Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? | TTD: Devotees common in Tirumala Srivari Temple On 10th December | Sakshi
Sakshi News home page

Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

Dec 10 2025 8:14 AM | Updated on Dec 10 2025 11:33 AM

TTD: Devotees common in Tirumala Srivari Temple On 10th December

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. మంగళవారం అర్ధరాత్రి వరకు 70,901  మంది స్వామివారిని దర్శించుకున్నారు.  23,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ. 3.96    కోట్ల ఆదాయం వచ్చింది.

టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో  దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 12   గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 4  గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన భక్తులను అనుమతించమని వెల్లడించింది.  

Advertisement
 
Advertisement
Advertisement