ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ
శ్రీకాళహస్తి: వైద్య విద్య ప్రైవేటీకరణకు నిరసరనగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా సాగుతోందని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ‘కోటి సంతకాల ప్రజా ఉద్యమం’పై మంగళవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడారు. మన బిడ్డలు వైద్యవిద్య చదవడానికి రష్యా, చైనా వెళుతున్నారు..చైనాలో మన బిడ్డలకు గ్యారెంటీ ఉంటుందా? గతంలో రష్యాలు యుద్ధం జరిగినప్పుడు అక్కడ మెడిసిన్ చేస్తున్న మన పిల్లల పరిస్థితి మీ అందరికీ తెలిసిందే అన్నారు. రాష్ట్రంలో పేదవారు గొప్ప చదువులు చదువుకోకూడదా? పెత్తందారులు మాత్రమే గొప్ప గొప్ప చదువులు చదవాలా,. ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీ పేద విద్యార్థులకు గొప్ప చదువులు చదివే అర్హత లేదా?అని ప్రశ్నించారు. కుల మతాలకతీతంగా ప్రతి పేదవాడు మెడిసిన్ చదవాలని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి, 50 శాతం భవనాలు కూడా నిర్మించారని తెలిపారు. అయితే చంద్రబా బు సర్కారు వాటిని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించిందన్నారు. ఆ దుశ్చర్యను అడ్డుకునేందుకు వైఎస్సార్ సీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 66 వేల పైచిలుకు సంతకాలను ప్రజల నుంచి స్వచ్ఛందంగా సేకరించిందన్నారు. వయ్యాల కృష్ణారెడ్డి, షేక్ సిరాజ్ బాషా, కోగిలి సుబ్రమణ్యం, ఉత్తరాజీ శరవణ కుమార్, కంటా ఉదయ్ కుమార్, శ్రీవారి సురేష్, పఠాన్ ఫరీద్, పాల్గొన్నారు.


