్నారు. పక్కపక్కనే కూర్చొన్నప్పటికీ ఎవరికి వారు యమునా తీరు చందంగా మాట్లాడుకోలేదు. ఇద్దరు నేతలు చూసీ చూడనట్లుగా ప్రవర్తించడం గమనార్హం. డీకే కుర్చీలో కూర్చొనే సమయంలో సిద్ధు వైపు చూసేందుకు ప్రయత్నించలేదు. ఇదంతా గమనించిన సిద్ధు ఆహ్వాన పత్రం చదువుకుంటూ ఉండిపోయారు. నమ్మకాన్ని మించిన గుణం లేదు అన్ని వర్గాలు నాకు మద్దతు ఇస్తున్నాయి నా కులం కాంగ్రెస్ పార్టీ..: డీకే ‘ఇచ్చిన మాట’విషయమై గురువారం సిద్ధు, డీకే మధ్య ట్వీట్ల వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక శుక్రవారం ఓ బహిరంగ సమావేశంలో డీకే చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయంగా మారాయి. ‘‘నిమ్మ కంటే పులుపైన వస్తువు ఇంకోటి లేదు. శంభు అంటే పరమేశ్వరుడు. ఆయన కంటే దేవుడు లేడు. నమ్మకం కంటే ఇంకో గుణం లేదు’’అంటూ సర్వజ్ఞ వచనాలను ఉటంకిస్తూ హైకమాండ్‌పై తన నమ్మకాన్ని, విశ్వాసం గురించి పరోక్షంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘‘ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నాకు దేవాలయం. ఢిల్లీలో మాకు ఎన్నో ముఖ్యమైన పనులుంటాయి. అందుకే అక్కడికి వెళ్తుంటాం. నాకు ఎలాంటి సామాజికవర్గాల వ్యాఖ్యానాలు, మద్దతు అవసరం లేదు. నా కులం కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాలు నాకు మద్దతుగా ఉన్నాయి. ఏ ఒక్క వర్గానికో నేను పరిమితం కాదు’’అని పేర్కొన్నారు. 28బీఎన్‌జీ70: బెంగళూరు ప్యాలెస్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ -
ఇంత జరుగుతున్నా ప్రధాని మౌనంగా ఉన్నారేం?: రాహుల్ గాంధీ
సాక్షి, ఢిల్లీ: దేశరాజధాని వాయు కాలుష్యంపై కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ఊపిరి తీసుకోలేని పరస్థితుల్లో అవస్థతలు పడుతున్నారని.. ఇంత జరుగుతున్న ప్రధాని మోదీ ఏం పట్టనట్లు వ్యవహరించడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం వాయు కాలుష్యంపై కొందరు పర్యావరణవేత్తలతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభం తీవ్రతరమవుతోంది. పేద, ధనిక అన్నివర్గాల వాళ్లు కాలుష్యం బారిన పడుతున్నారు. నేనూ ఢిల్లీ వాయి కాలుష్యం బాధితుడినే. విషపూరిత వాయువులతో పిల్లలు ఊపిరి ఆడక అవస్థలు పడుతున్నారు అని అన్నారాయన. ‘‘మోదీగారూ.. భారతదేశపు పిల్లలు మన కళ్ల ముందే ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. ఇంత జరుగుతున్నా మీరు ఎలా మౌనంగా ఉండగలరు? ఈ అంశంపై అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం మీ ప్రభుత్వానికి లేదా? ఒక ప్రణాళిక లేదు, బాధ్యతంటూ లేదా?’’ అంటూ ప్రధానిని ఉద్దేశించి ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన. ఇప్పటికైనా ప్రభుత్వాలు కలుగజేసుకోవాలి. కాలుష్యాన్ని కారకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఢిల్లీ వాయు కాలుష్య సమస్యపై పార్లమెంటులో చర్చ జరగాలి అని డిమాండ్ చేశారాయన. ఈ సందర్భంగా కొందరు చిన్నారుల తల్లులు ఆందోళన వ్యక్తం చేసిన వీడియోలను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.మరోవైపు.. వాయు కాలుష్యం సోర్స్ నుంచే అరికట్టాలన్న పర్యావరణవేత్తలు.. చిన్నారులు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. గత రెండు వారాలుగా ఢిల్లీ వాయు నాణ్యత దారుణంగా క్షీణిస్తూ వస్తోంది. ఈ పరిణామాలపై దేశసర్వోన్నత న్యాయస్థానం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో పిల్లలను పరిస్థితులు చక్కబడేదాకా స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది కూడా. -
క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటకం!
సాక్షి, బెంగళూరు/శివాజీనగర: కర్ణాటక రాజకీయం క్లైమాక్స్‌కు చేరింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ అనుకూల వర్గాల వరుస భేటీలు, రహస్య మంతనాలు, మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల నేపథ్యంలో అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. రాహుల్ గాంధీ జోక్యంతో కర్ణాటక రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిరుగుబాటు ధోరణిపై రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.ఆయా అంశాలు ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగడానికి సంబంధించి సిద్ధరామయ్యకు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వెరసి ఈ పరిణామాలు ముఖ్యమంత్రి రేసులో డీకే శివకుమార్‌కు అనుకూలంగా మారుతున్నట్లు కూడా పరిశీలకులు భావిస్తున్నారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం సిద్ధరామయ్యపై రాహుల్ అసహనానికి కారణాలను విశ్లేషిస్తే... అధిష్టానం ఎవరనే చర్చకు తావిచ్చిన సీఎం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై మీ సమస్యలు, విజ్ఞప్తులు ఏమైనా ఉంటే ఆయనకు తెలియజేయాలని సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ గడచిన వారాంతంలో సూచించారు. అయితే ఖర్గేను సిద్ధరామయ్య కలుసుకున్నప్పటికీ.. తాను రాహుల్‌తో మాత్రమే చర్చిస్తానని, నేరుగా అధిష్టానంతో తేల్చుకుంటానని చెప్పినట్లు సమాచారం. బహుషా ఈ కారణంతోనే మీడియాతో ఖర్గే మాట్లాడుతూ అధికార మారి్పడి విషయం పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని వ్యాఖ్యలు చేసి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడే ‘పార్టీ హైకమాండ్’ ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరనే ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. ఖర్గే ఈ ‘అసహాయ వ్యాఖ్యలు’ చర్చనీయాంశమయ్యాయి. దీనంతటికీ సిద్ధరామయ్య తిరుగుబాటు ధోరణే కారణమని రాహుల్ భావిస్తున్నారు. ఇక ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య జోక్యం చేసుకుంటున్నట్లు నివేదికల అందడం రాహుల్ అసహనానికి మరొక కారణం. దేవరాజు అరస్ రికార్డును అధిగమించిన తర్వాత రాజీనామా? మరోవైపు ముఖ్యమంత్రి స్థానం వదులుకునేందుకు సిద్ధరామయ్య కూడా మానసికంగా సిద్ధంగా ఉన్నారని ఆయన వర్గానికి చెందిన కొందరు మంత్రులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఒత్తిడి ఎక్కువయితే ఫిబ్రవరి, మార్చి మొదటి వారంలో వచ్చే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి తప్పుకునే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన దేవరాజు అరస్ రికార్డును సిద్ధరామయ్య డిసెంబర్లో అధిగమిస్తారు. దీంతో అప్పటివరకు ముఖ్యమంత్రిగా పని చేసి అనంతరం తన పదవికి రాజీనామా చేసే అవకాశం కూడా ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హైకమాండ్ అంటే అదొక బృందం: ఖర్గే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు మరో ముగ్గురు నలుగురు కీలక నాయకులను ఢిల్లీకి పిలిపించుకుని చర్చించి అన్నింటికి పరిష్కారం చూపుతామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం బెంగళూరులో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంటే ఒకే ఒక్కరు కాదని, అదొక బృందమని, పార్టీ పెద్దలంతా కలసికట్టుగా కూర్చొని మాట్లాడుకుని రాష్ట్ర సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తామన్నారు. సోనియాగాంధీ శుక్రవారం విదేశాల నుంచి వచ్చాక ఈ సమస్య పరిష్కారం ఒక కొలిక్కి వచ్చే వీలుంది.సీఎం, డిప్యూటీ సీఎం ‘ట్వీట్ల’ యుద్ధం!కర్ణాటక పరిణామాలు తాజాగా ‘ట్వీట్ల’ రాజకీయానికి దారితీశాయి. డిప్యూటీ సీఎం చేసినట్లు చెబుతున్న ఒక ట్వీట్‌కు కౌంటర్‌గా అన్నట్లు సీఎం మరో ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ప్రపంచంలో పెద్ద శక్తి’ (వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్) అని డీకే శివకుమార్ ‘ట్వీట్’ చేశారు. రెండున్నరేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాటను డీకే ‘ఈ ట్వీట్ ద్వారా’ గుర్తు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఆ ట్వీట్ తాను చేయలేదని, అదొక నకిలీ పోస్టు అని డీకే శివకుమార్ కొట్టిపారేశారు. కాగా ‘ప్రజల కోసం మంచి ప్రపంచం నిరి్మంచలేనప్పుడు ఆ మాటకు శక్తి లేనట్లే’ అని అర్థం వచ్చేలా సీఎం ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పు ఐదేళ్ల పరిపూర్ణ బాధ్యత అని పేర్కొంటూ ప్రభుత్వ చేపట్టిన పలు పథకాలను వివరించారు. కర్ణాటక అనేది ఒక నినాదం కాదని, అది మాకు ఒక ప్రపంచమని ట్వీట్ చేశారు. -
సిద్ధూ, డీకేలతో మాట్లాడతాం: ఖర్గే
సాక్షి బెంగళూరు: కర్ణాటక సీఎం వివాదంపై ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించింది. త్వరలోనే ఈ ప్రతిష్ఠంభనకు ముగింపు పలకబోతున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. త్వరలోనే పార్టీ అగ్రనేతలతో కలిసి సమావేశం నిర్వహిస్తామని ఆ మీటింగ్‌లో ఈ వివాదానికి ముగింపు పలుకుతామని ఖర్గే పేర్కొన్నారు.కర్ణాటకలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి పదవి కాపాడడం కోసం సిద్దరామయ్య, ఎలాగైనా సీఎం పదవి చేపట్టాలని డీకే శివకూమార్ ఇద్దరు నేతలు భీష్మించుకు కూర్చొన్నారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ ఇటీవల వ్యాఖ్యానించడంతో కేంద్రం ఆయనను సీఎం చేస్తానని హామి ఇచ్చిందని దానికోసమే అలా మాట్లాడారని అంతా అనుకున్నారు. ఈ వరుస ఘటనలతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అయితే తాజాగా ఆ రాష్ట్ర వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఆయన మాట్లాడుతూ "త్వరలోనే కర్ణాటకలో జరుగుతున్న వివాదానికి ముగింపు పలుకుతాం. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇతర నాయకులతో కలిసి సమావేశం నిర్వహిస్తాం. ఆ మీటింగ్ కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీ.కే శివకుమార్‌ను కూడా పిలిచి వారితో చర్చిస్తాం" అని ఖర్గే తెలిపారు.ఇటీవల ఒక కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ మాటకున్న శక్తి ప్రపంచంలోనే అత్యంత గొప్పదని, వాగ్దానం నిలబెట్టుకోవడం అనేది అతిపెద్ద చర్య అని అన్నారు. దీంతో సీఎం పదవినుద్దేశించే తాను మాట్లాడారని చర్చ జరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ‘అంతిమంగా నిర్ణయం తీసుకునేది హైకమాండ్ఈ గందరగోళానికి పూర్తి ముగింపు పలకడానికి, హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి అని అన్నారుపవర్ షేరింగ్ ఏంటంటే..2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్ చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండనున్నట్లు అధిష్ఠానం నిర్ణయించిందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 తారీఖుతో రెండున్నరేళ్ల కాలం ముగిసింది. దీంతో సీఎం మార్పు వ్యవహారం మళ్లీ తెరమీదకొచ్చింది. -
DK.. నేను ఫోన్ చేస్తా.. రాహుల్ మెసేజ్
-
కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం.. రంగంలోకి రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై గత ఐదురోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. డీకే శివకుమార్ పట్టువీడకపోవడంతో వ్యవహారం మరింత జఠిలంగా మారుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభంపై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నిన్నంతా కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక రాజకీయంపైనే వరుస భేటీలు నిర్వహించిందని జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. అందునా.. కర్ణాటకకు చెందిన పలువురు మంత్రులు, సీనియర్ నేతలతో రాహుల్ స్వయంగా చర్చలు జరిపినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆయన నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడింది అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.మరోవైపు ఢిల్లీకి చేరుకున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. కర్ణాటక కాంగ్రెస్‌లోని ఇరు వర్గాల వాదనలను, క్షేత్రస్థాయిలో పరిస్థితులను రాహుల్‌కు వివరించారు. దీంతో.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ను ఢిల్లీకి పిలిచే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఈ పంచాయితీకి తెర పడే అవకాశం కనిపిస్తోంది. -
సీఎం సీటు నుంచి దిగేందుకు సిద్ధం?!
నాయకత్వ మార్పుపై ఊహాగానాలు నడుస్తున్న వేళ.. కర్ణాటక రాజకీయంలో బడా ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం మార్పు ఉండొచ్చనే సంకేతాలను బలపరిచేలా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానంటూ ఇంతకాలం పదేపదే చెబుతూ వచ్చిన ఆయన.. ఇవాళ సరికొత్తగా మాట్లాడడం కన్నడనాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయిస్తే.. ఐదేళ్లు సీఎంగా కొనసాగుతాను. ఒకవేళ సీఎంను మార్చి తీరాలని అధిష్టానం భావిస్తే అందుకు కట్టుబడి ఉంటాను. నేను మాత్రమే కాదు.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా దీనిని అంగీకరించాల్సి ఉంటుంది’’ అని అన్నారాయన. నవంబర్ 20వ తేదీన నుంచి కర్ణాటక రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. పవర్ షేరింగ్ ఫార్ములా ద్వారా సీఎం రేసులో ఉన్న సిద్దూ, డీకేశిలను చల్లార్చిందనే ప్రచారం ఒకటి ఉంది. రెండున్నరేళ్లు పూర్తి కావడంతో డీకే మద్దతుదారులు ఆయనకు సీఎంపగ్గాలు అప్పగించాలని గళం వినిపిస్తుండగా.. అనుభవాన్ని,సామాజిక వర్గాల సమీకరణలను పరిగణనలోకి తీసుకుని కొనసాగించాలంటూ సిద్ధరామయ్య మద్దతుదారులు ఢిల్లీ పెద్దల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో.. డీకే శివకుమార్‌కు శిబిర ఎమ్మెల్యేల సంఖ్య పరిమితంగా ఉండడంతో ఈ మార్పునకు అధిష్టానం సుముఖంగా లేదని నిన్నటిదాకా ప్రచారం వినిపించింది. అయితే.. అనూహ్యంగా ఆయనకు మద్దతుదారుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. వాళ్లంతా మరోసారి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్‌ను కలవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో.. ఇటు సిద్ధరామయ్య కూడా సీఎం సీటు నుంచి దిగేందుకు సిద్ధమంటూ తాజాగా ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతా వాళ్ల చేతుల్లోనే..కర్ణాటకలో కేబినెట్ పునర్వవ్యస్థీకరణ(పీసీసీ చీఫ్ మార్పు సహా) చేపట్టాలని సిద్ధరామయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే సీఎం సీటు పంచాయితీ తేల్చిన తర్వాతే ఆ పని చేయాలంటూ డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో.. ‘‘నాలుగైదు నెలల కిందటే హైకమాండ్ నుంచి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు తనకు గ్రీన్‌సిగ్నల్ లభించిందని.. అయితే రెండున్నరేళ్ల పాలన పూర్తి అయ్యేదాకా ఆగాలని భావించానని’’ సిద్ధరామయ్య ఇవాళ మీడియాకు తెలిపారు. అయితే.. పవర్ షేరింగ్ ఫార్ములా(రెండున్నరేళ్ల తర్వాత సీఎం సీటు వదులకునేందుకు సిద్ధపడ్డారా?) అనేది ఒకటి ఉందా?.. అందుకు మీరు అంగీకరించారా? అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు.. అంతా హైకమాండ్ చేతుల్లోనే ఉంటుంది అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారాయన. ఆయన వస్తేనే..కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను డీకే శివకుమార్‌తో రీప్లేస్ చేయాలంటూ కొంత కాలంగా నడుస్తున్న రాజకీయాలతో ఢిల్లీ వేడెక్కుతోంది. ఇప్పటికే డీకే శివకుమార్ వర్గీయులు హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపారు. మరోవైపు.. శనివారం సిద్ధూ వర్గం ఎడతెరిపి లేకుండా బెంగళూరు పర్యటనకు వచ్చిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంతనాలు జరిపింది. అయితే.. అంతిమ నిర్ణయం అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉందంటూ ఖర్గే వాళ్లతో తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న ఖర్గే ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి రానున్నారు. ఆయన వచ్చాకే కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం ఓ కొలిక్కి రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎస్ఐఆర్ ఉద్దేశపూర్వక కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ‘ఎస్ఐఆర్)ను ఉద్దేశ పూర్వక కుట్రగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని బలిచేస్తు న్నారని మండిపడ్డారు. బీఎల్వోల మరణాలపై ఆదివారం ఎక్స్‌లో వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఎస్ఐఆర్ దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టిస్తోంది. దీని ఫలితంగా మూడు వారాల్లో 16 మంది బీఎల్వోలు ప్రాణాలు తీసుకున్నారు. గుండెపోటు, ఒత్తిడి, ఆత్మహత్యలకు దారి తీశాయి. ఎస్ఐఆర్ సంస్కరణ కాదు, ఇది మోపబడిన నేరం. మన దేశం ప్రపంచం కోసం అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నది. కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికీ కాగితపు అడవిని సృష్టించాలనే పట్టుదలతో ఉంది. ఎస్ఐఆర్ ఉద్దేశపూర్వక కుట్ర. పౌరులు ఇక్కడ వేధింపులకు గురవుతున్నారు. అనవసరమైన ఒత్తిడి కారణంగా బీఎల్వోల మరణాలను అనుకోకుండా జరిగిన నష్టంగా భావించి విస్మరిస్తున్నారు. ఇది వైఫల్యం కాదు, కుట్ర. అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని బలి చేస్తున్నారు’అని రాహుల్ ఈసీ, కేంద్రంపై విరుచుకుపడ్డారు.బీఎల్వోల పాలిట మృత్యుపాశం: ఖర్గేవివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ బీఎల్వోల పాలిట మృత్యుపాశంగా మారుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పని భారం తట్టుకోలేక బీఎల్వోలు ప్రాణాలు తీసుకుంటుండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర వహించడంపై ఆయన నిప్పులు చెరిగారు. గతంలో నోట్ల రద్దు, కరోనా లాక్డౌన్ నిర్ణయాలను ప్రజల మీద ఎలాగైతే రుద్దారో.. ఇప్పుడు ‘ఎస్ఐఆర్’ను కూడా అలాగే ఎలాంటి ప్రణాళిక లేకుండా హడావుడిగా అమలు చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కేవలం 19 రోజుల్లోనే 16 మంది బీఎల్వోలు పని ఒత్తిడి కారణంగా మరణించారని, ఇవి ఇంకా కొనసాగుతున్నాయని ఖర్గే ‘ఎక్స్’వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుంటే మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కానీ ఈ కుటుంబాలకు న్యాయం చేసేదెవరు? బీజేపీ ఓట్ల చోరీ ఇప్పుడు ప్రాణాంతకంగా మారింది. అధికార దాహంతో రాజ్యాంగ సంస్థల అధికారులను ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నారు’అని విమర్శించారు. -
డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఇవ్వాలంటున్న ఆయన వర్గం ఎమ్మెల్యేలు
-
ప్రజాస్వామ్యం ఖూనీ
న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షా లను నాశనం చేసేందుకు ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ముసుగులో ఎన్నికల కమిషన్(ఈసీ) కుట్ర పన్నిందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనికి నిరసనగా డిసెంబర్ మొదటివారంలో ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో భారీ ర్యాలీ చేపడతామని ప్రకటించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ అమలవుతున్న సమయంలో ఈసీ వైఖరి తీవ్ర నిరుత్సాహం కలిగించిందని పేర్కొంది. లక్షిత ఓట్లను తొలగించే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ సాగిందని ఆరోపించింది. కేంద్రంలోని బీజేపీ ఛత్రం కింద పనిచేయడం లేదని ఈసీ తక్షణమే నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ–కాంగ్రెస్ సారథ్యంలోని మహాగఠ్‌బంధన్ అనూహ్యంగా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సమావేశమైంది.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సారథ్యంలో మంగళవారంజరిగిన ఈ భేటీలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఎస్ఐఆర్ జరిగే 12 రాష్ట్రాల అధ్యక్షులు, శాసనసభా పక్షాల నేతలు, పార్టీ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష పార్టీలను నాశనం చేసేందుకు ఈసీ ప్రయత్నించడం, దేశ చరిత్రలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ‘మేం జనంలోకి వెళతాం. డిసెంబర్ మొదటి వారంలో రాంలీలా మైదాన్‌లో లక్షలాది మంది ప్రజలతో భారీ ర్యాలీ చేపడతాం.ఈసీ బండారాన్ని బట్టబయలు చేస్తాం’అని వేణుగోపాల్ తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ..ఎస్ఐఆర్ ప్రక్రియ సమగ్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు. నిష్పాక్షికంగా ఓటరు జాబితాను రూపొందించాల్సిన ఈసీ..రాజకీయ పక్షాలపై పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అసలైన ఓటర్లను తొలగించేందుకే ఈ ప్రక్రియను ఈసీ హడావుడిగా చేపడుతోందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై రాజకీయంగా, సంస్థాగతంగా, న్యాయపరంగా కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు.ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడుతాంఎన్నికల ప్రక్రియ సమగ్రతను పరిరక్షించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని ఖర్గే ఎక్స్‌లో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో ఇప్పటికే విశ్వాసం తగ్గిపోగా, ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో ఈసీ వైఖరి మరింత నిరుత్సాహపూరితంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నట్లు, ఏ రాజకీయ పార్టీకి లోబడి పనిచేయడం లేదని తక్షణం ఈసీ నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆశ్చర్యం కలిగించని పరాభవం
‘సొంత గుడిసె వేసుకోలేనోడు ఊరంతటికీ వేస్తాడా’ అని ఆఫ్రికాలో ఒక సామెత ఉంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల పరాభవంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఆ ఫలి తాలు ‘ఆశ్చర్యకరంగా’ ఉన్నాయన్నారు. కానీ అంతకన్నా భిన్నంగా ఉంటేనే ఆశ్చర్య పోవాలి. అక్కడ ఆ పార్టీ 2020లో 70 సీట్లకు పోటీ చేసి, కేవలం 19 గెల వగా... ఈసారి 61కి గానూ 6 స్థానాలు గెలిచింది. మహాగఠ్‌బంధన్ మొత్తంగానే ఓడినప్పటికీ, ఆ కూటమిలోని జాతీయ పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అయినందున దాని గురించి ప్రత్యేకంగా చర్చించటం అవసరమవుతున్నది. రెండేళ్ల క్రితం సగం దేశంలో ‘భారత్ జోడోయాత్ర’ జరిపిన రాహుల్ గాంధీ ఇపుడు బిహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ సాగించి, దేశమంతటా ప్రజా స్వామ్య ప్రియులలో కనీసం కొందరికి కొన్ని ఆశలు కల్పించారు. కానీ, 2004లో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించినప్పటి నుంచి ఈ 21 సంవత్సరాలలో ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలిగింది ఏమీ లేదు.నాయకత్వానికి సవాలురాహుల్ గాంధీ రాజకీయ ప్రవేశం చేసిన 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావటంలో తన పాత్ర ఏమీ లేదు. అంతకుముందటి వాజ్‌పేయి ప్రభుత్వం చేసిన ‘ఇండియా షైనింగ్’ ప్రచారాన్ని ప్రజలు మెచ్చనందున బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఓడిపో యింది. తర్వాత కాంగ్రెస్ నాయకత్వాన యూపీఏ కూటమి రెండవ సారి 2009లో అధికారానికి రావటంలో కొన్ని సంక్షేమ పథకాలు, ఆర్థిక పరిస్థితి పెరుగుదల పాత్ర వహించాయి. ఆ వెనుక 2014లో కాంగ్రెస్ ఓటమిలోనూ రాహుల్ బాధ్యత లేదు. వివిధ కుంభకోణాల వల్ల అది జరిగింది. ఆ విధంగా గుర్తించవలసిందేమంటే, రాహుల్‌కి నాయకత్వ పరీక్ష అంటూ మొదలైంది 2014 నుంచి! అప్పటినుంచి గత 11 సంవత్సరాలుగా ఆయన ఏమి చేశారన్నది ప్రశ్న.వాస్తవానికి అంతకుముందు కూడా రాహుల్ గాంధీ కొన్ని పరి మితమైన పరీక్షలను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్‌కు మొదటినుంచీ ఉత్తర ప్రదేశ్ ప్రధాన కార్యక్షేత్రం, బలమైన కేంద్రం. అక్కడ రైతుల పార్టీలు, దళితుల పార్టీలు, సోషలిస్టు పార్టీలు బలపడి వివిధ సామాజిక వర్గాలు దూరమైనందువల్లనే కాంగ్రెస్‌కు పునాది లేకుండా పోయిందని తనకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రొఫెసర్లు బోధపరచటంతో, వారి సూచనల ప్రకారం యూపీలో కాంగ్రెస్ పునరుద్ధరణకు రాహుల్ గాంధీ నడుం కట్టారు. సోదరి ప్రియాంక ఆయనకు తోడయ్యారు. ఆ రాష్ట్రాన్ని నేడు గెలిస్తే రేపు దేశాన్నంతా గెలవగలమన్నది ఆయన నిర్ణయించుకున్న లక్ష్యం. అందుకు తల్లి దీవెనలు కూడా పొందారు. కానీ, ఉత్తర ప్రదేశ్‌లో పార్టీ బలోపేతం అనే మొదటి పరిమిత పరీక్షలో ఆయన విఫల మయ్యారు. రెండవ పరిమిత పరీక్ష 2007లో పార్టీ ప్రధాన కార్య దర్శిగా నియమితుడై, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలకు ఇన్ఛార్జ్ కావటం రూపంలో ఎదురైంది. అందుకు సంబంధించి మొదట తగినంత హడావిడి చేసిన ఆయన, ఆ సంస్థలను పునర్ని ర్మించలేకపోయారు.వైఫల్యాలపై అధ్యయనం శూన్యంఇటువంటి పదేళ్ల పరిమిత వైఫల్యాల నేపథ్యం నుంచి, 2014 వచ్చేసరికి రాహుల్ గాంధీపై పార్టీ బాధ్యతలు పూర్తిగా వచ్చి పడ్డాయి. అప్పటికి కాంగ్రెస్ కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. సోనియా గాంధీ తన సమర్థతను పలు సందర్భా లలో రుజువు చేసిన దశ గడచిపోయింది. పార్టీ సాంకేతికంగా చీల లేదు గానీ పలువురు సీనియర్లు బీజేపీలో చేరటమో, మృతి చెంద టమో, వార్ధక్యం వల్ల క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమించ టమో మొదలైంది. పార్టీ నుంచి వివిధ సామాజిక వర్గాలు దూరం కావటం రాహుల్ రాజకీయ ప్రవేశం కన్నా చాలా కాలం క్రితం నుంచే మొదలు కాగా, ఈసరికి బాగా వేగం పుంజుకున్నది. పార్టీ మరికొన్ని రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. సోనియా తరచు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పరిణామాలన్నింటి జమిలి స్థితి... ఆయన తీవ్రమైన పరీక్షలను ఎదుర్కోవలసి రావటం. పార్టీ నాయకులకు ఒకప్పుడు ఉండిన సలహాదారులు, సహాయకులు, వర్కింగ్ కమిటీ సభ్యులు హేమాహేమీలు కాగా, ఈ దశ వచ్చేసరికి దాదాపు అందరూ పనికిరానివాళ్లు, స్వార్థపరులు వచ్చి చేరారు. రాహుల్ గాంధీకి అది మరొక పెద్ద కొరతగా మారింది.ఇటువంటివి చెప్పుకొన్నప్పుడు రాహుల్‌పై కొంత సానుభూతి కలగవచ్చు. కానీ అటువంటి అవసరమేమీ లేదు. ఆ మాట అనేందుకు తగిన కారణాలున్నాయి. పైన చెప్పుకొన్నట్లు 2004–14 మధ్య పదేళ్ల కాలంలో ప్రతికూల పరిస్థితులు పరిమితమే అయి, తన పరీక్షలు కూడా పరిమితమే అయి, తన మాటకు పార్టీలో ఎంత మాత్రం ఎదురు లేకుండా ఉండినప్పటికీ, ఆయన తన నాయకత్వ సమర్థతను రుజువు చేసుకోలేక పోయారు. పార్టీ పరిస్థితి క్రమంగా క్షీణిస్తూనే పోయింది. పార్టీ ఆయా వర్గాలకు ఎటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాల వల్ల; అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి ఆచరణ వైఫల్యాల వల్ల దూరమవుతూ వస్తున్నది? ఆ పరిస్థితి మారాలంటే ఏమేమి చేయాలి? అనే అధ్యయనాలు, ప్రణాళి కలు ఆయనకు ఎప్పుడూ లేకపోయాయి. మౌలికంగా అవి ఉండి ఉంటే, 2014లో కాంగ్రెస్ ఓడి బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించే పరిస్థితి ఎదురైనప్పుడు, ఇతరత్రా పైన పేర్కొన్న లోటుపాట్లు ఉండినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ‘సొంత గుడిసె’ వేసేందుకు సమ కట్టగల స్థితిలో ఉండేవారు.యూపీఏ ఉన్నట్టేనా?అది రాహుల్ గాంధీలో మౌలికంగా లేనందువల్లనే 2014 నుంచి ఇప్పటివరకు ‘సొంత గుడిసె’ వేయలేక పోవటమే గాక, ‘ఊరంతటికీ వేసే ప్రయత్నాలు’ సహజంగానే నెరవేరటం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ వరుసగా మూడవసారి ఓడిపోయింది. కేవలం మూడు రాష్ట్రాలలో అధికారాన్ని నిలుపుకొన్నది. యూపీఏ కూటమి గత లోక్‌సభ ఎన్నికలలో మంచి ఫలితాలను సాధించి కూడా కేవలం తన వల్ల అంతలోనే గందరగోళంగా మారింది. దాని అజెండా ఏమిటో అర్థం కావటం లేదనీ, ఎన్నికల తర్వాత తిరిగి ఒక్క సమా వేశమైనా జరగలేదనీ, ఇక తమకు దానితో నిమిత్తం లేదనీ, ఒంట రిగా పోటీ చేయగలమనీ, రాహుల్ అధికారంతో వ్యవహరిస్తున్నా రనీ కొందరు భాగస్వాములు ప్రకటించగా... అసలు ఆ కూటమి అన్నదే ఇక లేదని సీపీఎం నాయకుడు ప్రకాశ్ కారత్ వంటివాడు స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ నుంచి స్పందనలు లేక పోగా, కొందరిని బయటకు పంపేట్లు తానే వ్యవహరించారు. కొత్తగా ఒక్క పార్టీ అయినా దగ్గరకు రాలేదు. అట్టహాసపు యాత్ర లేవో చేస్తున్నా, ఆ నినాదాలు ఒక స్థాయిలో మంచివే అయినా, సాధారణ ప్రజల సమస్యలకు, వాటికి సంబంధం ఉండటం లేదు. ఈ విధమైన 21 సంవత్సరాల (2004–25) నేపథ్యాన్ని, 11 సంవత్సరాల (2014–25) నేపథ్యాన్ని పరిగణించినప్పుడు, రాహుల్ గాంధీ ‘సొంత గుడిసె’ను గానీ, ‘ఊరికి గుడిసె’ను గానీ వేయలేక పోవటంలో ఆశ్చర్యం లేదు; హరియాణా, మహారాష్ట్ర,ఢిల్లీతో మొదలైన పరాభవం ఇపుడు బిహార్‌లోనూ కొనసాVýæడంలో ఆశ్చర్యపడేది ఏమీలేదు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
స్థానికోత్సాహం...
