Anakapalli: గొలుగొండ కేజిబీవీలో దారుణం..విద్యార్థినికి గర్భం | Student gets pregnant at Golugonda KGBV | Sakshi
Sakshi News home page

Anakapalli: గొలుగొండ కేజిబీవీలో దారుణం..విద్యార్థినికి గర్భం

Dec 10 2025 12:01 PM | Updated on Dec 10 2025 12:22 PM

Student gets pregnant at Golugonda KGBV

అనకాపల్లి.  గొలుగొండ కేజిబీవీ (కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం) మరో వివాదంలో చిక్కుకుంది. కేజీబీవీ చదువుతున్న ఓ గిరిజన బాలిక గర్భం దాల్చింది. ఆమెకు తరుచు వాంతులు కావడంతో ఏఎన్‌ఎమ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ బాలిక ఐదు నెలల గర్భిణి అని డాక్టర్లు చెప్పడంతో దాన్ని దాచే పెట్టే యత్నం చేశారు.  ఆ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఆ బాలికను కుటుంబ సభ్యులకు అప్పచెప్పింది ఎస్‌ఓ సుధా. అయితే ఆ బాలిక వాంతులు కావడం గమనించిన కుటుంబ సభ్యులు.. ఏమైందని ఆరా తీయగా అసలు విషయం బటయపడింది. 

ఆ బాలికకు తండ్రి చనిపోవడంతో తల్లికి మరొకరతితో పెళ్లి చేశారు.  ఆ బాలిక అమ్మమ్మ దగ్గర పెరుగుతూ చదువుతోంది. అయితే  బాలిక గర్భం దాల్చిన విషయం బయటకు రావడంతో ఎస్‌ఓ సుధ రాజీనామా డ్రామాకు తెరలేపారు. ఇటీవల కాలంలో ఆ పాఠశాల తరుచు వివాదాల బారిన పడుతోంది. మొన్న రాత్రి 11 గంటల వరకు భోజనం పెట్టని వైనం బయటకు రాగా, ఆపై తల్లిదండ్రులు సైతం ఆందోళన బాట పట్టారు. తాజాగా ఓ విద్యార్థిని గర్భం దాల్చడంతో  ఆమె భవిష్యత్‌ ప్రశార్థకంగా మారడమే కాకుండా మరో వివాదంలో గొలుగొండ కేజీబీవి పాఠాశాల చిక్కుకున్నట్లయ్యింది, 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement