ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పేరు మార్పు ప్రతిపాదనపై కాంగ్రెస్ ధ్వజం
పండిట్ నెహ్రూయే కాదు..మహాత్ముడన్నా మోదీ సర్కారుకు నచ్చడం లేదు
గతంలో పలు స్కీముల పేర్లను ఇలా మార్చిందని ఆరోపణ
ఉపాధి హామీ పథకం తమ ఘనతేనన్న ప్రధాన ప్రతిపక్షం
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) బిల్లు పేరును మారుస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పథకాల పేర్లను మార్చడంలో మోదీ ప్రభుత్వం దిట్ట అంటూ ఎద్దేవా చేసింది. మహాత్మాగాంధీ అనే పేరుంటే వచ్చిన ఇబ్బందేమిటని నిలదీసింది.
శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడారు. పథకాలు, చట్టాల పేర్లను మార్చడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దిట్ట. గతంలో నిర్మల్ భారత్ అభియాన్‌ను స్వచ్ఛ భారత్ అభియాన్‌గా, గ్రామీణ ఎల్పీజీ పంపిణీ కార్యక్రమాన్ని ఉజ్వల యోజనగా మార్చారు. ఇలా రీ ప్యాకేజింగ్, బ్రాండింగ్‌లో బీజేపీ వాళ్లు సిద్ధహస్తులు. ఇప్పటిదాకా వాళ్లు పండిట్ నెహ్రూను మాత్రమే ద్వేషించారు. ఇప్పుడు మహాత్మాగాంధీ పేరు కూడా వారికి నచ్చడం లేదు. అందుకే, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును పూజ్య బాపు ఉపాధి హామీ పథకంగా మార్చారు’ అని జైరాం రమేశ్ ఆరోపించారు.
పేరు మార్చినంత మాత్రాన మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలే గ్రామాల రూపురేఖల్ని మార్చిన ఈ పథకానికి ఆద్యులన్న విషయం ప్రజలు మర్చిపోరని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు ఇదే పథకాన్ని వైఫల్యానికి చిరు నామాగా పేర్కొన్న ప్రధాని మోదీ, విప్లవాత్మ కమైన మార్పును తీసుకువచ్చిన ఈ పథకం ఘనత తమదేనని చెప్పుకునేందుకే పేరు మా ర్చారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థా గత) కేసీ వేణుగోపాల్ శనివారం ఎక్స్‌లో ఆరో పించారు.
భారతావనికి గ్రామాలే పట్టుగొమ్మ లు అని ప్రవచించిన మహా త్ముడి పేరును లేకుండా చేసేందుకే మోదీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. పథకానికి నిధుల కేటాయింపుల్లో ఏడాదికే డాది కోత విధించడంతోపాటు చెల్లింపులు సైతం లేకపోవడంతో బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నాయన్నారు. మొత్తంగా ఈ పథకాన్ని ఎత్తి వేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు.
ఈ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నిర్లక్ష్యాన్ని దాచి పెట్టడానికి కేంద్రం తీసుకున్న కంటి తుడుపు చర్య మాత్రమే నని పేర్కొన్నారు. వాస్తవానికి, ఈ ప్రభుత్వా నికి సంక్షేమ పథకాలపై సదుద్దేశం లేదు. ఏం చేయాలో తెలియనప్పుడు, ఇలాంటి చర్యల తో ఏదో చేసినట్లుగా ప్రజల ముందు నటి స్తోందని దుయ్యబట్టారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పేరును మార్చుతూ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలపడం తెల్సిందే. ఇకపై ఈ పథ కాన్ని పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజ నగా పిలుస్తారు. అదేవిధంగా, పనిదినాల సంఖ్యను ప్రస్తుత మున్న 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచనున్నారు.