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ అధిష్టానం సూత్రప్రాయంగా పచ్చజెండా ఊపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందడం ద్వారా వచ్చిన ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గకుండా చూడాలని, ఇదే ఊపుతో స్థానిక సమరానికి సిద్ధం కావాలని రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ పెద్దలు స్పష్టమైన సంకేతాలిచ్చినట్లుగా సమాచారం. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయానికి రావాలని సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.శనివారం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్‌ను అధిష్టానం పెద్దలకు పరిచయం చేశారు. వారంతా నవీన్ యాదవ్‌ను అభినందించారు. ఈ భేటీల్లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చ జరిగినట్లు తెలిసింది. ‘జూబ్లీ’ఊపును స్థానికంలోనూ చూపించండి... జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో సమష్టి పోరాటం ద్వారా పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించుకున్నందుకు రాష్ట్ర నేతలను రాహుల్, మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి రెఫరెండంగా భావించిన ఈ ఎన్నికలో విజయం సాధించడం పార్టీకి శుభపరిణామంగా నేతలు అభివర్ణించారు. జూబ్లీహిల్స్ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, ఇదే ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొని ఘన విజయం సాధించాలని అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.స్థానిక సంస్థల్లోనూ వ్యవహరించాల్సిన తీరుపై రాష్ట్రస్థాయిలో సమగ్ర చర్చ జరిపి, మంత్రివర్గంలోనూ చర్చించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకోవాలని అగ్రనేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ భేటీల్లో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ముఖ్యంగా రిజర్వేషన్ల అమలుపై కీలక చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ హామీ ఇచ్చినట్లు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూనే.. పార్టీ పరంగా వాటిని అమలు చేసే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.దీనిపై అన్ని వర్గాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని, చట్టపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలని నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తంగా, అధిష్టానం గ్రీన్ సిగ్నల్‌తో రాష్ట్రంలో త్వరలోనే స్థానిక ఎన్నికల సందడి మొదలుకానున్నట్లు స్పష్టమవుతోంది. అంతేగాక సోమవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్లో నిర్ణయం: మహేశ్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పడు నిర్వహించాలనే దానిపై సోమవారం జరగనున్న కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని టీపీపీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ చెప్పారు. అధిష్టానం పెద్దలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుపై పార్టీ నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ అడ్డంకులు సృష్టించిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు రాష్ట్ర పార్టీని, నవీన్ యాదవ్‌ను అధిష్టానం పెద్దలు అభినందించినట్లు తెలిపారు. సిబల్ విందుకు సీఎం రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన డిజిటల్ చానల్లో ‘దిల్సే విత్ కపిల్ సిబల్’పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆయన ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. -
నవీన్ యాదవ్‌కు రాహుల్ అభినందనలు
సాక్షి, ఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎన్నికలో గెలిచిన వల్లాల నవీన్ యాదవ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్‌నూ ఆయన అభినందించారు. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హస్తినలో రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగుర వేశారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి మాగంటి సునీతపై 25 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం.కాంగ్రెస్ విజయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు. -
అదే దెబ్బ కొట్టింది.. బీహార్ ఓటమిపై రాహుల్ రియాక్షన్..
-
‘ఇప్పుడు సఫారీనా?’.. రాహుల్‌పై బీజేపీ విమర్శలు
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల అంశం దేశంలో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ నేపధ్యంలో నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు తారా స్థాయికి చేరాయి. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంతో ఉల్లాసంగా మధ్యప్రదేశ్‌లో జంగిల్ సఫారీకి వెళ్లడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర విమర్శలు గుప్పించింది. LoP means Leader of Paryatan and partying for Rahul GandhiEven as Bihar elections are on : Rahul Gandhi goes for vacationElection in Bihar, Rahul Gandhi enjoying a "Jungle Safari" in PachmarhiThis shows his priorities When they lose elections they will blameECI & do a… pic.twitter.com/GBCCCqTziR— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) November 9, 2025ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలకమైన ఎన్నికల దశలో రాజకీయ వాస్తవికతకు దూరమయ్యారని, ఆయనలో సీరియస్ నెస్ లోపించిందిన బీజేపీ ఆరోపించింది.‘ఎక్స్’ పోస్ట్‌లో బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా స్పందిస్తూ, ప్రతిపక్ష నేత (ఎల్ఓపీ)రాహుల్ గాంధీ పర్యాటక నేతగా మారి, పార్టీలు చేసుకుంటున్నారని ఆరోపించారు. బీహార్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రాహుల్ గాంధీ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారని. బీహార్‌లో ఎన్నికలు జరుగుతుండగా రాహుల్ గాంధీ పచ్మరిలో జంగల్ సఫారీని ఆస్వాదించారని, ఇది ఆయన ప్రాధాన్యతలను తెలియజేస్తుందని’ ఆరోపించారు.ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు వారు భారత ఎన్నికల సంఘాన్ని నిందిస్తారని , హెచ్ ఫైల్స్ అంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తారని షెహజాద్ పూనవాలా దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ వారు జీవితమంతా ఇదే తప్పు చేస్తారని, వారి ముఖం మీద దుమ్ము ఉన్నప్పటికీ, వారు అద్దం శుభ్రం చేస్తూనే ఉంటారని ఆయన ఒక సామెతను ఉదహరించారు. కాగా శనివారం మధ్యప్రదేశ్ చేరుకున్న రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం జంగిల్ సఫారీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మరోమారు ఓటు చోరీ గురించి మాట్లాడారు. ఇది కూడా చదవండి: ‘మరిన్ని రాష్ట్రాల్లో..’ మళ్లీ ‘బాంబు’ పేల్చిన రాహుల్ -
‘మరిన్ని రాష్ట్రాల్లో..’ మళ్లీ ‘బాంబు’ పేల్చిన రాహుల్
భోపాల్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘ఓటు చోరీ’ అంశాన్ని ఆయుధంగా చేసుకుని, బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ నర్మదాపురంలోని పచ్మరి కొండ పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఓటు చోరీ’ని కప్పిపుచ్చేందుకే ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)నిర్వహించారని, అలాగే ఇది ఓటు చోరీని సంస్థాగతీకరించడానికి చేసిన ఒక ప్రయత్నమని ఆరోపించారు.విలేకరులతో రాహుల్ మాట్లాడుతూ..హర్యానాలో మాదిరిగానే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ లలో కూడా ‘ఓట్ల దొంగతనం’ జరిగిందని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు. కొన్ని రోజుల క్రితం తాను హర్యానాలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చానని, అప్పుడు ఓటు దొంగతనం ఓలా జరుగుతోందో స్పష్టంగా వివరించానని అన్నారు. హరాన్యాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని, ప్రతి ఎనిమిది ఓట్లలో ఒక కోటు చోరీ అయ్యిందని రాహుల్ ఆరోపించారు. ఈ డేటాను చూసిన తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా ఇదే జరిగిందని తాను నమ్ముతున్నానని అన్నారు.తమ దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని తాము క్రమంగా అందిస్తామని రాహుల్ పేర్కొన్నారు. తొలుత తన సమస్య ఓటు చోరీ అని, ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అన్నారు. కాగా విలేకరులు రాహుల్‌ను ‘భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని వివరాలను వెల్లడిస్తారా?’ అని అడిగినప్పుడు ఆయన తమ దగ్గర చాలా భిన్నమైన సమాచారం, వివరణాత్మక సమాచారం ఉందని, దానిని వెల్లడిస్తామని అన్నారు. ఇప్పటివరకూ కొంచెమే వెల్లడించామన్నారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, మోదీ, అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ల ఉమ్మడి భాగస్వామ్యంతో ఇదంతా జరుగుతున్నదని రాహుల్ ఆరోపించారు. దీని కారణంగా భారతమాతకు హాని జరుగుతోందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: kolkata: మరో ఘోరం.. నాలుగేళ్ల చిన్నారిపై అకృత్యం -
ఎన్నికల చోరీతోనే మోదీ ప్రధాని అయ్యారు..!
బంకా: ఓట్లనే కాదు, కాషాయ దళం ఏకంగా ఎన్నికలనే చోరీ చేస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల చోరీతోనే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో చేసినట్లే బీజేపీ చోరీ చేసిందని, గుజరాత్లో మళ్లీ మళ్లీ ఇదే జరుగుతోందన్నారు. ఈ విషయాన్ని జెన్ జెడ్‌కు, యువతకు ఆధారాలతో సహా కాంగ్రెస్ చూపిస్తుందని, ఇందులో సందేహమే లేదని తెలిపారు. బీజేపీ నేతలే లక్ష్యంగా ఆయన మరోసారి ఓట్ చోరీ ఆరోపణలు చేశారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటేసిన బీజేపీ నేతలు కొందరు, బిహార్ అసెంబ్లీ మొదటి విడత పోలింగ్‌లోనూ పాల్గొని ఓటేశారని విమర్శించారు. సంబంధించిన పేర్లు తదితర వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. బిహార్‌లోని బంకాలో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. హరియాణాలో చోటుచేసుకున్న ఓట్ చోరీపై కాంగ్రెస్ పార్టీ ఆధారాలను అందజేసినా ఎన్నికల కమిషన్ మాత్రం ఖండించలేదన్నారు. హరియాణా ప్రభుత్వం చోరీతో ఏర్పాటైన ప్రభుత్వమని ధీమాతో చెప్పగలనన్నారు. గతేడాది జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందన్నారు. రాష్ట్ర ఓటరు జాబితాలోని 2 కోట్లకుగాను కనీసం 25 లక్షల నకిలీ పేర్లున్నాయని, బీజేపీని గెలిపించేందుకు ఎన్నికల కమిషన్ ఆ పారీ్టతో కుమ్మక్కయిందని విమర్శించారు. ఈసారి బిహార్‌లో అలా కానివ్వబోమన్నారు. ఇందుకు ప్రజలు అనుమతించరని తెలిపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఎన్డీయే ప్రభుత్వం యువతను సోషల్ మీడియాలో రీల్స్ చేసుకోవాలంటూ ప్రేరేపిస్తోందని రాహుల్ వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దపు వ్యసనమే రీల్స్ అన్నారు. బిహార్ రైతులకు బ్యాంకులు రుణాలి్వడం లేదు, రుణాలను మాఫీ చేయడం లేదని భాగల్పూర్లో జరిగిన ర్యాలీలో ఆయన ఆరోపించారు. కానీ, ఇష్టమైన కార్పొరేట్ సంస్థల రుణాలను మాత్రం రద్దు చేస్తోందన్నారు. బీజేపీ మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకుందన్నారు. రోజులో 24గంటలూ ప్రధాని మోదీ మొహం చూపించేందుకు టీవీ చానెళ్లకు బీజేపీ భారీగా చెల్లింపులు చేస్తోందని పేర్కొన్నారు. -
‘నేను బిహార్‌లో ఓటేశా.. ఇక మీ వంతు..!’
పట్నా: ఆమెది పుణె. కాకపోతే బిహార్‌లో ఓటు వేసినట్లు ఆమెనే చెబుతోంది., మీరు కూడా బిహార్ వెళ్లి ఓటు వేయండి అని కూడా స్పష్టం చేసింది. ఆమె పేరు ఊర్మి. ఆమె ఒక న్యాయవాది. కాకపోతే బిహార్ తొలిదశ ఎన్నిక తర్వాత ఆమె షేర్ చేసిన ఫోటోపై రాజకీయ దుమారం రేగుతోంది. ‘ఎక్స్’ వేదికగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో అనేక ప్రశ్నలకు తావినిస్తోంది. నిజంగానే బిహార్‌లో ఆమె ఓటు వేసిందా?.. లేక ఇది డ్రామానా? అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తే కానీ తెలియదు.దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. మల్లీ స్టేట్ వోటింగ్ అనేది బీజేపీకి న్యూ స్టార్టప్‌నే కాదు.. కొత్త పెట్టుబడి దారు కూడా అంటూ ఆ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ రేష్మ అలమ్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలకు మహారాష్ట్రలో ఓటు వేసిన ఆమె.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల కోసం బిహార్‌లో ఓటు వేసిందని, ఇది ఓట్ చోరీ కాక మరేమిటని మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోందే పాటిల్ ద్వజమెత్తారు. Voted for a Modi-fied India! 🇮🇳Jaai ke Vote daali, Bihar! pic.twitter.com/kkWMwShqSh— Urrmi (@Urrmi_) November 6, 2025 ఈ ఫోటోపై ఓటరు గుర్తింపు, నివాస ప్రమాణాలు, ఎన్నికల నిబంధనలు ప్రకారం విచారణ జరగవలసిన అవసరం ఉంది. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇటీవల ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బ్రెజిలియన్ మోడల్ ఫోటోతో హర్యానాలో పలు ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఇప్పుడు బిహార్ ఎన్నికకు సంబంధించి తాజా ఫోటో వైరల్ కావడంతో ఎన్నికల పారదర్శకతకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.लोकसभा में महाराष्ट्र में वोट करूंगी विधानसभा में बिहार में वोट करूंगी मोदी के लिए वोट चोरी करूंगी 🧐🧐 pic.twitter.com/xDrrLoXMbj— Atul Londhe Patil (INDIA Ka Parivar)🇮🇳 (@atullondhe) November 6, 2025ఇవీ కూడా చదవండి: ‘పిచ్చి పని’.. కంగుతిన్న మోడల్ఈసీపై రాహుల్ హైడ్రోజన్ బాంబు -
ఈసీ మౌనం సిగ్గుచేటు!
