సాక్షి, ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వేగంగా చేయాలని ప్రయత్నిస్తోందని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆపాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు కోరుతున్నారు. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం ఈ మేరకు వినతి పత్రం అందజేసింది.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మెడికల్ కోర్సులు చదవడం కష్టంగా మారుతుంది. పేద వర్గాలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర ఇది. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. ఈనెల 17న ఈ కోటి సంతకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌కు అందిస్తారు. అందుకే ప్రభుత్వం వేగంగా మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రైవేటీకరణను ఆపాలి..
.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హాయంలో 17 కొత్త ప్రైవేట్ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఆస్తులను లీజుకు ఇస్తున్నారు. వంద రూపాయలకు ఎకరం చొప్పున ఒక్కో సంస్థకు 50 ఎకరాలు అప్పజెప్తున్నారు. దొడ్డి దారిన వారి నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఈ విధానాల వల్ల ప్రభుత్వ కాలేజీలలో డాక్టర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అని వినతి పత్రంలో ఎంపీలు పేర్కొన్నారు.
కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో.. వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, రఘునాథ్ రెడ్డి , సుభాష్ చంద్రబోస్ , బాబురావు , అయోధ్య రామిరెడ్డి తదితరులు ఉన్నాయి.
ప్రభుత్వ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామను కలిసి కుట్రను వివరించాం. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆమెనే నిధులు కేటాయించారు. ఏపీలో ఇప్పటికే మూడు మెడికల్ కాలేజీలకు ఫండింగ్ వచ్చింది. మిగిలిన మెడికల్ కాలేజీలకు ఫండ్ ఇవ్వాలని కోరాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయవద్దని కోరాం

ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వల్ల పేదల విద్యార్థులకు పేదలకు అన్యాయం జరుగుతుంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పిన అమరావతికి ఇప్పుడు అప్పు ఎందుకు తెచ్చారు?. మెడికల్ కాలేజీల రూపంలో లక్ష కోట్ల రూపాయలు ఆస్తి వస్తున్నా.. తనకు కావలసిన మనుషులకు పంచడానికి ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది రాబోయే తరాలకు, పేదలకు నష్టం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను విద్యార్థులు తమ టాపు ప్రయారిటీగా ఎంచుకుంటారు. వైద్య రంగాన్ని ప్రైవేటీకరించడం వల్ల ఇండిగో లాంటి సంక్షోభం తలెత్తుతుంది అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు.


