మోటార్‌బైక్, ఆటో ఢీ
● భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు
కోట:మండలంలోని చిట్టేడు వద్ద ప్రధాన రహదారిపై మంగళవా రం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెంద గా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గూడలి అరుంధతీయ కాలనీలో విషాదం నింపింది. ఎస్‌ఐ పవన్‌కుమార్ కథనం మేరకు.. గూడలి అరుంధతీయ కాల నీకి చెందిన ధనరాశి లావణ్య(26), తన భర్త మల్లికా ర్జున్‌తో కలసి గూడూరు హాస్పిటల్ వెళ్లేందుకు మోటార్‌బైక్‌లో బయలుదేరారు. చిట్టేడు వద్ద గూడూరు నుంచి విద్యానగర్ వస్తున్న ఆటో, మోటార్‌బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లావణ్య సంఘటన స్థలంలోనే మృతి చెందగా భర్త మల్లికార్జున్‌ను 108 వాహనంలో చికిత్స నిమిత్తం గూడూరుకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. ప్రమాదంలో ఆటో డ్రైవర్ అబ్బాస్‌కు గా యాలయ్యాయి. సంఘటన స్థలాన్ని గూడూరు డీఎస్పీ గీతాకుమారి, వాకాడు సీఐ హుస్సేన్‌బాషా పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసునమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మోటార్‌బైక్, ఆటో ఢీ