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కొంతకాలంగా ప్రయోగిస్తానంటూ చెప్పిన ‘హైడ్రోజన్ బాంబు’ ఎట్టకేలకు బిహార్ తొలి దశ పోలింగ్‌కు 24 గంటల ముందు బుధవారం బద్దలైంది. ఇది నిరుడు జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల జాబితాకుసంబంధించింది. రాహుల్ చెబుతున్న ప్రకారం అందులో 25 లక్షలమంది నకిలీ ఓటర్లున్నారు. సహజంగానే ఎన్నికల సంఘం(ఈసీ) మినహా దేశంలో అందరికీ ఈ విషయం దిగ్భ్రాంతి కలిగించింది. బ్రెజిల్లో ఉంటున్న పోర్చుగీసువాసి హెయిర్ డ్రెసర్ లారిసా నెరి అనే యువతి ఫొటోకు ఈ జాబితాలో చోటు దొరికింది. ఒకసారి కాదు... 10 పోలింగ్ కేంద్రాల పరిధిలో 22 సార్లు వినియోగించారు. ‘సెర్చ్’లో దొరక్కుండా ఒక్కో చోట ఒక్కో పేరు తగిలించారు. స్వీటీ, సరస్వతి, సీమ...ఇలా బహుళ నామధేయాలతో ఆమె మన ఎన్నికల జాబితాలో వర్ధిల్లింది. బహుశా 22 సార్లూ తన ఓటు హక్కు ‘విని యోగించుకుని’ ఆమె తన ‘పవిత్ర కర్తవ్యాన్ని’ నెరవేర్చి ఉంటుంది. మీడియా సమావేశంలో ఆమెను రాహుల్ బ్రెజిల్ మోడల్‌గా చెప్పారు. ఇది స్పీడ్ యుగం కనుక ఆ సమా వేశం ముగిసిన వెంటనే విషయం ఆమెకు చేరిపోయింది. ఏనాడూ సందర్శించని దేశంలో ఎన్నికల జాబితాలో తన పాత ఫొటో రావటంపై ఆమె బోలెడు ఆశ్చర్యపోతోంది. జనాన్ని దగా చేయటానికి తన ఫొటో వినియోగించి ఉంటారని సరిగానే గుర్తుపట్టింది.నకిలీ ఓటర్ల పంచాయతీ రాహుల్–ఈసీలకు సంబంధించింది కాదు. ఇద్దరిలో ఎవరో ఒకరి మాటే నిజం కావాలి కనుక జరిగిందేమిటో ఈసీ సంజాయిషీ ఇచ్చితీరాలి. తప్పు తనవైపుంటే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాహుల్ ఆరోపణ అవాస్తవమైతే ఆయనపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదీ చేయకుండా ‘అప్పుడెందుకు చెప్పలేద’ంటూ దబాయింపులకు దిగటం నైతిక పతనానికి చిహ్నమవుతుందే తప్ప సమర్థవంతమైన జవాబు కానేరదు. సీ–డాక్ సంస్థ రూపొందించిన సాఫ్ట్వేర్ ఉపకర ణాన్ని 2022లో వినియోగించారు. వార్షిక ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) పేరిట జరిగిన ఆ ప్రక్రియలో దాని సాయంతో దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల ఓట్లు తొలగించారు. ఇవన్నీ ఒకటికన్నా ఎక్కువసార్లు నమోదైన ఓట్లు, చెల్లని ఓట్లు. ఆ ఉపకరణం ఒకటికన్నా ఎక్కువసార్లు వినియోగించిన ఫొటోను కూడా పసిగడుతుంది. దానికి ఎందుకు స్వస్తి చెప్పారో ఈసీ సంజాయిషీ ఇవ్వాలి.అసలు ఈసీకీ, ఈ 12.5 శాతానికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధమేమిటో అర్థంకాదు. రాహుల్ లెక్క ప్రకారం హరియాణాలో 12.5 శాతం మంది నకిలీ ఓటర్లు. చిత్రంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలైన వెంటనే ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతానికీ, నాలుగు రోజుల తర్వాత అదే సంస్థ చెప్పిన శాతానికీ మధ్య వ్యత్యాసం కూడా 12.5 శాతమే! ఇంత శ్రద్ధగా లెక్క పాటిస్తున్న మాయావులెవరో ఈసీ తేల్చుకోవాలి. రాహుల్ ఆరోపణలకు ఈసీ ఎగవేత ధోరణిలో జవాబిస్తున్నందువల్ల కేంద్రం జోక్యం చేసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలి. జాబితాలో చేరిన నకిలీ ఓట్ల సంగతలా ఉంచి... గల్లంతైన ఓట్లు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎన్డీటీవీ బృందం ఆరా తీసిన ప్రకారం హరి యాణాలో ఒక గ్రామంలోని పలు కుటుంబాల్లో రెండు నుంచి నాలుగు ఓట్లు గల్లంత య్యాయి. చిత్రమేమంటే వీరు ఆ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఓటేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మాదిరి లీలలు బహు విధాలు! నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచే అక్రమాలు మొదలైపోయాయి. నిజానిజాలేమిటో నిర్ధారించుకోకుండానే కూటమి నాయకులు ఫిర్యాదు ఇచ్చిందే తడవుగా జిల్లాల్లో ఉన్నతాధికారుల్ని మార్చారు. అయి దేళ్లుగా అమలవుతున్న పథకాలు ఆపేశారు. బదిలీల వెనకున్న కుతంత్రమేమిటో పోలింగ్ రోజు హింస బయటపెట్టింది. పోలైన నాలుగు కోట్లకుపైగా ఓట్లలో 51 లక్షలు సాయంత్రం 6 తర్వాతే పడ్డాయి. ఇక ఈవీఎంల విన్యాసాలు అనంతం. సగటున ఒక్కో అసెంబ్లీ స్థానంలో 28,000 ఓట్లు, లోక్‌సభ స్థానం పరిధిలో 1.96 లక్షల ఓట్లు పెరిగాయి. ఇది 87 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటముల్ని నిర్దేశించింది. వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసి 17 నెలలు గడుస్తున్నా జవాబు లేదు! కర్ణాటక, మహారాష్ట్రలకు సంబంధించి కూడా ఇలాగే ఫిర్యాదులొచ్చాయి. ఈ స్థితిలో జరుగుతున్న, జరగబోయే ఎన్నికలపై ఎవరికైనా విశ్వాసం ఉంటుందా? ఇకనైనా ఈసీ బాధ్యులు నోరు విప్పాలి. ఆ ఉద్దేశం లేకుంటే తప్పుకోవాలి. -
నెట్టింట వైరల్ గా మారిన బ్రెజిల్ మోడల్ లారిసా నెరీ
-
‘పిచ్చి పని’.. కంగుతిన్న మోడల్
న్యూఢిల్లీ: హార్యానా ‘ఓట్ చోరీ’ ఆరోపణల సందర్భంగా రాహుల్ గాంధీ చూపిన ఫొటోపై బ్రెజిలియన్ మోడల్ లారెస్సా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో ఈ మోడల్ ఫొటోతో ఏకంగా 22 పేర్లు నమోదై ఉన్నాయని రాహుల్ గాంధీ బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ ఎన్నికల జాబితాలో ఓ బ్రెజిలియన్ మోడల్ ఫొటో ఉండటం ఏమిటని ఆయన ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలో లారెస్సా ఎక్స్ వేదికపై స్పందించారు. రాహుల్ ఆరోపణలపై బ్రెజిలియన్ మోడల్ లారిస్సా స్పందిస్తూ ఇది నమ్మశక్యంగా లేదని అన్నారు. తన వాదనను ఆమె ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్టు చేస్తూ వివరించారు. భారతదేశంలో ఎన్నికల ప్రయోజనాల కోసం తన చిత్రాన్ని దుర్వినియోగం చేయడంపై ఆమె ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఆమె పోర్చుగీస్ భాషలో మాట్లాడుతూ ‘గైస్, నేను మీకు ఒక జోక్ చెబుతాను... ఇది చాలా విచ్రితమైనది.. వారు నా పాత ఫొటోను ఉపయోగించారు. అది నా చిన్నప్పటిది. భారతదేశంలో ఓటు వేయడానికి నా ఫొటోను వాడారు. ఒకరితో ఒకరు పోరాడేందుకు నన్ను భారతీయురాలిగా చిత్రీకరించారు. ఎంత పిచ్చి పనో చూడండి’ అని అన్నారు. The name of the Brazilian Model seen in @RahulGandhi's press conference is Larissa. Here's her reaction after her old photograph went viral. pic.twitter.com/K4xSibA2OP— Mohammed Zubair (@zoo_bear) November 5, 2025ఈ వీడియోలో లారిస్సా.. ఒక రిపోర్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనను భారతదేశ ఎన్నికల్లో ఓటు వేయడం గురించి అడిగారని వెల్లడించారు. ఇదేవిధంగా తన స్నేహితుడొకరు ఇదే ఫొటోను పంపారన్నారు. ఇది ‘నమ్మశక్యం కానిది’, ‘వింతైనది’ అని ఆమె పేర్కొన్నారు. కాగా బ్రెజిలియన్ మోడల్ లారిస్సా పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. LIVE: #VoteChori Press Conference - The H Files https://t.co/IXFaH9fEfr— Rahul Gandhi (@RahulGandhi) November 5, 2025ఇది కూడా చదవండి: ‘ఏడు కాదు ఎనిమిది’.. ట్రంప్ సరికొత్త వాదన -
అప్పుడెందుకు చెప్పలేదు?
న్యూఢిల్లీ: బీజేపీతో అంటకాగి హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి ప్రధాన ఎన్నికల కమిషన్ కారణమైందంటూ రాహుల్‌గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వెనువెంటనే స్పందించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు(బీఎల్ఏ) ఎందుకు ఆనాడే ఈ అభ్యంతరాలను తెలపలేదని ఈసీ ఎదురు ప్రశ్నించింది. హరియాణాలో ఎన్నికల ముందు జరిగిన ఓట్ల సవరణల ప్రక్రియ వేళ కాంగ్రెస్ ఎందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదని ఈసీ ప్రశ్నించింది. ‘‘గత ఏడాది అక్టోబర్‌లో హరియాణాలో ఎన్నికలు జరిగాయి. అంతకుముందే ఆయా నియోజకవర్గాల్లో డూప్లికేట్ ఓట్లు ఉంటే తక్షణం రాజకీయ పార్టీలు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఇచ్చాం. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు ఫిర్యాదు చేయకుండా ఏం చేస్తున్నట్లు? ఓట్లేసేటప్పుడు పోలింగ్ కేంద్రాల్లో కూర్చున్న కాంగ్రెస్ ఏజెంట్లు చూస్తూ ఊరుకున్నారా? ఫలానా ఓటు అప్పటికే పోల్ అయినట్లు మీకు అనుమానం వస్తే ఎందుకు వెంటనే అక్కడి అధికారులకు తెలియజేసి అభ్యంతరం చెప్పలేదు? ఓటరు గుర్తింపుపై అనుమానాలుంటే ఎందుకు అధికారులకు సమాచారం ఇవ్వలేదు?’’ అని కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారి రాహుల్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ఇంటి నంబర్ సున్నా ఎందుకు వేశారని, ఈ ప్రక్రియలో తప్పలు ఉన్నాయంటూ రాయ్, హోడల్ నియోజకవర్గాలకు సంబంధించి కేవలం 22 పిటిషన్లు అందాయి. అవన్నీ ఇంకా పంజాబ్, హరియాణా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. వాస్తవానికి 23 పిటిషన్లు వస్తే ఒకటి ఉపసంహరించుకున్నారు. తన ఆరోపణలకు సంబంధించి పూర్తి, సమగ్ర ఆధారాలను రాహుల్ బయటపెడితే బాగుంటుంది’’ అని అధికారి హితవు పలికారు. ‘‘ ప్రతి రాష్ట్రంలో డూప్లికేట్ ఓ ట్లు, మృతిచెందిన ఓటర్ల ఓట్లు, వలస వెళ్లిన వారి ఓట్లను తొలగించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వేను మొదలెట్టాం. ఎస్ఐఆర్కు రాహుల్ మద్దతు పలుకుతున్నారా? వ్యతిరేకిస్తున్నారా? కనీసం బిహార్‌లో అయినా ఎస్ఐఆర్ వేళ ఎందుకు కాంగ్రెస్ బూత్‌లెవల్ ఏజెంట్లు అభ్యంతరాలు తెలపలేదు?’’ అని అధికారి ప్రశ్నించారు. రాహుల్ అబద్ధాలాడుతున్నారు: హరియాణా సీఎం నకిలీ ఓట్లతో హరియాణాలో బీజేపీ గెల్చిందని, అందుకే నాయబ్ సింగ్ సైనీ సర్కార్ కొలువుతీరందని రాహుల్ చేసిన విమర్శలపై సైనీ స్పందించారు. ‘‘ రాహుల్ అబద్ధాలు చెప్తున్నారు. ఆయన కుటుంబంలో నాలుగు తరాల వాళ్లు దేశాన్ని పరిపాలించారు. అయినాసరే అబద్ధాలు చెప్పే అలవాటు రాహుల్‌కు పోలేదు. ఇక్కడ ఎలాంటి చర్చనీయాంశం లేకపోయినా కాంగ్రెస్ వాళ్లు జనాలను తప్పుదోవ పట్టిస్తారు’’ అని సైనీ వ్యాఖ్యానించారు. -
ఈసీపై రాహుల్ హైడ్రోజన్ బాంబు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నిల సంఘంపై, కేంద్ర ప్రభుత్వంపై సాధారణ విమర్శలు చేసే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం భారీ హైడ్రోజన్ బాంబు పడేశారు. ఏకంగా పాతిక లక్షల నకిలీ ఓట్లతో, ఈసీ అండదండలతో హరియాణా ఎన్నికల్లో బీజేపీ దొంగమార్గంలో గెలిచిందని రాహుల్ విమర్శించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను చోరీచేశారని ఆరోపించారు. హరియణాలో బీజేపీ విజయం సాధించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు బీజేపీతో కలిసి పనిచేశారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వీళ్లంతా ప్రధాని మోదీకి భాగస్వాములని వ్యాఖ్యానించారు. ఈ విమర్శల జడివానకు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’ వేదికైంది. బుధవారం మీడియా సమావేశంలో రాహుల్ పలు సంచలనాత్మక ఆరోపణలు చేశారు. బిహార్ తొలి దశ పోలింగ్‌కు కొన్నిగంటల ముందు రాహుల్ ఈ విమర్శల జల్లు కురిపించారు. సీమా.. స్వీటీ.. సరస్వతి.. ‘‘హరియాణాలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని ఐదు వేర్వేరు ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెప్పాయి. కాంగ్రెస్ 73 చోట్ల గెలిస్తే బీజేపీకి 17 సీట్లే వస్తాయని చెప్పాయి. కానీ బీజేపీ చేసిన ఈ ఓట్ల చోరీ, నకిలీ ఓట్ల దందాతో కాంగ్రెస్ ఓడిపోయింది. బీజేపీ వ్యక్తులు అటు ఉత్తరప్రదేశ్‌లో ఓటేసి తర్వాత హరియాణాలోనూ ఓటేశారు. పాతిక లక్షల ఓట్లు ఉన్నాయనడానికి ఈ బ్రెజిల్ మోడలే ప్రత్యక్ష ఉదాహరణ. ఈమె ఫొటో, వివరాలతో 22 ఓట్లు ఉన్నాయి. సీమా, స్వీటీ, సరస్వతి.. ఇలా 22 పేర్లతో ఉన్న ఓట్లన్నీ ఈమె ఫొటోతో నమోదై ఉన్నాయి. గత ఏడాది ఎన్నికల్లో 10 బూత్‌లలో ఆ ఓట్లన్నీ పోలయ్యాయి. బీజేపీ కార్యకర్తలు నేతలు అటు ఉత్తరప్రదేశ్‌లో ఇటు హరియాణాలో ఓటర్లుగా నమోదయ్యారు. బీజేపీ నేత దాల్చంద్ యూపీ, హరియాణాల్లో ఓటేశారు. మథురలో బీజేపీ సర్పంచ్ ప్రహ్లాద్ అదే పనిచేశారు. ఇలాంటి వాళ్లు వేలల్లో ఉన్నారు. పాల్వాల్ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్, బీజేపీ నేత 150వ నంబర్ ఇంట్లో ఉంటున్నారు. ఆయన ఇంట్లో ఏకంగా 66 ఓట్లు ఉన్నాయి. ఇంకొకరైతే తన ఇంట్లో 500 మంది ఓటర్లు ఉన్నారని అన్ని ఓట్లను నమోదుచేశాడు. ఇవన్నీ మేం స్వయంగా క్షేత్రస్థాయిలో తిరిగి తెల్సుకున్నవే. ఇక హరియాణా ఎన్నికల చరిత్రలో తొలిసారిగా బ్యాలెట్ ఓట్లు అనేవి వాస్తవ ఓటర్లతో సరిపోలలేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు. కాంగ్రెస్ చరిత్రాత్మక విజయాన్ని వ్యవస్థీకృత నేరం ద్వారా ఓటమిగా మార్చేశారు’’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మేం అటు పోరాడుతుంటే ఇటు చంపేశారు ‘‘భారత ప్రజాస్వామ్యాన్ని సర్కార్చోరీ విధానంతో నాశనంచేశారు. ఈ వినాశనానికి ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) అనేది సరికొత్త ఆయుధంగా దాపురించింది. బిహార్‌లోనూ ఓటు చోరీని మొదలెట్టారు. మేం విపక్ష పార్టీలతో కలసి ఓ వైపు ఎస్ఐఆర్పై పోరాటం చేస్తుంటే మరోవైపు ప్రజాస్వామ్యాన్ని కొన్ని శక్తులు చంపేస్తున్నాయి. ఆనాడు హరియాణా ఓట్ల లెక్కింపునకు రెండ్రోజుల ముందు సీఎం నయాబ్ సైనీ ఓ మాట అన్నారు. ఒక వ్యవస్థను సిద్ధంచేశాం. అందుకే మేం గెలవబోతున్నాం అని అన్నారు. అప్పుడే మాకు అనుమానం వచ్చింది. కర్ణాటకలోని మహాదేవపుర, ఆలంద్ నియోజకవర్గాల్లో జరిగిన మోసమే రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో జరుగుతోందని మాకు అర్థమైంది’’ అని రాహుల్ వివరించారు.మోదీ, ఈసీల సారథ్యంలో వ్యవస్థీకృత ఓటు చోరీ ‘‘ప్రధాని మోదీ, ఎలక్షన్ కమిషన్ సంయుక్తంగా వ్యవస్థీకృత ఓటు చోరీ విధానాన్ని తీసుకొచ్చారు. ఈసారి బిహార్ ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు దానిని రంగంలోకి దింపుతున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఈసీ పార్ట్నర్షిప్ కొనసాగిస్తోంది. వీళ్లంతా మూకుమ్మడిగా దేశ ప్రజాస్వామ్య పునాదులను పెకలిస్తున్నారు. ఓట్ల చోరీని ఓ పరిశ్రమగా మార్చేశారు. పోలింగ్ జరిగే ప్రతి రాష్ట్రానికి దానిని పట్టుకొస్తున్నారు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వేదిక మీదకు రాహుల్ కొందరు బిహారీ ఓటర్లను ఆహా్వనించారు. తన ఒక్కడి ఓటే తీసేశామని అధికారులు చెప్పారని, తీరాచూస్తే గ్రామంలో మరో 187 ఓటర్ల ఓట్లు కూడా గల్లంతయ్యాయని ఆ బిహారీలు చెప్పారు. ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీదే ‘‘ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వ అధికారాన్ని చేజిక్కించుకునే ‘ఆపరేషన్ సర్కార్ చోరీ’కి ఈసీ తెరతీసింది. ఇంటి నంబర్ లేని సందర్భాల్లో, నిరాశ్రయులకు మాత్రమే ‘జీరో నంబర్’ ఇస్తామనేది శుద్ధ అబద్ధం. మా బృందం స్వయంగా క్షేత్రస్థాయిలో తిరిగి లెక్కలేనన్ని లొసుగులను పట్టుకుంది. ఇంటి నంబర్ జీరో అని ఓటరు జాబితాలో ఉన్న వాళ్లెందరో తమ సొంత ఇళ్లలో ఉంటున్నారు. ఇల్లు లేని వాళ్లకు మాత్రమే జీరో నంబర్ కేటాయించామని ఈసీ చెబుతున్న దాంట్లో నిజం లేదు. హరియాణాలో 25,41,144 నకిలీ ఓట్లు ఉన్నాయి. వీటిలో చాలా ఓట్లు రెండు మూడు చోట్ల ఉన్నాయి. అంటే 5,21,619 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. అడ్రస్‌లేని 93,174 ఓట్లు ఉన్నాయి. ఒక అడ్రస్‌పై వందల ఓట్లున్నాయి. అలాంటివి రాష్ట్ర ఓట్ల జాబితాలో ఏకంగా 19,26,351 ఓట్లు ఉన్నాయి. నకిలీ ఓటర్ల ఫొటోలతో 1,24,177 ఓట్లు సృష్టించారు. హరియణాలోని ప్రతి ఎనిమిది ఓట్లలో ఒకటి నకిలీదే. పాతికలక్షల ఓట్లు అంటే రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో 12 శాతం ఓట్లు నకిలీవే. ఒక్క నియోజకవర్గంలో 22,000 ఓట్ల మెజారిటీ అంటేనే చాలా పెద్ద సంఖ్య. అలాంటిది 25 లక్షల ఓట్లు అంటే ఇక లెక్కేసుకోండి. ఎంతటి కుట్ర జరిగిందో. ఈ కారణంగానే గత ఏడాది హరియాణా ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ 22,779 ఓట్ల తేడాతోఓడిపోయింది. ఈ అంకెల గారడీలు చూస్తే నేనే షాక్ అయ్యా. మీ భవిష్యత్తు ఎలా చోరీకి గురవుతోందో జెన్‌జెడ్ యువత ఇకనైనా తెల్సుకోవాలి’’ అని రాహుల్ అన్నారు. -
హర్యానాలో 25 లక్షల ఓట్లు చోరీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఓటు చోరీ ఆరోపణలతో పాటు ‘హెచ్’ ఫైల్స్‌ను బహిర్గతం చేశారు. హర్యానాలో 25,41,144 లక్షల ఓటు చోరీ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ‘మా దగ్గర ‘హెచ్’ ఫైల్స్ ఉన్నాయి. రాష్ట్రంలో ఓటు చోరీ ఎలా జరిగిందో దానిలో ఉంది. ఇది రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరుగుతోందని అనుమానిస్తున్నాం. హర్యానాలోని మా అభ్యర్థులు.. ఏదో తప్పు జరిగిందంటూ ఫిర్యాదులు విరివిగా చేశారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు.హర్యానా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించిన రాహుల్ .. కాంగ్రెస్ విజయాన్ని బీజేపీ విజయంగా మార్చేందుకు ఒక ప్రణాళికను అమలు చేశారని ఆరోపించారు. హర్యానాలో 25 లక్షల ఓట్లు చోరీ అయ్యాయని, ఇందులో 5.21 లక్షల నకిలీ ఓటర్లు, 93,174 చెల్లని ఓటర్లు, 19.26 లక్షల బల్క్ ఓటర్లు ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు. తాను చెబుతున్న దానికి 100 శాతం రుజువు ఉందని, వారు కాంగ్రెస్ విజయాన్ని ఓటమిగా మార్చడానికి వ్యవస్థాగత తారుమారుకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.హర్యానాలో రెండు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 25 లక్షల మంది నకిలీ ఓటర్లు అని విలేకరుల సమావేశంలో రాహుల్ తెలిపారు. తన బృందం 5.21 లక్షల నకిలీ ఓటరు నమోదులను బయటపెట్టిందని, హర్యానాలో ప్రతి ఎనిమిది మంది ఓటర్లలో ఒకరు నకిలీవారున్నారు. ఓటరు జాబితాలో వ్యత్యాసాలను చూపించే స్లయిడ్లను రాహుల్ ప్రదర్శించారు. ఓటు చోరీ కోసం బ్రెజిలియన్ మోడల్ వాడారని ఆరోపించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను అణిచివేసేందుకు బీజేపీ ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్‌ను నిర్వహిస్తోందని రాహుల్ ఆరోపించారు.అన్ని ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో కాంగ్రెస్ విజయాన్ని సూచించాయని గుర్తుచేశారు. హర్యానా చరిత్రలో తొలిసారిగా, పోస్టల్ బ్యాలెట్లు వాస్తవ ఓట్లతో సరిపోలలేదని, ఇది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని, కాంగ్రెస్ అఖండ విజయాన్ని ఓటమిగా మార్చడానికి ఒక ప్రణాళికను అమలు చేశారని రాహుల్ ఆరోపించారు. అయితే ఎన్నికల కమిషన్ వర్గాలు రాహుల్ గాంధీ వాదనలను తోసిపుచ్చాయి. రాష్ట్ర ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా “సున్నా అప్పీళ్లు” దాఖలు అయ్యాయన్నారు.ఇది కూడా చదవండి: నెహ్రూను గుర్తు చేసుకున్న మమ్దానీ -
పాకిస్తాన్ ఉగ్రవాదులకు అమిత్ షా హెచ్చరిక
