సాక్షి,అమరావతి: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విషయంలో క్రెడిట్ కొట్టేద్దామని చంద్రబాబు అండ్ గ్యాంగ్ ప్రయత్నించిందని, సీన్ రివర్స్ కావడంతో సైలెంటయ్యిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
మీడియాతో మాట్లాడిన సతీష్ రెడ్డి.. ‘బాబు పాలనపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అభివృద్ధి పేరుతో చేసింది ఏమీ లేదు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. బాబు పాలన అంతా ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడం బాబుకు అలవాటు కాదు. డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఆయనకు తెలిసిన మార్గం.
టీటీడీలో చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. టీటీడీలో తప్పు జరిగితే వేంకటేశ్వరస్వామి శిక్షిస్తాడు. అనవసరంగా బురద చల్లితే ఆ పాపం ఊరికే పోదు’అని ఆయన హెచ్చరించారు.


