రాపూరు పోలీస్ స్టేషన్‌లో ఐజీ
రాపూరు: స్థానిక పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం గుంటూరు జోన్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సందర్శించారు. సేష్టన్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో పలు పోలీస్‌స్టేషన్లను సందర్శించడం జరిగిందని తెలిపారు. లా అండ్ ఆర్డర్, క్రైమ్, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. రాపూరులో చిన్నచిన్న భూ సమస్యలున్నాయని క్రైమ్ కూడా పెద్దగా లేదని ఈ సంవత్సరం ఇప్పటివరకు 163 కేసులు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. పోలీసుల పనితీరు బాగుందని వారిని అభినందించారు. ఆయన వెంట నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత్ వేజెండ్ల, ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసరావు,సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐరాజేష్ తదితరులు ఉన్నారు.
నృసింహుని సేవలో ఐజీ
పెంచలకోనలోని శ్రీ పెనుశిలలక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మిదేవి, ఆంజనేయస్వామిని మంగళవారం గుంటూరు జోన్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత్ వేజెండ్ల దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