దర్భంగా: భారత్‌పై మరోసారి దాడికి దిగే సాహసం చేస్తే తూటాలకు ఫిరంగులతో సమాధానం చెప్తామని పాకిస్తాన్ ఉగ్రవాదులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పహల్గాంలో మన పౌరులపై దాడి చేసి, ఆడబిడ్డల నుదుటిపై సిందూరాన్ని తుడిచేసిన ముష్కరులపై 20 రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను అంతం చేశామని తెలిపారు.అమిత్ షా మంగళవారం బీహార్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఇక్కడ తయారయ్యే ఫిరంగులను పాక్ ముష్కర మూకలపై ఎక్కుపెట్టనున్నట్లు స్పష్టంచేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ భద్రతను నిర్లక్ష్యం చేశామని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు. నేరగాళ్లను నీరాజనాలు పలుకుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్–ఆర్జేడీ కూటమికి ఓటు వేస్తే బీహార్‌లో మళ్లీ జంగిల్‌రాజ్ వస్తుందని ప్రజలను అమిత్ షా అప్రమత్తం చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ నేరగాళ్లను నీరాజనాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ‘షాబుద్దీన్ అమర్ రహే’అంటున్నారని ఆక్షేపించారు. జంగిల్‌రాజ్‌ను మళ్లీ తీసుకురావాలని ప్రతిపక్ష నాయకులు ఆరాటపడుతున్నారని, ప్రజలు అందుకు అంగీకరించబోరని తేలి్చచెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంపైనున్న కమలం గుర్తుపై మీటను నొక్కితే సుపరిపాలన వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రను అమిత్ షా తప్పుపట్టారు. చొరబాటుదారులను కాపాడే ప్రయత్నాలు మానుకోవాలని రాహుల్‌కు హితవు పలికారు. -
ఉచితంగా బైక్ ఇచ్చిన రాహుల్.. ట్విస్ట్ ఇచ్చిన యువకుడు
ఒక చిన్న టీ కొట్టు యజమాని.. అతనికి సాక్షాత్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వంటి పేరున్న నాయకుడు కలవడమే కల లాంటి విషయం. ఇక ఆయన నుంచి ఏకంగా రూ.1.50లక్షలు విలువ చేసే బైక్‌ను ఉచితంగా అందుకుంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది?. అయినా సరే.. తన ఓటు కాంగ్రెస్‌కు వేయను అంటూ ఆ టీ కొట్టు యజమాని చెబుతున్నాడు. ఇంతకీ ఈ కథ ఏమిటంటే..గత ఆగస్టు 27న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు బీహార్‌లో 14 రోజుల ‘ఓటర్ అధికార్ యాత్ర’ సందర్భంగా దర్భంగాలో ఉన్నప్పుడు ఈ కధ ప్రారంభమైంది. ఆ సమయంలో ఆయన పార్టీ సహచరులు 52 కి.మీ దూరంలో ముజఫర్‌పూర్ వరకూ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఆ సందర్భంగా జాతీయ రహదారి 27లోని మాబ్బి సమీపంలోని షాపూర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న మా దుర్గా లైన్ హోటల్లో టీ తాగారు. ఆ తర్వాత, గాంధీ భద్రతా సిబ్బంది, హోటల్ యజమాని సుమన్ సౌరభ్ (21)కి చెందిన బజాజ్ పల్సర్ బైక్‌ను తీసుకెళ్లి తిరిగి ఇవ్వలేదని ఆరోపించాడు. ఏం జరిగిందో తెలీదు కానీ దాంతో సౌరభ్ తన హనం కోసం తీవ్రంగా అన్వేషించాడు. ‘నా లైఫ్‌లైన్ అకస్మాత్తుగా తెగిపోయింది’ అని సౌరభ్ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. తన బైక్ కోసం సాధ్యమైనంత వరకు ప్రతీ తలుపును తట్టినప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోయాడు.తాను ఒక కారు అద్దెకు తీసుకుని దాదాపు 25,000 ఖర్చు చేసి తిరిగినట్టు చెప్పారు. స్థానిక కాంగ్రెస్, ఆర్జేడీ, భారతీయ జనతాపార్టీ (బీజేపీ) సభ్యులను సంప్రదించినా ఎవరి నుంచీ స్పష్టమైన స్పందన రాలేదని గుర్తు చేసుకున్నాడు. చివరకు స్థానిక మాబ్బి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేయాలని కాంగ్రెస్ నాయకుడు మదన్ మోహన్ ఝా సూచించారట. అయితే, తాను కొంతమంది స్థానిక సోషల్ మీడియా వ్యక్తులను సంప్రదించడంతో వారు తన కథను హైలైట్ చేశారని అది రాహుల్ గాంధీ దృష్టికి వెళ్లి ఉండవచ్చని సౌరభ్ చెప్పాడు.ఇది జరిగిన మూడు రోజుల తర్వాత, సెప్టెంబర్ 1న గాంధీ యాత్ర ముగింపు వేడుక కోసం పాట్నా హోటల్లో క్యాంపెయిన్ చేస్తున్న ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్ నుంచి సౌరభ్‌కి కాల్ వచ్చింది. ‘రాహుల్ గాంధీ నుంచి కొత్త మోటార్ సైకిల్ తాళం తీసుకోవడానికి సెప్టెంబర్ 1న ఉదయం 7 గంటలకు పాట్నాకు రావాలని ఆయన కోరాడు. కాంగ్రెస్ అధినేత రాహుల్ ఆహ్వానం మేరకు సౌరభ్, మళ్ళీ కారు అద్దెకు తీసుకుని, తన తండ్రి అనిల్‌తో కలిసి పాట్నా చేరుకున్నారు, అక్కడ, పాట్నా హైకోర్టు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర రాహుల్.. అతడిని కలుసుకుని, రాష్ట్ర రాజధానిలోని బోరింగ్ రోడ్ ప్రాంతంలోని ఒక దుకాణం నుంచి కొనుగోలు చేసి కొత్త బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ తాళంను ఆయనకు అందజేశారు.‘ఓ కొత్త మోటార్ బైక్‌ను పొందడం అనేది నాకు ఊహించని విషయం. అది కూడా రాహుల్ గాంధీ వంటి పెద్ద రాజకీయ నాయకుడి నుంచి అందుకోవడం ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. నా ఆందోళనను అర్థం చేసుకున్నందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. బైక్ ధర రూ.1.5 లక్షల కంటే ఎక్కువే. ఇది నాకు చాలా పెద్ద మొత్తం ’ అని సౌరభ్ అన్నాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో వీరిద్దరి సమావేశం వీడియోను షేర్ చేసింది. అయితే, దర్భంగా గ్రామీణ నియోజకవర్గంలో ఓటరుగా తన ప్రాధాన్యత గురించి మీడియా అడిగినప్పుడు ‘నేను ఆర్జేడీ అభ్యర్థికి ఓటు వేస్తాను’ అని సౌరభ్ నిర్మొహమాటంగా చెప్పాడు. తన కుటుంబం ఎల్లప్పుడూ ఆర్జేడీ ఓటర్లేనని సౌరభ్ స్పష్టం చేశాడు. బైక్ విషయంతో దానికి సంబంధం లేదన్నట్టుగా అతను తేల్చేశాడు. నవంబర్ ఆరో తేదీన జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో దర్భాంగా పోలింగ్‌కు వెళుతుంది. ఫలితాలను నవంబర్ 14న ప్రకటిస్తారు.-సత్య. -
రాహుల్ తన ఇటలీ మూలాలు బయటపెట్టారు: అమిత్ షా
నలంద/లఖీసరాయ్: బిహార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాం«దీని బీజేపీ అగ్రనేత అమిత్ షా లక్ష్యంగా చేసుకున్నారు. ‘‘ఛాత్ పండుగ వేళ ఛాత్మాతను ప్రారి్థస్తున్నట్లు ప్రధాని మోదీ నాటకం ఆడుతున్నారని రాహుల్ బాబా ఆరోపించారు. ఇటలీ మూలాలున్న రాహుల్ గాంధీకి భారతీయ సనాతన విశ్వాసాలను పొగిడేంత కనీసం అర్హత కూడా లేదు. గతంలోనూ మోదీ తల్లిని కాంగ్రెస్ నేతలు అవమానించారు. ఈ అవమానాలకు బదులు తీర్చేకునేలా ఈవీఎం బటన్లపై ఎన్డీఏ గుర్తులున్న చోట్ల శక్తిమేరకు గట్టిగా ఒత్తండి. ఎంత బలంగా ఒత్తాలంటే ఆ ధాటికి ఇటలీలో భూప్రకంపనలు రావాలి’’అని అన్నారు. కాంగ్రెస్‌పైనా అమిత్ విమర్శలు గుప్పించారు. ‘‘ఐదు శతాబ్దాల అయోధ్య నిర్మాణ కలను కాంగ్రెస్ 70 ఏళ్లు అధికారంలో ఉండి కూడా సుసాధ్యం చేయలేకపోయింది. నలందలో ఆధునిక విశ్వవిద్యాలయాన్ని మోదీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. గతంలో మాదిరి ఆనాటి జ్ఞానభాండాగారాలను ఏ ముఖ్తియార్ ఖిల్జీ కూడా నాశనంచేయలేడు’’అని అమిత్ వ్యాఖ్యానించారు. తారాపూర్‌లో బీజేపీ అభ్యరి్థ, ప్రస్తుత డెప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి త్వరలో సీఎం అయ్యే అవకాశాలున్నాయని అమిత్ పరోక్ష వ్యాఖ్యలుచేశారు. ‘‘చౌదరికి ఓటేయండి. త్వరలో ప్రధాని మోదీ ఈయనకు పెద్ద బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు’’అని అన్నారు. -
యుద్ధం ఆపానన్న ట్రంప్‌తో మోదీ వాదనలో గెలవలేరు
షేక్‌పురా(బిహార్): ఆపరేషన్ సిందూర్ వేళ భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న వాదనలకు అడ్డుకట్ట వేసే ధైర్యం ప్రధాని మోదీకి అస్సలు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. బిహార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా గురువారం నలంద, షేక్‌పురాలో సభలో రాహుల్ ప్రసంగిస్తూ మోదీపై విమర్శల వాగ్భాణాలు సంధించారు. ‘‘తన కారణంగానే భారత్, పాక్ యుద్ధం ఆగిందని ఇప్పటికే ఎన్నో సార్లు ట్రంప్ అంతర్జాతీయ వేదికలపై డప్పు కొట్టారు. ఆయన ప్రకటనలను ప్రధాని మోదీ కనీసం అడ్డుకునే సాహసం చేయట్లేరు. మీరు మాట్లాడేది అబద్ధం అని మాట వరసకు కూడా ట్రంప్‌కు చెప్పే ధైర్యం మోదీకి లేదు. ఇటీవల కాలంలో మోదీ అమెరికాకు వెళ్లాల్సింది. కానీ ట్రంప్ భయానికే ఆయన అమెరికా వైపు కన్నెత్తి చూడట్లేరు. నిజంగానే మోదీకి అంతటి ధైర్యం ఉంటే బిహార్ ఎన్నికల ర్యాలీల్లో యుద్ధం ఆపింది ట్రంప్ కానేకాదు అని మోదీ కరాఖండీగా ప్రకటించాలి’’అని రాహుల్సవాల్ విసిరారు. ధైర్యశాలి ప్రధాని అంటే మా నాన్నమ్మే ‘‘నిజానికి ప్రధాని అంటే ఎంతటి ధైర్యశాలిగా ఉండాలో మా నాన్నమ్మ, నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని చూసి నేర్చుకోవాలి. 1971లో నాటి అమెరికా అధ్యక్షుడితో ఇందిర సూటిగా ‘మాకు మీరంటే ఏమాత్రం భయంలేదు’అని ముఖం మీదే చెప్పేశారు. ఆమె తెగింపు గల నాయకురాలు’’అని ఇందిరను రాహుల్ గుర్తుచేసుకున్నారు. బిహార్‌లో భూములు అందుబాటులో లేవన్న అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘బడా పారిశ్రామిక సంస్థకు చవగ్గా భూములు అమ్మేస్తూ పోతే ఇక భూముల లభ్యత ఎలా సాధ్యం?’’అని ప్రశ్నించారు. -
ఓట్ల కోసం అవమానిస్తున్నారు: ప్రధాని మోదీ
ముజఫర్‌పూర్: రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్- ఆర్జేడీల మధ్య విభేదాలున్నాయని, అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ముజఫర్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపించారు. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేతలు, రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌లపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. తనను చెడ్డ చేయడం వారి జన్మహక్కుగా భావిస్తున్నారని ప్రధాని నర్రేంద మోదీ వ్యాఖ్యానించారు.ముజఫర్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గొడవలకు సంబంధించిన నివేదికలు తనకు అందుతున్నాయని అన్నారు. ఆ రెండు పార్టీలు పరస్పర విభేదాలతో నీరు, నూనె మాదిరిగా ఉన్నాయని, అవి అధికారాన్ని చేజిక్కించుకుని, బీహార్‌ను దోచుకునేందుకే కలిసి వచ్చాయని ప్రధాని ఆరోపించారు. బీహార్‌లో వారి ర్యాలీలు బూటకం తప్ప మరేమీ కాదని, ఆ పార్టీలు ఎప్పటికీ బీహార్‌ను అభివృద్ధి చేయలేవని ప్రధాని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కొన్ని దశాబ్దాలుగా బీహార్‌ను పాలించాయని, అయితే వారు ప్రజలకు ఇచ్చినది ద్రోహం, తప్పుడు వాగ్దానాలు మాత్రమేనంటూ ప్రధాని మోదీ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకు పడ్డారు.ఐదు నిదర్శనాలుఆర్జేడీ, కాంగ్రెస్‌ల దుష్ప్రవర్తనకు నిదర్శనాలుగా ఐదు విషయాలు ఉన్నాయని, అవి.. దేశీయంగా తయారు చేసిన పిస్టల్స్, క్రూరత్వం, సామాజిక ద్వేషం, దుష్ఫరిపాలన, అవినీతి.. అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీహార్‌లో అత్యంత వేడుకగా జరుపుకునే ఛట్ పై ప్రధాని డ్రామా చేస్తున్నారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల ఆరోపించారు. దీనికి ప్రధాని సమాధానమిస్తూ కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ఓట్ల కోసం ఛటీ మయ్యాను అవమానించారని ఆరోపించారు. వారికి ఛటీ మయ్యాను పూజించడం కేవలం ఒక నాటకం, ప్రహసనంలా కనిపించిందా అని ప్రధాని ప్రశ్నించారు. ఛట్ పూజను అవమానించిన వారిని బీహార్ ప్రజలు ఎప్పటికీ క్షమించరని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఉత్సవానికి యునెస్కో సాంస్కృతిక వారసత్వ హోదా కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. -
‘ఇది సంస్థాగత హత్య’.. ‘మహారాష్ట్ర’ ఘటనపై రాహుల్ విమర్శలు
సతారా: మహారాష్ట్రలోని సతారాలో వైద్యురాలి ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. దీనిని ‘సంస్థాగత’ హత్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన దరిమిలా న్యాయం కోసం పోరాడుతున్న బాధిత కుటుంబానికి అండగా నిలుస్తానని ఆయన ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి వెలువడిన కొన్ని నివేదికలను గుర్తుచేస్తూ, రాహుల్ గాంధీ ‘బీజేపీతో సంబంధం కలిగిన కొందరు ప్రముఖులు.. బాధిత వైద్యురాలిని అవినీతి ఊబిలోనికి నెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటన నాగరిక సమాజపు మనస్సాక్షిని కదిలించే విషాదమని ఆయన అన్నారు. తన వైద్యంతో ఇతరుల రోగాలను తగ్గించాలని ఆశపడిన వైద్యురాలు.. అవినీతి వ్యవస్థలో కూరుకుపోయిన నేరస్థుల వేధింపులకు గురయ్యిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్తుల నుండి ప్రజలను రక్షించే బాధ్యత కలిగిన అధికారులే.. అమాయక మహిళపై అత్యంత దారుణానికి పాల్పడ్డారని రాహుల్ పేర్కొన్నారు. महाराष्ट्र के सतारा में बलात्कार और उत्पीड़न से तंग आकर डॉ. संपदा मुंडे की आत्महत्या किसी भी सभ्य समाज की अंतरात्मा को झकझोर देने वाली त्रासदी है।एक होनहार डॉक्टर बेटी, जो दूसरों का दर्द मिटाने की आकांक्षा रखती थी, भ्रष्ट सत्ता और तंत्र में बैठे अपराधियों की प्रताड़ना का शिकार…— Rahul Gandhi (@RahulGandhi) October 26, 2025ఇది ఆత్మహత్య కాదు.. ఒక సంస్థాగత హత్య అంటూ రాహుల్ తన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. అధికారం నేరస్థులకు కవచంగా మారినప్పుడు, ఎవరి నుండి న్యాయం ఆశించగలం? డాక్టర్ మరణం.. బీజేపీ ప్రభుత్వ అమానవీయ కోణాన్ని బహిర్గతం చేస్తున్నది. న్యాయం కోసం చేస్తున్న ఈ పోరాటంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం. భారతదేశంలోని ప్రతి ఆడబిడ్డ భయపడనవసరం లేదు. వారికి అండగా ఉంటూ, వారి తరపున మేము న్యాయం పోరాటం చేస్తాం అని రాహుల్ పేర్కొన్నారు.గురువారం రాత్రి సతారాలోని ఒక హోటల్ గదిలో ఒక మహిళా డాక్టర్ ఉరి వేసుకున్నారు. ఆమె స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. ఫల్తాన్ సిటీ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానే తనపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడని, ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ వేధింపులకు గురి చేశాడని ఆమె సూసైడ్ లేఖలో రాశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఆ రైల్వే స్టేషన్ పేరు మారింది -
‘రైళ్లలో అమానవీయం’: బీహార్‌పై నిప్పులు చెరిగిన రాహుల్
న్యూఢిల్లీ: బీహార్‌లో ఎన్నికల సందడి నెలకొన్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పండుగల సమయంలో బీహార్‌లో సామర్థ్యానికి మించిన రీతిలో రైళ్లను నడపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగల సీజన్లో ప్రయాణికులను రైళ్లలో అమానవీయ రీతిలో తీసుకెళుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ మోసపూరిత విధానాలు, ఉద్దేశాలకు ఈ పరిస్థితి సజీవ నిదర్శమని రాహుల్ అభివర్ణించారు.‘బీహార్‌లో రైళ్లు పూర్తిగా నిండిపోయాయి. టిక్కెట్లు దొరకడం అసాధ్యంగా మారింది. ప్రయాణం అమానవీయంగా తయారయ్యింది. చాలా రైళ్లు 200 శాతం సామర్థ్యంతో నడుస్తున్నాయి. ప్రయాణికులు రైలు తలుపుల దగ్గర వేలాడుతున్నారు’ అంటూ రాహుల్ ‘ఎక్స్’లో వీడియోను షేర్ చేశారు. కేంద్రంలోని బీజేపీ, బీహార్‌లో ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూలు పండుగ రద్దీని తగ్గించేందుకు 12 వేల ప్రత్యేక రైళ్లు నడుపుతన్నట్లు ప్రకటించాయని, అన్ని రైళ్లు ఎక్కడని రాహుల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి ఏటా పరిస్థితులు ఎందుకు దిగజారిపోతున్నాయి? బీహార్ ప్రజలు ఇలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో ఎందుకు ప్రయాణించాల్సి వస్తున్నదని రాహుల్ నిలదీశారు. त्योहारों का महीना है - दिवाली, भाईदूज, छठ।बिहार में इन त्योहारों का मतलब सिर्फ़ आस्था नहीं, घर लौटने की लालसा है - मिट्टी की खुशबू, परिवार का स्नेह, गांव का अपनापन।लेकिन यह लालसा अब एक संघर्ष बन चुकी है। बिहार जाने वाली ट्रेनें ठसाठस भरी हैं, टिकट मिलना असंभव है, और सफ़र… pic.twitter.com/hjrYJJFJ0F— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2025రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఉంటే వారు వేల కిలోమీటర్ల దూరం తిరగాల్సిన అవసరం లేదని, వీరంతా నిస్సహాయ ప్రయాణికులు మాత్రమే కాదని, ఎన్డీఏ మోసపూరిత విధానాలకు సజీవ సాక్ష్యం అని రాహుల్ పేర్కొన్నారు. కాగా పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీని నిర్వహించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అక్టోబర్ ఒకటి, నవంబర్ 30 మధ్య 12,011 ప్రత్యేక రైలు ట్రిప్పుల షెడ్యూల్‌ను ప్రకటించింది. సగటున, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు 196 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. -
‘త్వరలో రాహుల్ పెళ్లి.. స్వీట్స్‌కు ఆర్డర్’?.. సంబరంగా చెప్పిన దుకాణదారు
న్యూఢ్లిలీ: దేశమంతటా దీపావళి వేడుకలు ఎంతో ఆనందంగా జరిగాయి. ఈ సందర్భంగా చాలామంది పరస్పరం స్వీట్లను పంచుకుని అభినందనలు తెలియజేసుకున్నారు. ఈ నేపధ్యంలో ఒక ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది. దీపావళి వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందుకు మరోమారు పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఒక మిఠాయి దుకాణం యజమాని ఆ వివరాలు వెల్లడించారు.దీపావళి వేళ ఓల్డ్ ఢిల్లీలోని ప్రముఖ ఘంటేవాలా స్వీట్స్ దుకాణానికి మిఠాయిలు కొనుగోలు చేసేందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్‌తో జరిగిన సంభాషణను యజమాని సుశాంత్ జైన్ మీడియాకు తెలిపారు. ముందుగా ఆయన రాహుల్ గాంధీని భారతదేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా అభివర్ణించారు. ఆయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, తనకు అతని వివాహ స్వీట్ల ఆర్డర్ అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ దుకాణానికి ఎన్నో ఏళ్లుగా గాంధీ కుటుంబంతో అనుబంధం ఉందని, వారికి స్వీట్లు కావాల్సినప్పుడు తామే అందిస్తామని తెలిపారు. पुरानी दिल्ली की मशहूर और ऐतिहासिक घंटेवाला मिठाइयों की दुकान पर इमरती और बेसन के लड्डू बनाने में हाथ आज़माया।सदियों पुरानी इस प्रतिष्ठित दुकान की मिठास आज भी वही है - ख़ालिस, पारंपरिक और दिल को छू लेने वाली।दीपावली की असली मिठास सिर्फ़ थाली में नहीं, बल्कि रिश्तों और समाज… pic.twitter.com/bVWwa2aetJ— Rahul Gandhi (@RahulGandhi) October 20, 2025రాహుల్ తమ దుకాణానికి రాగానే తాను.. ‘రాహుల్ జీ.. దయచేసి త్వరలోనే పెళ్లి చేసుకోండి. మీ వివాహ స్వీట్ల ఆర్డర్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని’ అన్నానని తెలిపారు. రాహుల్ తమ దుకాణంలోకి వచ్చిక అతని తండ్రి, దివంగత ప్రధాని రాజీవ్‌ను గుర్తుచేసుకుంటూ, అతనికి ‘ఇమారి’ స్వీట్ ఇష్టమని చెప్పారన్నారు. అలాగే ఆయన దానిని తయారు చేసేందుకు ప్రయత్నించారన్నారు. రాహుల్‌కు బేసన్ లడ్డూ ఇష్టమని తెలుసుకున్న తాను.. అతనితో దానిని కూడా తయారు చేసేందుకు కూడా ప్రయత్నించమని చెప్పానని సుశాంత్ జైన్ తెలిపారు.దుకాణానికి వచ్చిన రాహుల్ అక్కడి సిబ్బంది ఆప్యాయంగా పలుకరించారు. పండుగను ఎలా చేసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ‘పాత ఢిల్లీలోని చారిత్రక ఘంటేవాలా స్వీట్ దుకాణంలో ఇమార్తి, బేసన్ లడ్డూలు తయారుచేశాను. ఈ షాపులోని శతాబ్దాల నాటి తీపిదనం ఇప్పటికీ మనసుకు హత్తుకునేలా ఉంది. అసలైన దీపావళి గొప్పదనం స్వీట్లలోనే కాదు, సంబంధాలు, సమాజంలో కూడా ఉంటుంది" అని రాహుల్ రాశారు. -
దళితుడిగా పుట్టడమే నేరమా?
కాన్పూర్: అధికార బీజేపీపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ పాలనలో దళితులపై అణచివేత నానాటికీ పెరిగిపోతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హరియాణాలో దళిత ఐపీఎస్ అధికారి వై.పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో దళితుడైన హరిఓం వాల్మీకిని దారుణంగా హత్య చేశారని, ఈ హత్యాకాండ మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని బెదిరించి గొంతు నొక్కేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని ఆరోపించాచారు. రాహుల్ గాంధీ శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హరిఓం తండ్రి, సోదరుడు, సోదరితో మాట్లాడారు. సంతాపం ప్రకటించారు. అధైర్యపడొద్దని, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాను ఇక్కడికి రాకుండా ఉత్తరప్రదేశ్ అధికారులు అడ్డంకులు సృష్టించారని రాహుల్ ధ్వజమెత్తారు. దేశంలో దళితులపై విచ్చలవిడిగా దాడులు జరుగున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన తొలుత మీడియాతో మాట్లాడారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆ దేశంలో దళితుడిగా జని్మంచడమే నేరమా? అనే ప్రశ్న బాధితుల కళ్లల్లో కనిపిస్తోందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో దళితులపై అకృత్యాలకు పాల్పడిన నేరగాళ్లను కాపాడడం, బాధితులనే శిక్షించడం బీజేపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. న్యాయాన్ని గృహ నిర్బంధంలో ఉంచలేరని తేల్చిచెప్పారు. హరిఓం వాల్మీకి కుటుంబాన్ని వేధించడం ఇకనైనా మానుకోవాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. హరిఓం వాల్మీకి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దేశంలో ప్రతి బాధితుడికి, అణగారిన వర్గాలకు తన అండదండలు ఉంటాయన్నారు. ఈ పోరాటం కేవలం హరిఓం కోసం కాదని.. అన్యాయానికి తలవంచని ప్రతి గొంతుక కోసం పోరాడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు. 40 ఏళ్ల హరిఓం వాల్మీకిని ఈ నెల 2న రాత్రిపూట గ్రామస్థులు కొట్టిచంపారు. అతడిని దొంగగా భావించి దాడిచేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. -
నన్ను కలవొద్దని ఈ కుటుంబాన్ని బెదిరించారు: రాహుల్ గాంధీ
ఉత్తర ప్రదేశ్ రాయ్‌బరేలీలో గాంధీ జయంతి నాడు దొంగ అనే అనుమానంతో హరీఓం వాల్మీకి అనే దళితుడ్ని కొందరు కొట్టి చంపారు. ఈ ఘటన అక్కడ తీవ్ర దుమారం రేపింది. శుక్రవారం ఫతేపూర్‌లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యూపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను కలవొద్దని ఈ ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని బెదిరించిందని.. అది కుదరకపోవడంతో ఫేక్ ప్రచారానికి దిగిందని మండిపడ్డారాయన. దేశంలో దళితులపై దాడులు, హత్యలు, అఘాయిత్యాలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ కుటుంబం ఎలాంటి నేరం చేయలేదు. ఇది ఒక బాధిత కుటుంబం. కానీ వీళ్లేదో నేరస్తులన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నన్ను కలవొద్దని వీళ్లను పోలీసులు బెదిరించారు. వీళ్లను కనీసం ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదు. హరీఓం కుమార్తెకు శస్త్రచికిత్స అవసరం. వీళ్ల ఆంక్షలతో ఆమెకు కనీస వైద్యసేవలు అందడం లేదు. చర్యలు తీసుకోవాల్సింది నేరస్తుల మీద. వీళ్ల మీద కాదు. నేరస్తుల రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది అని యోగి సర్కార్‌పై మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రాజకీయ దుమారం రేగింది. మాకు మీ పరామర్శ అక్కర్లేదు.. ప్రభుత్వం తగినంత సాయం చేసింది అనే పోస్టర్లు అక్కడ వెలిశాయి. అయితే.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పోస్టర్లను చించేయగా.. బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంకోవైపు.. హరీఓం సోదరుడు, ఆ కుటుంబం పేరిట కొన్ని వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యింది. मृतक हरिओम वाल्मीकि के भाई ने Rahul Gandhi को Expose कर दिया।शर्मा आनी चाहिए कांग्रेस को।pic.twitter.com/UnKZrN1Tlf— Unfileterd Rencho (@UnfileterdR) October 17, 2025రాష్ట్ర మంత్రులు మా ఇంటికి వచ్చి పరామర్శించారు. మా సోదరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారు. నేరస్తులు జైల్లో ఉన్నారు. ప్రభుత్వ చర్యలతో మేం సంతృప్తిగానే ఉన్నాం. రాహుల్ గాంధీ సహా నేతలెవరూ మా ఇంటి వైపు రావొద్దు అంటూ ఆయన చెప్పడం అందులో ఉంది. పైగా బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయానే వాటిని పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ వీడియోలపై మీడియా నుంచి రాహుల్ గాంధీకి ప్రశ్న ఎదురైంది.ఇంతకు మించి దిగజారదు అనుకున్న ప్రతీసారి బీజేపీ ఇలానే చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. అది బలవంతంగా తీయించిన వీడియో అని, ఆ వీడియోను మోదీ అనుకూల మీడియా(Godi Media), బీజేపీ విపరీతంగా ప్రచారం చేస్తున్నాయని అన్నారాయన. అయితే కాసేపటికే రాహుల్‌ను కలవడం సంతోషంగా ఉందంటూ మరో వీడియో ఆ కుటుంబం పేరిట బయటకు రావడం గమనార్హం.Whenever you think that BJP can’t stoop lower than this, they set a new parameter. Hariom Valamiki family told Rahul Gandhi Ji that they were threatened by the BJP govt to not meet him and they were forced to say this on camera. That video was made viral by Godi media and BJP. pic.twitter.com/q42JsYrBxc— Shantanu (@shaandelhite) October 17, 2025అక్టోబర్ 2వ తేదీన జమునాపూర్ వద్ద హరీఓం వాల్మీని దొంగగా అనుమానించి కొందరు కొట్టి చంపారు. ఈ ఘటన యూపీ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. విమర్శల నేపథ్యంలో కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయించింది యోగి ప్రభుత్వం. అక్టోబర్ 11వ తేదీన బాధిత కుటుంబాన్ని యోగి పరామర్శించారు. ఆ కుటుంబం కార్చిన ప్రతీ కన్నీటి బొట్టుకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని ఆ సమయంలో భరోసా ఇచ్చారాయన. అంతేకాదు.. హరీఓం సోదరికి కాంట్రాక్ట్ బేస్ మీద స్టాఫ్ నర్స్‌గా ఉద్యోగం ఇప్పించారు. राहुल गांधी जी आज हमसे मिलने आए। वे हमारे लिए मसीहा हैं, हम चाहते हैं कि वे हमें न्याय दिलाएं। - हरिओम वाल्मिकी जी का परिवारअब बिलकुल चुप रह तू ।pic.twitter.com/wr7DkBZW5Y— Surbhi (@SurrbhiM) October 17, 2025ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిని అక్టోబర్ 10న ఎన్కౌంటర్లో పట్టుబడ్డాడు. ఇప్పటిదాకా 14 మందిని పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విమర్శల నేపథ్యంలో.. ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. జాతి కోణంలో ఈ ఘటనను చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. సోషల్ మీడియాలో చర్చ మాత్రం ఆగడం లేదు. -
ట్రంప్ ప్రకటన.. రాహుల్ విమర్శలు.. స్పందించిన కేంద్రం
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తోందని, ఇందుకుగానూ భారత ప్రధాని మోదీ నుంచి తనకు స్పష్టమైన హామీ అందిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారని రాహుల్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంధన దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ నోట్ రూపేణా స్పందించింది. అస్థిర పరిస్థితుల నడుమ.. వినియోగదారుల ప్రయోజనాలకే తమ ప్రాధాన్యం ఉంటుందని అందులో కేంద్రం స్పష్టం చేసింది(India Reacts On Trump Russia Oil Comments).మీడియా ప్రశ్నలకు బదులుగా.. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తాజా పరిణామాలపై ఒక నోట్ విడుదల చేశారు. చమురు సంబంధిత దిగుమతులు భారత్‌కు ఎంతో కీలకం. మార్కెట్ అస్థిరతల మధ్య ఇక్కడి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం మా ప్రధాన ధ్యేయం. అందుకే దిగుమతుల విధానాలు ఆ దిశగా రూపొందించబడ్డాయి.... స్థిరమైన ఇంధన ధరలు, భద్రతతో కూడిన సరఫరా.. ఇవే మా ద్వంద్వ లక్ష్యాలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, ఇంధన వనరుల విస్తరణ, వివిధ దేశాల నుంచి సరఫరా పొందడం జరుగుతోంది అని అందులో పేర్కొన్నారాయన. అలాగే..Our response to media queries on comments on India’s energy sourcing⬇️🔗 https://t.co/BTFl2HQUab pic.twitter.com/r76rjJuC7A— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2025అమెరికాతో సంబంధం గురించి మాట్లాడుతూ.. గత దశాబ్దంగా ఇంధన సహకారం పెరుగుతోంది. ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం భారత్‌తో సహకారం మరింతగా అభివృద్ధి చేయాలనే ఆసక్తి చూపుతోంది. చర్చలు కొనసాగుతున్నాయి అని జైస్వాల్ అందులో తెలిపారు. తద్వారా.. అంతర్జాతీయ ఒత్తిడులకు కాకుండా దేశ ప్రయోజనాల ఆధారంగా భారత్ ముందుకు వెళ్తుందని మరోసారి భారత్ స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధం(Ukraine Crisis) ముగింపు దిశగా కీలక అడుగు పడిందని, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయబోతోందని, మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటనపై రాహుల్ గాంధీ భగ్గుమన్నారు. ట్రంప్ నుంచి సానుకూల స్పందన లేకపోయినా తరచూ అభినందన సందేశాలు ఎందుకంటూ మోదీని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ తరుణంలో కౌంటర్‌గా కేంద్రం నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.ఇదీ చదవండి: మోదీ నన్ను ప్రేమిస్తారు.. అంటే మరోలా కాదు! -
బీహార్ కూటమిలో తేలని సీట్ల లెక్క.. లాలూను అడ్డుకున్న తేజస్వీ
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఆర్జేడీ–కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్లో అస్పష్టత కొనసాగుతోంది. అధికార ఎన్డీయేలోని ప్రధాన పక్షం బీజేపీ ఇప్పటికే 71 స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించగా ఇండియా కూటమి ఇంకా పోటీచేసే స్థానాలపైనే సిగపట్లు పడుతోంది. మరో రెండ్రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో బుధ, గురువారాల్లో ఈ అంశాన్ని తేల్చాలని మిత్రపక్షాలు తేల్చి చెబుతున్నాయి.రాష్ట్రంలోని మొత్తం 243 సీట్లకు గానూ కాంగ్రెస్ గతేడాది పోటీ చేసిన సంఖ్యతో సమానంగా సీట్లను కోరుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లలో పోటీచేసి 19 చోట్ల నెగ్గింది. ఈసారి సైతం తమకే అంతే స్థానాలను కోరుతుండగా, ఆర్జేడీ మాత్రం 54–55 సీట్లకు మాత్రమే ఆఫర్ ఇస్తోంది. ఇదే అంశమై సోమవారం ఏఐసీసీ పెద్దలతో జరిగిన చర్చల సందర్భంగా మరో 3 స్థానాలు ఇచ్చేందుకు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, తమకు కనీసంగా 65 స్థానాలైనా ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టినట్లు సమాచారం. దీనిపై బుధ, గురువారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.తేజస్వీ జోక్యంతో టికెట్లు ఇవ్వడం ఆపేసిన లాలుఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ సోమవారం రాత్రి పార్టీ నేతలకు టికెట్లు ఇవ్వడం ప్రారంభించారు. ఇది సరైన విధానం కాదంటూ కుమారుడు తేజస్వీ యాదవ్ అడ్డుకోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అప్పటికే టికెట్లు అందుకున్న నేతలు తిరిగి ఇవ్వాలని తేజస్వి కోరారు. ఇందుకు స్పందించింది కొందరే. గత వారమే జేడీయూ నుంచి ఆర్జేడీలో చేరిన సునీల్ సింగ్ మంగళవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. టికెట్ల వ్యవహారంపై ఆర్జేడీ, కాంగ్రెస్ నేతల మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా నడుస్తున్నాయి. -
ఐపీఎస్ పూరన్ కుటుంబ సభ్యులకు రాహుల్ పరామర్శ
చండీగఢ్: హర్యానా కేడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ వై. పురాన్ కుమార్ ఆత్మహత్యపై తక్షణమే విచారణ జరపాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన చండీగఢ్‌లోని పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరేళ్ల నుంచి పురన్పై వివక్షత చూపుతున్నారని మండిపడ్డారు. డ్రామాలు ఆపి పూరన్ అంత్యక్రియలు నిర్వహించాలంటూ బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో ప్రపంచానికి తెలియాలని రాహుల్ అన్నారు. ఈ నెల 7న పూరన్‌కుమార్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా, ఉన్నతాధికారుల వేధింపులే ఆత్మహత్యకు కారణమంటూ ఎనిమిది పేజీల సూసైడ్ లెటర్లో పేర్కొన్నారు. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హోదాలో పురాన్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా హర్యానా పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి కుమార్ కూడా ఆ రాష్ట్ర కేడర్లోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె విధుల్లో భాగంగా విదేశాల్లో ఉన్నారు. భర్త మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఆమె.. భారత్‌కు పయనమయ్యారు.అయితే, తన భర్త మరణానికి కారణమైన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ పురాన్ కుమార్ భార్య అమ్నీత్ పీ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా భర్త ఐపీఎస్ పురాన్ కుమార్‌ను పోలీస్ శాఖలో పనిచేసి రిటైరైన ఉన్నాతాధికారులు, పలువురు పనిచేస్తున్న వారు వేధింపులకు గురి చేయడం,అవమానించడంతో పాటు మానసిక హింసకు గురి చేశారని వాపోయారు. అందుకే ఆయన మరణించినా.. చండీగఢ్ పోలీసులు పట్టించుకోలేదని అమ్నీత్ పీ కుమార్ ఆరోపించారు. -
Bihar Elections : 40 ఏళ్ల తర్వాత రెండు దశలు.. మరిన్ని ఆసక్తికర సంగతులు
న్యూఢిల్లీ: రాబోయే 38 రోజుల్లో దేశంలోని అందరి దృష్టి బీహార్‌పైనే ఉండనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీని సోమవారం ప్రకటించారు. మొదటి దశలో బీహార్‌లోని 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. మిగిలిన స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. బీహార్‌లో 40 ఏళ్ల తర్వాత రెండు దశల్లో పోలింగ్ జరగబోతోంది.ఆపరేషన్ సిందూర్, జీఎస్టీ సంస్కరణలు, ఓటు చోరీ లాంటి ప్రతిపక్షాల ఉద్యమాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నిర్దేశించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. బీహార్‌లో ఎన్నికల ఏర్పాట్ల విషయానికొస్తే రాష్ట్రంలో మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బూత్‌కు 1,200 కు మించి ఓటర్లు ఉండరు. పోలింగ్ బూత్‌లలో 100 శాతం వెబ్‌కాస్ట్ చేయనున్నారు. ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయి. ఓటర్లు తన మొబైల్ ఫోన్లను బూత్‌కు తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.పోలింగ్ ఏజెంట్లు బూత్ సెంటర్ నుండి 100 మీటర్ల దూరంలో ఉండేందుకు అనుమతిస్తారు. బ్యాలెట్ పేపర్లపై సీరియల్ నంబర్లు బోల్డ్ అక్షరాలతో ఉంటాయి. ఓటర్ స్లిప్‌లలో బూత్ నంబర్ కూడా బోల్డ్ అక్షరాలతోనే ఉంటుంది. ఫారమ్ 17సీ, ఈవీఎం డేటా అందుబాటులో లేకపోతే వీవీపాట్ లెక్కింపు తప్పనిసరి. ప్రతి రెండు గంటలకు రియల్-టైమ్ ఓటరు ఓటింగ్‌ను అప్డేట్ చేస్తారు.ఎవరి సంగతి ఏమిటి?నితీష్ కుమార్.. రికార్డు స్థాయిలో 10వ సారి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం.తేజస్వి యాదవ్.. 20 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేందుకు మరో అవకాశం.రాహుల్ గాంధీ .. తన ఓటు చోరీ నినాదానికి ప్రజల ఆమోదం పొందే ఛాన్స్ప్రశాంత్ కిషోర్.. ఓట్లు చీలుస్తారా? కింగ్ మేకర్ అవుతారా? అనేది తేలనుంది.చిరాగ్ పాస్వాన్.. బీహార్‌లో తన పార్టీ ఉనికిని బలోపేతం చేసేందుకు అవకాశం.ఒవైసీ.. అనుకున్న స్థాయిలో ముస్లిం ఓట్లను పొందగలరా? అనేది తేలనుంది.నితీష్‌కు నిజమైన పరీక్షఫలితాల సమయంలో అందరి దృష్టి నితీష్ కుమార్ పైనే ఉండనుంది. తేజస్వి యాదవ్ తరచూ నితీష్ కుమార్ ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.లాలూ కుటుంబంలో అంతర్గత పోరులాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అతని సోదరి రోహిణి ఆచార్య తన సోదరునిపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.మహిళల చేతుల్లో ఫలితాలు?బీహార్ ఎన్నికల ఫలితాలను మహిళలే నిర్ణయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని లక్షలాది మహిళల ఖాతాలలో నితీష్ కుమార్ ఇప్పటికే ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున జమచేశారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.2,500 అందించాలనే ప్రతిపక్షాల ప్రయత్నాన్న ఇది గండికొట్టనున్నదని పలువురు అంటున్నారు. ఇన్ని అంశాల మధ్య రాబోయే 11 రోజులు బీహార్‌కు అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. అక్టోబర్ 17 మొదటి దశ నామినేషన్లకు చివరి తేదీ. ఈ లోపునే, సీట్ల కేటాయింపు, పార్టీల సమీకరణలు స్పష్టం కానున్నాయి. -
అది భారత్‌కు అతిపెద్ద ముప్పు.. విదేశీ గడ్డపై రాహుల్
బొగోటా: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. నరేంద్ర మోదీ పాలనలోని భారత్‌లో ప్రజాస్వామ్య దాడులు జరుగుతున్నాయంటూ విమర్శించారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది దేశంలో ప్రజాస్వామ్మంపై జరుగుతున్న దాడేనంటూ మండిపడ్డారు. కొలంబియాలో ఈఐఏ యూనివర్శిటీలో విద్యార్థులను రాహుల్ కలిశారు. దీనిలో భాగంగా ప్రసంగించిన రాహుల్.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంపై విమర్శలే లక్ష్యంగా మాట్లాడారు. ‘ ప్రజాస్వామ్యం అనేది ప్రతీ ఒక్కరికీ చోటును కల్పిస్తుంది. కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్యంపై అన్ని వైపుల నుంచి దాడులు జరగుతున్నాయి. భారత దేశ జనాభా 140 కోట్లు ఉంది. చైనా పరంగా చూస్తే భారత్ అనేది పూర్తిగా భిన్నం. చైనా అనేది కేంద్రీకృత వ్యవస్థలా ఏకరీతిలో ఉంది. భారత్ వికేంద్రీకృతమై ఉంది. సంస్కృతులు, సంప్రదాయాలు మరియు మతాలను కలిగి ఉంది. భారతదేశం చాలా సంక్లిష్టమైన వ్యవస్థను కలిగి ఉంది. చైనా చాలా కేంద్రీకృతమై, ఏకరీతిగా ఉంది. భారతదేశం వికేంద్రీకృతమై ఉంది బహుళ భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలను కలిగి ఉంది. భారతదేశం చాలా సంక్లిష్టమైన వ్యవస్థను కలిగి ఉంది. ప్రపంచానికి ఏమి కావాలో దాన్ని సమకూర్చే శక్తి భారత్ వద్ద ఉంది. కానీ పరిస్థితి మరోలా ఉంది. ప్రస్తుత భారత్ ఒకే లైన్లో లేదు. నాయకులు తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. వాటిని సరిదిద్దుకోవాలి. అందులో ప్రధానమైనది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి ఒకటి’ అంటూ విమర్శించారు.రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ ప్రచార ఆర్భాట నాయకుడే తప్ప ఏమీ లేదంటూ కౌంటరిచ్చింది. విదేశీ గడ్డపై భారత్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడమే ఇందుకు నిదర్శమనమంటూ ధ్వజమెత్తింది. భారత్‌లో జరుగుతున్న అభివృద్ధి రాహుల్ కనిపించడం లేదా అంటూ ప్రశ్నించింది. ప్రపంచ పటంలో భారత్ గణనీయ అభివృద్ధి రాహుల్‌కు కనబడటం లేనట్లుంది అంటూ ఎద్దేవా చేసింది. -
కరూర్ తొక్కిసలాటలో 41కి చేరిన మరణాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో సుగుణ అనే మహిళ సోమవారం మృతి చెందింది. చికిత్స పొందుతున్న వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారు కోలుకుంటున్నారు. బాధిత కుటుంబాలను కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ సోమవారం పరామర్శించారు. ఘటనపై విచారణ అధికారిగా ఉన్న డీఎస్పీ సెల్వరాజ్‌ను తప్పించి ఆయన స్థానంలో ఏడీఎస్పీ ప్రేమానంద్‌ను తమిళనాడు ప్రభుత్వం నియమించింది. సోమవారం ఎఫ్ఐఆర్లో విజయ్ ఆలస్యంగా రావడం, పోలీసులు విధించిన నిబంధనల్ని తుంగలో తొక్కడం, సభకు వచి్చన జనం నీళ్లు, ఆహారం లేకపోవడం వల్ల నీరసించిపోతున్నారని, రద్దీ మరింత పెరిగితే ఊపిరి ఆడకపోవచ్చని తాము పదేపదే హెచ్చరించినా నిర్వాహకులు ఖాతరు చేయకపోవడంతోనే ఇంత పెద్ద ఘోరం జరిగినట్టు పేర్కొనడం గమనార్హం. ఇదిలావుండగా.. కరూర్ ఘటన గురించి సీఎం స్టాలిన్ వీడియో విడుదల చేస్తూ, జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాల సమావేశాలకు కొత్త మార్గదర్శకాలను రూపకల్పన చేసి ప్రజల ప్రాణ రక్షణ దిశగా నిబంధనలు కఠినం చేస్తామని స్టాలిన్ పేర్కొన్నారు. హైకోర్టును ఆశ్రయించిన నటుడు విజయ్ తొక్కిసలాట ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనాన్ని సోమవారం ఆశ్రయించారు. ఆయన తరపున టీవీకే ఉప ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున తరపున న్యాయవాదులు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారని, రాళ్లు రువ్వారని, పోలీసులు లాఠీచార్జి చేశారని పేర్కొంటూ స్థానిక డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీపై సైతం అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు అంశాలను పిటిషన్లో ప్రస్తావించారు. కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని కోరారు. బాధితులను పరా>మర్శించడానికి విజయ్‌కు అనుమతి ఇవ్వాలని, గట్టి భద్రతకు ఆదేశించాలని కోరారు. అత్యవసరంగా విచారించాలని కోరినా.. అక్టోబరు 3వ తేదీన విచారించేందుకు ధర్మాసనం నిర్ణయించింది. తాజా ఘటన నేపథ్యంలో విజయ్ పార్టీ గుర్తింపు రద్దుకు ఆదేశించాలని కోరుతూ మధురైకు చెందిన న్యాయవాది సెల్వకుమార్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా.. చెన్నై శివారులోని పనయూరు నివాసంలో ఉండే విజయ్ సోమవారం హఠాత్తుగా నగరం నడ్డిబొడ్డున ఉన్న పట్టినంబాక్కం నివాసానికి మకాం మార్చారు. కరూర్ ఘటనపై విజయ్‌తో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఫోన్లో మాట్లాడారు. కాగా.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన ఆడిటర్ గురుమూర్తిని టీవీకే సంయుక్త కార్యదర్శి నిర్మల్‌కుమార్ నేతృత్వంలోని బృందం చెన్నైలో కలిసినట్టు సమాచారం. బీజేపీ ఎంపీ హేమమాలిని నేతృత్వంలో కరూర్ ఘటనపై విచారణకు బీజేపీ అధిష్టానం కమిటీని నియమించినట్టు తెలిసింది. ఉరేసుకున్న టీవీకే పార్టీ నేత కరూర్‌లో తమ పార్టీ నేత ప్రచారం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన విల్లుపురం జిల్లా వీరపట్టుకు చెందిన టీవీకే పార్టీ నాయకుడు అయ్యప్ప (26) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు రాసిపెట్టిన లేఖ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
‘రాహుల్ ప్రాణాలకు ముప్పు’.. అమిత్ షాకు కాంగ్రెస్ సంచలన లేఖ
న్యూఢిల్లీ: ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని, ఏబీవీపీ మాజీ నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన నేతపై వెంటనే చర్యలు తీసుకోకపోతే లోక్‌సభలో ప్రతిపక్ష నేతపై హింసకు పాల్పడినట్లు నిర్ధారణ అవుతుందని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. ఆ లేఖలో కేసీ వేణుగోపాల్ ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రింటు మహదేవ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై హత్యా బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మహదేవ్ బీజేపీ ప్రతినిధి అని, ఒక మలయాళ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ విధమైన వ్యాఖ్యలు చేశారన్నారు. రాహుల్ గాంధీని ఛాతీపై కాల్చి చంపాలని మహదేవ్ బహిరంగ ప్రకటన చేశారని, ఇది ఎంతమాత్రం నోరు జారడం కాదని, పొరపాటు, అతిశయోక్తి అంతకన్నా కాదన్నారు. ఇది ప్రతిపక్ష నేత, దేశంలోని అగ్ర రాజకీయ నాయకులలో ఒకరైన వ్యక్తికి ఎదురైన హత్యా బెదిరింపని వేణుగోపాల్ పేర్కొన్నారు.బీజేపీ అధికార ప్రతినిధి ఇలాంటి విషపూరిత మాటలు మాట్లాడటం చూస్తుంటే రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఏర్పడటమే కాకుండా, రాజ్యాంగం ప్రకారం ప్రతీ పౌరునికి ఇవ్వవలసిన ప్రాథమిక భద్రతా హామీలకు భంగం వాటిల్లినట్లు అవుతుందని వేణుగోపాల్ అన్నారు. కాగా రాహుల్ గాంధీ భద్రతను పర్యవేక్షిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఇటీవల రాహుల్ గాంధీ భద్రతకు ముప్పు ఉందని హోంశాఖకు పలు లేఖలు రాసిందని వేణుగోపాల్ గుర్తు చేశారు. అలాగే సీఆర్పీఎఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన ఒక లేఖ అనుమానాస్పద పరిస్థితుల్లో మీడియాకు లీక్ అయ్యిందని అన్నారు. రాహుల్ గాంధీని తమ హక్కుల పరిరక్షకునిగా భావిస్తున్న లక్షలాది మంది భారతీయులు ఆయనకు ప్రాణహాని ఉందని తెలిసి, తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి ఎదురైన బెదిరింపు కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిపై జరిగిన దాడి అని అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని, అందుకే దీనిపై హోంశాఖ త్వరగా, నిర్ణయాత్మకంగా, బహిరంగంగా చర్య తీసుకోవడంలో విఫలమైతే, ఈ చర్యకు సహకరించినట్లు అవుతుందని వేణుగోపాల్ పేర్కొన్నారు. -
బీహార్‌లో విజయానికి.. రాహుల్ 10 పాయింట్ల ప్రణాళిక
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే, రూ. 25 కోట్లకు పైగా విలువైన ప్రైవేట్, ప్రభుత్వ కాంట్రాక్టులలో అత్యంత వెనుకబడిన తరగతులకు (ఈబీసీ) రిజర్వేషన్లు కల్పిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. పట్నాలో జరిగిన అతి పిచ్రా న్యాయ సంకల్ప్ సింపోజియంలో రాహుల్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తామని హామీనిచ్చారు.నేటికీ ఈ దేశంలో అత్యంత వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలవారు ఉన్నారు. వారిలోని అర్హులైనవారికి అన్నింటా భాగస్వామ్యం లభించడం లేదు. దేశం అంతటా ఇలానే ఉంది. తాము కుల గణన నిర్వహించి, ఈ దేశంలో దళితులు, అత్యంత వెనుకబడిన తరగతుల నిజమైన జనాభాను చూపించాలనుకుంటున్నామని రాహుల్ పేర్కొన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై విమర్శలు గుప్పిస్తూ, జేడీయూ ప్రభుత్వం ఈబీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు. న్యాయ సంకల్ప్ సింపోజియంలో పది అంశాల తీర్మానాన్ని రాహుల్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు దీనిని అమలు చేస్తామని తెలిపారు. ‘ఎక్స్’లో కాంగ్రెస్ పోస్ట్ లోని వివరాల ప్రకారం పది అంశాలు.. VIDEO: “A ten-point resolution was passed at the 'Ati Pichra Nyay Sankalp' symposium today, to be implemented when the INDIA bloc comes to power in Bihar,” said Congress leader and Lok Sabha LoP Rahul Gandhi (@RahulGandhi).(Full video available on PTI Videos -… pic.twitter.com/HQgqtsST1x— Press Trust of India (@PTI_News) September 24, 20251. అత్యంత వెనుకబడిన తరగతులపై దురాగతాల నివారణ చట్టానికి ఆమోదం.2. పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో ఈబీసీలకు రిజర్వేషన్లను 20శాతం నుండి 30శాతానికి పెంచడం.3. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయడానికి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌ను సవరించడం.4. నియామకాలలో సముచితమైనది కాదు (ఎన్ఎఫ్ఎస్) నిబంధన చెల్లదని ప్రకటించడం.5. ఈబీసీ జాబితా రూపకల్పనలో సమతుల్యానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం.6. భూమిలేని కుటుంబాలకు భూమిని కేటాయించడం. 7. పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఈబీసీల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు.8. విద్యా హక్కు చట్టం (2010) కింద ప్రైవేట్ పాఠశాలల్లో రిజర్వ్ చేసిన సీట్లలో సగం ఈబీసీ, ఓబీసీ, దళిత, గిరిజన వర్గాల పిల్లలకు కేటాయింపు.9 రూ.25 కోట్ల వరకు ప్రభుత్వ కాంట్రాక్టులలో ఈబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించడం.10. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(5) కింద అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలలో రిజర్వేషన్లను వర్తింపజేయడం.బీహార్ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ప్రముఖ పార్టీల మధ్య సీట్ల పంపకాల చర్చలు కొనసాగుతున్నాయి. -
ఓట్ల చోరీతో నిరుద్యోగం
న్యూఢిల్లీ: దేశంలో ఓట్ల చోరీ జరుగుతున్నంత కాలం నిరుద్యోగం, అవినీతి పెరిగిపోతూనే ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. ఓట్ల దొంగతనాన్ని, ఉద్యోగాల దొంగతనాన్ని యువత ఇక సహించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ మంగళవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశవ్యాప్తంగా యువత నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం అని వివరించారు. నిజంగా ప్రజల విశ్వాసం పొంది, వారి ఓట్లతో అధికారంలోకి వచి్చన ఏ ప్రభుత్వమైనా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తుందని తెలిపారు. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిజాయతీగా, ప్రజల మద్దతుతో అధికారంలోకి రాలేదని స్పష్టంచేశారు. ఓట్లను దొంగిలించి, వ్యవస్థలను శాసించి అధికారంలోకి వచి్చందని ఆరోపించారు. అందుకే దేశంలో నిరుద్యోగంలో గరిష్ట స్థాయికి చేరిందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితి రావడంతో గత 45 ఏళ్లలో ఇదే మొదటిసారి అని వెల్లడించారు. ఉద్యోగాల సంఖ్య నానాటికీ తగ్గిపోతోందని, నియామక ప్రక్రియ కుప్పకూలిందని, ఫలితంగా యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. అదే అసలైన దేశభక్తి చక్కటి భవిష్యత్తు కోసం, కలలు నిజం చేసుకోవడం కోసం యువత కష్టపడి పని చేస్తున్నారని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం వారిని పట్టించుకోకుండా ప్రచారాన్నే నమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రముఖులు, బడా బాబుల నుంచి ప్రశంసలు, కీర్తనలు పొందుతూ మోదీ మురిసిపోతున్నారని విమర్శించారు. మోదీ పాలనలో ధనవంతులే మరింత బాగుపడుతున్నారని, సాధారణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆక్షేపించారు. నిరుద్యోగం, ఓట్ల చోరీ నుంచి భారత్‌కు విముక్తి కల్పించడమే అసలైన దేశభక్తి అని ఉద్ఘాటించారు. -
H1B ఎఫెక్ట్.. బలహీన ప్రధాని అంటూ మోదీపై విమర్శలు
న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల వార్షిక ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచినా మౌనంగా ఉండిపోయిన ప్రధాని మోదీ నిజంగానే బలహీన ప్రధాని అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగోయ్ తమ తమ సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాల్లో పోస్ట్‌లు పెట్టారు.‘నేను మరోసారి చెబుతున్నా. భారత్‌కు ఉన్నది కేవలం బలహీన ప్రధాని మాత్రమే’ అని రాహుల్ విమర్శించారు. ‘మోదీజీ.. పుట్టినరోజు నాడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ట్రంప్ నుంచి మీకు ఫోన్‌కాల్ వచ్చింది. కానీ రిటర్న్ గిఫ్ట్‌గా లక్ష డాలర్ల రుసుం భారం భారతీయులపై పడింది’ అని ఖర్గే అన్నారు. ‘‘నాడు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తరఫున పాల్గొని ‘మరోసారి ట్రంప్ సర్కార్’ అని మీరే నినదించారు. అందుకే రిటర్న్ గిఫ్ట్‌గా లక్షడాలర్ల వార్షిక ఫీజు భారం భారతీయ టెక్ ఉద్యోగులపై పడింది. ఇప్పటికే 50 శాతం టారిఫ్ పడుతోంది. దీంతో 10 కీలక రంగాల్లో భారత్ రూ.2.17 లక్షల కోట్ల ఆదాయాన్ని నష్టపోతోంది. ఇవి చాలవన్నట్లు భారత్‌పై 100 శాతం టారిఫ్ మోపాలని ఐరోపా సమాఖ్యను ట్రంప్ ఉసిగొల్పుతున్నారు.విదేశీ అగ్రనేతలు కనబడగానే గట్టిగా ఆలింగనాలు చేసుకోవడం, ప్రాసలు వినిపించేలా నినాదాలు ఇవ్వడం, పెద్ద సభలు ఏర్పాటుచేయడం, ఆ సభల్లో మోదీ, మోదీ అని బిగ్గరగా నినా దాలు ఇప్పించుకోవడం సరైన విదేశాంగ విధానం అనిపించుకోదు’ అని మోదీపై ఖర్గే విమర్శలు గుప్పించారు. ‘భారతీయ ప్రతిభావంతులు, అత్యున్నత నైపుణ్యాలున్న సిబ్బంది భవిష్యత్తును అమెరికా ప్రభుత్వం నాశనం చేస్తోంది. ఇంతటి రుసుముల భారం మోపినా మోదీ మౌనంగా ఉండటం ఆయన బలహీనతను రుజువుచేస్తోంది’అని గౌరవ్ గొగోయ్ అన్నారు. ‘నేరుగా చర్చల వేళ హెచ్–1బీ వీసాల విషయంలో నాటి ట్రంప్ ప్రభుత్వం ఆనాడు మోదీకి ఎలాంటి హామీ ఇవ్వలేదని 2017లోనే రాహుల్‌గాంధీ బయటపెట్టారు. ఇప్పుడు అది నిజమని నిరూపితమైంది’ అని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా అన్నారు. -
ఓట్ చోరీ వ్యవహారం.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
గుల్బర్గా: ‘అలంద్’లో ఓట్ల తొలగింపు ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలంద్ నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 6,018 ఓట్లను తొలగించారంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ క్రమంలో కర్ణాటక సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది.గురువారం (సెప్టెంబర్ 18) ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో మీడియాతో మాట్లాడిన రాహుల్.. కర్ణాటకలోని కాంగ్రెస్‌కు బలం ఉన్న పోలింగ్ బూత్‌లను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. అక్కడే ఓట్లను తొలగించేందుకు కుట్రలు సాగించారన్నారు. ‘‘ఓట్లు అత్యధికంగా తొలగింపునకు గురైన టాప్–10 బూత్‌లు కాంగ్రెస్‌కు బలం ఉన్నవే. 2018లో ఈ పదింటిలో ఎనిమిది బూత్‌లను కాంగ్రెస్ గెలుచుకుంది. మహారాష్ట్రలోని రాజురా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ సాయంతో 6,850 మంది ఓటర్లను మోసపూరితంగా చేర్చారు. ఇదే సాఫ్ట్‌వేర్‌ను హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్‌లోనూ ఉపయోగించారు. దానిపై మావద్ద ఆధారాలున్నాయి’’ అంటూ రాహుల్ చెప్పుకొచ్చారు.కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల దొంగలకు యథేచ్ఛగా సహకరిస్తోందని మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఓట్ల చోరులను కాపాడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో వ్యవస్థీకృతంగా ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల చోరీపై తాను బయటపెట్టిన నిజాలు హైడ్రోజన్ బాంబు కాదని రాహుల్ వెల్లడించారు. త్వరలో నిజాలు బయటపెడతానని, బాంబు పేలుస్తానని అన్నారు. -
ఆన్లైన్లో ఓట్లు తొలగించడం సాధ్యం కాదు
న్యూఢిల్లీ: ఓట్ల చోరీ జరుగుతోందని, ఓట్ల దొంగలను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కాపాడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఖండించింది. అందులో ఏమాత్రం వాస్తవం లేదని, రాహుల్ నిరాధార ఆరోపణలు చేశారని తేలి్చచెప్పింది. ఆన్లైన్లో ఓట్లను తొలగించడం సాధ్యం కాదని పేర్కొంది. ఎవరి ఓటునైనా తొలగించాలనుకుంటే వారి వాదన తప్పనిసరిగా వింటామని వెల్లడించింది. సంప్రదించి అభిప్రాయం తెలుసుకోకుండా ఓటును తొలగించే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. సామాన్య ప్రజలు ఆన్లైన్లో తమ ఓటును తొలగించుకోలేరని వివరణ ఇచి్చంది. రాహుల్ చెబుతున్నదాంట్లో నిజం లేదని తెలియజేసింది. 2023లో కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు కొందరు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలం కాలేదని పేర్కొంది. దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు వివరించింది. అలంద్‌లో 2018లో బీజేపీ, 2023లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు గుర్తుచేసింది. అక్కడ ఓట్ల తొలగింపునకు జరిగిన ప్రయత్నాలకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని 2023 సెపె్టంబర్ 6న పోలీసులకు ఇచ్చామని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓట్లు తొలగించాలంటూ వచి్చన దరఖాస్తులను పరిశీలించగా 24 మాత్రమే అసలైనవని, 5,994 తప్పుడు దరఖాస్తులేనని తేలినట్లు తెలిపింది. తప్పుడు దరఖాస్తులను తిరస్కరించామని, ఓట్లను తొలగించలేదని పేర్కొంది. -
ఓట్ల దొంగలకు ఈసీ అండ
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల దొంగలకు యథేచ్ఛగా సహకరిస్తోందని మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఓట్ల చోరులను కాపాడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూ నీ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో వ్యవస్థీకృతంగా ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. గురువా రం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఓట్ల చోరీని బహిర్గతం చేస్తూ తెరపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఓటర్ల జాబితా నుంచి తమ పేర్ల తొలగింపు కోసం దరఖాస్తు చేసినట్లుగా ఎన్నికల సంఘం చెబుతున్న వ్యక్తులు సైతం వేదికపైకి వచ్చారు. నిజానికి వారు ఎలాంటి దరఖాస్తు చేయలేదు. వారి పేరిట ఇంకెవరో దరఖాస్తు చేశారు. ఓట్ల చోరీపై తాను బయటపెట్టిన నిజాలు హైడ్రోజన్ బాంబు కాదని రాహుల్ వెల్లడించారు. త్వరలో నిజాలు బయటపెడతానని, బాంబు పేలుస్తానని అన్నారు. రాహుల్ ఏం మాట్లాడారంటే... ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్‌తో... ‘‘కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 6,018 ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్‌కు బలం ఉన్న పోలింగ్ బూత్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. అక్కడే ఓట్లను తొలగించేందుకు కుట్రలు సాగించారు. ఓట్లు అత్యధికంగా తొలగింపునకు గురైన టాప్–10 బూత్‌లు కాంగ్రెస్‌కు బలం ఉన్నవే. 2018లో ఈ పదింటిలో ఎనిమిది బూత్‌లను కాంగ్రెస్ గెలుచుకుంది. మహారాష్ట్రలోని రాజురా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ సాయంతో 6,850 మంది ఓటర్లను మోసపూరితంగా చేర్చారు. ఇదే సాఫ్ట్‌వేర్‌ను హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్‌లోనూ ఉపయోగించారు. దానిపై మావద్ద ఆధారాలున్నాయి. సీఐడీకి ఆధారాలివ్వడానికి భయమెందుకు? కర్ణాటకలో ఓట్ల చోరీపై ఫిర్యాదు చేశాం. దీనిపై రాష్ట్ర సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని ఆధారాలు ఇవ్వాలని అధికారులు 18 నెలల్లో ఎన్నికల సంఘానికి 18 లేఖలు రాస్తే ఇప్పటికీ స్పందించలేదు. ఎన్నికల సంఘం ఆధారాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఆధారాలిస్తే ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నది ఎవరో తెలిసిపోతుంది కాబట్టి భయపడుతున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఇప్పటికైనా నోరువిప్పాలి. ఆయన సక్రమంగా విధులు నిర్వర్తించాలి. సీఐడీ దర్యాప్తును అడ్డుకొనే ప్రయత్నం చేయొద్దు. సీఐడీకి వారం రోజుల్లోగా ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాజ్యాంగాన్ని హత్య చేయడానికి ఎన్నికల సంఘం సహకరిస్తున్నట్లేనని భావిస్తాం. ఓట్ల దొంగతనాన్ని ఇకనైనా ఆపాలని కోరుతున్నాం. వ్యతిరేకుల ఓట్లే టార్గెట్ మన దేశంలో ఎన్నికలను ఎలా రిగ్గింగ్ చేస్తున్నారో కొన్ని రోజులుగా యువతకు తెలియజేస్తున్నా. అందులో ఈరోజు మరో మైలురాయి. ఓట్ల తొలగింపు అనేది అనుకోకుండా జరుగుతున్నది కాదు. దేశవ్యాప్తంగా వ్యతిరేకుల ఓట్లను ఒక పద్ధతి ప్రకారం టార్గెట్ చేస్తున్నారు. మైనార్టీలు, దళితుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారు. ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌ను వాడుకోవడంతోపాటు తప్పుడు దర ఖాస్తులు సమర్పిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లను వాడుకుంటున్నారు. ప్రతిపక్షాలకు బలం ఉన్న ప్రాంతాల్లో లక్షలాది ఓట్లు గల్లంతవుతున్నాయి. ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తును పూరించడం సాఫ్ట్‌వేర్‌తో సెకండ్లలోనే పూర్తయిపోతోంది. తెల్లవారుజామునే ఇది జరుగుతోంది. మరోవైపు నకిలీ వ్యక్తులు అసలైన ఓటర్ల ముసుగులో రంగ ప్రవేశం చేస్తున్నారు. తమ ఓట్లు తొలగించాలంటూ తప్పుడు పత్రాలతో దరఖాస్తులు సమరి్పస్తున్నారు. ఓట్ల చోరీపై మా దగ్గర 100 శాతం కచ్చితమైన ఆధారాలున్నాయి. నేను నా దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రేమిస్తున్నా. వాటిని కాపాడుకోవడానికి పోరాటం సాగిస్తా’’ అని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలి దేశంలో రాజ్యాంగబద్ధ సంస్థలు వాటి విధులు సరిగ్గా నిర్వర్తించడం లేదు. అందుకే న్యాయ వ్యవస్థ సహా ఇతర విభాగాలు జోక్యం చేసుకోవాలి. పరిస్థితిని చక్కదిద్దాలి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఓట్ల చోరులను, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేవారిని కాపాడుతున్నారు. నేను ప్రతిపక్ష నేతను. ఈ విషయం మామూలుగా చెప్పడం లేదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కొందరు హైజాక్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలి. నేను నిజాన్ని మాత్రమే చూపించగలను. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఖూనీ అవుతున్నాయని ప్రజలు అర్థం చేసుకున్నరోజు వాటిని కాపాడుకోవడానికి వారే నడుం బిగిస్తారు. అందుకు నేను పునాది వేస్తున్నా. ఈ ఉద్యమం కొనసాగుతుంది. -
రాహుల్ ఆరోపణలపై ఈసీ రియాక్షన్.. పటాకులే పేలాయంటూ సెటైర్లు
న్యూఢిల్లీ: ఓట్ల చోరీ పేరిట కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల స్పందించింది. ఆన్లైన్లో ఓట్లు ఎవరూ తొలగించలేరని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అదే సమయంలో మరోవైపు.. బీజేపీ సైతం ఆయన చేసిన ఆరోపణలపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారం.. అవాస్తవం. సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటునూ తొలగించడం లేదు అని ఈసీ స్పష్టం చేసింది. అదే సమయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల తొలగింపు ప్రయత్నాలను మాత్రం అంగీకరించింది. ‘‘ ఆ సమయంలో కర్ణాటకలోని ఆలంద్ శాసనసభ నియోజకవర్గంలో ఓటర్లను తొలగించేందుకు కొన్ని విఫలయత్నాలు జరిగాయి. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఎన్నికల సంఘం స్వయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరిపింది’’ అని పేర్కొంది.మరోవైపు రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం.. నకిలీ ఓట్ల చేర్పు ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆయన బాంబు పేలలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారత్‌ను బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు అని మండిపడ్డారు. ‘‘ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ నిష్పక్షపాతంగా పనిచేస్తోంది. కానీ రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తూ.. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ సుమారు 90 ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ వైరాగ్యంతోనే ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని ఠాకూర్ విమర్శించారు. హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానన్న రాహుల్.. చివరికి పటాకులతోనే సరిపెట్టారు. ఆరోపణలే ఆయన రాజకీయ ఆభరణంగా మారాయి. కోర్టులు క్షమాపణలు కోరడం, మందలించడం ఆయనకు అలవాటైపోయింది అని అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: ఓట్ల దొంగలకు రక్షగా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై సంచలన ఆరోపణలు -
కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
-
ఓట్ల దొంగలకు రక్షగా.. సీఈసీపై రాహుల్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి సంచలన ఆరోపణలకు దిగారు. ఓట్ల దొంగతనం ఒక పథకం ప్రకారమే జరుగుతోందని.. ఆ దొంగలను రక్షించే ప్రయత్నంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం న్యూఢిల్లీలోని ఇందిరా భవన్ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని.. రాష్ట్రం వెలుపలి నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించినట్లు వ్యాఖ్యానించారు. సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. 100 శాతం ఆధారాలున్నాయ్ఓట్ల చోరీ గురించి ఈసీ నుంచి మాకు సమాచారం వస్తోంది. చాలా చోట్ల మైనారిటీలు, ఆదివాసీల ఓట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఉద్దేశపూర్వకంగానే లక్షల ఓట్లను తొలగించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు. కర్ణాటక ఓటర్లకు లింక్ చేసిన ఫోన్ నెంబర్లన్నీ తప్పుడువే. కాంగ్రెస్‌కు బలమున్న ప్రాంతాల్లోనే ఓట్ల తొలగింపు జరిగింది. ఓట్లను తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారు. ఫేక్ లాగిన్‌తో కాంగ్రెస్ సానుభూతి ఓట్లను తొలగించారు. ఇవన్నీ ఆరోపణలు కాదు.. పక్కా ఆధారాలతో చెబుతున్నా.. సీఈసీపై సంచలన ఆరోపణలుఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవారిని కాపాడుతోంది. అధికారులకు తెలియకుండా జాబితా నుంచి ఓట్లు ఎలా పోతాయి?. కేవలం కాంగ్రెస్ ఓటర్లే టార్గెట్‌గా ఇదంతా నడుస్తోంది. కర్ణాటక సీఐడీ ఓట్ల తొలగింపు వివరాలు 18సార్లు అడిగినా ఈసీ స్పందించడం లేదు. మాకు ఓట్ల తొలగింపు ఐడీల వివరాలు, ఓటీపీలు కావాలి. వారం లోగా సీఐడీ అడిగిన వివరాలు అందించాలి. ఓట్ల దొంగలను రక్షిస్తూ.. కర్ణాటక అలంద్‌లో గోదాబాయ్ పేరుతో 18 ఓట్లు తొలగించారు . మహారాష్ట్ర రాజురా నియోజకవర్గంలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారు. కర్ణాటక, యూపీ, మహారాష్ట్ర, హర్యానాలో ఒకే రీతిలో ఓట్ల తొలగింపు జరిగింది. సెంట్రలైజ్డ్ వ్యవస్థ ద్వారా పథకం ప్రకారం రాష్ట్ర ఎన్నికల్లో ఓట్లు డిలీట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థ ఆ పని చేయడం లేదు. ఓట్ల దొంగలను సీఈసీ రక్షిస్తోంది. అందుకే ప్రతిపక్ష నేతగా నేను ప్రజల ముందు ఉంచుతున్నాఓటు చోరీ అనేది ప్రజాస్వామ్యంపై అణుబాంబ్ లాంటిది. కానీ ఇప్పుడు హైడ్రోజన్ బాంబ్ పేలబోతోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవాళ్లను ఈసీ కాపాడుతోంది. ఓట్లు చోరీ చేస్తున్న వారిని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రక్షిస్తున్నారు. అన్నింటికీ మా దగ్గర ఆధారాలన్నాయ్. ఎన్నికల వ్యవస్థలో అక్రమాలను కోర్టులు పరిశీలించాలి. ఓట్ల చోరీపై న్యాయ వ్యవస్థ దృష్టి సారించాలి అని రాహుల్ గాంధీ కోరారు. ఈ క్రమంలో ఆధారాల పేరిట పలువురు ఓటర్లతో మాట్లాడించిన ఆయన, ఓట్ల అవకతవకల పేరిట జరిగిన అంశాలనూ మీడియా ముందు ప్రవేశపెట్టారు. VIDEO | Delhi: During a press conference, Congress MP Rahul Gandhi (@RahulGandhi) shows 'evidence' of alleged vote theft in Karnataka, claiming that the theft happened specifically on the booths where Congress was winning.He further claimed that a fake login was created in the… pic.twitter.com/k9uSw4boLG— Press Trust of India (@PTI_News) September 18, 2025 LIVE: Special press briefing by LoP Shri @RahulGandhi at Indira Bhawan | New Delhi. https://t.co/BfcSQU0LTd— Congress (@INCIndia) September 18, 2025 -
బీహార్‌లో కూటమి పంచాయతీ.. సీట్ల పంపకాలపై కీలక భేటీ?
