సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బుధవారం నగరంలో పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్ పర్సన్, వైఎస్సార్‌సీపీ మహిళా నేత తిప్పరమల్లి జమలపూర్ణమ్మ ఇటీవలె అనారోగ్యం బారిన పడి చికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆమెను పరామర్శించారు.
కేదారేశ్వరపేటలోని జమలపూర్ణమ్మ నివాసానికి వెళ్లిన వైఎస్ జగన్.. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని ఆమెకు ఆయన భరోసా ఇచ్చారు. ఆమె ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు వాకబు చేయాలని స్థానిక నేతలకు పురమాయించారు. వైఎస్ జగన్ రాకతో లోటస్ రోడ్లు కిటకిటలాడాయి. పార్టీ కార్యకర్తలు, జగన్‌ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు.





