బాబు సర్కారు పేదల పొట్టగొడుతోంది!
తిరుపతి లీగల్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే వాటిని చంద్రబాబు ప్రభు త్వం ప్రైవేటీకరణ చేసి, పేదల పొట్ట కొడుతోందని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి సౌజన్యంతో మంగళవారం తిరుపతి కోర్టుల ప్రధాన ద్వారం వద్ద న్యాయ వాదులు కోటి సంతకాల సేకరణలో భాగంగా సంతకాల సేకరణ చేపట్టారు. వైఎస్సార్ సీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు ఐ.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఏ సీఎం చేయని విధంగా ఒకేసారి 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతి తెచ్చి, కొన్ని ప్రాంతాల్లో కళాశాలల నిర్మాణాలు పూర్తి చేసినా ఆ కళాశాలలను చంద్రబాబు సర్కారు ప్రైవేటు వారి చేతిలో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, ప్రజలు పాల్గొని సంతకాలు చేశారు. సంతకాల సేకరణలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు రాజశేఖర్, నరహరిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, కె. విజయకుమార్, కోటేశ్వర్ రెడ్డి, ఏ. ప్రకాష్ రెడ్డి, ఎన్. వెంకటేష్, మహాదేవ్, శైలేంద్ర, బాలాజీ, కరుణాకర్ నాయుడు, వేలు పాల్గొన్నారు.