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్‌లోని ప్రతిపక్ష ఇండియా కూటమిలో నెలకొన్న సీట్ల పంపకాల పంచాయితీని ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ ఈ నెల 19న కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీలో ఉంటామన్న ప్రకటన నేపథ్యంలో కూటమిలో గందరగోళం పెరిగిన నేపథ్యంలో ఈ భేటీని తలపెట్టినట్లు తెలుస్తోంది.ఆరోగ్య సమస్యల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉన్న ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ ఈ సీట్ల చర్చల బాధ్యతను చేపట్టేందుకు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను సమర్పించాలని ఆయన కోరారని, ఆ పార్టీకి 50–52 సీట్లు కేటాయించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ పోటీ చేయాలనుకుంటున్న స్థానాలతో పాటు, పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు ఇచ్చే స్థానాలపై ఈ భేటీలో ఓ స్పష్టత తేవాలని కాంగ్రెస్ భావిస్తోంది.ఆర్జేడీ కోరుకుంటున్న ఓ 25 స్థానాలపై కాంగ్రెస్ సైతం పట్టుబడుతుండటంతోనే సమస్య ఉత్పన్నమవుతోందని, దీనిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని ఏఐసీసీ నేత ఒకరు తెలిపారు. ఇక ప్రస్తుత కూటమిలో వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)తో పాటు, 2020లో 19 సీట్లలో పోటీ చేసి 12 గెలుచుకున్న సీపీఐ(ఎంఎల్)లు ఇప్పుడు 40–45 సీట్లను అడుగుతున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ సైతం ఆర్జేడీతో చర్చలు జరుపుతుండగా, ఎంఐఎం సైతం కూటమిలో చేర్చుకోవాలని ఆర్జేడీని సంప్రదించినట్లు తెలుస్తోంది. వీటన్నింటి దృష్ట్యా సీట్ల పంపకాలపై ఓ స్పష్టతకు రావాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
అదీ భారతదేశమే కదా.. నన్ను రక్షించలేరా?: రాహుల్ గాంధీ
పంజాబ్ వరద ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. భద్రతా కారణాలను చూపిస్తూ ఆయన్ని పలు గ్రామాల్లోకి పోలీసులు అనుమతించలేరు. దీంతో అధికారులను ఆయన నిలదీయగా.. మరోవైపు పంజాబ్ పోలీసులు, ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.పంజాబ్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించి, ప్రజలకు అండగా నిలుస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. అయితే..बाढ़ ने पंजाब में भीषण तबाही मचाई है।आज घोनेवाल में गांववासियों से मिला - उजड़े आशियाने, बर्बाद खेत, बिखरी ज़िंदगियां। दर्द आंखों में साफ दिखता है, मगर हौसला अटूट है।राज्य और केंद्र सरकार दोनों हर हाल में ये सुनिश्चित करें कि राहत पैकेज और मुआवज़ा बिना देरी पीड़ितों के हाथों… pic.twitter.com/f1nUxJ945S— Rahul Gandhi (@RahulGandhi) September 15, 2025గురుదాస్‌పూర్ జిల్లాలో రావి నది వరదలతో దెబ్బ తిన్న టూర్ గ్రామంలోకి వెళ్లనీయకుండా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో అధికారులతో ఆయన సంభాషణ ఇలా సాగింది..రాహుల్ గాంధీ: మీరు చెబుతున్నది ఏమిటంటే, భారత భూభాగంలో మీరు నన్ను రక్షించలేరు. అదేనా?పోలీస్ అధికారి: మేము ఎప్పుడూ మీ రక్షణకు సిద్ధంగా ఉన్నాంరాహుల్ గాంధీ: మీరు చెబుతున్నది ఇది భారతదేశమే (రవి నదికి అటుపక్కనున్న గ్రామాన్ని చూపిస్తూ), కానీ మీరు నన్ను అక్కడ రక్షించలేరు. అది భారతదేశం కాదా?.. ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్లలేరు అంటే, పంజాబ్ పోలీస్ రక్షించలేరు అని అర్థమా?పోలీస్ అధికారి: అది భారత్ భూభాగమే అయినా, ప్రస్తుతం అక్కడ రక్షణ కల్పించడం కష్టంఅయినప్పటికీ రాహుల్ గాంధీ బోటు ద్వారా ఆ గ్రామానికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉందని అధికారులు వారించడంతో ఆయన మరోసారి వాళ్లను నిలదీశారు.నది ప్రశాంతంగానే ఉంది. ఇది నిజమైన కారణం కాదు అంటూ టూర్ గ్రామానికి వెళ్లకుండా ఇతర వరద ప్రభావిత ప్రాంతాలు ఘోనేవాల్ (అమృత్సర్) మరియు గుర్చక్ (గుర్దాస్పూర్) గ్రామాల్లో పర్యటించారు. ఇక ఈ ఘటనపై పంజాబ్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భారతదేశంలోనే మనం సురక్షితంగా లేకపోతే.. మరెక్కడ సురక్షితంగా ఉంటాం? అని ప్రశ్నిస్తోంది.पंजाब: गुरदासपुर में राहुल गांधी पाकिस्तान सीमा के पास प्रभावित गांवों का दौरा करने गए◆ सुरक्षा कारणों से SP जुगराज सिंह ने उन्हें आगे जाने से रोका, दोनों में बहस हुई◆ राहुल गांधी गांवों का दौरा किए बिना लौट आए, सुरक्षा मुद्दों पर विवाद बना@RahulGandhi | Punjab | pic.twitter.com/n8OtBTUjOc— Zuber Chaudhary (@ZuberChaudhar18) September 16, 2025మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ స్పందిస్తూ.. అక్కడ మన ప్రజలే(భారతీయులే) ఉన్నారు. రాహుల్ గాంధీ వాళ్ల పరిస్థితిని తెలుసుకోవాలనుకున్నారు. మూడు రోజులుగా కాంగ్రెస్ తరఫున అక్కడ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. అలాంటిది ప్రజల్ని కలవనివ్వకపోవడం దురదృష్టకరం అని అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్పందిస్తూ.. భారతదేశంలో రాహుల్ గాంధీకి పాకిస్తాన్ నుంచి ప్రమాదం ఉందని చెబుతున్నారు. రాహుల్ గాంధీని రవి నదికి అటుపక్కనున్న గ్రామానికి వెళ్లనివ్వకుండా భద్రతా కారణాలు చూపడం సరైంది కాదు. ఇది భారతదేశమే, అక్కడ మన ప్రజలే ఉన్నారు. ఆయన వారి సమస్యలు తెలుసుకోవాలనుకున్నారు అని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత పార్థాప్ సింగ్ బాజ్వా ఈ పరిణామంపై కాస్త తీవ్రంగానే స్పందించారు. ‘‘అధికారులు చెబుతున్నట్లు అది భద్రతా సమస్య కానేకాదు. ఇది రాజకీయ నిర్ణయం. బాధ్యత తప్పించుకునేందుకు ప్రభుత్వం నిరాధార భద్రతా కారణాలు చూపుతోంది. ఇది సిగ్గుపడాల్సిన విషయం అని ఆయన అన్నారు.పంజాబ్ పోలీసులు ఏం చెబుతున్నారంటే..రాహుల్ గాంధీ పర్యటించాల్సిన టూర్ గ్రామం భారత్‌లోనే ఉంది. పంజాబ్ గుర్దాస్పూర్ జిల్లా రావి నది ఒడ్డున ఉంది. అయితే, ఆ ప్రాంతం ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. ఇటీవల వరదలతో బార్డర్ ఫెన్సింగ్ దెబ్బతింది. అప్పటి నుంచి నిఘా పటిష్టం చేశారు. అందుకే పంజాబ్ పోలీస్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రాహుల్ గాంధీకి అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. రాహుల్‌కే కాదు.. మరేయితర పార్టీ నేతలకూ అక్కడికి వెళ్లేందుకు ప్రస్తుతానికి అనుమతి లేదు. -
విమర్శల బదులు విస్తృత దర్యాప్తు చేయించాల్సింది
న్యూఢిల్లీ: బిహార్‌లో ఆగమేఘాల మీద చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను తీవ్రమైనవిగా భావించి దర్యాప్తు చేపట్టాల్సిందిపోయి ఆయనపై ప్రత్యారోపణల బురద చల్లడం ఏమాత్రం సబబుకాదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఎస్‌వై ఖురేషి వ్యాఖ్యానించారు. ఖురేషి రాసిన ‘ప్రజాస్వామ్యానికి గుండెకాయ(డెమొక్రసీస్ హార్ట్‌ల్యాండ్’పుస్తకం త్వరలో ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నిల సంఘం తీరును ఆయన తూర్పారబట్టారు. ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ చేపట్టిన నిరసన తర్వాత ఉద్యమస్థాయికి చేరిన విషయం తెల్సిందే. ‘‘ఓట్ల చోరీ అంశంలో త్వరలో రాహుల్‌గాంధీ ‘హైడ్రోజన్ బాంబ్’పేలుస్తానని చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఎత్తుగడ అయి ఉండొచ్చు. కానీ ఆయన చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఎన్నికల సంఘం కొత్త ఓట్ల జోడింపు, నకిలీ ఓట్ల తొలగింపు ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు, లోపాటు ఉన్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. రాహుల్ చేసిన ఆరోపణలను ఈసీ చాలా తీవ్రంగా భావించాలి. వాటిలోని సహేతుకత, ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని లోతైన దర్యాప్తు చేపట్టాలి. సమగ్రస్థాయిలో దర్యాప్తుతో ఆయన ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గుతేల్చాలి. అలాంటిదేమీ చేయకుండా కేవలం ఆయనపై ప్రత్యారోపణలు చేయడం ఈసీకి తగదు. బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) చేపట్టిన విధానం లోపభూయిష్టంగా ఉందని విపక్షపారీ్టలుసహా పలు వర్గాల నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని నివృత్తిచేయాల్సిన బాధ్యత ఈసీపైనే ఉంది. ఆ దిశగా అడుగులేయాల్సిందిపోయి ఇతరత్రా అంశాల్లో జోక్యం చేసుకుని వివాదాల తేనెతుట్టెను ఈసీ కదిపింది’’అని ఖురేషి అన్నారు. అఫిడవిట్ అడగడం సబబుకాదు ‘‘ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించినప్పుడు దర్యాప్తు మొదలెడితే సరిపోయేది. అలా చేయకుండా రాహుల్ నుంచి ఆ ఆరోపణలు నిజమేనని పేర్కొంటూ అఫిడవిట్‌ను కోరడం సబబుకాదు. ఆయనేం వీధిలో వెళ్లే వ్యక్తికాదు. లోక్‌సభలో విపక్ష నేత. కోట్లాది ఓటర్లకు ప్రతినిధి. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల తరఫున ప్రశ్నించే ప్రజాప్రతినిధి. కోట్లాది ప్రజల గొంతుక. అలాంటి కీలకమైన హోదాలో ఉన్న వ్యక్తితో ఈసీ ఇలా నిర్లక్ష్యధోరణితో వ్యవహరించడం గతంలో నేనెప్పుడూ చూడలేదు. అఫిడవిట్ ఇవ్వండి లేదంటే ఇలా చేస్తాం అలా చేస్తాం అంటూ ఆయనతో అమర్యాద బాషలో సం¿ోదించడం అభ్యంతరకరం మాత్రమేకాదు నేరంకూడా’’అని ఖురేషి ఆగ్రహం వ్యక్తంచేశారు.ఆ సందర్భాల్లో నేనెంతో బాధపడ్డా.. ‘‘నేరుగా ఈసీని తప్పుబడుతూ ఏవైనా ఆరోపణలు వస్తే నేను తొలుత ఆందోళనచెందుతా. ఈసీని అత్యంత పారదర్శకంగా పనిచేసేలా చూడటంలో నాడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నా వంతు కృషిచేశా. అందుకే ఇప్పుడు కేంద్ర ఎన్నికలసంఘంపై ఎవరైనా ఆరోపణలుచేస్తే మాజీ సీఈసీగానేకాకుండా ఒక సగటు భారతీయ పౌరునిగా ఎంతో బాధపడతా. ఏదైనా ప్రభుత్వసంస్థను ఎవరైనా బలహీనపర్చడానికి ప్రయతి్నస్తే కుంగిపోతా. అలాంటి ఈసీ స్వయంగా ఆరోపణల దాడులను ఎదుర్కొన్నప్పుడు వాటిని సమగ్ర దర్యాప్తు ద్వారా సమగ్రంగా ఎదుర్కోవాలి. రాజకీయ శక్తులు, బయటి వ్యక్తుల ఒత్తిళ్ల ఏ స్థాయిలో ఉన్నా సరే స్వీయ నిర్ణయాలల్లో వెనుకడుగు వేయకూడదు. ప్రజల విశ్వాసాన్ని ఈసీ చూరగొనాలి. అధికార పారీ్టతో పోలిస్తే విపక్ష పార్టీల పలుకుబడి తక్కువ అయినాసరే విపక్ష పారీ్టల విశ్వాసాన్నీ సాధించాలి. అధికార పార్టీ నేతలతో పోలిస్తే విపక్ష పారీ్టల నేతలు చెప్పేవి ఎక్కువగా వినాలి. అందుకోసం వారికి ఈసీ తలుపులు బార్లా తెరవాలి. వాళ్లకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ల వాదనలు, ఆరోపణలు, అభ్యంతరాలు, విన్నపాలను సావదానంగా ఆలకించాలి. మా మాట ఈసీ వినట్లేదని ముఖ్యమైన 23 పార్టీలు సుప్రీంకోర్టు గుమ్మం తొక్కే పరిస్థితి తెచ్చుకోవద్దు’’అని ఈసీకి ఖురేషి హితవు పలికారు.కొత్త జాబితాలో తప్పుల్లేవని అఫిడవిట్ ఇవ్వగలరా? ఈ సందర్భంగా ఈసీపై ఖురేషి పలు ప్రశ్నలు సంధించారు.‘‘ముసాయిదా జాబితా తర్వాత సవరణల తర్వాత తెచ్చే తుది జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లవని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? రాహుల్‌ను అడిగినట్లుగా మీరు కూడా ఇందులో ఏ తప్పులు ఉండబోవని అఫిడవిట్ సమరి్పంచగలరా? తప్పులు ఉంటే అది నిజంగా నేరమే. అలాంటి పరిస్థితిని మీరు ఎదుర్కోగలరా?. ఈసీ అనేది పారదర్శకంగా ఉంటే సరిపోదు. పారదర్శకంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపించాలి. నిజానిజాలను దర్యాప్తు మాత్రమే బయటపెట్టగలదు. తీవ్ర ఆరోపణలు అరుదుగా చేస్తారు. అలాంటప్పుడే దర్యాప్తు చేపట్టాలి. అలాంటి అవకాశాన్ని ఈసీ సది్వనియోగం చేసుకోలేకపోయింది’’అని అన్నారు. ఖురేషీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ‘రాజకీయ పారీ్టలతో మేము క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇంత నిర్మాణాత్మక పద్ధతిలో మరెక్కడా సమావేశాలు జరగవు’అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
హీరాబెన్-మోదీపై ఏఐ వీడియో.. బీజేపీ గుర్రు
బీహార్ ఎన్నికల ప్రచారం పోనుపోను వ్యక్తిగత విమర్శలకు కేరాఫ్‌గా మారేలా కనిపిస్తోంది. మొన్నీమధ్యే రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో మోదీని, మోదీ తల్లిని కొందరు దూషించినట్లుగా ఓ వీడియోను బీజేపీ వైరల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ సైతం తన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బీహార్ కాంగ్రెస్ విభాగం నేరుగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.సాహబ్ కలలో అమ్మ .. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయమంటూ.. ఆ వీడియో ఉంది. అందులో ప్రధాని మోదీని పోలిన క్యారెక్టర్.. ‘‘ఈరోజు ఓట్ల దొంగతనం(Vote Chori) అయిపోయింది.. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని కళ్లు మూసుకుంటుంది. ఆ వెంటనే హీరాబెన్‌ను పోలి ఉన్న పాత్ర కలలో ప్రత్యక్షమై.. "ఓట్ల కోసం నా పేరును ఉపయోగించడంలో ఎంత దూరం వెళ్తావు? రాజకీయాల్లో నీతిని మరచిపోయావా? అని అంటుంది. ఈ మాటలతో నిద్రపోతున్న వ్యక్తి ఆశ్చర్యంతో మెలకువకు వస్తాడు.ఈ వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ కాంగ్రెస్ విడుదల చేసిన AI వీడియోపై తీవ్రంగా స్పందించారు.. ఈ వీడియో రాజకీయాల్లో దిగజారిన స్థాయికి నిదర్శనమని అన్నారాయన. రాహుల్ గాంధీ సూచన మేరకే బీహార్ కాంగ్రెస్ యూనిట్ ఈ వీడియోను రూపొందించిందని ఆరోపించారాయన. ప్రధాని మోదీ ఎప్పుడూ కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారని, కానీ ఇప్పుడు ఆయన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగి మరీ కాంగ్రెస్ దాడి చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి దేశాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా.. మోదీ సహా దేశంలోని ప్రజలందరి తల్లుల గౌరవాన్ని అవమానించడమే ఈ వీడియో ఉద్దేశమని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.साहब के सपनों में आईं "माँ" देखिए रोचक संवाद 👇 pic.twitter.com/aA4mKGa67m— Bihar Congress (@INCBihar) September 10, 2025అయితే.. క్షమాపణలకు కాంగ్రెస్ నిరాకరిస్తోంది. ఇదేం వ్యక్తిగత దూషణ కాదని.. రాజకీయ విమర్శ మాత్రమే అని చెబుతోంది. వీడియోలో వ్యక్తీకరించిన సందేశం ప్రధానిగా మోదీ తన తల్లి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే విమర్శ మాత్రమే అని అంటోంది. -
Rahul Gandhi: సెక్యురిటీ ప్రోటోకాల్స్ పాటించడం లేదంటూ లేఖ
-
ఓట్ల చోరీపై పోరాటం ఉధృతం చేస్తాం
రాయ్‌బరేలీ: ‘ఓటు చోర్, గద్దీ చోడ్’ నినాదం దేశమంతటా వినిపిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఓట్ల చోరీ బాగోతాన్ని భిన్నరూపాల్లో బయటపెడతామని చెప్పారు. ఓట్ల దొంగలు పదవుల నుంచి దిగిపోవాలని ప్రజలు నినదిస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ పార్లమెంట్ నియోజక వర్గానికి చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓట్ల చోరీ ముమ్మాటికీ నిజమని తేల్చిచెప్పారు. ప్రజల ఓట్లను దొంగలించి గద్దెనెక్కినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో జరిగిన ఓట్ల చోరీపై తమవద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోటి మందిని కొత్తగా ఓటర్లుగా చేర్పించి బీజేపీ గెలిచిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని మండిపడ్డారు. ఓట్ల చోరీపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను కూడా కాపాడినట్లేనని రాహుల్ అన్నారు. దేశ సంపద ప్రజలందరికీ చెందుతుందని రాజ్యాంగం నిర్దేశిస్తున్నట్లు గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీతోపాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫోటోలతో కూడిన పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘భారతదేశం చివరి ఆశ కలియుగ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు’ అంటూ వాటిపై నినాదాలు రాశారు. -
జీఎస్టీ 2.0.. కాంగ్రెస్ క్రెడిట్‌పై నిర్మలమ్మ చురకలు
వస్తు సేవల పన్ను (GST) 2.0 క్రెడిట్ ముమ్మాటికీ తమదేనంటున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చురకలంటించారు. గతంలో జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని విమర్శించినవాళ్లే.. ఇప్పుడు GST 2.0కు క్రెడిట్ తీసుకుంటున్నారని అన్నారామె. గతంలో వస్తు సేవల పన్నును గబ్బర్ సింగ్ టాక్స్ అని అభివర్ణించిన ప్రతిపక్ష నేతలు.. ఇప్పుడు అదే పన్ను వ్యవస్థలో మార్పుల క్రెడిట్‌ను ఖాతాలో వేసుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘GST 2.0 అనేది ప్రజల కోసం, వ్యాపారాల కోసం తీసుకున్న నిర్ణయం. ఇది రాజకీయ విమర్శలకు సమాధానం కాదు. కానీ, గతంలో దీనిని ‘గబ్బర్ సింగ్ టాక్స్’ అని పిలిచినవాళ్లే ఇప్పుడు దీన్ని తమ విజయం అని చెప్పుకోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది అని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ అన్నారు.అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో దీన్ని ఎందుకు అమలు చేయలేకపోయిందో చెప్పాలి? అని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో GST అమలు చేయడం అసాధ్యమని భావించిందని, కానీ మోదీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసి, ఇప్పుడు రెండో దశ సంస్కరణలు కూడా తీసుకువస్తోందని పేర్కొన్నారు.పన్ను శ్లాబ్‌ల సరళీకరణ, 5% & 18% ప్రధాన శ్లాబ్‌లు, 40% సిన్ టాక్స్ (తంబాకూ, లగ్జరీ వస్తువులపై) GST 2.0లో కీలక మార్పులని చెప్పొచ్చు. అయితే.. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీనిని ఆయుధంగా చేసుకునే ప్రతిపక్షాలు ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. జీఎస్టీ 2.0పై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. ఇది రాహుల్ గాంధీ 2016లో సూచించిన 18% GST క్యాప్‌ను అనుసరించడమే అని పేర్కొన్నారు. GST 2.0లో సాధారణ వినియోగదారులకు ప్రయోజనం కలగాలన్న ఉద్దేశంతో తీసుకున్న చర్యలపై తమ పాత్రను గుర్తు చేశారు.ఇదిలా ఉంటే.. జీఎస్టీని గబ్బర్ సింగ్ టాక్స్ అని మొదటగా పిలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ. 2017 అక్టోబర్‌లో గుజరాత్ గాంధీనగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్య చేశారు. జీఎస్టీలో 28% అత్యధిక పన్ను ఉంది, మూడు రిటర్న్ ఫారమ్‌లు ఉన్నాయి. ఇది ప్రజలపై భారం పెడుతోంది. ఇది గబ్బర్ సింగ్ టాక్స్లా ఉంది అని అన్నారాయన. బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ షోలేలోని విలన్ గబ్బర్ సింగ్ లాగా, ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తోందన్న ఉద్దేశంతో ఆయన పై వ్యాఖ్య చేశారు. GST అమలులో బహుళ పన్ను శ్లాబ్‌లు, క్లిష్టమైన కంప్లయన్స్ విధానం ఉండటం వల్ల చిన్న వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ సమయంలో ప్రతిపక్షాలు ఆరోపించాయి కూడా. -
నేను క్షమించినా ప్రజలు క్షమించరు: మోదీ
పట్నా: బిహార్‌లో రాహుల్‌గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో మోదీ తల్లి దివంగత హీరాబెన్నుద్దేశిస్తూ కొందరు విపక్షనేతలు అవమానకరంగా మాట్లాడిన ఉదంతంపై ప్రధాని మోదీ తొలిసారిగా ఆవేదనాభరితంగా స్పందించారు. బిహార్‌లో మహిళల నైపుణ్యాభివృద్ధికి కృషిచేసే కొత్త ‘బిహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్’ను మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించి లక్షలాది మంది మహిళలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ దివంగత నా మాతృమూర్తికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. రాజకీయాలకు దూరంగా ఉండిపోవడమే ఆమె చేసిన తప్పా? ఆమెను మాత్రమే దూషించాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ అంటూ గద్గద స్వరంలో మోదీ తన ప్రసంగాన్ని మొదలెట్టారు.‘‘ నా తల్లిని అవమానించిన బిహార్ ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలను నేను క్షమిస్తానేమోగానీ దేశంలోని ప్రజలెవ్వరూ వారిని క్షమించబోరు. ఒకరి తల్లిని దూషించిన వారిని ఇంకొకరు పొరపాటున కూడా క్షమించబోరు. తల్లిపై దారుణదూషణోదంతంలో ఆర్జేడీ–కాంగ్రెస్ పార్టీలను బాధ్యులను చేయాల్సిన కనీస బాధ్యత బిహార్‌లోని ప్రతి ఒక్క కుమారుడిపై ఉంది. ఆర్జేడీ–కాంగ్రెస్ నేతలు ఏ వీధిలోకి వెళ్లినా, ఏ పట్టణంలో ప్రచారంచేసినా అక్కడ మాతృమూర్తులు, సోదరీమణులను అవమానిస్తే అస్స లు ఊరుకోబోమని, సహించబోమని గట్టిగా, స్పష్టంగా తెలిసేలా చేయండి’’ అని బిహార్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.‘‘ తల్లిపై దుర్భాషలాడిన ఆర్జేడీ–కాంగ్రెస్ నేతలను బిహార్‌లోని తల్లులు, సోదరసోదరీమణులు వీధుల్లోకి వచ్చిమరీ నిలదీయాలి. ఇలాంటివి అస్సలు సహించబోమని స్పష్టంచేయాలి. నన్ను విమర్శించే క్రమంలో తల్లిని, మహిళను తిడితే ఎవ్వరూ ఊరుకోబోరని, తిట్లదండకానికి తెరదించుతామని మీరంతా నిరూపించాలి’’ అని మహిళలకు మోదీ పిలుపునిచ్చారు. బిహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్ అనేది మహిళా స్వయంసహాయక బృందాలకు తక్కువ వడ్డీలకు రుణాలను అందిస్తూ వారి నైపుణ్యాభివృద్ధికి కృషిచేస్తుంది.జానకీమాతకు జన్మస్థలి‘‘బిహార్ అనేది జానకీమాతకు జన్మస్థలి. బిహార్ రాష్ట్రం ఎల్లవేళలా మహిళలను గౌరవిస్తుంది. ఆర్జేడీ–కాంగ్రెస్ సంయుక్త రాజకీయ కార్యక్రమం నా తల్లిని అవమానించేందుకు వేదికగా మారడం, అందునా బిహార్‌లో ఈ కార్యక్రమం జరగడాన్ని అస్సలు ఊహించలేదు. ఇది నిజంగా బిహార్ తల్లులు, సోదరీమణులను అవమానించడమే. ఇలాంటి నేతలను బిహార్ ప్రజలు అస్సలు క్షమించరు’’ అని మోదీ అన్నారు. ‘‘ ఆర్జేడీ పాలనా కాలంలో తల్లులు, మహిళలు ఎన్నో అవస్థలు పడ్డారు. నేరçస్తులు, రేపిస్టులు, హంతకులను ఆర్జేడీ ప్రభుత్వం కంటికిరెప్పలా కాపాడుకుంది. తమ కుటుంబసభ్యులు క్షేమంగా రోజూ ఇంటికి తిరిగొస్తారో లేదోనని బిహార్ మహిళలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.అందుకే తర్వాత మహిళా ఓటర్లు ఆర్జేడీ సర్కార్‌ను ఇంటికి సాగనంపారు. నాడు ఆర్జేడీ కూటమిని ఇంటికి సాగనంపిన అదే మహిళాలు ఇప్పుడు నా తల్లికి జరిగిన అవమానాకి ప్రతీకారం తీర్చుకుంటారు. దర్భంగాలో జరిగిన దుర్ఘటన విపక్షాల కూటమి దారుణాలకు దర్పణం పడుతోంది. రాష్ట్రంలో మహిళలు దోపిడీ, అణచివేతకు గురవుతున్నారు’’ అని మోదీ అన్నారు. ‘‘ కొడుక్కి తన తల్లి అంటే దేవత, దైవంతో సమానం’’ అని భోజ్‌పురీ సామెతను రాబోయే నవరాత్రి, ఛాత్ పండుగలను పురస్కరించుకుని మోదీ గుర్తుచేశారు. ‘‘సూర్యభగవానుని మహిళారూపంలో ఏడుగురు దుర్గామాత అక్కచెల్లెళ్ల రూపంలో బిహార్ ప్రజలు పూజిస్తారు. అలాంటి ప్రజలకు కాంగ్రెస్–ఆర్జేడీ క్షమాపణలు చెప్పాల్సిందే’’ అని మోదీ అన్నారు.‘‘ దేశసేవకు నా జీవితాన్ని అంకితం చేస్తానని మా అమ్మతో చెప్పినప్పుడు ఆమె అందుకు అడ్డుచెప్పలేదు. పైగా దేశసేవ చేస్తానన్నందుకు అభినందించి ప్రోత్సహించారు. కుటుంబ బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెబితే వారించలేదు. పేద తల్లి కుమారుడు అధికారాన్ని(ప్రధాని పదవిని) స్వీకరించడం పేరుగొప్ప నేతలకు అస్సలు నచ్చట్లేదు. మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతినీ వాళ్లు ఓర్వలేకపోతున్నారు. దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా ఆసీనులైన ద్రౌపదీముర్మును సైతం అవమానించడానికి వాళ్లు దుస్సాహసం చేశారు. నాకంటే 20 ఏళ్లు జూనియర్ అయిన(రాహుల్‌గాంధీ) ఓ వ్యక్తి ఓ పదిహేను రోజులు ఎస్ఐఆర్పై పోరు పేరు చెప్పి యాత్రచేశారు’’ అని రాహుల్‌గాంధీని పరోక్షంగా విమర్శించారు. -
‘మోదీ క్షమించినా.. బీహార్ వాళ్లను క్షమించదు’
తన మాతృమూర్తి హీరాబెన్‌పై అనుచిత వ్యాఖ్యల పేరిట వైరల్ అయిన వీడియోపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. తన తల్లికే కాదని.. దేశంలోని తల్లులందరికీ ఇది అవమానమేనని భావోద్వేగంగా మాట్లాడారు. బీహార్‌లో మహిళల కోసం బీహార్ రాజ్య జీవికా నిధి సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ఆయన.. ఆ కార్యక్రమానికి హాజరైన 20 లక్షల మంది మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.చనిపోయిన నా తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. అయినా అందులోకి లాగారు. కేవలం నా తల్లినే కాదు.. దేశంలోని ప్రతీ తల్లినీ, సోదరినీ కాంగ్రెస్, ఆర్జేడీలు అవమానించాయి అని అన్నారాయన. ఈ మాటలు నా తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించాయి. మీరు కూడా ఈ మాటలు విన్న తర్వాత నాతోపాటు మీరూ ఎంతగా బాధపడి ఉంటారో నాకు తెలుసు అంటూ ఆయన భావోద్వేగంగా స్పందించారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా నా తల్లి కష్టపడడం ఆపలేదు. మా కోసం దుస్తులు తయారు చేయించేందుకు ప్రతి పైసా ఆదా చేసేది. దేశంలో కోట్లాది తల్లులు ఇలాగే త్యాగం చేస్తూ జీవిస్తున్నారు. తల్లి స్థానం దేవతలకంటే గొప్పది అని ప్రధాని అన్నారు. బీహార్‌లో కాంగ్రెస్–RJD వేదికపై వాడిన అసభ్య పదజాలం తన తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ కుటుంబాల్లో పుట్టినవారు పేద తల్లుల బాధను, వారి కుమారుల పోరాటాన్ని అర్థం చేసుకోలేరు. వీరంతా బంగారు, వెండి చెంచాలతో పుట్టినవారు. బీహార్‌లో అధికారాన్ని తమ కుటుంబాల స్వంతంగా భావిస్తున్నారు. కానీ మీరు ఒక పేద తల్లి కుమారుడిని ప్రధాన సేవకుడిగా ఆశీర్వదించారు. ఇది ‘నామ్‌దార్’లకు జీర్ణించుకోవడం కష్టమైంది అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, RJD నేత తేజస్వీ యాదవ్‌లపై విమర్శలు చేశారు.నాపై అసభ్య పదజాలం వాడిన జాబితా చాలా పొడవుగా ఉంది. నన్ను నీచ్, గంది నాళీ కీ కీడా, పాము అని అంటున్నారు. ఇప్పుడు ‘తూ’ అని కూడా సంబోధిస్తున్నారు.. అంటూ రాహుల్ గాంధీ ర్యాలీలో తనను ‘తూ’ అని పిలిచిన విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇలాంటి వ్యాఖ్యలకు మోదీ క్షమించినా.. బీహార్ ప్రజలు క్షమించబోరని అన్నారాయన.ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ బీహార్‌లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర సందర్బంగా.. దర్భంగలో మోదీ, ఆయన తల్లి హీరాబన్ను దూషించినట్లుగా ఓ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఘటనపై కేసు నమోదుకాగా.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు కూడా. -
హైడ్రోజన్ బాంబు త్వరలో పేలుస్తా!: రాహుల్ గాంధీ
పాట్నా: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీపై ఇప్పటికే అణుబాంబు పేల్చానని, త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానని పేర్కొన్నారు. ఓట్ల దొంగతనంపై మరిన్ని నిజాలు బయటపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి వస్తుందని, ఆయన తలెత్తుకోలేరని చెప్పారు. సోమవారం బిహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగింపు సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఓట్ల చోరీని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని విప్లవాత్మక రాష్ట్రమైన బిహార్ యావత్ దేశానికి స్పష్టమైన సందేశం ఇచ్చిందని వెల్లడించారు. మహాత్మాగాం«దీని హత్య చేసిన దుష్ట శక్తులే నేడు రాజ్యాంగాన్ని హత్య చేయడానికి కుట్రలు సాగిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగం జోలికి వస్తే సహించబోమని బీజేపీని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని, ఓటు హక్కును రక్షించడానికే యాత్ర చేపట్టానని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, ఓటు చోర్, గద్దీ ఛోడ్ అంటూ వారు ముక్తకంఠంతో నినదించారని అన్నారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే... రేషన్ కార్డును, భూమిని లాక్కుంటారు ‘‘బీజేపీ నాయకులు మాకు నల్లజెండాలు చూపించారు. వారు ఒక విషయం తెలుసుకోవాలి. ఓట్లచోరీపై మహాదేవపురలో అణుబాంబు ప్రయోగించా. త్వరలో హైడ్రోజన్ బాంబు రాబోతోంది. అందుకోసం బీజేపీ నేతలు సిద్ధంగా ఉండాలి. ఓట్ల దొంగతనంపై బీజేపీ అసలు రంగు ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి దక్కాల్సిన విజయాన్ని బీజేపీ కూటమి దొంగిలించింది. ఇది వంద శాతం నిజం. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయి. బిహార్ యువతకు చెప్పదల్చుకున్నది ఏమిటంటే.. ఓటు చోరీ అంటే హక్కుల చోరీ, రిజర్వేషన్ల చోరీ, ప్రజాస్వామ్యం చోరీ, ఉద్యోగాలు–ఉపాధి అవకాశాల చోరీ, విద్య చోరీ, భవిష్యత్తు చోరీ. కేవలం ఓటునే కాకుండా మీ రేషన్ కార్డును, భూమిని సైతం లాక్కొని అదానీకి, అంబానీకి కట్టబెట్టాలని చూస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ బీజేపీపై నిప్పులు చెరిగారు. తప్పుడు విధానాలు నమ్ముకుంటున్న మోదీ: ఖర్గే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీరుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో సోషలిజం గురించి మాట్లాడిన నితీశ్ ఇప్పుడు బీజేపీ–ఆర్ఎస్ఎస్ల ఒడిలో సేదతీరుతున్నారని ధ్వజమెత్తారు. పనికిరాని చెత్తను ఎక్కడ పారేస్తారో నితీశ్‌ను బీజేపీ–ఆర్ఎస్ఎస్లు అక్కడే పారేయడం తథ్యమని స్పష్టంచేశారు. ఓటర్ అధికార్ యాత్ర ముగింపు సభలో ఖర్గే మాట్లాడారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ నెగ్గడానికి ప్రధాని మోదీ ఓట్ల చోరీకి ఆలోచనతోనే ఉంటారని ఆరోపించారు. ఎన్నికల్లో విజయం కోసం బోగస్ ఓట్లను, తప్పుడు ప్రచారాన్ని, తప్పు డు హామీలు, తప్పుడు పథకాలను నమ్ముకుంటారని ఆయన తీవ్రంగా విమర్శించారు. -
‘‘మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా?’’
