AP: నారాయణ కాలేజీలో దారుణం | Student In Narayana College Tiruppati Trying To End Life | Sakshi
Sakshi News home page

AP: నారాయణ కాలేజీలో దారుణం

Dec 10 2025 11:24 AM | Updated on Dec 10 2025 12:12 PM

Student In Narayana College Tiruppati Trying To End Life

తిరుపతి: జిల్లాలోని అగరాల నారాయణ కాలేజీలో దారుణం చోటు చేసుకంది. చదువు పేరుతో కాలేజ్‌ యాజమాన్యం పెడుతున్న వేధింపులు భరించలేక మహీధర్‌రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు.

కాలేజ్‌ మూడో అంతస్తు నంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో మహీదర్‌రెడ్డికి తలకు తీవ్రగాయాలయ్యాయి.  ఆ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

కాగా, ఈ ఏడాది ఆరంభంలో ఏపీలోని అనంతపురం  సోమలదొడ్డి దగ్గరున్న నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి చరణ్  ఆత్మహత్య చేసుకున్నాడు. జనవరి 23 వ తేదీన కాలేజీ మూడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ీసీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement