సాక్షి,ఢిల్లీ: ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చే ఓటర్లను ఓటర్ల జాబితానుంచి తొలగిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఓట్ చోర్, గద్దీ ఛోడ్ ర్యాలీలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘ఈసీ బీజేపీ కుమ్మక్కయ్యి వ్యవస్థల్ని నిర్విర్యం చేస్తున్నారు. ఓట్ చోరీపై దేశ వ్యాప్తంగా 5.5కోట్ల మందికి పైగా సంతకాలు సేకరించాం. ఓట్‌చోరీపై అందరూ ఏకమవ్వాలి. ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు జోడించారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత,నిస్పక్షపాతం ఉండాలి. కానీ ఇక్కడ అలా లేదు. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి మీ అందరి మద్దతు కావాలి’అని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు.