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) ద్వారా విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి కీలక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకట ఆధారంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్‌పై సెటైర్లు సంధించారు. సత్యమేవ జయతే అంటూ కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో.. ‘‘కాళేశ్వరంను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ కరెన్సీ మేనేజర్(CM) నిర్ణయం తీసుకున్నారు. విపక్ష పార్టీలను నాశనం చేసే సెల్‌గా సీబీఐని గతంలో రాహుల్ గాంధీ అభివర్ణించారు. మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే.. The Currency Manager (CM) of Rahul Gandhi in Telangana has decided to handover Kaleshwaram case to CBIThe very CBI that @RahulGandhi had famously called “Opposition Elimination Cell” of the BJPHave you any clue Mr. Gandhi on what your CM is doing? Bring it on, whatever it… pic.twitter.com/3vBYbf5Atd— KTR (@KTRBRS) September 1, 2025ఎన్ని కుట్రలు చేసినా సరే.. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తామని, న్యాయయ వ్యవస్థ, ప్రజలపై మాకు నమ్మకం ఉంది అని ట్వీట్లో పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. గతంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభావితం చేస్తోందని చేసిన ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్‌ను కేటీఆర్ తన ట్వీట్లో పోస్ట్ చేశారు. సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థలను రాజకీయంగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలపై టార్గెట్ చేస్తున్నారని గతంలో రాహుల్ గాంధీ పలుమార్లు ఆరోపించారు. తద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని తీవ్రవ్యాఖ్యలే చేశారాయన. -
నిరసనకారులకు చాక్లెట్లతో సమాధానం.. రాహుల్ వీడియో వైరల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనపై విమర్శలు చేస్తున్నవారికి అత్యంత విచిత్రంగా సమాధానం చెప్పారు. బీహార్‌లోని ఆరాలో ‘ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొన్న రాహుల్ గాంధీ తనకు ఎదురైన నిరసనకారులకు ప్రేమతో సమాధానం చెప్పారు. ఇటీవల బీహార్‌లో రాహుల్ గాంధీ ర్యాలీ వేదికపైనున్న కొందరు నేతలు.. ప్రధాని మోదీ, ఆయన తల్లిపై దుర్భాషలాడారని బీజేపీ ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇందుకు బాధ్యత వహిస్తూ, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం నేపథ్యంలో బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు రాహుల్ గాంధీ యాత్రకు వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసనలు చేపట్టారు. తాజాగా ఆరా జిల్లాలో జరుగుతున్న ఈ నిరసనలకు రాహుల్ గాంధీ అనూహ్యంగా స్పందించారు. నిరసనకారులకు చాక్లెట్లు ఇచ్చి, సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అలాగే రాహుల్ యాత్ర మరింతమంది దృష్టిని ఆకర్షించింది. #WATCH | Arrah, Bihar: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi offered candies to BJYM workers who showed him black flags and confronted him over the alleged derogatory remarks made against the Prime Minister and his late mother at a Mahagathbandhan event in Darbhanga. pic.twitter.com/dkFXz8WJeB— ANI (@ANI) August 30, 2025కాంగ్రెస్ నేతలు ఈ వివాదాన్ని బీజేపీ రాజకీయ కుట్రగా అభివర్ణించారు. దర్భంగా ఘటనలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి బీజేపీ ఏజెంట్ అని, యాత్ర జనాదరణను అడ్డుకోవడానికి ఈ ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. అయితే, బీజేపీ నేతలు ఈ ఘటనను ఖండిస్తూ, రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన బీహార్ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతను సృష్టించింది.రాహుల్ చేపట్టిన ఈ యాత్ర బీహార్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనున్నదని పలువురు అంటున్నారు. రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్‌లతో పాటు ఇతర ఇండియా బ్లాక్ నేతలు ఈ యాత్ర ద్వారా ఓటర్లను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా తాజాగా రహుల్ చాక్లెట్ ఆఫర్ ఘటన.. రాహుల్ గాంధీ యాత్రకు సానుకూల దృష్టిని తెచ్చినప్పటికీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ ఘర్షణ మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. -
బిహార్ సీఎం అభ్యర్థిని నేనే
ఆరా(బిహార్): బిహార్‌లో మహాఘఠ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తానేనంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించుకున్నారు. శనివారం ఆరా జిల్లాలో ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ సమక్షంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. బిహార్ సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై రాహుల్ గాంధీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఆరా ర్యాలీలో తేజస్వీ మాట్లాడుతూ..తాను ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాల్నే సీఎం నితీశ్ కుమార్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. ‘ముందు నేను వెళ్తుంటే ప్రభుత్వం వెనుక వస్తోంది. కాపీ కొట్టే సీఎం కావాలా? ఒరిజినల్ సీఎం కావాలా?’అంటూ ప్రజలను ప్రశ్నించారు. మహాఘఠ్ బంధన్ తరఫున అసలైన సీఎం అభ్యర్థి తానేనంటూ ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ మాత్రం మౌనంగా ఉండిపోయారు. దీంతో తేజస్వి...కాంగ్రెస్ జాతీయ పారీ్టయే అయినప్పటికీ బిహార్‌లో ఆర్జేడీ పెద్దన్న అని, తమదే పైచేయి అన్న అర్థంలో మాట్లాడారు. -
‘నేనే ఒరిజినల్ సీఎం..’ బీహార్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం
బీహార్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఈ పరిణామం అక్కడి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.బీహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర పాట్నా సభతో పూర్తి కానుంది. ఈ రోజు యాత్ర సరన్ జిల్లా చాప్రా నుంచి ప్రారంభమై, ఆరా, భోజ్‌పూర్ మీదుగా సాగింది. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను ‘కాపీక్యాట్ సీఎంగా’ అభివర్ణిస్తూ ఆరాలో నిర్వహించిన ర్యాలీలో తేజస్వి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.నితీశ్ నా విధానాలను కాపీ కొడుతూ.. ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, తేజస్వి ప్రజల్లోకి దూసుకుపోతుంటే.. ఈ ప్రభుత్వం మాత్రం వెనుకబడిపోయింది. మీకు సిసలైన సీఎం కావాలా? లేదంటే నకిలీ సీఎం కావాలా? అంటూ తేజస్వి మాట్లాడారు. తద్వారా తనను తాను సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ప్రకటించుకున్నట్లైంది. ఆ సమయంలో రాహుల్ గాంధీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లు తేజస్విని చూస్తూ ఉండిపోయారు.కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినప్పటికీ.. బీహార్‌కు ఆర్జేడీనే పెద్దన్నగా తేజస్వి గతంలో వ్యాఖ్యానించారు. ఓటర్ అధికార్ యాత్రలో ఈ ఇద్దరు నేతలూ కలిసే ముందుకు సాగారు. కానీ ఎక్కడా కాంగ్రెస్‌గానీ, రాహుల్ గాంధీగానీ అధికారికంగా బీహార్ సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై స్పందించలేదు. ఇదిలా ఉంటే..కాంగ్రెస్-ఆర్జేడీ మధ్య సీట్ల పంపకాల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదని ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ తాజాగా కథనం ఇచ్చింది. తాము ఆశించినన్ని సీట్లు ఆర్జేడీ ఇవ్వకపోవచ్చనే యోచనలో ఉన్న కాంగ్రెస్.. తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేసేందుకు ముందుకు రావడం లేదన్నది ఆ కథనం సారాంశం.2020లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక మహాఘట్బంధన్ కూటమి తరఫున కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేసి.. కేవలం 19 స్థానాల్లో ెగ్గింది. అయితే ఈసారి కూడా అన్నే స్థానాలను కాంగ్రెస్ ఆశిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ లేదంటే నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 35 ఏళ్ల తేజస్వి యాదవ్ గతంలో రెండుసార్లు డిప్యూటీ సీఎంగా పని చేశారు.ఓటర్ అధికార్ యాత్ర బీహార్‌లో ఆరా (Ara) పట్టణంలో 2025 ఆగస్టు 30న జరిగింది. ఈ రోజు యాత్ర సరన్ జిల్లా చాప్రా నుంచి ప్రారంభమై, ఆరా, భోజ్‌పూర్ మీదుగా సాగింది. -
రాహుల్ క్షమాపణ చెప్పాలి
గౌహతి: చొరబాటుదార్ల కారణంగా అస్సాంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తంచేశారు. చొరబాటు సమస్యను అధ్యయనం చేయడానికి ప్రధాని మోదీ డెమొగ్రఫీ మిషన్‌ను ప్రకటించారని తెలిపారు. చొరబాటుదార్ల నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామంటూ హామీ ఇచ్చామని, అది కచి్చతంగా నిలబెట్టుకుంటామని తేల్చిచెప్పారు. అమిత్ షా శుక్రవారం అస్సాంలో పర్యటించారు. అస్సాం తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి గోలాప్ బొర్బోరా శత జయంతి వేడుకల్లో ప్రసంగించారు. ఏ ఒక్క చొరబాటుదారుడు మన దేశంలో ఉండడానికి వీల్లేదని స్పష్టంచేశారు. విదేశీయుల అక్రమంగా వచ్చి మన దగ్గర తిష్టవేస్తే సహించాలా? అని ప్రశ్నించారు. చొరబాటుదారులందరినీ బయటకు పంపించక తప్పదని అన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడానికే ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను చేపట్టిందని, దానిపై రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రతిపక్షాలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలు ఓటర్ అధికార్ యాత్ర ముసుగులో చొరబాటుదార్ల బచావో యాత్ర చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. ఏ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా ఓటర్ల జాబితా గుండెకాయ లాంటిదని స్పష్టం చేశారు. బిహార్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా ఆ పార్టీ నాయకులు ప్రధాని మోదీ తల్లిని అవమానించారని అమిత్ షా దుయ్యబట్టారు. రాహుల్ గాం«దీకి నిజంగా సిగ్గుంటే తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్‌కు వెళ్లొచ్చే నేతలు అస్సాంను పాలించాలా? తరచుగా పాకిస్తాన్‌కు వెళ్లొచ్చే నాయకులు అస్సాంను పరిపాలిస్తామంటే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్‌కి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని పరోక్షంగా మండిపడ్డారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాజధాని గౌహతితో పంచాయతీ ప్రతినిధుల ర్యాలీలో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలు చొరబాటుదార్లకు, ఆక్రమణదార్లకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చొరబాటుదార్లు అస్సాంలో వేలాది ఎకరాల భూమిని ఆక్రమించారని, వారిని వెళ్లగొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తుండగా, కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. 1.29 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం ఆక్రమణదార్ల చెర నుంచి విడిపించిందని గుర్తుచేశారు. అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ వర్మ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తుందని చెప్పారు. -
‘ట్రంప్ ఫోన్.. ఆపరేషన్ సిందూర్‌ను ఆపిన ప్రధాని మోదీ’
పాట్నా: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తానే అణచివేశానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. తన చొరవ లేకపోతే రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే ప్రమాదం ఉండేదని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల ప్రకారం.. ఆయన ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేయాలని సూచించారని, కాబట్టే ఆపరేషన్ సిందూర్ ఆగిందని ఆరోపించారు.బీహార్ ముజాఫర్పూర్లో కాంగ్రెస్ ఓటర్ అధికార్ యాత్ర పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. వినండి.. మీరు ఏమి చేస్తున్నారో..అది 24 గంటల్లోపు ఆపండి’అని అన్నారు. అందుకు మోదీ ఆపరేషన్ సిందూర్‌ను ఐదుగంటల్లోనే ఆపేశారంటూ విమర్శలు గుప్పించారు. కాగా,బీహార్‌లో కాంగ్రెస్ తలపెట్టిన ఓటర్ అధికార్ యాత్ర కొనసాగుతోంది. బీహార్‌లో 1,300 కిలోమీటర్ల మేర సాగనుంది. 20కి పైగా జిల్లాలను కవర్ చేస్తూ సెప్టెంబర్ 1న పాట్నాలో ముగియనుంది. #WATCH | Muzaffarpur, Bihar | Addressing during the 'Voter Adhikar Yatra', Lok Sabha LoP Rahul Gandhi says, "Trump said today that when the war between India and Pakistan was going on, I picked up the phone and told Narendra Modi and told him to stop whatever he was doing within… pic.twitter.com/ap4ih0Ruqt— ANI (@ANI) August 27, 2025 -
‘ఆ దమ్ముందా స్టాలిన్?’
బీహార్‌లో తమిళనాడు సీఎం స్టాలిన్ పర్యటన వేళ.. రాజకీయ విమర్శలతో దుమారం చెలరేగింది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే తరఫున రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రకు స్టాలిన్ మద్దతు ప్రకటించారు. అయితే ఒకప్పుడు బీహారీలను అవమానించినవారే.. ఇప్పుడు ఓట్ల కోసం అక్కడికి వెళ్తున్నారా? అంటూ అధికార జేడీయూ, బీజేపీ కూటమి విమర్శలు గుప్పించింది.తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీహార్ పర్యటనపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఈ ఏడాది చివర్లో బీహార్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొనడానికి స్టాలిన్ బీహార్ చేరుకున్నారు. అయితే, గతంలో డీఎంకే నేతలు చేసిన యాంటీ బీహారీ కామెంట్లతో పాటు సనాతన ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. బీజేపీ స్టాలిన్‌ను సవాల్ విసిరింది.బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ ఉంచారు. నోరు తెరిస్తే నీతి, ఆత్మగౌరవం కోసం నిలబడి మాట్లాడే వ్యక్తిని అంటారు కదా? ద్రవిడ మోడల్‌కు సింహం లాంటోడిని అంటారు కదా?. అదే నిజమైతే.. గతంలో మీ పార్టీ వాళ్లు చేసిన వ్యాఖ్యలు బీహార్‌లో మీరూ చెప్పండి చూద్దాం అంటూ సవాల్ చేశారాయన. రెండేళ్ల కిందట.. ఓ పబ్లిక్ మీటింగ్‌లో ఉదయ్‌నిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూలతో పోలుస్తూ.. నిర్మూలించాల్సిన అవసరం ఉందటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీహార్ సహా పలు రాష్ట్రాల్లో జూనియర్ స్టాలిన్‌పై కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. అలాగే.. డీఎంకేకు చెందిన దయానిధి మారన్ బీహారీలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలనూ బీజేపీ లేవనెత్తుతోంది. బీహారీలు.. అశ్లీలంగా ఉంటారు. అజ్ఞానులు. పానిపూరి అమ్మేపనులు, టాయిలెట్లు శుభ్రం చేస్తుంటారు అని మారన్ అన్నట్లు బీజేపీ చెబుతోంది. ఇవే వ్యాఖ్యలను ఇప్పుడు స్టాలిన్ బీహార్‌లో మళ్లీ వినిపించాలంటూ సవాల్ చేస్తోంది. తిరుపతి మాత్రమే కాదు బీజేపీ నేత అన్నామలై కూడా ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. స్టాలిన్ బీహార్ వేదికపై వాటిని తిరిగి చెప్పాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.మరోవైపు బీహార్ జేడీయూ నేత అభిషేక్ ఝా కూడా స్టాలిన్ పర్యటనను తప్పుబడుతూ, "ఇలాంటి వ్యక్తులతో కలిసి బీహార్ ప్రజల మద్దతు ఆశించడం తేజస్వీ యాదవ్‌కు మైనస్ అవుతుంది" అన్నారు. ఇదిలా ఉంటే.. బీహార్ ఎన్నికల వేళ, ఈ వ్యాఖ్యలు ఇండియా కూటమిపై ఎంత ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే. -
చిరాగ్, పెళ్లి చేసుకో!
‘ఓటర్ అధికార్ యాత్ర’ సభ అనంతరం రాహుల్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ పాల్గొన్న మీడియా భేటీ సరదా సన్నివేశాలకు, నవ్వులకు వేదికైంది. కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య చిచ్చు పెట్టేందుకు ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్నకు తేజస్వి బదులిస్తూ, ఆయన ఎత్తులను చిత్తు చేస్తానని ధీమా వెలిబుచ్చారు. అయితే, ‘‘ చిరాగ్ వయసులో నాకంటే పెద్ద. పెద్దన్నయ్య వంటివాడు. అందుకే తనకు నాదో సలహా. త్వరగా పెళ్లి చేసుకుంటే మంచిది’’ అంటూ నవ్వులు పూయించారు. ‘‘నీ ఉచిత సలహాలు నాక్కూడా తగులుతున్నాయి, చూసుకో’’ అంటూ రాహుల్ చెణుకులు విసరడంతో అంతా మరోసారి గొల్లుమన్నారు. తేజస్వి అంతటితో ఆగకుండా, ‘పెళ్లి చేసుకొమ్మని మా నాన్న(లాలు) కూడా మీకిప్పటికే చాలాసార్లు చెప్పా’రన్నారు. అది నిజమేనని రాహుల్ అంగీకరించారు. ‘‘రెండేళ్లుగా లాలూజీని ఎప్పుడు కలిసినా నా పెళ్లి మాటే ఎత్తుతున్నారు. ఆయన సమక్షంలో ఇంకా నా పెళ్లి చర్చలు జరుగుతున్నాయి’’ అంటూ మరోసారి అందరినీ నవి్వంచారు. ‘‘రాహుల్ పెళ్లి గురించి ఆయన తల్లి సోనియాగాంధీతో మాట్లాడా. రాహుల్‌ను పెళ్లికొడుకుగా చూడాలని మేమంతా ఆరాటపడుతున్నాం. ఆయన బారాత్‌లో మేం డ్యాన్స్ చేయాల్సిందే’’ అని లాలు గతంలో అనడం తెల్సిందే. బుల్లెట్ ర్యాలీలో... రాహుల్‌కు ముద్దు అరారియాలో బుల్లెట్ ర్యాలీ సందర్భంగా ఓ యువకుడు హఠాత్తుగా దూసుకొచ్చి రాహుల్ ఎడమ భుజంపై ముద్దు పెట్టాడు! జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న రాహుల్‌కు ఓ ఆగంతకుడు అంత సమీపానికి రావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. భద్రతాధికారులు అతన్ని దూరంగా నెట్టడమే గాక చేయి కూడా చేసుకున్నారు. అనంతరం ఇంకెవరూ రాహుల్‌ను సమీపించకుండా వలయంగా మారి భద్రత కల్పించారు. అంతకుముందు కూడా ఓ బాలుడు రాహుల్ ర్యాలీగా వెళ్తున్న ఓపెన్ టాప్ కారుపైకి ఎక్కాడు.


