రాష్ట్రస్థాయి పోటీలకు రాచగున్నేరి విద్యార్థిని ఝాన్సీ
శ్రీకాళహస్తి: జిల్లాస్థాయి విద్య,వైజ్ఞానిక ప్రదర్శనలో శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి జెడ్పీ హైస్కూల్ విద్యార్థి ఝాన్సీ ఉత్తమ ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికై ంది. ఝాన్సీ రాచగున్నేరి ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. పోటీలో పాల్గొనేందుకు గైడ్ టీచర్‌గా సైన్‌న్స్ టీచర్ లింకన్ వ్యవహరించారు. మంగళవారం తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో డీఈఓ కేవీఎన్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందుకుంది. ఈ నెల 27వ తేదీ విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఆ విద్యార్థిని ఉపాధ్యాయులు సుజాత, రామ్మూర్తి, ప్రధానోపాధ్యాయురాలు గిరిజ గ్రామస్తులు అభినందించారు.


