సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ తగిలింది. వేంపల్లి మండలం అమ్మగారిపల్లి గ్రామంలో టీడీపీ కండువాలు వేసేందుకు బీటెక్ రవి వెళ్లారు. ఆయన రాకతో గ్రామస్తులు.. తమ ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వెళ్లారు.

పోలీసు ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో నుంచి గ్రామం మొత్తం వైఎస్ కుటుంబం వెంటనే నడుస్తున్నామన్న గ్రామస్తులు.. టీడీపీ ఊరిలో అడుగు పెట్టడంతోనే ఊరు వదిలి రావాల్సి వచ్చిందని గ్రామస్తులు చెప్పారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘టీడీపీ నాయకులు గ్రామంలోకి రావడంతో ఊరు మొత్తం ఖాళీ చేశారు. ఇళ్లకు తాళాలు వేసి వైఎస్సార్‌సీపీకి అమ్మగారిపల్లి గ్రామస్తులు మద్దతుగా నిలిచారు. అమ్మగారిపల్లి గ్రామస్తులు ఇచ్చిన స్ఫూర్తి వైఎస్సార్‌సీపీకి వెయ్యి ఏనుగుల బలం.

‘‘టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బలహీనపడింది. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని వైఎస్ జగన్ కోరుకున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పోలీసుల ఒత్తిళ్లకు లొంగకుండా అమ్మగారిపల్లి గ్రామస్తులు తెగువ చూపించారు’’ అని సతీషరెడ్డి పేర్కొన్నారు.


