sv satish kumar reddy
-
‘చంద్రబాబు మీద కూడా అవే సెక్షన్లు పెట్టవచ్చు’
తాడేపల్లి: ఉత్తారంధ్ర టీచర్స్ ఎమ్మెల్నీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమికి ప్రభుత్వ పనితీరే నిదర్శనమన్నారు , వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి,. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ నిర్వహించిన సతీష్ రెడ్డి.. కూటమి సానుకూలే వర్గాలే ఆ పార్టీని ఓడించాయన్నారు. అవతల వాళ్ల మీది బురదజల్లడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య అని, వాటిని అవతల వాళ్లు కడుక్కునే లోపేలే నీవు చేసే పనులు నువ్వు తెలివిగా చక్కబెట్టుకుంటావంటూ సతీస్ రెడ్డి మండిపడ్డారు.చంద్రబాబుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేస్తాం‘చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 ని వయిలెట్ చేశారు. ఆయనపై అనర్హతా వేటు వేయాలని గవర్నరుని కోరతాం. త్వరలోనే గవర్నరుని కలుస్తాం. గవర్నరు న్యాయం చేయకపోతే కోర్టుకు వెళతాం. చంద్రబాబు సీఎం పదవికి అనర్హుడు. సీఎం గా ఉన్న వ్యక్తి హేట్ స్పీచ్ చేయటం కరెక్టు కాదు. పోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చు. దాని ప్రకారం చంద్రబాబుపై అనర్హతా వేటు చేయవచ్చు. చంద్రబాబుపై అనర్హతా వేటు వేయాలని కోర్టులో పిటిషన్ వేస్తాం.అప్పుడు వారి వల్లే గెలిచారు.. ఇప్పుడు వారి వల్లే ఓడిపోయారు..2024లో ఉద్యోగుల మద్దతుతో కూటమి గెలిచింది. కానీ అదే ఉద్యోగుల చేతిలో 9 నెలలకే కూటమి ఘోరంగా ఓడిపోయింది. ఐఆర్, పిఆర్సీతో సహా ఏ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించలేదు. పిఆర్సీ కమీషన్ ని కూడా వేయలేదంటే ఉద్యోగులపై ప్రభుత్వానికి ఏం ప్రేమ ఉన్నట్టు?, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. తెలంగాణ నుండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని తీసుకురాలేకపోయారు.ఈ సంవత్సరం ఒక్క అడ్మిషన్ ని కూడా ఏపీ నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకోలేదు. దీంతో 33 వేలమంది విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ సమస్య అడిగినా తప్పించుకునేలా ప్రభుత్వం మాటలు చెప్తోంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమికి జనం వాతలు పెట్టే పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు వైసీపి మీద చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. రాగద్వేషం, పక్షపాతం లేకుండా పరిపాలన చేస్తానని చేసిన ప్రతిజ్ఞ ఏం అయింది. వైఎస్సార్ సీపీ వారికి పనులు చేయొద్దని ఎలా మాట్లాడతారు?, నీ 40 ఏళ్ల అనుభవం ఇదేనా?పోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చుపోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చు. చంద్రబాబు వేసిన విషబీజం ఆయన కార్యకర్తలకు నష్టం చేస్తుంది. రేపు అధికారం కోల్పోతే మీవారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఏం గొప్ప జరిగినా అదేనని చెప్పుకోవటం చంద్రబాబు నైజం. విధ్వంసం అనే చంద్రబాబు స్కూళ్లను జగన్ బాగుచేయటం విధ్వంసంలాగా కనిపిస్తుందా?, వైద్యాన్ని ఇంటి దగ్గరే చేయించటం విధ్వంసమా?, చంద్రబాబు చేసే హేట్ స్పీచ్ వలన విధ్వంసం జరుగుతోంది. పోసాని కృష్ణమురళి మాటల వలన రాష్ట్రంలో గొడవలు జరిగాయని కేసులు పెట్టారు. మరి అవే మాటలు మాట్లాడిన చంద్రబాబు మీద ఎందుకు కేసులు పెట్టటం లేదు? -
జగన్ వస్తే నువ్వు ఎలా పారిపోయావో అందరికీ తెలుసు ..
-
‘ప్రజలకు మేలు జరగాలంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వాల్సిందే’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్ అడిగే ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన కోసం కాదని.. అసెంబ్లీలో ప్రజల తరఫున పోరాటం చేయడానికి తగిన సమయం కోసం అడుగుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌ను నమ్మడం వల్లే ప్రజలు వారికి పట్టం కట్టారని.. చంద్రబాబు అబద్ధాలు నమ్మడం లేదని పవన్‌తో పచ్చి అబద్ధాలు మాట్లాడించారంటూ దుయ్యబట్టారు.‘‘ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటున్న పవన్ కళ్యాణ్.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన పోషిస్తాడా..?. ప్రజల తరఫున పోరాటం చేస్తావా..?. నిన్ను శాశ్వతంగా భూస్థాపితం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల నువ్వు చంద్రబాబుకు చెంచాగిరి చేస్తున్నావా..?. నీ వ్యక్తిగత సమస్యలు ఉంటే ఇంట్లో చూసుకో. పవన్, షర్మిలను వినియోగించుకుని చంద్రబాబు గేమ్ ఆడుతున్నాడు. సమర్థమైన చర్చలు ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఎలా జరుగుతాయి..?’’ అంటూ సతీష్‌కుమార్‌రెడ్డి నిలదీశారు.‘‘మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటే ప్రజలు సమర్థించరు. సభ్యత్వం పోతోందంటున్నారు. సోనియాపై పోరాటం చేసిన చరిత్ర జగన్‌ది. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే 5.46 లక్షల ఓట్లతో ఆనాడు ఎంపీగా గెలిచిన వైఎస్ జగన్ ముందు మీరు ఫ్లూట్ ఊదుతున్నారా..?. మీరు కోర్టుకు ఇంతవరకూ ఎందుకు అఫిడవిట్ వేయడం లేదు..?. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే జరిగే నష్టం ప్రజలకే. అధికారపక్షంతో పాటు ప్రతిపక్షం ముఖ్యమే. జగన్ చరిష్మా, సామర్థ్యం ఏంటో ఒకసారి తెలుసుకోండి. ఆయన అడుగు బయటపెడితే జనం ప్రభంజనంగా వస్తున్నారు. అనవసరమైన మాటలు మాట్లాడవద్దు.. జన ప్రభంజనంలో కొట్టుకుపోతారు. నువ్వు హామీగా నిలబడ్డ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించు. పవన్ కళ్యాణ్.. ఇప్పటీకైన మేలుకో.. లేదంటే చంద్రబాబు నిన్ను ముంచేస్తాడు. షర్మిల.. మీరు కాంగ్రెస్‌కు వ్యతిరేకమైన పార్టీలతో పోరాడుతున్నారా? లేక వ్యక్తిగత ఎజెండా అమలు చేస్తున్నావా..?’’ అంటూ సతీష్‌రెడ్డి దుయ్యబట్టారు. -
నేరస్తులకు సర్కారు దన్ను
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో నేరం రుజువై జైలుశిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకర్‌రెడ్డిని తానే విడిపించానని పులివెందుల టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీష్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు నేరగాళ్లకు అండగా నిలుస్తున్నారని స్పష్టమవుతోంది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. చట్టంలో ఉన్న అవకాశాలను వాడుకుని పాలకపక్షానికి చెందిన వారికి మాత్రమే క్షమాభిక్ష పెట్టడం, టీడీపీ నేతలు, వారి అనుచరులపై ఉన్న కేసులను ఎత్తివేయడం వంటి అడ్డుగోలు పనులకు చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడడం లేదు. టీడీపీ నేతలకే క్షమాభిక్ష జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ ప్రజాప్రతినిధుల అనుచరులను క్షమాభిక్ష పేరుతో జైళ్ల నుంచి బయటకు తీసుకొస్తున్నారు. పలు నేరాలు నిరూపణ కావడంతో కోర్టులు విధించిన శిక్షాకాలం పూర్తికాకుండానే టీడీపీకి చెందిన వారికే క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారు. ఘనతంత్ర దినోత్సవం పేరుతో 49 మందికి క్షమాభిక్ష పెడుతూ 2018 జూన్ 8న చంద్రబాబు ప్రభుత్వం జీవో నెం.75 జారీ చేసింది. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో ముద్దాయి రాగిపిండి సుధాకర్‌రెడ్డితోపాటు మరో 48 మందిని ఇలా క్షమాభిక్ష పేరుతో జైలు నుంచి విడుదల చేసారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా మరో 32 మందిని విడుదల చేయాలని కొద్ది రోజుల క్రితం టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. వాస్తవానికి వృద్ధాప్యం, మహిళలు, సత్ప్రవర్తన వంటి కారణాలతో క్షమాభిక్ష పెట్టినట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ వారిలో వృద్ధులు ఇద్దరు మాత్రమే ఉండగా, నలుగురు మాత్రమే మహిళలు ఉన్నారు. మిగిలిన వారంతా 33 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయస్సు కలిగినవారే. టీడీపీకి అనుకూలంగా ఉండే వారిని గుర్తించి ఎన్నికల వేళ విడుదల చేసేలా క్షమాభిక్ష అవకాశాన్ని వాడుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణలో ఉన్న కేసుల ఉపసంహరణ తెలుగుదేశం పార్టీ నేతలపై ఉన్న పాత కేసులు ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 160కి పైగా జీవోలను జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజా జీవనానికి భంగం కలిగించడం తదితర సెక్షన్ల కింద గతంలో టీడీపీ నాయకులపై నమోదైన కేసులను ప్రభుత్వం ఎత్తేసింది. పోలీస్ రికార్డుల్లో మగ్గుతున్న వాటిని, కోర్టు విచారణలో ఉన్న కేసులను సైతం ఉపసంహరించుకునేలా జీవోలు జారీ చేయడం గమనార్హం. చంద్రబాబు అధికారం చేపట్టిన తొలి ఏడాది నుంచే టీడీపీ నేతలపై కేసులకు చెల్లుచీటి రాయడం మొదలైంది. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కింజరాపు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలపై కేసులను ఎత్తివేశారు. టీడీపీ నేతలపై కేసుల వివరాలు - మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరికొందరిపై ఇబ్రహీంపట్నం, విజయవాడ పటమట, భవానీపురం, గన్నవరం పోలీస్ స్టేషన్లలో నమోదైన ఐదు కేసులను ఎత్తివేస్తూ 2015 జూన్ 4న జీవో నెంబర్ 647ను ప్రభుత్వం జారీ చేసింది. - మంత్రి కొల్లు రవీంద్రపై రాబర్డ్సన్పేట పోలీస్ స్టేషన్, ఇనకుదురు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను ఎత్తివేస్తూ 2017 మే 3న జీవోలు నం.361, 362, 363 జారీ చేశారు. - అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మరికొందరిపై నరసరావుపేట–1 పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల్లో విచారణ నుంచి మినహాయిస్తూ 2016 సెప్టెంబర్ 9న జీవో 664 జారీ చేశారు. - ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై ఉన్న కేసును ఉపసంహరించుకుంటూ కోర్టుకు నివేధించాలని 2017 మార్చి 10న జీవో 192ను ప్రభుత్వం జారీ చేసింది. ఆయనపై ఉన్న మరో కేసు విచారణ నుంచి తప్పిస్తూ 2016 సెప్టెంబర్ 14న జీవో నం.681 ఇచ్చారు. - శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మరో 33మందిపై రావులపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విచారణ నుంచి మినహాయిస్తూ 2016 ఫిబ్రవరి 27న ప్రభుత్వం జీవో జారీ చేసింది. - కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విచారణ నుంచి మంత్రి అచ్చెన్నాయుడు మరో ఆరుగురిని మినహాయిస్తూ ప్రభుత్వం 2015 జూన్ 23న జీవో 704 జారీ చేసింది. - మంత్రి గంటా శ్రీనివాసరావుపై అనకాపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన ప్రభుత్వ ఆస్తుల ద్వంసం కేసు విచారణ నుంచి తప్పిస్తూ ప్రభుత్వం 2016 మార్చి 4న జీవో 143 జారీ చేసింది. - ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మరో 20 మందిపై ఉన్న ఆస్తుల ధ్వంసం కేసును ఉపసంహరించుకుంటూ 2017 మే 9న ప్రభుత్వం జీవో 379 ఇచ్చింది. - మంత్రి నక్కా ఆనందబాబు మరో నలుగురిపై వేమూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ఎత్తివేస్తూ 2017 ఫిబ్రవరి 7న జీవో 97 జారీ చేశారు. - ముఖ్యమంత్రి వియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మరో 15 మందిని ఓ కేసు విచారణ నుంచి మినహాయిస్తూ 2016 సెప్టెంబర్ 14న ప్రభుత్వం జీవో 679 జారీ చేసింది. - తూర్పుగోదావరి జిల్లా అమలాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎ.ఆనందరావు మరో ఏడుగురుపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసును ఎత్తివేస్తూ 2017ది మార్చి 28న జీవో 261 జారీ చేశారు. - ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ వివేకానంద, మరో 21 మందిని ఓ కేసు విచారణ నుంచి తప్పిస్తూ 2016 ఏప్రిల్ 21న జీవో 278 జారీ చేశారు. - అనంతపురం జిల్లాలో నమోదైన కేసుల్లో అప్పటి ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, యర్రబెల్లి దయాకర్‌రావు, రంగనాయకులు, బీసీ గోవిందప్ప, మెట్టు గోవిందరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, హరీశ్వర్‌రెడ్డి, బాబు రమేష్, పడాల అరుణ, లలిత కమారి, అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు నారాయణరావు, వై.రాజేంద్రప్రసాద్, మసాల పద్మజ, చిన్నరాజప్పలతోపాటు మరో నలుగురిని విచారణ నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం 2016 డిసెంబర్ 29న జీవో 907 జారీ చేసింది. -
అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం
కడప సెవెన్ రోడ్స్ : తమ ప్రభుత్వం జిల్లాను పట్టించుకోవడం లేదనేదాంట్లో నిజంలేదని, అన్ని విధాలా జిల్లాను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ చైర్మన్ హోదాలో తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనకు శుక్రవారం నగరంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయన స్టేట్ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో సెయిల్ ఆధ్వర్యాన స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కడపలో డిఫెన్స్ రీసెర్చి డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఖనిజాధార పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామమన్నారు. ముంపువాసులకు కేవలం రూ. 13 కోట్లు పరిహారంగా చెల్లిస్తే గండికోట రిజర్వాయర్‌ను నీటితో నింపవచ్చన్నారు. కానీ, గత ప్రభుత్వం ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిం చిందని తెలిపారు. అలాగే పీబీసీ, మైలవరానికి రావాల్సిన నీటి విడుదల కోసం కృషి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌కు లభించే 45 టీఎంసీల నీటిని రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని వివరించారు. రెండు, మూడు నెలల్లో రైతుల రుణమాఫీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. రాజ్యాంగపరమైన వ్యవహారాల్లో పార్టీలకతీతంగా తాను పనిచేస్తానని, మిగిలిన సమయంలో సాధారణ టీడీపీ కార్యకర్తగా వ్యవహారిస్తానన్నారు. కొన్ని కులాలను విస్మరిస్తున్నామన్న వాదన కూడా పసలేనిదని ఆయన కొట్టిపారేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు శ్రీనివాసులురెడ్డి, లక్ష్మిరెడ్డి, పీరయ్య, జిలానీబాషా, మహిళా నాయకురాలు కుసుమకుమారి పాల్గొన్నారు.