అదృశ్యమైన వ్యక్తి మృతి
వెంకటగిరి రూరల్: కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలాయపల్లి మండలం అలిమిలి గ్రామానికి చెందిన పొటేళ్ల ప్రసన్న కుమార్ (30) మృతదేహమై బాలాయపల్లి మండలం నిండలి వాగులో లభ్యమయ్యారు. ప్రసన్న కుమార్ గత నెల 30 తేదీన తోటి స్నేహితులతో కలసి ఇంటి వద్ద నుంచి వెళ్లారని, తర్వాత తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు తండ్రి శీనయ్య ఈనెల 3వ తేదీన బాలాయపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మండలంలోని నిండలి వాగులో ప్రసన్న కుమార్ మృత దేహం లభ్యం కావడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంగళవారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


