రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
తడ: జాతీయ రహదారిపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహ నం ఢీకొన్న ప్రమాదంలో సుమారు 45 నుంచి 50 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని పురుషుడు మృతి చెందాడు. ఎస్‌ఐ కొడపనాయుడు కథనం మేరకు.. తడకండ్రిగ పంచాయతీ పరిధిలో చైన్నె వైపు వెళ్లే మార్గంలోని ఓ మెస్ సమీపంలో, జాతీయ రహదారిపై మృతదేహం ఉన్నట్టు అందిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్ఖలా నికి చేరుకున్నారు. జాతీయ రహదారి పక్కన నడుచుకుంటూ వెళుతున్న ఇతన్ని చైన్నె వెళ్లే వాహనం వెనుక నుంచి ఢీ కొనడంతో మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమి త్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ పోటీలకు
నాయుడుపేట క్రీడాకారుడు
నాయుడుపేటటౌన్: పల్నాడు జిల్లా నర సారావుపేటలో మూడు రోజులుగా జరిగిన స్కూల్ గే మ్స్ ఫెడరేషన్ అండర్–17 ఫుట్‌బాల్ పోటీల్లో నాయుడుపేటకు చెందిన క్రీడాకారుడు ఇందుకూరు రోల్డ్‌కృష్ణ రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటి, జాతీయ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ గౌన్‌బాషా తెలిపారు. జనవరి 11న హర్యాణాలో జరుగనున్న జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరపున పాల్గొన్నంటున్నట్లు తెలిపారు.
చోరీ కేసులో నిందితుల అరెస్టు
తిరుపతి రూరల్: మహిళ మెడలో బంగారం గొలుసు లాక్కుని వెళ్లిన కేసులో నిందితులను తిరుపతి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలంలోని పెరుమాళ్లపల్లి సమీపంలో మ ల్లిక అనే మహిళ మెడలోని గొలుసు లాక్కొని పారిపోయిన సంఘటనకు సంబంధించి తి రుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల ఆచూకీ కోసం రెండు ప్రత్యేక టీంలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. 48 గంటలలోపే నిందితులను గుర్తించి రైల్వే కో డూరు శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన కస్తూరి జయకృష్ణ, రైల్వే కోడూరు శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన మాచినేని శిరీషా, పుల్లంపేట మండలం కొట్టలపల్లికి చెందిన లింగుంట వినీలను చెర్లోపల్లి సర్కిల్ వద్ద మంగళవారం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 24 గ్రాముల బంగారం గొలుసుతోపాటు కత్తులు, ఆటో (ఏపీ39 విడి 5613) స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి


